Posted in తెలుగు, నీల్లు నిజాలు, పుస్తకాలు on జనవరి 24th, 2006
నీళ్లు-నిజాలు
(వ్యాసాల సంకలనం)
ఆర్. విద్యాసాగరరావు
చీఫ్ ఇంజనీరు (రిటైర్డ్)
కేంద్ర జల సంఘం
తెలంగాణ విద్యావంతుల వేదిక
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (USA)
జనవరి 2006
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు, పుస్తకాలు on జనవరి 24th, 2006
ఒకటవ భాగము
భారతదేశంలో జలసంపద - అభివృద్ధి - సమస్యలు
నీటి లభ్యత
నదీ బేసిన్లు
సాగునీరు
వరదలు-నియంత్రణ
విద్యుత్ సంపద
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on జనవరి 24th, 2006
ప్రకృతిప్రసాదించిన జీవనదులు దేశాల మధ్యా, రాష్ట్రాల మధ్యా మైత్రీహారాలుగా, సుహృద్భావ సేతువులుగా ఉండవలసింది పోయి మనిషి స్వార్థం, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కారణంగా వివాదాలు రగిలిస్తున్నాయి. 21వ శతాబ్దంలో యుద్ధాలు నీటికోసమే జరుగుతాయంటూ ఈజిప్టు సామాజిక శాస్తవ్రేత్త ఇస్మాయిల్ సెరాగెల్డిన్ చెప్పిన జోస్యం నిజమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్, కర్నాటకల మధ్య కృష్ణా జలాలకు సంబంధించి అలమట్టి సమస్య, కర్నాటక, తమిళనాడు మధ్య కావేరీ జలకలహం, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్య రావి-బియాస్ జలవివాదం ఎప్పుడు ముదిరి […]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on జనవరి 24th, 2006
నీళ్ల పైన నేను రాస్తాననిగాని, రాయాలనికాని ఎన్నడూ అనుకోలేదు. చిన్నతనం నుంచీ నేను రాసింది కవిత్వం, కథలు, నాటికలు - వేసింది స్టేజిపైన నాటకాలు, రేడియో, దూరదర్శన్లో నాటికలు. ఈ రేడియో పిచ్చి ఎంతదాకా వెళ్లిందంటే నేను క్యాసువల్ ఆర్టిస్ట్‌గా రేడియోలో వార్తలు చదవడం, అనౌన్సర్‌గా పని చేయడం మొదలుకుని భారత ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు తెలుగులో వేయికిపైగా రేడియోలో నాటికల రూపంలో దశాబ్దానికి పైగా రాయడం ప్రసారం చేయడం వరకు సాగింది. నా రచనా వ్యాసంగం […]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on జనవరి 24th, 2006
ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయన్నమాట వాస్తవం కాదు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం భూమిపై ఉన్న నీరు 140 కోట్ల ఘనపు కిలోమీటర్లు. అంటే ఆ నీటిని మన భూమిపైన విస్తరింపజేస్తే అది మూడు కిలోమీటర్ల ఎత్తుంటుంది. అయితే ఈ నీటిలో 97శాతం పైగా ఉప్పునీరు. సముద్రాలలో దాగుంది. మిగిలిన స్వచ్ఛమైన నీటిలో సుమారు 77.6 శాతం ధృవాలలో మంచురూపంలో, 21.8 శాతం భూగర్భంలో చాలా లోతున నిక్షిప్తమై ఉంది. అంటే మనకు లభ్యమయ్యే నదులలో, […]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on జనవరి 24th, 2006
నది అనేది హైద్రాలాజికల్ సిస్టంలో సహజమైన ఉనికి గల ఒక వివేషం (Entity). దానికి భౌగోళికపరమైన సరిహద్దులుంటాయి. నదిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పథకాలు చేపట్టడమనేది శ్రేష్ఠమైన పని. కాని దురదృష్టవశాత్తూ రాజకీయం కారణంగా అది సాధ్యమయ్యే పని కాదు.
మన దేశంలో ఆయా రాష్ట్రాలు, తమ సరిహద్దుల్లోని నదులపై అభివృద్ధి పథకాలను రూపొందించి కేంద్ర జల సంఘానికి పంపటం రివాజు. అంతేగాని నదీబేసిన్‌పై సమగ్ర అభివృద్ధి పథకాలను (ఏ రాష్ట్రం, ఎంత నీరు అన్నది […]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on జనవరి 24th, 2006
మన దేశంలో మొత్తం సాగుకాగల భూమి 13.988 కోట్ల హెక్టేర్లుగా (ఒక హెక్టారనగా సుమారు రెండున్నర ఎకరాలు) అంచనా వేసారు. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 5.846 కోట్ల హెక్టేర్లు మిగతా 8.142 కోట్ల హెక్టేర్లు చిన్నతరహా ప్రాజెక్టుల ద్వారా జరగవలసి ఉంది. భూగర్భ జలాల నుండి సాగయ్యే 6.40 కోట్ల హెక్టేర్లు చిన్నతరహా ప్రాజెక్టు కోవకే చెందుతాయి. మార్చి 2005 నాటికి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 4 కోట్ల మూడు లక్షల […]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on జనవరి 24th, 2006
ఇంత సువిశాల దేశంలో, వైవిధ్యం కలిగిన వాతావరణం, పోకడలలో దేశంలో ఏదో ఓ మూల వరద, మరోచోట దుర్భిక్షం ఏక సమయంలో సంభవించడం అసహజమేమీ కాదు. ఒకేసారి ఒకే రాష్ట్రంలో కొన్నిచోట్ల వరదలు సంభవిస్తుంటే కొన్ని ప్రాంతాలు క్షామానికి గురై తల్లడిల్లడం కూడా గమనిస్తున్నాం. ఆదినుండీ, మానవుడు వరదతో సహజీవనం సాగిస్తున్నాడు. అయితే పూర్వపు రోజుల్లో మనుషులు తక్కువ ఉండేవారు. పారిశ్రామిక కార్యకలాపాలు అంతగా లేకపోవడం, వరద ప్రాంతాలలో (ఫ్లడ్ ప్లెయిన్స్)లో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోకపోవడంవల్ల […]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on జనవరి 24th, 2006
మన దేశంలో అపారమైన జల విద్యుత్ సంపద ఉంది. 1987 సంవత్సరంలో కేంద్ర విద్యుత్ సంస్థ (సిఇఎ) వారు చేపట్టిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 వేల 44 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం (60 శాతం లోడ్ ఫ్యాక్టర్ ప్రాతిపదికన) ఉంది. చిన్న చిన్న విద్యుత్ పథకాలు, పంప్ స్టోరేజి పథకాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును కూడా కలుపుకుంటే మన దేశంలో సుమారు 94 వేల మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం (60 […]
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on జనవరి 24th, 2006
ఒకానొక కాలంలో మన దేశంలో అన్ని రవాణా వ్యవస్థల్లోకెల్లా నదీరవాణా అగ్రగామిగా ఉండేది. అయితే రైలుమార్గాలు అధునాతన సాంకేతికతో రహదార్లు పుంజుకోవడంతో దీనికితోడు నదీరవాణా సేవ నిర్వహణ లోపాలు తోడయ్యి నదీరవాణా తన ప్రాధాన్యతను కోల్పోయింది. ఇప్పటికీ అంతో ఇంతో మెరుగ్గా నదీరవాణా నిర్వహిస్తున్న రాష్ట్రాలుగా గోవా, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళలను చెప్పుకోవచ్చు.
Read Full Post »
Posted in తెలుగు, నీల్లు నిజాలు on జనవరి 24th, 2006
ఉపరితల జలాలు
రాజ్యాంగంలో 246 అధికరణంలో ఏడవ షెడ్యూల్‌లో మూడు జాబితాలున్నాయి.
కేంద్రజాబితా: ఇందులో జతపరిచిన విషయాలకు సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకే ఉంది.
రాష్ట్రజాబితా: ఇందులో పొందుపరిచిన విషయాలపై చట్టాలను రూపొందించే అధికారం ఆయా రాష్ట్ర శాసన సభలకే ఉంది.
ఉమ్మడి జాబితా: ఇందులో ఉటంకించిన విషయాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, శాసనసభకు ఉభయులకూ ఉంది.
Read Full Post »