మన దేశంలో మొత్తం సాగుకాగల భూమి 13.988 కోట్ల హెక్టేర్లుగా (ఒక హెక్టారనగా సుమారు రెండున్నర ఎకరాలు) అంచనా వేసారు. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 5.846 కోట్ల హెక్టేర్లు మిగతా 8.142 కోట్ల హెక్టేర్లు చిన్నతరహా ప్రాజెక్టుల ద్వారా జరగవలసి ఉంది. భూగర్భ జలాల నుండి సాగయ్యే 6.40 కోట్ల హెక్టేర్లు చిన్నతరహా ప్రాజెక్టు కోవకే చెందుతాయి. మార్చి 2005 నాటికి భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 4 కోట్ల మూడు లక్షల ముప్ఫై వేల హెక్టేర్లు, భూగర్భ జలాల ద్వారా సాగయ్యే 4 కోట్ల 66 లక్షల హెక్టేర్లతో కలిపి చిన్నతరహా ప్రాజెక్టుల ద్వారా సాగయ్యే 5 కోట్ల 90 లక్షల ముప్ఫై వేల హెక్టేర్లు వెరసి 9 కోట్ల 93 లక్షల 60 వేల హెక్టేర్లకు సాగునీరు అందించే ఏర్పాట్లు జరిగాయి. అంటే దీనర్థం ఏప్రిల్ 1, 2005 నాటికి సాగునీరు అందవలసిన భూమి 4 కోట్ల 5 లక్షల 20 వేల హెక్టేర్లు మిగిలుంది. ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 1 కోటి 81 లక్షల 30 వేల హెక్టేర్లు, చిన్నతరహా ప్రాజెక్టుల ద్వారా 2 కోట్ల 23 లక్షల 90 వేల హెక్టేర్లు సాగవవలసి ఉంది. ఇందులో భూగర్భ జలాల పాత్ర 1 కోటి 74 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడం.
9 కోట్ల 93 లక్షల 60 వేల హెక్టేర్ల భూమికి సాగునీరందించేందుకు వసతులు కలిగించినా వాస్తవానికి 8 కోట్ల 46 లక్షల 50 వేల హెక్టేర్ల భూమి మాత్రమే సాగు అవుతోంది. అంటే 85 శాతమన్నమాట. ఈ తేడా (15 శాతం)కు కారణం అధికనీటిని ఉపయోగించే వాణిజ్యపంటలు వేయడం, జలాశయాల్లో పూడికలు. సకాలంలో కమాండ్ ఏరియాలో అభివృద్ధి పనులు చేపట్టక పోవడం. సాగునీటి సౌకర్యం అన్ని రాష్ట్రాల్లో ఒకేవిధంగా లేదు. పంజాబ్‌లో 72 శాతం భూములకు సాగునీరు అందుతుండగా మధ్యప్రదేశ్‌లో అతిస్వల్పంగా 17.7 శాతం భూములకే సాగునీరు అందుతోంది. ప్రతి రాష్ట్రంలోనూ కనీసం 30 శాతం భూమికి సాగునీరందాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అలా జరిగితేనే క్షామం నుండి విముక్తి లభిస్తుందన్నది ప్రభుత్వ ఆలోచన. ఒక కోటి హెక్టేర్ల భూమికి అదనంగా సాగునీరందాలన్న లక్ష్యం, కేంద్ర ఆర్థికమంత్రి 25.2.2005 నాడు ప్రకటించిన భారత నిర్మాణ్ పథకంలో భాగమే.
1951కి పూర్వం మన దేశంలో 2 కోట్ల 26 లక్షల హెక్టేర్లు ఆ తరువాత ఏడాదికి సగటున 15 లక్షల నుండి 22 లక్షల హెక్టేర్లకు అదనంగా సాగునీరు అందివ్వడం జరుగుతోంది. అయితే భారత్ నిర్మాణ్‌లో భాగంగా 1 కోటి హెక్టేర్లకు సాగునీరు అందివ్వలానుకుంటే మరో నాలుగేళ్లలో సగటున ఏడాదికి 25 లక్షల హెక్టేర్ల భూమికి సాగునీరు అందివ్వవలసుంటుంది.
పదవ పంచవర్ష ప్రణాళికా కాలం ప్రారంభం అయ్యేనాటికే 388 పెండింగు ప్రాజెక్టులున్నాయి. ఇందులో 169 భారీ, 219 మధ్యతరహావి. ఈ388 ప్రాజెక్టుల్లో 221 ప్రాజెక్టులు ఆమోదం పొందినవి. మిగిలిన 167 ప్రాజెక్టులకు ఆమోదం లేదు. అంటే అవసరమయిన కేంద్ర అనుమతులు రాక ప్రణాళికా సంఘం నుండి పెట్టుబడుల క్లియరెన్స్ లభించలేదన్నమాట.
దేశంలోని 388 పెండింగు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 92 వేల 85 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసారు. అయితే ఈ అంచనా 15 శాతం పెరగవచ్చని నిపుణుల అభిప్రాయం. ఈ 388 పెండింగు ప్రాజెక్టులు పూర్తి అవుతే 1 కోటి 25 లక్షల హెక్టేర్ల భూమికి నీరు అందే అవకాశం ఉంటుంది. ఈ 388 ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆమోదం పొందిన, ఆమోదం లేకుండా నిర్మింపబడుతున్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల వివరాలు ఇవి.
1.4.2004 నాటికి ఆమోదం పొందిన ప్రాజెక్టులు.
భారీ ప్రాజెక్టులు
పై వివరాలు చూస్తే ఆమోదం పొందిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.1156.27 కోట్లు, ఆమోదం పొందని ప్రాజెక్టులకు రూ.7648.43 కోట్లు వెరసి 8804.70 కోట్ల రూపాయల అవసరం అని తేలుతోంది.
సత్వర సాగునీటి లబ్ధి కార్యక్రమం (AIBP)
కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో వుండి మరో నాలుగేళ్లలో పూర్తయ్యే స్థితిలో వుండి, ఆ ప్రాజెక్టులకు మరే ఇతర సంస్థల నుండి (అంటే నాబార్డు, విదేశీ సంస్థల వంటివి) ఋణం లభించకుండా ఉంటే వాటికి కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి లబ్ధి కార్యక్రమం ద్వారా నిధులు సాయంగా పొందే అవకాశముంది.
ఈ కార్యక్రమం క్రింద ఒక ప్రాజెక్టు పూర్తయ్యాకే ఇంకోదానికి అవకాశ ముంటుంది. అయితే ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టులకు, అయిదో పంచవర్ష ప్రణాళిక లేక అంతకుముందు ప్రారంభమయిన ప్రాజెక్టులకు ఈ షరతు వర్తించదు.
ఈ కార్యక్రమంలో, గిరిజనులకు, క్షామపీడిత ప్రాంతాలకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులకు, అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులకు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమి సాగుకు వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఈ కార్యక్రమం క్రింద ప్రత్యేక శ్రేణిలో చేర్చిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 75 శాతం సాయం అందిస్తుంది, మిగతా 25 శాతం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడోవంతు ప్రాజెక్టు ఖర్చు భరించే షరతుపైన మిగతా డబ్బు కేంద్రం నుండి సాయంగా లభిస్తుంది. ఈ సహాయం ప్రత్యేకశ్రేణి రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో 90 శాతం గ్రాంట్ 10 శాతం అప్పు కాగా మిగిలిన రాష్ట్ర ప్రాజెక్టులకు 70 శాతం అప్పు 10 శాతం గ్రాంటుగా లభిస్తుంది. ఫాస్ట్ ట్రాకు ప్రాజెక్టులకు ప్రత్యేక సదుపాయం ఉంది. రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో పూర్తవగల కేంద్ర అనుమతి పొందిన ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాకు ప్రాజెక్టులుగా గుర్తించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుండి వందశాతం సాయం అందుతుంది. అయితే గ్రాంటులు, అప్పుల షరతు మాత్రం మామూలే.
AIBP సాయం పొందే రాష్ట్ర ప్రాజెక్టుల పనితీరును కేంద్ర జలసంఘం పరిశీలిస్తుంది.
ఈ కార్యక్రమం క్రింద ఆంధ్రప్రదేశ్ పొందిన సాయం వివరాలు ఇవి.
AIBP (రూపాయలు కోట్లలో)
మన రాష్ట్రం బడ్జెట్ నిధులను పూర్తిగా వినియోగించుకోలేకపోవడానికి గల ఏకైక కారణం మన రాష్ట్రం మనవంతు నిధులను సమకూర్చలేకపోవడమే.
జాతీయ ప్రాజెక్టులు
కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ దేశంలోని 9 భారీ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి వాటికి వంద శాతం కేంద్ర నిధులను అందచేయాలని ప్రతిపాదించింది. ఆ ప్రాజెక్టులు ఇవి:
ఈ ప్రాజెక్టులు పూర్తవడానికి 27,700 కోట్ల రూపాయలు అవసరం. నాలుగేళ్ల వ్యవధిలో వీటికి 10 వేల కోట్ల రూపాయల నిధులు అందచేస్తే ఈ ప్రాజెక్టుల క్రింద మిగిలిన 32 లక్షల హెక్టేర్లలో 20 లక్షల హెక్టేర్లకు సాగునీరు అందివ్వడానికి వీలుంటుంది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా జు|ఔఆ సహాయాన్ని పొందుతున్నవే. కనుక జాతీయ ప్రాజెక్టులుగా వీటిని గుర్తిస్తే వీటికిచ్చే జు|ఔఆ సహాయాన్ని ఇతర ప్రాజెక్టులకు మళ్లించవచ్చు.
ఈ ప్రాజెక్టుల కోసం ఒక జాతీయ నీటిపారుదల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
జలయజ్ఞం పేరిట మన రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులలో కొన్నింటిని ఈ జాబితాలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా వాటికి కేంద్ర ప్రణాళికా సంఘం అనుమతులు లేకపోవడం ఓ పెద్ద అవరోధంగా నిలిచింది.
ఆమోదం పొందని ప్రాజెక్టులు
కేంద్ర అనుమతి పొందని 167 ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాలలో స్వంత నిధులతో నిర్మితమవుతున్నాయి. వీటిని పూర్తి చేయడానికి 38972 కోట్ల రూపాయలు అవసరమని ఇవి పూర్తయితే 43 లక్షల హెక్టేర్ల భూమి సాగులోకి వస్తుందని అంచనా.