బంగారి బతుకమ్మ
Posted in వ్యాసాలు on సెప్టెంబర్ 24th, 2006
- అల్లం నారాయణ
పూల కలబోత ఎక్కడైనా చూశారా? తంగేడుపూల స్పర్శనెప్పుడైనా మనసుపొరల్లో నిలుపుకున్నారా! సుతిమెత్తని రేకలుగా విచ్చుకున్న గుమ్మడి పూల సొగసు మీకు తెలుసా! గాలికి అలలాగా తలలూపే కట్ల చెట్టుకు విరగపూసే నీలి ఆర్ణవపు కట్లపూలు మీకు తెలుసా! నల్లని గింజల్ని దాచుకున్న మర్మపు పువ్వు గుణుకును చూశారా!





