Posted in హైదరాబాద్ విమోచన on నవంబర్ 23rd, 2006
- బి. అనిల్ కుమార్
బ్రిటిష పరిపాలనలో స్వయం ప్రతిపత్తి అనుభవించిన 556 సంస్థానాల్లో అతి పెద్దది, ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. కుతుబ్ షాహీల గోలకొండ రాజ్యాన్ని స్వీయ దండయాత్రలో చేజిక్కించుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఒకటవ ఆసఫ్ ఝాను 1713లో డక్కను సుబేదారుగా నియమించాడు. నిజాం ఉల్‌ముల్క్ అన్న బిరుదును స్వీకరించి మొఘల్ గవర్నర్‌గా గోలకోండ రాజ్యాన్ని చేపట్టిన ఆసఫ్‌ఝా ఢిల్లీ పీఠంపై సంక్షోభం నెలకొన్న సమయంలో స్వతంత్ర్యం ప్రకటించుకోవడం ద్వారా 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు.
[…]
Read Full Post »
Posted in కథలు on నవంబర్ 22nd, 2006
ఉత్తరం ఇచ్చిన ఆ వ్యక్తిని ఆపాదమస్తకం ఓసారి పరీక్షగా చూశాడు. చెమటతో తడిసి ముద్ద అయిపొయాడు ఆ వ్యక్తి.
“నమస్తే…! అని కూడ అనకపాయె ఏందీ? ఆ…” అనికున్నాడు ప్రతాపరావు దొర. “పేరేమిటి?” దొరగారి ప్రశ్న.
“నారాయణ” ఆ వ్యక్తి జవాబు. కళ్ళజోడు సవరించికుని ఉత్తరం విప్పాడు ప్రతాపరావు. బావమరిది రాసినట్టు సంతోషం వేసింది. గబ గబ చదవడం మొదలెట్టడు.
Read Full Post »
Posted in తెలుగు on నవంబర్ 21st, 2006
తెలంగాణ సాయుధ పోరాటం : దొడ్డి కొమురయ్య , సదవండి
Read Full Post »
Posted in కవితలు on నవంబర్ 21st, 2006
- గంగుల శాయిరెడ్డి
సీ. మండువేసవియెండ | మంటలోఁ గ్రాగుచు
బూనిన పనిసేయు | మౌను లెవరు?
వానలో నానుచు | వణకుచు హల మూని
చలియందు దున్నెడి | సాధులెవరు?
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on నవంబర్ 21st, 2006
- పులిగోటి ఆనందమాంబ
గీ. విద్యయన్నను స్త్రీలకు వెగటుగల్ల
వనితలజ్ఞానులనుచును వాడుకొనుట
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on నవంబర్ 21st, 2006
- అరిగె రామస్వామి
గీ. మాలమాద్గు లన్యమతములఁజేరిరి
ధేడ్ చమారటంచు దిట్టుకతన
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on నవంబర్ 21st, 2006
- నీలకంఠ చంద్రమౌళీశ్వర కవులు
సీ. కంటిరే మనకెట్టి ఘనమున్నదో మున్ను
గన్నారఁదిలకించి యన్నలార
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on నవంబర్ 21st, 2006
- జొన్నలగడ్డ హనుమంతరెడ్డి
సీ. పుట్టినప్పటినుండి వెట్టిచాకిరిఁజేయ
శారీర బలమెల్ల సమసిపోయెఁ
గులకాంత పగలెల్లఁగూలిఁజేసినఁ గాని
యొక్కపూటకె తిండి చిక్కదాయెఁ
Read Full Post »
Posted in English, వీడియో on నవంబర్ 20th, 2006
Have a look at a New video on Bathukamma !
Click Here if you are having trouble watching the Google video
Read Full Post »
Posted in తెలుగు, వీడియో on నవంబర్ 20th, 2006
Posted in తెలుగు, వీడియో on నవంబర్ 20th, 2006
If you are having problem viewing the video on Google video,
Click here to Watch it on YouTube
Read Full Post »
Posted in పాటలు on నవంబర్ 20th, 2006
రచన: అందెశ్రీ
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…||
Read Full Post »
Posted in పాటలు on నవంబర్ 20th, 2006
రచన: నందిని సిధా రెడ్డి, గానం: దేశ్‌పతి శ్రీనివాస్
నాగేటి సాల్లల్ల నా తెలంగాణా, నా తెలంగాణా,
నవ్వేటి బతుకులు నా తెలంగాణా, నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
పారేటి నీల్లల్ల పానాదులల్ల
పూసేటి పూవుల్ల పూనాసలల్లా
| పారేటి…|
కొంగు సాపిననేల నా తెలంగాణా, నా తెలంగాణా
పాలుతాపిన తల్లి నా తెలంగాణా, నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
Read Full Post »
Posted in తెలంగాణ చరిత్ర on నవంబర్ 20th, 2006
నల్గొండ జిల్లా, జనగామ తాలూకాకు (ప్రస్తుతం జనగామ తాలూకా వరంగల్లు జిల్లాలో ఉంది) చెందిన పేరు మోసిన దేశముఖ్ విసునూరు రామచంద్రారెడ్డి 40 వేల ఎకరాలకు భూస్వామి. ఆయన కౌలుదార్లనుండి, రైతుల నుండి నిర్బంధంగా భూములు కబళిస్తూనే వచ్చాడు. తన ఆధీన ప్రాంతంలోని, దాదాపు 40 గ్రామాల రైతులచేత నిర్బంధంగా సంవత్సరం పొడవునా తన పొలాలలో చాకిరి చేయించుకొనేవాడు. కుటుంబంలో బిడ్డ పుట్టినా, వివాహం జరిగినా, ఎవరైనా మరణించినా ఆ సందర్భాలలో రైతులనుండి నిర్బంధంగా నజరానాలు (ధనరూపంగాగాని, […]
Read Full Post »
Posted in వ్యాసాలు on నవంబర్ 20th, 2006
హైదరాబాద్, ఆగస్టు24 : నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు తమదైన శైలిలో ఉద్యమించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి చేయూతగా నిలిచిన ఉస్మానియా యూనివర్శిటీలోనే అనేక ఉద్యమాలు పుట్టాయి…. వందేమాతం ఉద్యమం మొదలుకొని…..వామపక్ష ఉద్యమాలు ఇక్కడే పుట్టాయి. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం మళ్లీ మొద లైంది. ఉస్మానియా ఉద్యమాల చరిత్రలో వామపక్ష విద్యార్థి ఉద్య మం తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే అధిక ప్రాధా న్యత ఉంది. ఈ […]
Read Full Post »
‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల….. నా తల్లి బందీ అవుతుందో కనిపించని కుట్రల’…. అనే పాటకు ప్రాణం పోసి, బహుళ జాతి కంపెనీల పెత్తనాన్ని ఎండగట్టి, ఒక ప్రభుత్వాన్ని తలక్రిందులు చేసినంత పని చేసిన ప్రజాకవి గోరటి వెంకన్న. డర్బన్ లో దళితకవిగా తన సత్తాను చాటినా, సినీ పరిశ్రమలో గీత రచయితగా ప్రతిభను చూపినా ఆయనకు ఆయనే సాటి.
Read Full Post »
Posted in వ్యాసాలు on నవంబర్ 19th, 2006
-నందిని సిధారెడ్డి
ఎట్టకేలకు ‘తెలుగుతల్లి’ చర్చ మొదలైంది. కెసిఆర్ ఒక్కమాటతో బిడ్డల గుండెలు కలవరపడ్డాయి. తెలుగుజాతి, తెలుగుతల్లి భావన కృత్రిమమైందని, అవసరాల రీత్యా కల్పించబడిందని తెలంగాణవాదులు తొమ్మిదేళ్ళుగా చెప్పుకొస్తున్నా పట్టించుకోని వాళ్ళు రాజకీయ స్వరంలో వినిపించేసరికి రచ్చ చేస్తున్నారు. ఎప్పటికైనా తెలుగుతల్లి చరిత్ర తేలాల్సిందే. దబాయింపు ఏ చర్చకైనా మంచిదికాదు. జాతి భావన, మాతృ భావన, ప్రాంత భావన కాల సందర్భాల్లోంచి రూపొందుతుంది. చారిత్రక అవసరాల కనుగుణంగా ఆయా భావనల ప్రాధాన్యత మారుతూ ఉంటుంది.
[…]
Read Full Post »
Posted in వ్యాసాలు on నవంబర్ 19th, 2006
- ఎన్. వేణుగోపాల్
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె.చంద్రశేఖర రావు ‘ఎవడి తెలుగుతల్లి, ఎక్కడి తెలుగుతల్లి’ అని ప్రశ్నించి తెలుగు సమాజంలో, ముఖ్యంగా రాజకీయాలలో, పత్రికావ్యాఖ్యాతలలో కందిరీగలతుట్టెను రేపారు. తెలంగాణ ఆకాంక్షలను దేశ రాజకీయాలలో, ఢిల్లీలో కేంద్రస్థానానికి తెచ్చిన ఘనతతోపాటు, ఈ అత్యవసరమైన తెలుగుతల్లి చర్చనీయాంశాన్ని ప్రధానవేదికమీదికి తెచ్చిన ఘనత కూడా కెసిఆర్ కి ఇవ్వాలి.
Read Full Post »
Posted in గోలకొండ కవుల సంచిక on నవంబర్ 19th, 2006
- గవ్వా జానకిరామరెడ్డి
మ. ధర స్వాతంత్ర్యమె స్వర్గతుల్యమను తత్వజ్ఞాన లేశంబులో
నరయ జాలని మందబుద్ధులిటు లాహా! మాదృశుల్ విత్తలో
భరతి తుచ్ఛసుఖానురక్తినిజ యావచ్చక్తుల రిత్తవోఁ
బరతంత్రంబుల బుద్ధులౌదు రిది యే ప్రారబ్ధ కర్మంబొకో.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on నవంబర్ 19th, 2006
తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి నిరంతర కృషి సల్పిన మహనీయుడు మాడపాటి హన్మంతరావు. భావదాస్యంతో భషాదాస్యంతో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజలల్ల చైతన్యాన్ని నూరిపోసి ఉద్యమాలు నిర్మించిండు మాడపాటి. కృష్ణా జిల్లాలో జన్మించినప్పటికీ పెరిగి పెనవేసుకున్న జీవితం అంతా తెలంగాణలనే. ఆయన తపనా కృషీ అంతా స్థానిక ఉద్యమాలతో కొనసాగింది.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on నవంబర్ 19th, 2006
తెలంగాణ రైతుల జీవితాన్ని సాహిత్యంగా మలిచిన మహనీయుడు గంగుల శాయిరెడ్డి. పోతన వారసత్వాన్ని ఆవాహన చేసుకొని వ్యవసాయ జీవితంలోని కడగండ్లను పరిష్కరించటానికి ఒక చేత హలం మరొక చేత కలం పట్టిన కవి శాయిరెడ్డి. తెలంగాణ సాహిత్య చరిత్ర మొదటి వరుసలో పేర్కొనదగిన శాయిరెడ్డికి ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు సముచిత స్థానమివ్వలేదు.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on నవంబర్ 19th, 2006
తెలంగాణ రాజకీయ, సాంఘీక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభా, కృషీ అనన్యమైనది. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on నవంబర్ 19th, 2006
తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’ గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. ‘నా తెలంగాణ కోటీ రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on నవంబర్ 19th, 2006
తెలంగాణ రైతాంగ ఉద్యమంల నిర్మాణాత్మక పాత్ర మగ్దుం మొహియుద్దీన్. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంల, ట్రేడ్ యూనియన్ సంస్థల నిర్మాణంల మగ్దుం కృషి మరువరానిది. కవిత్వాన్ని అంతర్జాతీయ స్థాయిల నిలిపిన మగ్దుం తెలంగాణకు గర్వకారణం. ప్రజలల్ల ఆయనకున్న అభిమానం, స్థానిక చరిత్ర నిర్మాణంల అయన చొరవ అనన్య సాధ్యం.
Read Full Post »
Posted in తెలంగాణ వైతాళికులు on నవంబర్ 19th, 2006
తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. రచయిత. సేవాశీలి. ఉద్యమకర్త. కమ్యూనిస్టు నేత. ప్రచురణకర్త. పాత్రికేయుడు. ప్రచారకుడు ఆయన. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాలల్ల పాలుపంచుకున్నడు.
Read Full Post »