Feed on
Posts
Comments

తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. రచయిత. సేవాశీలి. ఉద్యమకర్త. కమ్యూనిస్టు నేత. ప్రచురణకర్త. పాత్రికేయుడు. ప్రచారకుడు ఆయన. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాలల్ల పాలుపంచుకున్నడు.

1915, నవంబర్ 1వ తేదీన నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని మాచవరంల సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించిండు. తండ్రి చిన్ననాట చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండిపెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం చేసిండు.  గ్రంధాలయోద్యమంతో మొదలైన ప్రేరణ ఆళ్వారుస్వామిని నిజాం వ్యతిరేకోద్యమం దాకా నడిపించింది. ప్రజల్లో కలిసి ఆయన పని చేసిన తీరు నిజాంకు కోపం తెప్పించింది. వట్టికోట జైలు జీవితం ‘జైలు లోపల’ పేరుతో కథల సంపుటిగా వెలువడింది. వంటపనిల, ప్రూఫ్ రీడింగ్‌ల, హోటల్ సర్వర్‌గా పని చేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయన ప్రజల మనిషిగా నిలబడేట్టు చేసినయి. నిజాంను గడగడలాడించిన ‘ఆంధ్రమహాసభ’ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టిండి. తెలంగాణ ప్రజాజీవిత నేపథ్యంతో 1952ల ‘ప్రజలమనిషి’ నవల రచించిండు. 1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణతో ‘గంగు’ నవల రచించిండు.

తెలంగాణ చైతన్యం కోసం ‘దేశోద్ధారక గ్రంథమాల’ స్థాపించి కొద్దికాలంలనే 35 పుస్తకాలు ప్రచురించటం ఆయన కృషికి నిదర్శనం. తెలంగాణ విశేషాలతో కూర్చి ‘తెలంగాణ’ పేరుతో సంపుటాలు ప్రచురించిండు. ఇవేవీ ఇప్పుడు అందుబాటుల లేకుండా పోయినయి. 1961 ఫిబ్రవరి 5 న ఆయన మృతి తెలంగాణకు తీరని లోటుగా ఉండిపోయింది.

5 Responses to “తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి”

  1. 1
    Chandraiah Amagoni Says:

    మీరు ముద్రించినది అసమ్పుర్థిగా కలదు. నా వద్ద పూరితిగా గల ఒక కరపతఋము కలదు. దానిని ఎలా ఉంచాలి.

  2. 2
    ymadhava reddy Says:

    VERY్ GOOD AUTHOAR GOOD MAN OUR VILLAGE PERSON MADHAVA RAM(KALAN) SHALIGOWARARAM (MONDAL) NALGONDA DIST

  3. 3
    ymadhava reddy Says:

    good authoar

  4. 4
    narasimha rao Says:

    good story of a freedom revolutioner who is unknown to the present fgeneration but it lacks the script

  5. 5
    sadanandam Says:

    వత్తికొత అలావ్వాలు గారు మన తెలంగాణ great novelist

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com