‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల….. నా తల్లి బందీ అవుతుందో కనిపించని కుట్రల’…. అనే పాటకు ప్రాణం పోసి, బహుళ జాతి కంపెనీల పెత్తనాన్ని ఎండగట్టి, ఒక ప్రభుత్వాన్ని తలక్రిందులు చేసినంత పని చేసిన ప్రజాకవి గోరటి వెంకన్న. డర్బన్ లో దళితకవిగా తన సత్తాను చాటినా, సినీ పరిశ్రమలో గీత రచయితగా ప్రతిభను చూపినా ఆయనకు ఆయనే సాటి. ఏ క్షణంలో ఎక్కడ ఉంటాడో తెలియని గోరటి వెంకన్నౌ ఫేయిల్యూర్ స్టోరీ కోసం రెండు నెలలు నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు వెంకన్న తెలకపల్లిలో కనిపించాడంటూ కబురు తెలి సింది. వెంటనే వెళ్లి వాకబు చేయగా, ఇప్పుడే తన ఊరివైపు వెళ్ళాడని అక్కడి జనం చెపారు. అటువైపు వెళితే అల్లంత దూరాన చేతిలో సూట్ కేసు పట్టుకుని పొలం గట్టున పిల్లదారిన సరాసరా అడుగులేస్తూ కనిపించాడాయన. మమ్మల్ని గమనించి ఎటుపోతు న్నారన్నా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. మీ ఫైయిల్యూర్ స్టోరీ కోసమే వస్తున్నామనగా ‘నిలకడలేని సంచారమే నా ఫేయిల్యూర్, అదే నా సక్సెస్’ అంటూ ఒక్క మాటలో చెపాడు. కాస్త వివరంగా చెపమని కోరగా, కూర్చోమన్నట్లు పచ్చిగడ్డి తివాచీ పరిచి ఉన్న పొలం గట్టును చూపించాడు. ఆ తర్వాత గుండెల్లో గూడుకట్టుకున్న బాధలను, ఎద మాటున అణిచి పెట్టుకున్న ఆవేదనను చెపటం ఆరంభించాడు.
* * *
పాలమూరుజిల్లా గౌరారంలో పుట్టాను. నా బాల్యమంతా అక్కడి పంటపొలాల మధ్యనే గడిచి పోయింది. నేను పుట్టిననాటికి అమ్మనాన్నలకు రెండెకరాల పొలం ఉండేది. ఐదు సందుల మట్టి మిద్దె, ఒక చిన్న గుడిసె, కోత కొడవళ్లు, గడ్డపార, రాతెండి చెంబు, ఇత్తడి బిందె, వెంకటేశ్వరుని విగ్రహం, బంగారురంగులో వున్న ఏకుతారా మాకున్న ఆస్తి. చిన్నాన్న, నాయనమ్మ, తాత, మేము కలిసి వుండేవాళ్ళం. నా చిన్నతనమంతా గారాబంగా గడిచింది కానీ సుఖమన్నది లేదు. తాత ఒక చేతిలో అంబలి కట్టుకొని, భుజం మీద నన్ను కూర్చోబెట్టుకుని కోమటిభీమయ్య బాయి కాడికి తీసుకు పోయేవాడు. అక్కడ పశువులు, మేకలు మేపేవాడ్ని. ఎండాకాలం సెలవులయితే మొత్తం మేక లతో తిరిగేవాడ్ని. వాటితో పాటు అడవిలో కాయలు, పండ్లు తింటూ, నీటి కయ్యలలో తనివి తీరా
ఈత కొట్టేవాడ్ని. అప్పుడే నాకు పంట పొలాల పచ్చదనం, ప్రకృతిలోని చల్లదనం పరిచ మయ్యింది. ప్రేమకు కొదువ లేకపోయి నా బతుకులో దరిద్రం ఉండేది. ఆ దరిద్రానికి దూరం కాలేకపోవడం మా కుటుంబం ఫేయిల్యూర్. ఏనాడూ బడికి చక్కగా పోయింది లేదు. నాన్నకు నన్ను చదివించాలనే కోరిక ఉండేది. కానీ నాకు లెక్కలు వచ్చేవి కాదు. కొడితే చదువు వస్తుందని గట్టిగా నమ్మే స్వాముల పంతులు నన్ను విపరీతంగా కొట్టేవాడు. దీంతో బడి అంటే విరక్తి కలిగేది. బడికి పోకుండా గడ్డివాములో దాక్కునే వాణ్ణి. ఇలా అయితే చదువు సాగదని నాన్న, అమ్మమ్మలు కలిసి దుందుబి నది ఆవల వున్న ర్ఛౌుుపతిపేట హాస్టల్ లో నన్ను పడే శారు . మొదటిసారి అలా ఊరికి దూరం కావడం.
అమ్మ సద్దన్నం, సంకటి, సీతఫలాలు, మడు గులు గుపి తెచ్చిన చేపలు తిని గారాబంగా బతికినవాణ్ణి. ఉన్న పళంగా హాస్టల్ లో పడటంతో నరకంలాగా ఉండేది. పెద్ద పిల్లలు, వంట వాళ్ళు, వార్డెన్ నన్ను కొట్టేవారు. 20 మందికి కలిపి గది ఇచ్చారు. అది కూడా పొటుకు పెట్టేది. మేము తెచుక్చున్న పైసలును పెద్ద పిల్లలు గుంజుకునే వారు. రాత్రిపూట దీపపు కందిలే మాకు దిక్కు. ఇది భరించలేక రెండు రోజులకు ఒకసారి ఇంటికి పారిపోయేవాణ్ణి. మళ్లీ తన్ని పంపించేవారు. ఇలాంటి ఇమిడీ ఇమడని పరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షలు వచ్చాయి. రాసాను. ఫలితాలు
వెలువడ్డాయి. నేను పాసయ్యాను. ఎంతో ఆశ్చర్యం. ర్ఛౌుుపతిపేట 11 యేండ్ల హాస్టల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా పదవ తరగతి నెగ్గిన మొదటి దళితున్ని నేనేనట. అందరూ ఎంతో సంతోషపడ్డారు. కాని నాకు తెలుసు ఎంత కషప్ట డితే ఆ లెక్కలు పాసయ్యానో. అక్కడ గోవర్ధన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. మహానుభావుడు. లెక్కలు చెపటంలో మంచి దిట్ట.
ఎక్కాలు రాని వానికి సైతం లెక్కలు నేరడంలో నేరరి. వారి సారథ్యంలోనే నే ను లెక్కలు చేయగలిగాను.
పది అయ్యాక లెక్కలకు దూరం జరగాలనుకున్నాను. ఇంటర్‌లో కల్వకుర్తి జూనియర్ కళాశాలలో నాకు సీటు వస్తే పట్టరానంత సంతోషం కలిగింది. ఆ సంతోషంలో 10 సేర్ల బియ్యం, మెత్తిన కట్టెలు మోపు ఎత్తుకుని, గురిగిలో కారంపొడి పోసుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా కల్వకుర్తికి చేరాను.15 రోజుల పాటు అక్కడే ఉండి కారం మెతుకులు తింటూ కాలేజీకి వెళ్ళాను. కాని కల్వకుర్తి కాలేజీ వాతావరణం నాకు నచ్చలేదు. జడ్చర్ల బాగుంటుందని తెలిసిన వాళ్ళు చెపారు. జడ్చర్లలో నాకు సీటివ్వాలంటూ ప్రిన్సిపాలౖఉ సత్యనారాయణకు ఒక లేఖ రాసాను. నా లేఖకు ఆయన ముగ్దుడయ్యాడు. సీటు ఇవ్వటానికి అంగీకరించాడు. అయితే, కాలేజీలో జాయిన్ కావడానికి ఫోటోలు అవ సరమయ్యాయి. ఫోటోలు దిగి డబ్బు చెల్లించే స్తోమత నాకు లేదు. ఎలా అని బాధ పడుతుంటే ర్ఛౌుుపతి పేటకు చెందిన సాయిబాబా, అంబా శంకర్ రావు అనే ఇద్దరు వ్యక్తులు
నన్ను ఫోటో దింపించి సాయం చేశారు.
లెక్కలు లేని బైపిసి తీసుకుని టీచర్ కావాలని నా ఆలోచన. ఏమో అదృష్టం బాగుంటే డాక్టరు కూడా కావచ్చు. కాని బైపిసి చదవాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. పుసక్తాలు, రికార్డులు… అందుకని ఆలోచించి ఎంతో బాధ పడుతూ హెచ్ఇసి తీసుకున్నాను. ముందునుంచి యిలాగే జరుగుతోంది నాకు. టీచర్‌ని అవుదామనుకుని గుమాస్తానయ్యాను. రంగస్థల కళా కారుడిని కావాలనుకుని రచయితనయ్యాను. చిన్నపట్నుంచి ఇపటివరకు నా ఆలోచనేదీ అమలు కాకపోవటం నా ఫేయిల్యూర్.
నాకు నాటకాలంటే ఇష్టం. తెలకపల్లిలో సురభి వాళ్లు నాటకాలు వేసే వారు. వాటిని చూడడం కోసం 20 పైసలు ఇచ్చి ఇసుకలారీలు ఎక్కి వెళ్ళే వాడ్ని. విషాద సన్నివేశాలలో వెక్కెక్కి ఏడ్చేవాణ్ణి. నాటకాల పిచ్చిలో తెనాలి, కర్నూలు కూడా తిరిగేవా ణ్ణి. అలాగే సాహిత్యం అన్నా యిష్టమే. పుస్తకాలు కొనాలనిపించేది. కానీ ఖాళీ జేబు నన్ను వెక్కిరించేది. మొత్తం మీద హెచైసిలో జడ్చర్ల కళాశాలలో నేనొక్కడ్నే పాసయ్యాను. అయితే డిగ్రీకి వచ్చాక కూడా కష్టాలు తీరలేదు. డబ్బు యిబ్బంది వల్ల ఈవెనింగ్ కాలేజీ లో చదువుతూ ఉదయం పూట పేపర్‌బాయ్ గా పనిచేశాను. రోజుకు 80 పేపర్లు ఇంటింటికి తిరిగి పంచేవాణ్ణి. దీంతో దగ్గు వచ్చేది. ఒక్కొక్కసారి రక్తంపడ్డ సందర్భాలూ ఉన్నాయి. అయినా పేపరేయటం బందుచేస్తే పూటగడిచే పరిస్థితి లేక అలానే కొనసాగించే వాణ్ణి. ఖాళీ సమయంలో గ్రంథాలయంలో గంటల తరబడి కూర్చునేవాణ్ణి .
డిగ్రీ పూర్తయిన మొదటి సంవత్సరమే వివాహం జరిగింది. అదే సంవ త్సరం ఎపిపిఎస్‌సి రాశాను. దాంతోపాటు ఎంఎ తెలుగు కూడా రాశాను. ఎపిపిఎస్‌సిలో ఓపెన్ క్యాటగిరిలో 13వ ర్యాంక్ వచ్చింది. ఇంటర్వ్యూలో జిల్లా కలెక్టర్ ‘సామాజిక అడవులు’ అనే అంశంపై ఒకే ఒక్క ప్రశ్న వేశారు. నా సమాధానానికి కలెక్టర్ సంతృప్తి చెందారు. కో ఆపరేటీవ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం
వచ్చింది. అదే సమయంలో ఎంఎ తెలుగు సీటు కూడా యూనివ ర్సిటీలో వచ్చింది. ఎందులో చేరాలా అని సతమతమయ్యాను. ఎంఎ తెలుగు చేసి ఉంటే నాకిష్టమైన టీచింగ్ ఫీల్డులో లెక్చరర్ అయి ఉండేవాణ్ణి. కాని ఆర్థిక బాధల వల్ల ఉద్యోగమే మేలని నిర్ణయించుకున్నాను. చేరిన మొదటిరోజే 400 ఫైళ్ళు నా ముందు పెట్టారు. ఎపట్నుంచో పడావు పడి దుమ్ముపట్టి వున్నాయి అవి. బీరువా తాళం ఇవ్వడానికి బదులు మా ఆఫీసర్ స్క్రూడ్రైవర్‌ను ఇచ్చిదన్నే తాళం చెవి అన్నారు.
ఫైళ్ళను క్లియర్ చేయటం కష్టంగా వుండేది. అయినా, ఓపిగ్గా వాటన్నింటిని పరిశీలించేవాడ్ని. రూ.1300 జీతం వచ్చేది.
వీటితోనే కుటుంబాన్ని పోషించుకుంటూ చెల్లెలు, తమ్ముళ్ళను చదివించాను. వారు ఇప్పుడు మంచి స్థాయిలో వున్నారు. గుమాస్తా జీవితం నుంచి బయటపడాలని గ్రూపు-2 సాధించాలన్న తపనతో తెల్లవార్లు నిద్రకాచి చదివాను. తీరా గ్రూపు-2 మెయిన్ పరీక్ష రాయబోయి కళ్ళు తిరిగి పడిపోయాను. దాంతో నాలో ఉన్న భ్రమలన్నీ పోయాయి.
ఆ రోజుల్లో తెలకపల్లి మండలంలో కాశన్న, పర్వతాలు, నేను మాత్రమే పట్టభద్రులైన దళితులం. అన్ని పార్టీల వాళ్ళు నన్ను ఎంపిపిగా పోటీ చేయమని కోరారు. నాకు మాత్రం ఆధ్యాత్మికం, సాహిత్యంపైనే ఎక్కువ మక్కువ ఉండేవి. అయితే క్రమంగా వామపక్ష భావాలు అబ్బటంతో సాహిత్యం వైపు పయనించాలో, విప్లవం వైపు పయనించాలో తెలిసేది కాదు. విప్లవ సాహిత్యంపై మక్కువ కలగడానికి జక్కా వెంకటయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, మారోజు వీరన్న, డాక్టర్ఎ .పి విఠలైయ్యలు నిర్వహించిన తరగతులు వినటమే కారణం. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం, తరిమెల నాగిరెడ్డి త్యాగాలు, వీర తెలంగాణ విప్లవ పోరాట గాధలు ఎక్కువగా చదివేవాణ్ణి. సమాజాన్ని మార్చాలన్న తపన ఎక్కువగా వుండేది. పాటకు దగ్గర కావాలనుకున్నాను. సలాది భాస్కర్‌రావు హరికథ, నాజర్ పాటలు, సుద్దాల హన్మంతు, గద్దర్, గూడ అంజయ్య పాటల ప్రభావం నన్ను కవిగా నిలబెట్టాయి.
1987లో ఉస్మానియా యూనివర్సిటి డి హాస్టల్ లో మా బావగారైన వెంకటయ్య, పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ సెక్రటరీ మారోజు వీరన్న కలిసి ఉండేవారు. అక్కడే సాయుధ పోరాటం ద్వారా, పార్ల మెంటరీ రాజకీయాల ద్వారా ప్రజల విముక్తి అన్న అంశంపై మారోజు వీరన్న క్లాసు విన్నాను. ఈ క్లాసు నాపై చె రగని ప్రభావాన్నివేసింది. నాలో విప్లవ రాజకీయాలకు పునాది వేసింది.
అపటికే మిత్ర శశి, ‘అడవిబిడ్డలు’ ఒగ్గుకథ ప్రభావం నా మీద ఉంది. ఈ తరుణంలోనే రఘవా చారి అనే పంతులు నన్ను విరసం సభ్యులకు పరిచయం చేయటం ప్రగతిశీల సాహిత్య ఉద్యమం వైపు నడవటానికి కారణమయ్యింది. కవిత్వం వైపు పూర్తిగా మనసు మళ్లింది. అన్ని సభలకు తిరిగేవాణ్ణి.
మార్క్సిజం పట్ల మమకారం ఉన్నా మొదట భక్తి ఉద్యమాల ప్రభా వంతో బసవేశ్వరుడు, కబీర్, వేమన వంటి ఆధాత్య్మిక ప్రజా కవులను స్మరిస్తూ ‘మానవీయుల మరవబోకన్న’….. అన్న తత్వం రాశాను. దీన్ని మల్లె పల్లి లక్ష్మయ్య వివిధ సాహితీ వర్గాలకు పరిచయం చేశారు. ఆ తర్వాత ‘అందుకోర గుతుపందుకో ఈ దొంగల తరిమేటందుకు’, ‘ఎన్నిసార్లు ఈ ౌ్ఛూరాలు’,
‘వీరులారా విద్యార్థులారా’ అన్న విప్లవ పాటలు మొదటిసారిగా ప్రపంచానికి వినిపించాను. వినవ్నాళ్లందరూ మెచ్చుకున్నారు. క్రమంగా పేరు వచ్చింది. ఇక ‘పల్లె కన్నీరు పెడతుందో’ పాట నేపధ్యం చెపాలి.
ఒక సమయంలో గోరటి అంటే కల్లు అన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమయ్యేది. నాకు కల్లు తాగటమే ప్రధాన వ్యాపకం. స్నేహితులు కూడా నాకు కల్లు తాపుతూ నా పాటలు వింటూ నాతో గడపాలని కోరుకునేవారు. ఉద్యోగం చేసే మొదటి రోజులలో తర్నికల్లు గ్రామంలో తనివి తీరా కల్లు తాగే ఇంటికి పోయేవాణ్ణి. స్వచ్ఛమైన కల్లు ఆ రోజుల్లో పుష్కలంగా లభించేది. ఒక్క సీసా క ల్లు తాగితే చక్కని ఊహతో కవిత్వం నా కలం నుంచి జాలు వారేది. ప్రపంచీకరణ తర్వాత బహుళజాతి కంపెనీల బీర్లు, విస్కీలు ఊరి పొలిమేరకు చేరి గౌడన్నల బతుకులను ఛిద్రం చేశాయి. ఈ బాధే ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’ అన్న పాటకు పురుడుపోసింది. ఈ పాట ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్న భేదం లేకుండా ప్రతి తెలుగోని నాడిని తాకింది. ఈ పాటను సినిమా కోసం మోహన్ బాబు మొదట అడిగారు. కానీ, ఇవ్వలేదు. ఆ తర్వాత నారాయణమూర్తన్న అడిగాడు. ఆయన సినిమా సామాజిక అంశాలను సృశిస్తూ వుండటంతో ఆయనకు ఇచ్చాను. కాంగ్రెస్ వాళ్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పాటను తమ ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించుకున్నారు. డైరెక్టర్ శంకర్ నన్ను సినీ రంగానికి పరిచయం చేసిన సంగతి యిక్కడ చెపాలి. నా మొదటి పాట ‘శ్రీరాములయ్య’ కోసం రికార్ఢ్ అయ్యింది. అన్ని రకాల పాటలు రాసే సత్తా నాలో వున్నపటికీ, సామాజిక సృహ కలిగించే చిత్రాలకే పాటలు రాయాలని నిర్ణయించుకున్నాను .
సినిమా రచయిత అంటే తరగని ఆస్తులు ఉంటాయని అనుకుంటారు. కానీ, నాకున్న ఆస్తి నా జీతం, కట్టవుతున్న జిపిఎ్ౌ్ఛ, నాగర్ కర్నూలులో బ్రహ్మంగారి గుడి దగ్గర వున్న 180 గజాల ప్లాటు, దాంతో పాటు మనసును కుదుటపరిచే నా నలుగురు పిల్లలు. ఒక సమయంలో నా కుటుంబంలో తలెత్తిన సంక్షోభాన్ని కొందరు వాడుకుని నన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారు. భరించలేని మానసిక ఆందోళన మొదలయ్యింది. అయినా పాట రాయటం మానలేదు. సమస్యలెన్ని వున్నా మేధావుల, ఆత్మీయుల సాంగత్యంతో నన్ను నేను పరిశీలించుకునే అవకాశం చిక్కింది. ఉన్నంతలో పీడిత ప్రజల పక్షాన నిలిచి న్యాయం కోసం నిలబడి పాటలు రాయటమే నా సక్సెస్. డిపార్ట్‌మెంటలో పరీక్షలురాసే తీరిక లేక గజిటెడ్ ఉద్యోగిని కాలేకపోవటం నా ఫేల్యూర్ అంటూ ముగించాడాయన.
- దాసిరెడ్డి వెంకట్ ఆన్ లైన్ ప్రతినిధి, మహబూబ్ నగర్
(ఆంధ్రజ్యోతి ఫైల్యూర్ స్టోరి నుండి)
Also watch పాటా పాడేటీ పిల్లలు, ఊటా సెలిమెల్లో ! and Listen to వరదగూడు, గిచ్చన్న గిరిమల్లెలో
December 10th, 2006 at 12:54 am
వెంకన్న గురించి తెలిపినందుకు సంతొషము. వెంకన్నచెప్పిన పంతులు “గొవర్ధన రెడ్డి” మరెవరొ కాదు, మా నన్నె. వెంకన్న కి మా నాన్న లెక్కలు ఇష్టం
…నాకు మా వెంకన్న పాటలు ఇష్టం.
శ్రీధర రెడ్డి
అమెరిక నుండి,
http://www.mydreamzs.com
May 22nd, 2007 at 6:47 pm
మొదటిసారి టిఇ9 వాళ్ళూ తమ చానెల్ ప్రచారం కొరకు వెంకన్న పాటను వినియోగించుకున్నారు. ఆచరణాలు మొదట అర్ధంకలేదు,పూర్తిపాట విన్న తరువాత వదల బుద్దికాలేదు. గోరేటి గొప్పతనం గురించి , గద్దర్,గూడ అంజయ్య వంటి మన తెలంగాణ కవుల గొప్పతనంగురించి ఎంత చెప్పినా ,రాసినా తక్కువే. వీళ్ళు ఇతర ప్రాంతాల్లో పుట్టిఉంటే మన తెలుగు సాహిత్యకారులు ఎంత నెత్తికెత్తుకుని ఉండే వాళ్ళో! తెలంగాణలో పుట్టడం మనకు శాపం కాదు,కాని విముక్తైన తెలంగాణ అంధ్రుల పెత్తనం కిందికి(1956లో) వెళ్ళడం మాత్రం నిజంగా శాపమే. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర&సీమ ల
కబంద హస్తాలనుండి, సంకెళ్ళనుండి విముక్తికై జరుగుతున్న పోరాటంలో మనం విజయులం ఐన నాడే మనకు ఆ శాపం తొలిగేది,మనం బాగుపడేది,అభివ్రుద్ది చెందేది.
మనం ఇక్కడ ఒకవైపు రాస్తున్నం,ఆడుతున్నం,పాడుతున్నం ,ఉద్యమాలుచేస్తున్నం,ఆక్రోశిస్తున్నం ,మనపై పెత్తనం చేస్తున్న వాళ్ళను శపిస్తున్నం.కాని వారి ఆగడాలను,వారు కొనసాగిస్తున్న అన్యాయాల్ను కనీసం తాత్కాలికంగా కూడా ఆపలేకపోయాము. ఏఅత్త సొమ్మును ఏఅల్లుడుకూడా మన తెలంగాణ ఆస్తులను/సొమ్ములను బాబు(టిడిపీ),వయ్యెస్సార్(కాంగ్రేస్)లు చేసినట్టుగ చేసి ఉండరు. ఇంతెందుకు
కేద్రంనుండి హైకమాండ్ పంపిన ఇంచార్జీలను,ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఏస్,ఐఫిఎస్ ఆఫీసర్లను మన తెలంగాణకు వ్యతిరేకంగ పనిచేయించుకోవడానికి లంచంగ మన భూములనే అగ్గువకు ఇస్త్తున్నరట. మరి ఒకవైపున ఇట్ల తెలంగాణ సంతర్పణ జరుగుతుంటే మన రాజకీయ పార్టీలు,నాయకులు మనకు అవమానాలను మోసుకొస్తున్నరు. ఎట్ల బాగుపడ్తమో, ఎవడు మనలను కడతేరుస్తడొ అర్ధం కాకుండా ఉంది. ఎవణ్ణి నమ్మాల్నో,ఎవణ్ణి నమ్మగూడదో చదువుకున్న మనకే అర్ధం కాకుంటే సామాన్యునికి ఎట్లా అర్ధం అవుతుందో ఆలోచించండి. 2009 వరకు మన ఓటర్లకు ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చే ఒక పార్టీ గాని ,నాయకుడుగాని పుట్టుకొస్తాడా? అనే సందేహం ఉంది.పుట్టుకొస్తే బాగుండుననే ఆశ కూడ ఉంది.
రాములు
June 18th, 2007 at 5:30 am
గొరటి వె0కన్న గురించి ఛదివి చాలా సంథొషమయింది. ఇంథకు ముందె ఆయన గురించి కొంథ థెలుసు.మా పాలమురు జిల్లా వాడని మరికొంథ అభిమానము. పారమర్థికమైన అలొచనలు వున్నాయని తేల్సుకొని మరీ ఆనంద పడ్డాను .కాని సాహిత్యానికి కూడా వర్గీకరణ ఆపాదించకండి. దళత సాహిత్యము, ధనిక సాహిత్యము, కుల సాహిత్యము,మత సాహిథ్యము అని సాహిథ్యాన్ని కూడా వర్గీ కరిస్థె కుంచించుకు పొతున్న మానవత మరీ చిన్నదయి నలుమూలలా వెతుక్కొవలసి వస్థుంది. ఏక్కడొ దలిత స్మషానము అనె బొర్దు చూసి నవ్వాలొ,ఎడావాలొ అర్థము కాలెదు. మరణించిన మనిషికి కూడా కులము అపాదిస్తె బ్రతికివున్న జనం దళిత దెవుళ్ళను, ధనిక దెవుళ్ళను వెతుక్కొని గుళ్ళు కట్టుకొవలసి వస్థుంది. అంటె, అట్టదుగు వర్గాలవారిని పై స్తాఇకి తెచ్చె ప్రయతనమం లొ మన పయనం పురొగమనమా, తిరొగమనమా? సమ సమాజ స్తాపనలొ అంతర్జాతీయ వర్గ పొరాటం లొ సాహిత్యాని చాలా వుపయొగించుకున్నారు కాని, మానసిక చైతన్యం తెవటానికి మాత్ర మె కాని మళ్ళీ మనిషిని పొట్టి వానిగా చెయటానికి కాదు. సమాజం లొ కళ రావాలంటె కళలను వర్గీకరించవద్ద ని నా అభిప్రాయం- మాది కొయిలకొండ- పాలమూరు జిల్లా.
June 18th, 2007 at 5:30 am
గొరటి వె0కన్న గురించి ఛదివి చాలా సంథొషమయింది. ఇంథకు ముందె ఆయన గురించి కొంథ థెలుసు.మా పాలమురు జిల్లా వాడని మరికొంథ అభిమానము. పారమర్థికమైన అలొచనలు వున్నాయని తేల్సుకొని మరీ ఆనంద పడ్డాను .కాని సాహిత్యానికి కూడా వర్గీకరణ ఆపాదించకండి. దళత సాహిత్యము, ధనిక సాహిత్యము, కుల సాహిత్యము,మత సాహిథ్యము అని సాహిథ్యాన్ని కూడా వర్గీ కరిస్థె కుంచించుకు పొతున్న మానవత మరీ చిన్నదయి నలుమూలలా వెతుక్కొవలసి వస్థుంది. ఏక్కడొ దలిత స్మషానము అనె బొర్దు చూసి నవ్వాలొ,ఎడావాలొ అర్థము కాలెదు. మరణించిన మనిషికి కూడా కులము అపాదిస్తె బ్రతికివున్న జనం దళిత దెవుళ్ళను, ధనిక దెవుళ్ళను వెతుక్కొని గుళ్ళు కట్టుకొవలసి వస్థుంది. అంటె, అట్టదుగు వర్గాలవారిని పై స్తాఇకి తెచ్చె ప్రయతనమం లొ మన పయనం పురొగమనమా, తిరొగమనమా? సమ సమాజ స్తాపనలొ అంతర్జాతీయ వర్గ పొరాటం లొ సాహిత్యాని చాలా వుపయొగించుకున్నారు కాని, మానసిక చైతన్యం తెవటానికి మాత్ర మె కాని మళ్ళీ మనిషిని పొట్టి వానిగా చెయటానికి కాదు. సమాజం లొ కళ రావాలంటె కళలను వర్గీకరించవద్ద ని నా అభిప్రాయం- మాది కొయిలకొండ- పాలమూరు జిల్లా.
July 12th, 2007 at 10:40 am
అన్న మీరు వ్రాషె పాట లు మన తెలంగాణ కు అవి అని ముత్యలు మన గడ్డ మీధ పుట్టి నంధు కు నాకు ఈ బ్రతుకు చాలు నెను ఎమి చెసి నా ఈ ఋణము తిరుచుకొనగలను నా ప్రతి రక్తము బొట్టు నా తెలంగాణ కొరకు వీరజిమ్మతా
నీ తమ్ముదు తెలంగాణ శ్రీను
July 18th, 2007 at 5:51 am
మామో – ఎంకన్న మామా…….
మొదట్సారి నీ పాటను బషీర్ బాగ్ జర్నలిస్టుల మీటింగ్ల ఇన్న…
శెరువోయి మా వూరి సెరువు…. అనుకుంట లయబద్ధంగ నువు పాడుతాంటె, ముంగట్నేఇనేటోండ్లల్ల కూసున్న నాకు, మా అన్నకు, మేనమామకు కండ్లపొడాంటి నీల్లుగారవట్టినయ్…
నిజం….
తెలంగాణ పల్లెలకు ప్రాణాధారాలైన చెరువులు గత 50 సంవత్సరాల నిర్లక్ష్యపు పాలనలో దారుణంగా కృషించి, నషించి దీనావస్థకు చేరాయి.
చిన్ననాట మనం చూసిన మత్తడి దృశ్యాలు, పిల్లల ఈతలు కనుమరుగై, ఎక్కడికెళ్ళినా బీళ్ళువారిన చెరువులే కనిపిస్తాయి.
మొక్కుబడిగా ప్రభుత్వం కేటాయించే చెరువుల మరమ్మత్తు పనులు ఎవరికి దక్కుతాయో, వళ్ళేపాటి పనులు చేస్తారో అందరికెరుక. (రెండు జోర్ వానలకే గండ్లు, నీళ్ళ అభద్ర్రత – మామూలే)
ఇక ఒకప్పటి సరస్సులనగరం (CITY OF LAKES) మన హైదరాబాదులో చెరువుల శిఖం భూములన్నీ ఎంత దారుణంగా అన్యాక్రాంతమయ్యాయో చూస్తే, మన నగరాన్ని కీర్తించిన విదేశీయులే విలపిస్తారు.
వెంకన్నా… ఈ మధ్య మేంవిన్నదేమంటే – మన నగరానికి త్రాగునీరందించే చెరువులకు కూడా గండం మోపైందట. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కుట్రట.
వినాశ కాలే……….. విపరీత బుధ్ధి!!!
July 27th, 2007 at 4:46 pm
anna mee patalu chaala baaguntaayi. mee GORATI POTU paatalu naaku baaga nachaayi..GALLI CHINNADI.. GAREEBOLLA KATHA PEDDADI… telangana brathuku nee notiventa paatayi……nannu vekkiristhundi .naa brathuku maarchukomantundi.. telangana kosam poraadamni pade pade ..aaraata peduthundi….naa cheyi ethi TELANGANA KU JAI antunna..
June 10th, 2008 at 6:03 am
anna melanty vallu malanty variki adarshamuga neluvalli.anna
nadi NALGONDA distic shaligowraram mandal ramagiri ani chinna grammam. naku elanti patalu anty challa estam.nevu manathelangana kosam elanty patalu enno padi mamulanu thelangana yuvakulanu vthejaparuchalani korukuntunanu.jai thelanganna…..
January 28th, 2009 at 1:39 am
వ్యాసము చాలా బాగుంది. “పల్లె కన్నీరు పెడుతుందొ కన్పించని కుట్రల” పాట నన్ను కదిలించినది. నిజముగా” కవి అంటె కదిలించెవాడూ ” …..నిజమె….ఈ పాట ను నెను ఎన్నొ సార్లు విన్నాను….ఒక వ్యాసంలొ నెను ఉపయొగించడము జరిగినది. బతుకమ్మ సినమాలొ వెన్కన్న యాక్షన్ బాగుంది. గొరటీ నీ జీవితము లొ ని కష్టాలు , కన్నీళ్ళూ .. లాగానె…పాలమూరు జిల్లాలొ నుండీ పైకి వచ్హిన ప్రతి వారికి ఇలాంటీ జీవిటాన్ని అనుభవించి వచ్హిన వారె……ఇది నా అభిప్రాయము మాత్రమె….మొన్న దసరా పండగ అప్పుడూ ” ఎన్ టీ . వి వారు నిర్వహించిన ప్రత్యెక ఆర్తిక మండళ్ళూ ” ప్ర త్యెక చర్హా గొష్టీ లొ పాల్గొని , నా వాయిసు ను ఇచ్హాను.
ఇది సంతొషకరమయిన విషయము.
ఇన్కా చెప్పాలని ఉంది అన్నా ….కాని తెలుగు పాంటూ సరిగా లెదు…తప్పులు పొతఉన్నయి.
మీరు ఇలాగె మంచి పాటలు సమాజానికి అందిచాలని కొరుకునె మీ పాలమూరు జిల్లా
వాసి.. మీ తూర్పింటీ నరెష్ కుమారు.naresh.tuurpinti@gmail.com …
January 28th, 2009 at 4:07 am
ఈ వ్యాసం చాలా బాగుంది. గొరటి వెంకన్న జీవితాన్ని ప్రతిబింబిస్తున్నది. నిజంగా ” గొరటి జీవితం కష్టాలు , కన్నీల్ల మయమే ” భూతకాలము ఎండి పోయిన ఏ రు లాంటిది.వర్థమానం వెలుగుచున్న దివ్వె లాంటిది”. అన్న వాక్యం వెంకన్నకు వర్తిస్తుంది. ఇతని ” పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల పాట నా హ్రుది ని తట్టింది…. నిజంగా అధ్భుతం. వీరి తో నేను నిజాం కాలేజ్ గ్రౌండు లో మాట్లాడాను. పాలమూర్ జిల్లా నుండి పైకి ఎదిగిన చాలా మంది వారి జీవితానికి వెంకన్న జీవితానికిసారూప్యం ఉంది. మొన్న దసరా పండుగకు “ఎన్ టి.వి ” నిర్వహించిన ప్రత్యేక ఆర్థిక మండళ్ళు చర్ర్చా ఘోష్టి లో నేను పాల్గొన్నాను.దానిలో వెంకన్న పాట పాడారు. ఇది సంతోషకరమయిన విషయం. ఇంతే సంగతులు….ఇట్లు మీరు పాటలు రాయాలని కోరుకునే పాలమూర్ జిల్లా వాసి… నరేశ్ కుమార్. తూర్పింటి ,తెలుగు పరిశోధకుడు
February 12th, 2009 at 4:31 am
పాలమూరు బిడ్ద తెలంగా మూద్దు బిడ్ద అన్నా వె0కన్న గురి0చి తెలిపిన0దుకు ధన్యవాదములు,
February 2nd, 2010 at 10:25 pm
అన్నా మీరు ప్రచురిస్థున్న విశయాలు చాల బాగుంటున్నాయి కాని ఒకటే భాధ
మీరు ఇస్థున్న ఆర్టీకల్స్ అన్ని పిడిఎఫ్ లొ “downloads” ఇస్తె ఉపయెగంగా ఉంటుంది
ఈ ఆర్టీకల్స్ ని print చేసి net లేని వ్వాల్లకు కూడ ఇస్తె చదవడానికి ఉపయెగంగా ఉంటుంది
January 30th, 2011 at 1:45 am
అన్నా నువ్వంథె నాకు మస్థు ఇస్తమె, నీ థల్లి గా పాటలింటె నాకు మస్థు సుకూంగుంటదన్న్ బాంచన్ తెలంగణా కొసమ్ ఒక పాట పాడాలన్నా,
జై తెలంగణా
జై జై తెలంగణా