Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
రచన: నందిని సిధా రెడ్డి, గానం: దేశ్‌పతి శ్రీనివాస్
* * *
* * *
నాగేటి సాల్లల్ల నా తెలంగాణా, నా తెలంగాణా,
నవ్వేటి బతుకులు నా తెలంగాణా, నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
పారేటి నీల్లల్ల పానాదులల్ల
పూసేటి పూవుల్ల పూనాసలల్లా
| పారేటి…|
కొంగు సాపిననేల నా తెలంగాణా, నా తెలంగాణా
పాలుతాపిన తల్లి నా తెలంగాణా, నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
తంగేడు పువ్వుల్లు తంబాలమంతా
తీరొక్క రంగుల్ల తీరిచ్చినా పువ్వు
| తంగేడు …|
తీరొక్క రంగుల్ల తీరిచ్చినా పువ్వు
బంగారు చీరలు బాజారులన్ని
|| బంగారు… ||
బతుకమ్మ పండుగ నా తెలంగాణా, నా తెలంగాణా
బంతి పూల తోట నా తెలంగాణా, నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
వరద గూడు కడితె వానొచ్చునంటా
బురద పొలము దున్ని మురిసున్నరంతా
| వరద … |
శివుని గుల్లే నీల్లు చీమలకు శెక్కరి
వానకొరకు భజన జడకొప్పులేసి
|| వాన … ||
వాగుల్ల వంకల్ల నా తెలంగాణా, నా తెలంగాణా
సూపు రాలిన కండ్లు నా తెలంగాణా, నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు
పాలపిట్టలజూసి పడుసుసప్పట్లు
| కొత్త … |
పాలపిట్టలజూసి పడుసుసప్పట్లు
జొన్నకర్రల జండ జోరున్నదేమి
||జొన్న … ||
అలై బాలై తీసె నా తెలంగాణా, నా తెలంగాణా
జమ్మి పంచిన ఆర్తి నా తెలంగాణా, నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
మోటగొట్టే రాత్రి మోగిన పాట
తాడుబేనిన తండ్రి తలుపులున్నప్పు
| మోట … |
తాడుబేనిన తండ్రి తలుపులున్నప్పు
కల్ల ముడిసిన అవ్వ కలలోని గింజా
|| కల్ల … ||
ఆరుగాలం చెమట నా తెలంగాణా, నా తెలంగాణా
ఆకలి దప్పుల మంట నా తెలంగాణా , నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
ఊరుగాచే తల్లి ఉరిమీజూడంగా
బువ్వలేని తల్లి బోనమొండిందీ
| ఊరుగాచే … |
బువ్వలేని తల్లి బోనమొండిందీ
సేనుకొచ్చిన పురుగు సెరిగిపోసిందా
|| సేను … ||
బోనాల పండుగ నా తెలంగాణా, నా తెలంగాణా
కాట్రావుల ఆట నా తెలంగాణా , నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
దట్టి గట్టిన రోజు డప్పు సప్పుల్లు
పీరీల గుండంల పిలగాండ్ల ఆట
| దట్టి … |
పీరీల గుండంల పిలగాండ్ల ఆట
కుడుక పేర్లమొక్కు కూలి బత్కుల్లు
|| కుడుక … ||
ఆలువాడిన పాట నా తెలంగాణా, నా తెలంగాణా
ఆత్మ గల్లా చెయ్యి నా తెలంగాణా , నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
కలిసేటి సేతుల్ల కన్నీటి పాట
సిందోల్లసిందుల్ల సిగురించే నాట్యం
| కలిసేటి … |
సిందోల్లసిందుల్ల సిగురించే నాట్యం
ఒగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం
|| ఒగ్గు … ||
కళలకే పుట్టుక నా తెలంగాణా, నా తెలంగాణా
పాటగాచిన పట్టు నా తెలంగాణా , నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
తాడుబేనిన బతుకుతండ్లాటసూడు
మంటలేని కొలిమి బతుకుల్ల మంట
| తాడు … |
మంటలేని కొలిమి బతుకుల్ల మంట
నీళ్ళులేని చెరువు నినుజూసి నవ్వే
|| నీళ్ళు … ||
బతికిసెడ్డాబిడ్డ నా తెలంగాణా, నా తెలంగాణా
తల్లడిల్లే తల్లి నా తెలంగాణా , నా తెలంగాణా
| నాగేటి సాల్లల్ల… |
బురుజుగోడల పొగరు మెడలు వంచంగా
పుట్లల్ల సెట్లల్ల గోగుపువ్వుల్లూ
| బురుజు … |
సద్దిమోసిన తల్లీ సావుబతుకులు
పానమిచ్చిన వీరకథలు పాడంగా
|| పాన … ||
గోరుకొయ్యల పొద్దు నా తెలంగాణా, నా తెలంగాణా
గోరింకలా సభలు నా తెలంగాణా , నా తెలంగాణా
|| నాగేటి సాల్లల్ల… ||
October 22nd, 2007 at 7:58 am
అన్న ఇది తెలంగాణ పల్లెల్లొ నీ పల్లె ల సందడి బతుకు చిత్రము
జై తెలంగాణ! జై తెలంగాణ!!
కాపాడు కుందాము మన తెలంగాణ సంస్క్రుతిని
July 22nd, 2008 at 3:24 am
I like this song please keep Telangana songs in this website
Jai Telangana….
Jai TRS
August 5th, 2008 at 7:49 am
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా
జై తెలంగాణ జై జై తెలంగాణా
February 26th, 2010 at 7:18 am
జై తెలంగాణ! జై తెలంగాణ్
బతికిసెడ్డాబిడ్డ నా తెలంగాణా, నా తెలంగాణా
తల్లడిల్లే తల్లి నా తెలంగాణా , నా తెలంగాణా
జై తెలంగాణ! జై తెలంగాణ్
February 27th, 2010 at 2:12 am
జై తెలంగాణా! జై జై తెలంగాణా!! తెలంగాణా ప్రజల హ్రుదయంలొ చెలరెగుతున్న మంటలకు,అభద్రతా భావానికి,తెలంగాణా విధ్యార్థుల ఆత్మహత్యలకు..కాదు హత్యలకు కారణము ఎవరు? తెలంగాణ రజకీయ ద్రొహులు కాదా? ఒకరు సామజిక తెలంగాణా అని..ఇన్కొకరు మేము తెలంగాణా కు వ్యతిరెకము కాదు అని…మరొకరు ఇన్కొరకముగా…. ఇక గత 40 ఏల్లుగా తెలంగాణ ప్రజల ఆశఃలను,నమ్మకలను కుదువబెట్టుకొని పదవులను, రాజబొగాలను అనుబవిస్తు…తెలంగాణా ప్రజలు మనొ వేదనకు గురై వుద్యమిస్తుంటె అందులొ కపటముతొ,కుబుద్దితొ చేరి…తెలంగాణా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అను కుటిల నినాదంతొ తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవాన్ని అతి కిరాతకంగ మానబంగము చేస్తున్న నాయకులు.ఇక్కడ మనము ఇలాంటి నాయకులను తెలిసి కుడా ఆదరిస్తున్నమన్న విషయాన్ని గుర్తుంచుకుని తీరాలి.ఇలాంటి రాజకీయ దుష్యాశఃనులు వున్నంతకాలం తెలంగాణా మాన,ప్రాణాలు దొపిడీకి..వివక్ష కు గురౌతూనే వుంటుంది…ప్రపంచ ప్రసిద్దికెక్కిన తెలంగాణా సాయుద రైతాంగ పొరాటాల గడ్డ పై ఇప్పుడు ఇలాంటి కుటిల నాయకుల రాజరికం చూసి…కాదు చూడకేక తెలంగాణా తల్లి కళ్ళనుండీ నెత్తుటి కన్నీరు కారుస్తుంది…అవమానంతొ తలవంచుకుంటుంది….దాదాపు 200 ల యేళ్ళు అంగ్లేయుల దాష్య ష్యున్కలాలనుండి భరత మాతకు విముక్తి కలిగిన రీతిగ తెలంగాణా తల్లి కూడా గర్వంగా తలెత్తుకునే రోజు వస్తుంది.
March 13th, 2010 at 1:29 pm
ఓ,
చక్కని ఐక్య వాది ,తెలంగాణ వచ్చిన తెలుగునాడు ముక్కలు అవుతుందంటావు
బ్రక్కచిక్కిన మా కాపుల తిప్పల గురించి తెలియదంటావు
త్రుప్పు పట్టిన మా మర యంత్రాల ఇరుసుల గురించి తెలియదంటావు
జబ్బు చేయించే మీ రసాయనవ్యర్ద మలినాల గురించి తెలియదంటావు
మణులు పంచే మా గనులల్ల నలిగే జనుల గురించి తెలియదంటావు
నీరు లేక ఏరులయి పారే కన్నీటి చారల గురించి తెలియదంటావు
భూమిని ధ్రోచిన క్రిమి నేతలు చేశే భూటకాల గురించి తెలియదంటావు
తెప్ప దాటించిన ప్రక్క వాడి కంచానికి వేసే కంచె గురించి తెలియదంటావు
ఎంత త్రిప్పినా పెరగని మా చేనేత మగ్గాల వడిని గురించి తెలియదంటావు
ఏమి చెప్పినా తరగని మా ఎడారి రోదనల తడిని గురించి తెలియదంటావు.