- జొన్నలగడ్డ హనుమంతరెడ్డి
సీ. పుట్టినప్పటినుండి వెట్టిచాకిరిఁజేయ
శారీర బలమెల్ల సమసిపోయెఁ
గులకాంత పగలెల్లఁగూలిఁజేసినఁ గాని
యొక్కపూటకె తిండి చిక్కదాయెఁ
గొడుకు గష్టించియుఁ గొలువుఁజేసినఁ గాని
కట్టుటకై గుడ్డ కరవువచ్చె
ఋణ దాతలెల్లరు ఋణములు రెట్టించి
యన్యాయముగఁఏల నాచికొనిరి
కటకటాజీవనముఁజేయఁ గష్టమయ్యె
నెవరికేనియు మామీఁద నెనరులేదు
బ్రతుకుఁదెఱువును జూపియు భద్రముగను
దీనులగు మమ్ముఁ బ్రోవవే దేవదేవ.
‘గోలకొండ కవుల సంచిక’ (1934) నుంచి