- అరిగె రామస్వామి
గీ. మాలమాద్గు లన్యమతములఁజేరిరి
ధేడ్ చమారటంచు దిట్టుకతన
దేశమతముదిక్కు ధేడ్ చమార్లేకదా
రక్త బంధులార రైతులార
గీ. హిందుమతము జీవహింసను నోర్వదు
మాలమాద్గులన్న మండిపడును
దనను హింసఁజేయఁ దగసలాములఁజేయు
రక్త బంధులార రైతులార.
‘గోలకొండ కవుల సంచిక’ (1934) నుంచి