- పులిగోటి ఆనందమాంబ
గీ. విద్యయన్నను స్త్రీలకు వెగటుగల్ల
వనితలజ్ఞానులనుచును వాడుకొనుట
యబ్బురంబేమి దీపంబునవలఁద్రోయ
నున్న యింటిలోఁ జీఁకటి యుండకున్నె.
ఉ. కాంతలు మాతృభాషపయి గౌరవముంచక నన్యభాష న
శ్శ్రాంతము నేర్చినంతటను సారములేదిక గొప్పయైన శ్రీ
మంతముగల్గి యున్నదని మంగళసూత్రముఁ బారవైచి య
త్యంత సుభూషణంబులను దాల్చినరీతిని యెంచి చూడఁగ
‘గోలకొండ కవుల సంచిక’ (1934) నుంచి