Feed on
Posts
Comments

Monthly Archive for నవంబర్, 2006

కలమే ఆయుధంగా ప్రజలల్ల చైతన్యం విస్తరింపజేసిన వ్యక్తి వెల్దుర్తి మాణిక్యరావు. ఒక పక్క రచయితగా మరొక పక్క పాత్రికేయుడుగా ఆయన కృషి చిరస్మరణీయం. ఆంధ్రమహాసభ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పలు పత్రికలల్ల రచనా బాధ్యతలు నిర్వహిస్తూ స్వాతంత్ర్యోద్యమ పిపాసను రేకెత్తించిండు. తెలంగాణ ప్రజల చైతన్యం కోసం ఆయన బహుముఖాలుగా కృషి చేసిండు.

Read Full Post »

ప్రాంతీయ విద్యావికాసంల విశేషమైన కృషి సల్పిన సేవాపరాయణుడు కె.సి.గుప్త. గ్రంధ ప్రచురణా కర్తవ్యాన్ని స్వీకరించిన ఘనుడు గుప్త. తెలుగు చదువునుంచి దూరం చేయబడిన తెలంగాణ ప్రజలకు చదువులను, సాహిత్యాన్ని పంచిన గుప్తది భిన్నమైన వ్యక్తిత్వం. ఇక్కడి రాజకీయ పరిస్థితుల పరిణామంల తనదైన ముద్రతో భాగస్వామ్యం వహించిండు గుప్త.

Read Full Post »

తెలుగులో తొలి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’కు పాటలు రాసిన తొలి సినీగేయ రచయిత చందాల కేశవదాసు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లిల 1876 జూన్ 20వ తేదీన జన్మించిండు. చందాల లక్ష్మి నారాయణ, పాపమ్మలు తల్లిదండ్రులు. కేశవదాసు నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, నాటకకర్త. భక్త ప్రహ్లాద, కనకతార చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు రచించి, సినీరంగంల ఖ్యాతిపతాక నెగురవేసిండు.

Read Full Post »

తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి. రాజకీయ సాంఘీక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం రాసి ప్రజాకవి. హక్కులడిగి ప్రజల మనిషి. ఉద్యమం నడిపి ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. పుటక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. 

Read Full Post »

పాకాల తిరుమల్ రెడ్డి చిత్రకళారంగంల పి.టి.రెడ్డిగా చిరపరిచితుడు. చిత్రకళారంగంల అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రముఖులల్ల పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంల అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడాయన.

Read Full Post »

- ఒద్దిరాజు రాఘవరంగారావు
బోధాభిః సాధువాద క్రటన పటువాగ్వైఖరీమౌఖరీభి
ర్గాధాభిర్హృద్యపద్యైర్మధుమయకలితైర్వ్యాసజాలైర్విశాలైః
స్తోత్రైశ్చిత్రైశ్చరిత్రై ర్వివిధవిషయశాస్త్రార్థ వాదైర్వినోదైః
సంయుక్తాగోలకొండా విసతుసతతమ్పత్రికాహ్యత్రభూమ్యామ్

Read Full Post »

- గంగుల శాయిరెడ్డి
సీ. నీజాతివారలు రాజులైయుండియుఁ
గనఁజాలరైరి నీ కష్టమెల్ల
నీ కులమందు జన్మించిన యానమీం
దారులుగనరు నీ తాపమెల్ల

Read Full Post »

-వరవరరావు
ఒక భావన జీవితానుభవంలోకి వస్తే తప్ప అది అందరికీ ఒకే సెంటిమెంటు కాజాలదు. ఆ అనుభవం కూడా చేదు అనుభవం అయినపుడు కేవలం భాషలో, సాహిత్యంలో, మధ్యతరగతి విస్తృతంగా ప్రచారం చేసే సంస్కృతీ సంప్రదాయాల్లో ఉండే భావనను అందరిచేత ఆమోదింపజేయడం సాధ్యం కాదు. మా ఊరే. నాలుగు వందల ఏళ్లకు పైగా మా ఊరే. మా హుస్సేన్‌సాగరే, మా ట్యాంక్ బండే.

Read Full Post »

« Prev

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com