‘తెలంగాణ’పై తొందరపడాలి ! ఆలస్యం అనర్థదాయకం
డిసంబర్ 29th, 2006 by డిస్కవర్ తెలంగాణ
- మధుగౌడ్ యాష్కీ
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు చాలా ముందే తెలంగాణ రాష్ట్రంకోసం ఆందోళన ప్రారంభమైంది. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం (ఎస్.ఆర్.సి) స్పష్టంగా చెప్పిన ఈ అభిప్రాయాన్ని పునరుద్ఘాటించుకోవడం అవసరం : ‘హైదరాబాద్ రాష్ట్రంగా చెప్పుకొంటున్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచడం ఆంధ్ర, తెలంగాణ ప్రయోజనాలరీత్యా కూడా అవసరమే. 1961లో, లేదా ఆ సమీపంలో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత హైదరాబాద్ (తెలంగాణ) రాష్ట్రానికి చెందిన శాసనసభ్యులలో మూడింట రెండువంతులమంది ఆమోదిస్తే, ఆంధ్రతో సమైక్యమయ్యే ప్రొవిజన్‌ను పొందుపరచుకోవాలి’ అని ఎస్.ఆర్.సి సూచించింది. ఆధునిక భారతానికి నిజమైన దార్శనికుడు పండిట్ నెహ్రూ కూడా 1953లో, ‘ఇతరుల భూభాగాన్ని ఆక్రమించుకోవడం లేదా చేజిక్కించుకోవడం అనే సామ్రాజ్యవాద పన్నాగమే విశాలాంధ్రవాదానికి ప్రేరణ’ అని నిర్మొహమాటంగా స్పష్టంచేశారు.
పూర్తి వ్యాసాన్ని PDF రూపంల చదవండి >>
(29 డిసెంబర్ 2006, వార్త నుంచి)



