వర్తమానం : మరలనిదేల ఎస్సార్సీ?
Posted in తెలుగు, రెండవ ఎస్.ఆర్.సి, వర్తమానం, ఆంధ్రజ్యోతి on Jan 9th, 2007
- ఎన్. వేణుగోపాల్ ఆ రావణకాష్టం ఈ దేశంలో ఎప్పటికీ చల్లారదనే స్పష్టమైన అవగాహనతోనే, ‘మరలనిదేల రామాయణంబన్న’ అని తానే ప్రశ్న వేసుకుని ‘తినిన అన్నమే తినినయట్లు, చేసిన సంసారమే చేసినయట్లు’ అని జవాబు చెప్పుకుని రామాయణ కల్పవృక్షం రాశారు విశ్వనాథ సత్యనారాయణ. విలీనానికి ముందునుంచీ, 1952 నుంచీ రగులుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎప్పటికీ ఆరిపోదనే స్పష్టమైన అవగాహనతోనే, ఆ మంటమీద దొరికిన చన్నీళ్లు నాలు గు చిలకరిద్దామనే సాచివేత ఎత్తుగడలో భాగంగానే ‘మరలనిదేల [...]