రెండో ఎస్సార్సీ వేయాల్సిందేనా?
Posted in తెలుగు, రెండవ ఎస్.ఆర్.సి, ఆంధ్రజ్యోతి on Jan 11th, 2007
- బి.ఎస్.రాములు ఆరు దశాబ్దాల క్రితం రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాతకూడా ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఏ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం (స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్- ఎస్సార్సీ) నేర్పాటు చేయలేదు. మొదటి ఎస్సార్సీ నివేదిక ననుసరించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఆవిర్భవించాయి. అయితే హైదరా బాద్ రాష్ట్ర రద్దు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మొదటి ఎస్సార్సీ నివేదిక సూచనలకు వ్యతిరేకం. ఇటీవల కొందరు రెండో ఎస్సార్సీ వేయాలని డిమాండ్ చేస్తు న్నారు. [...]