Feed on
Posts
Comments

- డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

మనమిప్పుడు పునర్నిర్మాణ (డీకన్‌స్ట్రక్షన్‌) యుగంలో ఉన్నాం. నిరాఘాటంగా ముందుకు దూసుకెళ్లడానికి ఒకడుగు వెనక్కి వేయడం అవసరం. ఆ అడుగు బలమైన భూమిక మీద పడాలి. స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ దాదాపు ఇలాంటి మాటల్నే చెప్పి ఉన్నాడు. తెలంగాణ స్వాతంత్య్ర సాధనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి.

దాదాపు నాలుగేళ్ల క్రితం తెలంగాణ సాంస్కృతిక వేదిక తరపున కాసుల ప్రతాపరెడ్డి సంకలనం చేసిన ‘తెలంగాణ తోవలు’ పుస్తకంలో తెలంగాణ సాహిత్య చరిత్రను రాయాలనే ఉద్దేశంతో ‘లెక్కదప్పిన తెలుగు సాహిత్య చరిత్ర’ అనే చిన్న వ్యాసం రాశాను. సంతృప్తినివ్వలేదు. చాలా అసమగ్రమనిపించింది. కె. శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌లు ‘కవిలె’ పేరుతో తెలంగాణ సమీపగత సాహిత్య సాంస్కృతిక చరిత్రను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదీ చాలదనిపించింది.

ఆధునిక తెలంగాణ కవిత్వాన్నంతటినీ ఒక్కచోట కుప్పపోసి చూపించాలనే ఉద్దేశంతో సురేంద్రరాజుతో కలిసి ‘మత్తడి’ కవితా సంకలం తెచ్చాను. అదీ అసమగ్రమే అనిపించింది. ఈ సంకలనం ముందుమాటలోనే చెప్పిన ప్రకారం తెలంగాణ ప్రాచీన కవిత్వాన్ని సంకలనం చేయడానికి రెండున్నర సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఎంతచేసినా ఇంకా ఏదో మిస్సవుతున్నదనే అనపిస్తుంది.

తెలంగాణ ఐక్యవేదిక, ఉస్మానియా చరిత్రశాఖ, తెలంగాణ రచయితల వేదిక తదితరులెందరో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రాజకీయ చరిత్రను, నిర్మించడానికి ప్రయత్నించారు.

ఇన్ని ప్రయత్నాల తర్వాత కూడా చేయాల్సింది ఎంతో ఉంది. అది పూర్తి చేయడం ఇలాంటి ప్రయత్నాల వల్ల సాధ్యంకాదేమోననిపిస్తున్న తరుణంలో తెలంగాణ చరిత్రను నిర్మించడమనే మహత్తర కార్యం సంఘటితంగా, ప్రణాళిక బద్దంగా చేస్తే తప్ప సాధ్యం కాదని అనిపిస్తున్న సమయంలో హిస్టరీ కాంగ్రెస్‌ తరహాలో ‘తెలంగాణ హిస్టరీ సొసైటీ సంస్థ ఏర్పడనున్నదని తెలిసి గొప్ప ఆనందం కలిగింది. తెలంగాణ రైటర్స్‌ కాలం తొలిసన్నాహక సమావేశాలకు ఎంతో ఉద్వేగంతో పాల్గొన్నాను. అంత ఉద్వేగంతో ఈ సన్నాహక సమావేశానికి వచ్చినాను.

ఇంతమంది (ఇక్కడికి రాని ఇంకెంతమందితో సహా) తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం పట్ల ఉద్విగ్న మనస్సుతో ఇక్కడి రావడం అందరికీ ఆనందం కలిగించే విషయమే గాక ఎవరికి వాళ్లం కర్తవ్యం నిర్ధేశం చేసుకోవాల్సిన సందర్భం. ఇంతమందిని ఇక్కడికి రప్పించడానికి చొరవతీసుకున్న కె. శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, ఎన్‌. వేణుగోపాల్‌, లోకేశ్వర్‌…లు, తెలంగాణ కవులకు ప్రాధాన్యాన్నిస్తూ తెలుగు సాహిత్య చరిత్ర రచించి సమావేశంలో ప్రధానోపన్యాసం చేసిన ముదిగంటి సుజాతారెడ్డిలు అభినందనీయులు.

ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించే పనిలో ‘తెలంగాణ చరిత్ర సొసైటీ’ నిర్వహించాల్సిన విషయాల్ని కొన్ని ప్రస్తావిస్తాను.

‘మును మార్గకవిత లోకం
బున వెలయుగ దేశికవిత బుట్టించి తెను
గున నిలిపి రాంధ్ర విషయమున
జన చాళుక్య రాజు మొదలుగ పలువుర్‌…..’

నన్నెచోడుడి ప్రసిద్ధ పద్యం అందరికీ తెలిసిందే. ఇందులో నాల్గవ పాదంలో ‘జన చాళుక్య..’ అనే దానికి ‘జన సత్యాశ్రయని తొట్టి చాళుక్య నృపుల్‌’ అనే పాఠాంతరం ఉంది.

మొదటి పాఠం ప్రకారం తూర్పు చాళుక్యులే తెలుగు కవిత్వ ప్రేరకులుగా కనిపిస్తారు. రెండవ పాఠం ప్రకారం సత్యాశ్రయుడు ప్రేరకుడుగా కనిపిస్తాడు. కాని తూర్పు (వేంగీ) చాళుక్యులలో ఆరవ శతాబ్దికి చెందిన కుబ్జవిష్ణువర్ధనుడి (బాదామి చాళుక్యుడు

  • తూర్పు చాళుక్యుల స్థాపకుడు) కి సత్యాశ్రయ బిరుదు ఉంది కాని అప్పటికి తెలుగు కవిత్వం మొదలు కాలేదు. రాజరాజ నరేంద్రునికి తాత వరసైన సత్యాశ్రయుడనే రాజు ఉన్నాడు కాని అతడు అనామకుడు. తెలంగాణలోని కొలనుపాక మొదటి రాజధానిగా పాలించిన కళ్యాణి చాళుక్యులు (కాలం 965-1189)లలో ఒక సత్యాశ్రయుడు (997-1008) ఉన్నాడు. ఇతడే నన్నెచోడుడు పేర్కొన్న సత్యాశ్రయుడేమో పరిశోధించవలసి ఉన్నది. ఇంతకంటే, తూర్పు చాళుక్యులకంటే ముందే వేములవాడ చాళుక్యుల (750-973) లో రెండవ అరికేసరి కన్నడ ఆదికవి పంపన ఆశ్రితుడు కావడం (940), పంపన కన్నడంలోనే గాక తెలుగులో కావ్యం రాసి ఉండడం (జినేంద్ర పురాణం, ఆధారం వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రబంధ రత్నావళి), ఇతని సోదరుడు జినవల్లభుడి కంద పద్యాలు లభించడం (కుర్క్యాల శాసనం
  • 940), జినవల్లభుడి ఆధ్వర్యంలో మల్లియ రేచన (940) కవిజనాశ్రయమనే చంధోగ్రంథం రాసి వుండడం, ఈ వేములవాడ చాళుక్య రాజు బద్దెగుడు (బద్దెన) (960-966) నీతి శాస్త్రముక్తావళి, సుమతి శతకం? రాసి వుండడం తెలంగాణ నుంచే తెలుగు సాహిత్యం మొదలైందనడానికి ఆస్కారం కలిగిస్తున్నవి. వీటన్నిటినీ నిర్ధారరణ చేయవలసిన కర్తవ్యం ఇలాంటి సంస్థలు నిర్వర్తించాల్సి ఉంది. ఇంతేకాదు తెలుగు సాహిత్య చరిత్ర రచన చేసిన వాళ్లు పరిశోధన చేసిన వాళ్లందరూ తెలంగాణేతరులు కావడం వలన తెలంగాణ నుంచి సాహిత్యం వచ్చే అవకాశం లేదని పూర్వనిశ్చిత అభిప్రాయం లేదా దురభిప్రాయం ఆ పరిశోధకులకు ఉన్నందు వల్ల కూడా, అలాగే వారికి తెలంగాణ భౌగోళిక పరిచయం లేకపోవడం వలన కొన్ని తప్పుడు నిర్ధారణలు జరిగి ఉన్నాయి.

    ఉదాహరణకు కొన్ని. కందుకూరి రుద్రకవి ప్రకాశం జిల్లాలోని కందుకూరి వాడనీ చింతలపాలెం అనే గ్రామాన్ని ఇబ్రహిం కుతుబ్‌షా (1550-1580) నండి అగ్రహారంగా పొందినవాడని వేటూరి ప్రభాకరశాస్త్రి, ఆరుద్ర మొదలైన పరిశోధకులు తేల్చినారు. కానీ నల్లగొండ జిల్లాలో దేవరకొండ సమీపంలో మరొక కందుకూరు ఉంది. ఈ కందుకూరులో కూడా జనార్ధనస్వామి దేవాలయం, సోమేశ్వరాలయం ఉన్నావి. ఈ కందుకూరుని జనార్ధన కందుకూరు అని కూడా పిలుస్తారు. రుద్రకవి జనార్ధనాష్టకం రాయడమే కాకుండా తన కావ్యాల్ని జనార్ధనస్వామికి, సోమేశ్వరుడికి అంకితమిచ్చినాడు. రుద్రకవి తను పొందిన అగ్రహారాన్ని ‘ద్వితింత్రిణి’ అని పేర్కొన్నాడు. ద్వితింత్రిణి అనగా రెండుచింతల లేదా రెంటచింతల. ఈ గ్రామం ప్రకాశం జిల్లాలో లేదు. అందువల్ల ద్వితింత్రిణిని ‘చింతపాలెం’ గా వ్యాఖ్యానించి రుద్రకవిది ఆ కందుకూరు అనే నిర్ణయించినారు. నిజానికి రెంటచింతల గ్రామం ఉంది. కాని అది గుంటూరు జిల్లాలో ఉంది. ఈ గ్రామం ప్రకాశం జిల్లా కందుకూరు కన్నా నల్లగొండ జిల్లా కందుకూరుకు చాలా సమీపంలో ఉంది. ఇబ్రహీంకుతుబ్‌షా దేవరకొండ దుర్గపాలకుడుగా ఉన్నపుడు పొందిన అగ్రహారమిది. అందువల్ల రుద్రకవి దేవరకొండ సమీపంలో కందుకూరి వాడని చెప్పవచ్చు. ఈ కవి కోస్తా జిల్లాలవాడుగానే పరిగణించ బడుతున్నాడు.

    ఇక అప్పకవి గురించి. అప్పకవి తన తాత ‘అభినవ చూతపురి’లో నివాసమున్నాడని పేర్కొనగా, ‘అభినవ చూతపురి’ కి ‘మామిళ్లపల్లి’ అనే అర్థం చెప్పి ఆ గ్రామం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని మామిళ్లపల్లి అగ్రహారం గానీ కావచ్చనీ కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నాడు. తర్వాతి చరిత్రకారులు దానినే అంగీకరించి అప్పకవిని ఆ జిల్లా వాడనే నిర్ధారించారు. కాని మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి తాలూకాలోని ‘లేమామిడి’ అనే గ్రామానికి ‘అభినవ చూతపుర’ము సంస్కృతీకరణమని బూర్గుల రామకృష్ణారావుగారు నిరూపించినా ఇంకా అప్పకవి కోస్తా జిల్లాల వాడుగానే పరిగణింప బడుతున్నాడు. ఇలాగే అనంతామాత్యుడు, కృష్మమాచార్యులు, నూతన కవి సూరన మొదలగు చాలామంది గురించి తప్పుడు నిర్ధారణలు జరిగి ఉన్నాయి.

    కొంతమంది తెలంగాణ కవుల్ని సాహిత్య చరిత్రల్లో పేర్కొనలేదు. ఉదాహరణకి ‘దాశరథి చరిత్ర’ అనే నిరోష్ఠ్యోత్తర రామాయణ గ్రంథకర్త పురుషకారి కేశవయ్య. ఈ కవిని గాని ఇతని గ్రంథమును గాని పూర్వ సాహిత్య చరిత్రకారులు, ఆధునిక సాహిత్యచరిత్రకారులు తమ గ్రంథాల్లో పరామర్శించలేదు. సమగ్ర ఆంధ్రసాహిత్యంగా పిలువబడే ఆరుద్ర గ్రంథంలో కూడా ఇతని గ్రంథప్రసక్తి లేకపోవడాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రిటైర్డ్‌ లెక్చరర్‌ వల్లపురెడ్డి బుచ్చారెడ్డి పురుషకారి కేశవయ్య రాసిన దాశరథి చరిత్ర (నిరోష్ఠ్యోత్తర రామాయణం) పరిష్కరిస్తూ పేర్కొన్నాడు.

    ఇట్లా చాలామంది కవుల గురించి తప్పుడు నిర్ధారణలు, అసలు పేర్కొనక పోవడం జరిగాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివెన్నో ఉన్నాయి. దాచేస్తే దాగని సత్యాలన్నీ బయటకు రావాలి. అప్పుడే తెలుగు సాహిత్యచరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర సంపూర్ణమవుతుంది. అందుకు తెలంగాణ చరిత్ర నిర్మాణ సంస్థలు పూనుకోవాలి. ప్రతిదీ ఇప్పుడు పునర్నిర్మాణం కావాలి.

  • చరిత్ర రచన, చరిత్ర నిర్మాణం ఎట్లా చేయాలనేది హిస్టరీయోగ్రాఫి అనే పేరుతో ఒక శాస్త్రంగా రూపొందిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
  • ఎవరిచరిత్రను వాళ్లే రచించుకోవాలనే సూత్రీకరణను అనుసరించి, తెలంగాణ చరిత్రను తెలంగాణ నిర్దిష్ట భౌగోళిక, రాజకీయ దృక్కోణం నుంచి నిర్మించాలి.
  • తెలంగాణలోని వివిధ అస్తిత్వాల (స్త్రీ, దళిత, ముస్లిం వాద) దృక్కోణం నుంచి కూడా తెలంగాణ చరిత్రను నిర్మించాలి. అందుకు ఆ వివిధ అస్తిత్వ సమూహాలనుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి.
  • చరిత్ర నిర్మాణంలో యూరోపియన్‌ నమూనాను అనుసరించవలసిన అవసరం లేదు.
  • ఇంతవరకు చరిత్ర నిర్మాణమంతా ఆధిపత్య వర్గాల అనగా పాశ్చాత్య మెజారిటీ మత పురుష, ఆధిపత్య ప్రాంత, ఆధిపత్య వర్గ (భూస్వామ్య, పెట్టుబడీదారి) ఆధిపత్య సాంస్కృతిక, అగ్రవర్ణ దృక్కోణం నుంచి నిర్మించడం జరిగింది. అందుకు భిన్నంగా అధీన వర్గాల లేద ఉపశ్రేణుల సబాల్టన్ర్‌) అనగా ప్రాచ్య, వెనుకబడిన ప్రాంత, పీడిత వర్గ, స్త్రీ, దళిత ముస్లింల అధీన సాంస్కృతిక దృక్కోణం నుంచి నిర్మించాలి.
  • వివిధ ప్రాంత నిర్దిష్టతలతో ప్రమేయం లేకుండా ప్రపంచమంతటా చరిత్ర క్రమం ఒకే విధంగా ఉంటుందనే విశ్వజనీన దృక్కోణం సరికాదు. పాశ్చాత్య చరిత్ర క్రమం, ఆసియా క్రమం ఒకే విధంగా లేదనే విషయంలో చాలా చర్చ జరిగిన విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దేశాల విషయంలోనే కాక దేశంలోని ప్రాంతాల విషయంలో కూడా ఈ వైవిధ్యం ఉంది. ఉదాహరణకు తెలుగు అభ్యుదయకవిత్వ చరిత్ర, తెలంగాణ అభ్యుదయ కవిత్వ చరిత్ర ఒకటి కాదు. ఆ ప్రత్యేకతల్ని గమనించకుండా (తెలుగు అభ్యుదయ కవిత్వం గేయ ఛందస్సులో, వచన కవిత్వం వస్తే, తెలంగాణ అభ్యుదయ కవిత్వం పద్యంలో పాటలో వచ్చింది) తెలంగాణ కవుల్ని మిగతా అభ్యుదయ కవులతో పోల్చి తెలంగాణ కవులు వెనుకబడి ఉన్నారని సూత్రీకరించడం జరిగింది. తెలంగాణ భాషను వెనుకబడిందిగా సూత్రీకరించడం జరిగింది. ఆ పోలిక నుంచే ‘తెలుగు వర్డ్స్‌వర్త్‌’ లాగా ‘తెలంగాణ శ్రీశ్రీ’ అనే సూత్రీకరణ వచ్చింది.
  • రెండు జిల్లాల భాష మొత్తం తెలుగు భాష కానట్టు ఒక కులంలోని సంస్కరణోద్యమం మొత్తం అన్ని కులాల సంస్కరణోద్యమం కానట్లుగానే ఒకటి రెండు ప్రాంతాల్లో వచ్చిన స్త్రీవాద కవిత్వాన్ని మొత్తం తెలుగు దేశ కవిత్వంగా చెప్పడం తప్పు. కడప, కర్నూలులో స్త్రీవాదం లేదు, దళితవాదం ఉన్నట్లు లేదు కాని ఆ ప్రాంతం విద్యార్థులు తమ ప్రాంతంలో లేని, రాని వాదాల్ని తమ సాహిత్య పరిణామంలో భాగంగా చదుపుకోవాలి
  • ఎట్లా వాళ్లు దాంతో ఏకీభవిస్తారు. అయినా బలవంతంగా తమలో భాగంకాని దాన్ని భాగంగా చదువుకోవాలి. ఇది సరికాదు.
  • కాబట్టి ఉమ్మడి అనగా అందరికీ వర్తించే అనగా విశ్వజనీన, చరిత్ర ఉండదు అనేది గుర్తుంచుకోవాలి.
    మాట్లాడే అంశాల మధ్యన మాట్లాడని (బిట్విన్‌ ది లైన్స్‌) అంశాలు వుంటాయి. చెలామణీ అయ్యే వాటి గర్భంలో చెలామణిలో లేని అంశాలు దాగి ఉంటాయి. వేమనలాగా, నాసరయ్యలాగా, వీరబ్రహ్మంలాగా… అలాంటిదే తెలంగాణ చరిత్ర.

    అన్ని స్థిర నిర్మాణాల్ని నిరాకరించడమే పునర్నిర్మాణం (డీకన్‌స్ట్రక్షన్‌).

    [ సూచిక | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | Download ‘PDF‘ ]

    Share/Save/Bookmark

    One Response to “చరిత్ర రచన / నిర్మాణం”

    1. 1
      mahi Says:

      జై తెలంగన జైజై తెలంగన

    Leave a Reply

    (కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


    a

    aa

    i

    ee

    u

    oo

    R

    Ru

    ~l

    ~lu

    e

    E

    ai

    o

    O

    au
    అం
    M
    అః
    @H
    అఁ
    @M

    @2

    k

    kh

    g

    gh

    ~m

    ch

    Ch

    j

    jh

    ~n

    T

    Th

    D

    Dh

    N

    t

    th

    d

    dh

    n

    p

    ph

    b

    bh

    m

    y

    r

    l

    v
     

    S

    sh

    s
       
    h

    L
    క్ష
    ksh

    ~r
     

    తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో