Feed on
Posts
Comments

- ఎన్ వేణుగోపాల్

జీవో 610 మీద మరొక సారి వివాదం మొదలయింది. ఇరవైరెండు సంవత్సరాల కాలయాపన చేసిన ప్రభుత్వం నెలరోజులలోపల అమలు చేస్తానని పారదర్శకంగా అబద్ధమని తేలిపోయే ప్రగల్భాలు పలుకుతున్నది. ఆ అమలుకోసమేననే పేరుతో మరొక జీవో తెచ్చింది. కోస్తాంధ్రకు, రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తమకు తాము చెప్పుకునే నాయకులు ఆ జీవోను అమలు చేయనేగూడదని ప్రకటిస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మరొక అడుగు ముందుకువేసి తెలంగాణ దయ్యం పట్టిందని, దాన్ని వదిలించే భూత వైద్యం జరగాలని అన్నారు.


ప్రభుత్వమే రెండు దశాబ్దాలకింద జారీ చేసిన ఒక జీవోను అమలు చేయడానికి, ఒకటికి రెండు సార్లు ప్రభుత్వం నియమించిన కమిషన్లు తప్పనిసరిగా అమలుచేయాలని సిఫారసు చేసిన జీవోను అమలు చేయకుండా ఉండడానికి, అమలు చేయించకుండా ఉండడానికి, ప్రజలమధ్య అనవసరమైన విద్వేషాలు రెచ్చగొట్టి అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రతిఒక్క పాత్రధారీ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే విషాద రసవత్తరంగా ఉన్నది. కాకపోతే ఒక ఇరవై రెండు సంవత్సరాల, ఆ మాటకు వస్తే యాభై సంవత్సరాల అన్యాయాన్ని వక్రీకరించి ప్రదర్శిస్తున్న ఈ రసవత్తర నాటకం ఈ పాత్రధారుల అతి ప్రదర్శనల వల్ల అంతిమంగా రక్తపాతానికీ, హింసకూ, అనవసరమైన విద్వేషాలకూ దారితీస్తుందేమోనని భయం వేస్తున్నది.ప్రతిరోజూ సామాజిక వ్యవహారాలపైననో, పాలనా అవసరాలకోసమో, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికో నాలుగైదు జీవోలు విడుదలయి ఆ పని తీరగానే కాలగర్భంలో కలిసిపోయే వాతావరణంలో, ఇరవై రెండు సంవత్సరాల కిందటి ఈ జీవో 610 ఇవాళ్టికీ సజీవంగా ఉన్నదంటే, ఇంత గాఢమైన ఉద్వేగాలను సృష్టించగలుగుతున్నదంటే, ఆ జీవోకు మూలంలోనే ఎంత బలం ఉన్నదనుకోవాలి! లేదా ఒకానొక ప్రభుత్వాజ్ఞ ఇంతటి సుదీర్ఘ చరిత్రకు, వివాదానికి కారణమవుతున్నదంటే మన పాలనా రీతులు, రాజకీయార్థిక విధానాలు ఎంత లోప భూయిష్టంగా ఉండి ఉండాలి!

నిజంగానే జీవో 610 చరిత్ర చూస్తే, అది ఎన్నెన్ని మలుపులు తిరిగి ఇక్కడికి వచ్చిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ జీవో కు మూలమైన చరిత్ర సుదీర్ఘమైనది, మూడు నాలుగు శతాబ్దాల కిందటిది. కాని, అంత దూరం పోనక్కరలేకుండానే కనీసం ఆంధ్రప్రదేశ్ పుట్టుకకు కారణమైన పెద్దమనుషుల ఒప్పందం నుంచి ఈ జీవో చరిత్రను చూడవచ్చు.

పెద్దమనుషుల ఒప్పందం లో విలీనం వల్ల జరిగే ఉద్యోగుల తొలగింపులు ప్రాంతీయ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని నాలుగో అంశం, జరగనున్న నియామకాలు ప్రాంతీయ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని ఐదో అంశం నిర్దేశించాయి. ఏడో అంశం ఇంకా స్పష్టంగా తెలంగాణ ప్రాంతీయుల ఉద్యోగ నియామకాలలో నిర్ణీత నిష్పత్తిని పాటించేందుకుగాను 12 సంవత్సరాల నివాసం వంటి సూత్రాలను రూపొందించాలని నిర్దేశించింది. అంటే ప్రాంతీయులకే ఉద్యోగాలు అనే పునాది మీదనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ అంశాన్ని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రిక్వైర్ మెంట్ ఆజ్ టు రెసిడెన్స్) రూల్స్ 1959 వెలువరించారు. కాని ఆ నిబంధనలను తుంగలో తొక్కడంతో తెలంగాణలో అసంతృప్తి ప్రజ్వలనం మొదలయింది.

ఆనేపథ్యంలో సమావేశమైన అఖిల పక్షం చేసిన సిఫారసులమేరకు 1969 జనవరి 21 న రాష్ట్రప్రభుత్వం జీవో 36 ప్రకటించింది. “1956 నవంబర్ 1 న గాని, ఆ తర్వాతగాని ఈ కింద వివరించిన, తెలంగాణ వాసులకు కెటాయించబడిన ఉద్యోగాలలో నియమితులయినవారందరినీ ఎపిపిఇ (ఆర్ ఆర్) రూల్స్ 1959 ప్రకారం 1969 ఫిబ్రవరి 28 లోపల వెనక్కిపంపించివేయడం జరుగుతుంది” అని ఆ జీవో పేర్కొంది. కాని ఆ జీవో అమలు కాలేదు.

ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగులలో, విద్యార్థులలో చెలరేగిన ఆందోళన ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్షగా పరిణమించడం అందరికీ తెలిసిన సంగతే. ఆ ఆందోళనాక్రమంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు, జైఆంధ్ర ఉద్యమం, మళ్లీ జైతెలంగాణ ఉద్యమం సాగిన తర్వాత ఇందిరాగాంధీ 1973లో ప్రతిపాదించిన ఆరుసూత్రాలపథకం తెరమీదికి వచ్చింది. ఆపథకంలో ఆరోసూత్రం ముల్కీనిబంధనలను రద్దు చేసింది. మూడోసూత్రం ఉద్యోగ నియామకాలలో స్థానికులకే ప్రాధాన్యత అని ప్రకటించినందువల్ల దానికి చట్టబద్ధత కల్పించడం కోసం రాజ్యాంగసవరణ చేసి 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. రాష్ట్రపతి సంతకంతో వెలువడిన ఉత్తర్వుల అమలుకే దిక్కులేకపోగా, వాటి అమలు కొరకు ఒక జీవో వెలువరించమని ముఖ్యమంత్రిని తెలంగాణ ఎన్జీవోల సంఘం ప్రాధేయపడిన కారణంగా జీవో 610 వెలువడింది. అదికూడ రాయలసీమ ప్రాంతీయులకే స్థానిక ఉద్యోగాలు అంటూ రక్షణ కల్పిస్తూ జీవో 564 వెలువడినతర్వాతనే. తెలుగుదేశం పాలనలో 1985 డిసెంబర్ 30 న వెలువడిన ఈ జీవో 1986 మార్చ్ 31 లోపు అమలు కావాలి. మూడు నెలలలోపు అమలు చేయడం అలా ఉంచి, అసలు అటువంటి జీవో ఒకటి ఉందనికూడ ప్రభుత్వం మరిచిపోయింది. ఆ బాధ్యతా రాహిత్యం పైన అసంతృప్తి విస్తరిస్తున్నదశలో 2001 మేలో తెలుగుదేశం ప్రభుత్వం ఏకసభ్య విచారణ కమిషన్ ను నియమించింది. కమిషన్ ప్రాథమికనివేదికమీద సిఫారసులుచేయడానికి ఒక శాసనసభా సంఘం నియమించారు. కమిషన్ తన తుదినివేదికను 2004 సెప్టెంబర్ లో సమర్పించేనాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ – తెరాస ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం కూడా ఆ నివేదికను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ మంత్రివర్గ ఉపసంఘం నివేదికను చదివి, క్రోడీకరించి తమకు నివేదించడానికి మరొక అధికారుల కమిటీని నియమించింది. ఆ కమిటీ తయారుచేసిన పరిశీలన పత్రం పకారం జీవో 72 అనే ఒక ఉత్తర్వును విడుదల చేశారు. ఆ ఉత్తర్వులు రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి, జీవో 610 స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని గగ్గోలు రేగడంతో జీవో 116 ద్వారా దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత గిర్ గ్లాని సిఫారసులమేరకు జీవో 610 అమలుపై సూచనలు ఇవ్వడం కొరకు ఒక శాసనసభా సంఘాన్ని నియమించారు. కొందరు సభ్యుల రాజీనామాలతో ఆ శాసనసభా సంఘం ఉనికి ప్రశ్నార్థకం కావడంతో జీవో 399 తీసుకువచ్చారు. జీవో 610 స్థానికులకు రిజర్వేషన్ల గురించి మాట్లాడగా, జీవో 399 అందుకు పూర్తిగా వ్యతిరేకంగా స్థానికేతరుల సంఖ్యకు గరిష్ట పరిమితి గురించి మాట్లాడుతున్నది.

పెద్దమనుషుల ఒప్పందం (1956) మీద, స్థానికుల ఉద్యోగ నిబంధనల (1959) మీద, జీవో 36 (1969) మీద, ఆరుసూత్రాల పథకం (1973) మీద, రాష్ట్రపతి ఉత్తర్వుల (1975) మీద, జీవో 610 (1985) మీద, గిర్ గ్లాని కమిషన్ (2001) మీద, శాసనసభా సంఘం (2002) మీద, మంత్రివర్గ ఉపసంఘం (2004) మీద, జీవో 72 (2006) మీద, జీవో 116 (2006) మీద, శాసనసభా ఉపసంఘం (2006) మీద, జీవో 399 (2007) మీద….స్థానికులకే ఉద్యోగాలు (అవి కూడ ఉన్నతోద్యోగాలు కావు, రాష్ట్రపతి ఉత్తర్వుల రిజర్వేషన్లు చిరుద్యోగాలకు మాత్రమే) అనే ప్రజాస్వామిక, సహజన్యాయసూత్రం అమలు కావడానికి ఎన్నితరాలు వేచిచూడాలి? వేచిచూస్తున్న అభాగ్యులకు పుండుమీద కారం చల్లినట్టు కారుకూతలు వినబడుతుంటే ఏం చేయాలి? తెలుగు టీవీ సీరియళ్ల మలుపులనూ అసహజత్వాన్నీ కుటిలత్వాన్నీ కూడ తలదన్నే ఇన్ని మలుపుల నాటకం తెలుగు నేలలో కాకుండా మరెక్కడయినా అయితే ఇంత సజావుగా సాగి ఉండేదేనా?

(Source: ఆంధ్రజ్యోతి, వర్తమానం జూన్ 12, 2007)

6 Responses to “జీవోమీదజీవోమీదజీవో…”

  1. 1
    harinath Says:

    అసలు ఈ జి ఒ గొడవ ఎంటొ, ఎప్పుడొ ఉద్యగాలలొ చెరి ముసలి అయ్యిన వాల్లని ఇప్పుడు ఉద్యోగం ప్రాంతం మారమనటం్ ఎంటొ అర్ఠంకాని విషయం.

    పర దేశాలలొ సైతం కొంత కాలం పైగా ఉంటె పౌరసత్వం ఇస్తారు. ఆలాంటప్పుడు ఒక రాష్త్రం లొ ఇంత గొడవ అవసరమా? అని అనిపిస్తుంది నాకు.

  2. 2
    610 కూ పాకిస్తాన్ కూ పోలికేమిటి? « గుండె చప్పుడు… Says:

    [...] 610 జీవో పూర్వాపరాల పైన ఎన్. వేణుగోపాల్ గారు ఒక మంచి వ్యాసం రాశారు. దాన్నిక్కడ చదవచ్చు. [...]

  3. 3
    ramulu Says:

    ప్రియ తెలంగాణ వాదులకు,
    హరినాద్ వంటి తెలంగాణ వారు ఈజీఓ ఏమిటో, 30 నుండి 50 ఏళ్ళ నుండీ మనదగ్గర పనిచేస్తున్న వాళ్ళను పొమ్మనడమ్ ఏమిటొ, ఇన్నిఏళ్ళ్ తరువాత ముసలివాళ్ళైన వారిని పొమ్మనడం(ఏదేశంలో లేనిది ఒక రాష్ట్మం ఉన్న కారణంగా మన దగ్గరికి వచ్చి ఉంటున్న వాలళ్ళని) లో అర్ధమేమిటొ అంటు మన తెలంగాణ వాదులను ప్రశ్నిస్తున్నరు. 23 ఏళ్ళుగా ఈ 610 జీఓను అమలు చేయని ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి/నిలదీయడానికి బదులు మనవాళ్ళనే నిలదీస్తున్నరు . ఒకవైపు ఆ.ప్ర. ప్రభుత్వం 610 జీఓను అమలుచేస్తానంటూ (ఆరొందల పది రాగాలు ఆంధ్ర జ్యోతి లో ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు సకాలం శీర్శికలో రాసిన ట్టు) మరోసారి కొత్తమార్గదర్శకాలను జారీచేసింది.

    హైద్రబాదు నుండి తమని పొమ్మనే హక్కు ఎవరికీ లేదని తెలంగాణ వారిని రాష్త్ర ఎంజీఓల సంఘం నాయకుదు హెచ్చరిస్తున్నాడు,మరోవైపు .అటువంటివారికి మన టిఎన్ జీఓలే సమాధనాం చెప్పలి.మీరువెళ్ళిపోవడానికి ఏంచెయ్యమంటరో/ఏంచేస్తే మీరుపోతరో చెప్పండని కేసీఆర్ ఎన్ జీఓలను ప్రశ్నిస్తే , శ్రీరమణ వంటి పత్రికా రచయితలు ,వెళ్ళకుంటే ఏంచేస్తారో చెప్పండని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటివారికి మన టిజెఫ్ వాళ్ళె సమాధనం చెప్పాలి. “ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే “అంటే ఇదేకావచ్చు. సామెత ఇటువంటి వారినిచూసే పుట్టి వుంటుందని నమ్మకంగా ప్పొచ్చు.

    ఒకవైపు అవాకులు చెవాకులు పేలుతూ మేం సామరస్యంగా విడిపోదామంటుంటే కేసీఆర్ ఏదో అడ్డు పడుతున్నట్లు మాట్లాడ్దే పద్దతి మార్చుకోవాలంటు సూచిస్థున్నారు చేగొండి.ఇక గాదె,వసంత వంటి రాజకీయనాయకుల మాటలకు కొదవలేదు ,వాటిని ప్రచురిస్తున్న మన తెలుగు పత్రికలకు అడ్డమూలేదు.ఇక బదిలీ చేయబడిన కానిస్టేబుల్స్ కొర్టుకెక్కి స్టే తెచ్చుకున్నారు.ఇవన్ని చూస్తుంటే 610 జీఓను ప్రభుత్వం అమలు చేయలేదని తేలిపోయింది.ఏదోరకంగా తదుపరి ఎన్నికలవరకు నెట్టుకొచ్చి ఓటేయించుకుని బయట పడితే తెలంగాణను అడిగేవాడెవడు ఉండడని వాళ్ళు భావిస్తున్నట్టున్నారు.

    కేసీఆర్ ఎన్ జీఓలను ఒకరకంగా ప్రశ్నించారు .ఐతే వారికే ఒకవైపు మనం సలహాఇస్తూనే మరోవైపు (మరోరకంగ) తెలంగాణ రాకుండ అడ్డుపడుతున్న వారినే ప్రశ్నించాల్సి ఉంది.మీరు ఇక్కడ(తెలంగాణలో) ఉండాలంటే తెలంగాణలో ఇతర రాష్ట్రాలవాళ్ళూ ఎలా తెలంగాణ వేరుకు అడ్డుపడకుండ ఉంటున్నరో అలాగే (వాళ్ళలాగే) ఉండండి అభ్యంతరం లేదు. వేరైనంకకూడా ఇతర రాష్ట్రాలవారి మాదిరే (మద్రాసులో లక్ష్లాది తెలుగు వాళ్ళుఇప్పుడు ఉంటున్న తీరుగ) ఉండండి, మీ ఉదోగాలు మీరే చేసుకోండి. మాతో పాటు కలిసి తెలంగాణ వేర్పటుకొరకు ఉద్యమించడానికి కలిసిరండి.అప్పుడు మిమ్మల్ని వేరుగా చూసే ప్రస్నే ఉండదు. అడ్డుపడదల్చుకుంటే మాత్రం మాకు తెలంగాణ రాకున్న ఫర్వాలేదు కాని మీరుపొయ్యేంతవరకు మాత్రం వదిలేది లేదు అని తెగేసి చెప్పాలి.మీరు బదిలీ ఐపోతె తెలుగు తల్లి విడిపోయే భాధా తప్పుతుంది,రాష్ట్రం ముక్కలయ్యే అవసరమూ తప్పుతుంది అని కూడ వారికి ,వారికి మద్దతిస్తున్న లక్షలాదిమంది అక్కడి వాళ్ళకు స్పష్టం చెయ్యాలి. రెండింట్లో యే దో ఒకటి ఎంచుకునే అవకాశం వారికే ఇద్దాం.

    మనం ఈక్రింది స్లోగన్స్ తో ఇప్పుడు ముందుకు సాగితే బాగుంటుందని నా నమ్మకం.
    బదిలీలకు సిద్దం కండి,
    తెలుగు తల్లిని బతికించండి,
    రాష్ట్రాని ముక్కలుగాకుండ నివారించండి,
    తెలంగాణ వేరుగాకుండ పోరాడండి,
    సమైక్య గానాలు చెయ్యండి,
    సామరస్యపు పాటలు పాడండి.

    లేదా

    ఇక్కడే అందరిలాగ ఉండండి,
    మీఉదోగాలు మీరు చేసుకోండి,
    తెలంగాణకు అడ్డుపడకండి,
    తెలంగాణ వేర్పాటుకు మాతో భుజం కలపండి.
    మద్రాసులో తెలుగువళ్ళు కలిసి
    ఉంటున్నట్టుగ మాతో కలిసిపోండి.

    - రాములు

  4. 4
    Sridhar Says:

    Excellenet

  5. 5
    rakesh Says:

    కాంగ్రెసు పార్టీని వెంటాడుతున్న సమస్యలు – అనుసరించాల్సిన తక్షణ వ్యూహం

    వార్తల్లో కనపడుతున్నట్టుగానే ప్రస్థుతం కాంగ్రెసుపార్టీని రకరకాల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఐతే అమ్ముల పొదిలో బాణాలన్నీ ఐపోతున్న కాంగ్రెసువాళ్ళకు ఇందులోంచి బయటపడాలంటే ఇప్పుడు మిగిలిన విధిలేనిమార్గం మరియు ఒకే ఒక్క తరుణోపాయం “తెలంగాణ రాష్ట్రం” ఏర్పాటుచెయ్యడమే …

    ముందుగా సమస్యలు:
    1. S.C. కులాల వర్గీకరణసమస్య: వీలైనంతవరకూ దాటవేత / సాగతీతధోరణిలో కొనసాగాలనుకున్నప్పటికీ (old strategy adopted by most political parties & politicians; BUT.. will not work any more), గుజరాత్లో వసుంధరా రాజె ప్రభుత్వానికి ఎదురైన పరిస్థితిని కళ్ళారా చూసింతర్వాత YSR ప్రభుత్వానికిది “ముందు-నుయ్యి వెనుక-గొయ్యి” లా తయారయింది. రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళకు బాగా తెలిసిన, విరివిగా వాడుకొంటున్న విషయం ఏమిటంటే కొన్ని సమస్యలను ఆదిలోనే త్రుంచకుండ ఉండడం.. ఆ issueను అట్లానే ఉంచుతే వీలైనంతకాలం వోట్లు పిండుకోవచ్చాయె మరి..
    అనాది కాలంగా కాగితాలకే పరిమితమౌతున్న అసంఖ్యాక ప్రాజెక్టులు , మాటలమూటలు, ఈకోవలోకే వస్తాయి. తెలంగాణప్రజల జన్మహక్కైన తెలంగాణ రాష్ట్రం” ఏర్పాటు కూడ, వారి (రాజకీయ)అనైక్యతకారణంగానైతెనేమి, మరేవిధమైన కారణంగానైతేనేమి రాజకీయపార్టీలకు “బ్రహ్మాండమైన ఎన్నికల” అంశంగా తయారైంది.

    ప్రస్థుత YSR ప్రభుత్వం, SCల వర్గీకరణనికూడా అదేదృష్టితో చూడాలనుకోవడం, వివిధసందర్భాల్లో అటువైపు మాలలకూ, ఇటువైపు మాదిగలకూ హామీలమీద హామీలిస్తూ ఓటుబ్యాంక్ గా వాడుకోవడం మనం చూశాం, చూస్తూనేవున్నాం.
    కరీంనగర్ ఎన్నికల్లో మందకృష్ణమాదిగ సహాయాన్ని YSR కోరింది, పొందగలిగింది ABCD తాయిలంతొనే కద!
    అయితే, ఇప్పుడు మందకృష్ణ ఆగే పరిస్థితుల్లో లేడు. 2009 ఎన్నికలలోపే తాడోపేడో తేల్చకపోతే మన రాజకీయ ఉద్ధండులు మరోనాటకానికి తెరతీయగలరని ఎరిగినవాడు.

    వరస ఆమరణనిరాహార దీక్షలూ,అలకలూ,బుజ్జగింపులూ, రెండువైపులా సంఘీభావాలుతెలిపే (గో.పి.)నేతలూ, conditional సమ్మె విరమణలూ వార్తల్లోకెక్కాయి. మాదిగల ఆగ్రహాగ్నిధాటికి ఎన్నోబస్సులు ఆహుతైతే, మాలల ఉధృతికి రాజీకీయాలకతీతంగా నేతలు రాజీనామాలకే సిధ్ధమైనారు. ఇంతటి విపత్కరపరిస్థితులకు కారణం ప్రజల్లో రాజకీయపరంగా అవగాహన పెరగడం ఒక కారణమైతే, ఆ అవగానాసరళిని తొసిరాజని, మొండిగా వ్యవహరించే పాలనావ్యవస్థకూడా ఒక ముఖ్య కారణం.
    మునుపటిలాగ నేతలు, శుశ్క-వాగ్దానాలుచేస్తూ ప్రజలను ఆకట్టుకొనడం, వోట్లు అడుక్కోవడం లాంటి కాలాలు కనుమరుగవుతున్నాయని గమనిస్తున్న సామాన్యప్రజలకు మహదానందంగా ఉన్నది.

    తాజ్-మహల్ నిర్మాణానికిరాళ్ళెత్తినకూలీల్లాగా, అన్నిరాజకీయపక్షాల్లోనూ ఉన్నదళితులేకదా – ధర్నాలకూ, రాస్తారోకోలకూ ముందుండి లాఠీదెబ్బలకు వెరవక ఉద్యమాగ్రేసరులుగా ఉండేది!

    మరి, వాళ్ళసమస్యతొనేనా వీళ్ళుచెలగాటమాడేది?
    దీన్నించిబయటపడటానికీ, రెందువర్గాల్లో రాజకీయ ఉనికికీ, కాంగ్రెసుపార్టీదగ్గర తెలంగాణ అస్త్రంతప్ప వేరేమార్గంలేదు.

    రాష్త్రవిభజనవల్ల సహజంగానే కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. మాలలు అధికంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో వారికితగినట్టుగాను, మాదిగలు అధికంగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో వారికితగినట్టుగాను ఉద్యోగావకాశాలు వస్తాయి. కొద్దిపాటి సవరణలతో, మినహయింపులతో అసంతృప్తిని నివారించవచ్చు.

    2. 610 G.O.

    “అన్ని సమస్యలవార్తలూ అటకమీదికి, ఆరువందలపది పతాకానికి” అన్నట్టైంది అన్నిపత్రికల ఫ్రంట్-పేజీ వ్యవహారం. రోజొక కొత్తవివాదంతో ఈ G.O. అమలు YSR కు పెద్దతలనొప్పి వ్యవహారమై కూర్చుంది.

    సంతోషించదగ్గ విషయమేమిటంటే, తెలంగాణనేతలంతా ఈవ్యవహారంలో ఒక్కటిగా ఉన్నారు. ఆంధ్రప్రాంతంవారిదే కక్కలేని, మింగలేని బాధ.. వ్యధ. చాలమంది ఆంధ్రనేతలకుతెలిసినా, స్థానికేతరులు ఎక్కువలేరనే చెప్పుతారు.
    ఒకరు కొన్ని departments లో మాత్రమే అమలుపరచాలంటే, ఇంకొకాయన ఈ G.O. అమలుచేస్తే తెలంగాణ అడుగవద్దంటాడు. మరొకాయనైతే ఇంకో అడుగు ముందుకువేసి, ఈ G.O. బదులు తెలంగాణవిడిపోవడమే మేలంటాడు.
    అంటే దానర్థం – హైదరాబాదులో ప్రభుత్యోద్యోగాల్లో తిష్టవేసుకున్న తెలంగాణేతరులసంఖ్య వారి నియోజకవర్గాలో గెలుపునుప్రభావితం చేసేంతవిగా ఉన్నట్టనేనా?

    G.O. అమలు చేస్తే తెలంగాణ అడుగవద్దని చెప్పే వారి మాటలనే మనం ఇంకో రకంగా అనువయించుకుంటే, “మమ్మల్ని ఎలాగైనా తెలంగాణలో ఉండనివ్వండి – మాకు రాష్ట్రవిభజనతో నిమిత్తంలేదు” అన్నట్టుగాలేదూ?

    కాబట్టి, రాష్ట్ర విభజన ప్రణాళికను YSR వీలైనంత త్వరగాచేపట్టి, దాని వల్ల ఏ జాతికి (వర్గ, కుల, ప్రాంత) నష్టం కలగడం లేదన్న వాస్తవాలను రూఢిపరచగలిగితేనే (establish చేస్తేనే) కాంగ్రెసువారికి రాజకీయంగా మనుగడ సాధ్యమయ్యేలా ఉంది.

    3. పుంజుకుంటున్న మరియు ప్రభవిస్తున్న ప్రతిపక్ష పార్టీలు (TDP/BJP/CPM&I/LOKSATTA & EVEN BSP)
    మూడేళ్ళ కాంగ్రెసుపాలనలో, తమకేమీ ఒరగలేదనుకుంతున్న వారిసంఖ్య కేవలం కాంగ్రెసు పార్టీలోనేకాక, సామన్యప్రజల్లో సైతం విపరీతంగా పెరగడంతో, ప్రభుత్వ అసంతృప్తుల సంఖ్యకూడ అదేవేగంతో పెరుగుతున్నది.

    అదనుకొసం వేచి చూస్తున్న మిగతా పార్టీలన్నిటికీ ఇలా ఎన్నెన్నో అంది వచ్చిన అవకాశాలు, చాలా బాగా వాడుకుంటున్నారు, ఎన్నికలవరకు మరి కొన్ని ఖచ్చితంగా add అవుతాయి కూడా!!

    కనుక, తెలంగాణ ఏర్పాటు అన్న నిర్ణయం (ఎంత సాహసోపేతం అనిపించుకున్నా), UPA ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసి, చారిత్రాత్మిక ఘట్టానికి శ్రీకారం చుట్టడమే కాంగ్రెసు పార్టీ తక్షణ కర్తవ్యం.

    కొసమెరుపు:
    ఇప్పటివరకూ, ఊపు తగ్గిన TRS కార్యకర్తలు మౌనంగానే అన్నీచూస్తున్నట్టున్నా, ఈ ప్రాంతపు ప్రజల మనోభావాలనూ, భాషనూ మరోసారి వెక్కిరిస్తూ తీసిన సినిమా “OPERATION DURYODHANA” పై సర్వత్రావ్యక్తమౌతున్న నిరసన వారికీ కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
    తెరాస, బసపా, భాజపా కలిస్తే (CPI పై తెలంగాణ సాధారణప్రజానీకానికి ఇంకా పూర్తినమ్మకం రాలేదు) తెలంగాణ పోరాటం రాజకీయంగా పటిష్టమౌతుంది. నాయకులు ఇంకోరకంగా ఆలోచించినా, కాంగ్రెసువారో, మరో ఇతర సమైక్యవాద ముఠాశక్తులో అడ్డుపడాలని చూసినా, ప్రజలే తమ తమ ఉద్యోగ-వ్యాపారాలను కొంతకాలం త్యజించి పోరాడడానికి సిధ్ధమయ్యే సూచనలూ కనిపిస్తున్నాయి మరి….!!

    ************************************************

  6. 6
    ramulu Says:

    610 జి.ఓ. తెలంగాణావారికి న్యాయం చేయడానికై అప్పటి ప్రియతమ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జారీచేసినట్టిది. రాయల సీమవాళ్ళు తమ ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణా మరియుఆంధ్రా వాళ్ళను వాపసు తమ,తమ ప్రంతాలకు పంపాలని అంధోళన చేశారు. వాళ్ళను పంపడానికి ఒక జీఓ జారీచేస్తూ మన తెలంగాణాకొరకు (తెలంగాణావారు డిమాండ్్ చేస్తే) మన ప్రాంతంలో పనిచేస్తున్న ఆంధ్ర-సీమల వారిని వాపసు పంపటానికి ఎంటీఆర్ ఈ 610 జిఓను జారీచేశారు. ఇటివల మనతెలంగాణా వాళ్ళు గట్టిపోనే పోరాటం చేశారు , ఐనా ఏమాత్రం అమలు చేయించ్కోలేక పోయారు, ప్రభుత్వాన్ని వంచలేకపోయారు. ఐనా ఎంతోకొంత అమలు కాక పోతుందా అనే ఆశతో తగిన యోగ్యతలు కలిగిన నిరుద్యోగ యువకులు ఎదురుచూస్త్తూనే ఉన్నారు. తాము చెప్పిన కాకిలెక్కలనైనా అమలుచేయకపోతారా అనే పక్కానమ్మకంతో ఉన్నారు. మరి ఉద్యమం సల్లబడ్డట్టు, ఊపుతగ్గినట్టు అనిపిస్తున్నది కాబట్టి ఈజీఓ అమలు ముందుకు సాగేటట్లుందా ? లేక ఇక్కడితో ఆగిపోయేసుచనలున్నాయా? అని కొందరు అనుమానిస్తున్నట్ట్లు తెలుస్తున్నది. ఇక్కడ అమెరికాలో ఉన్న వారికి ఎవరో ఒకరు ఉద్యమ పరిస్తితిని వివరిస్తూ రాస్తే ఇక్కడి వాళ్ళు అందోళన పడకుంటా ఉంటారు. ఆందోళన ఎందుకంటే తెలంగాణ వ్యతిరేకులు ఎప్పటికప్పుడు ఏవో మాయోపాయాలు పన్నుతూనే,అసత్యప్రచారాలు చేస్తూనే ఉన్నారు. కనుక ఈ సైటు చూసే వారు అందరూ రాయండీ.
    _రాములు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com