Feed on
Posts
Comments

610 బాధ్యత జే ఎస్‌ సీకి అప్పగింత

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆన్‌లైన్‌) వివాదాస్పదమైన ‘399, 415′ జీవోలను ప్రభుత్వం రద్దుచేసింది. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయవర్గాల నుంచి వచ్చి న తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో జీవో 610 అమ లుపేరిట జారీచేసిన జీవోలు 399, 415 లను రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని రద్దు చేయ డానికి గురువారం మరో జీవో 423ను జారీచేసింది. 610 జీవో అ మలుకు మార్గాన్ని సూచించే బాధ్యతను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తం గా ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలతో కూడిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సి ల్‌ (జేఎస్‌సీ)కి అప్పగించింది. 610 జీవోను చిత్తశుద్ధితో అమలు చేయటానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉన్నతవిద్యా శాఖ మంత్రి, జీవో 610 అమలుపై ఏర్పాటైన మంత్రుల కమిటీ చైర్మన్‌ డి.శ్రీనివాస్‌ చెప్పారు. వచ్చే శని, ఆదివారాలలోగా జేఎస్‌సీ ప్రతి నిధులు తమ మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అం దిస్తే ప్రభుత్వం వీటినే అమలు చేస్తుందని ఆయన ప్రకటించారు.

ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధ్యక్షతన గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో 610 జీవో అమలు కోసం ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు, తెలంగాణ ఉద్యో గ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు డి.శ్రీనివాస్‌, కె.జానారెడ్డి, కోనేరు రంగారావు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి జంధ్యాల హరినారాయణ, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ డి.సుధాకర్‌ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్‌తో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలలో నూ రాష్ట్రప్రతి ఉత్తర్వుల స్ఫూర్తిని అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారని వారు తెలిపారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సిబ్బంది ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేలోగా 610 అమ లు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని డి. శ్రీనివాస్‌ తెలిపారు.

ప్రభుత్వం చేయలేని పనిని జేఎస్‌సీ చేస్తుందని నమ్ముతున్నారా? అని విలేఖరులు డి.శ్రీనివాస్‌ను ప్రశ్నించగా… వాళ్లు మంచి సూచనలు చేస్తారనే విశ్వాసం తమకుందని, ఉద్యోగ సంఘాల నాయకులకు తమపై నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. యూనియన్‌ నాయకులు సుధాకర్‌, లింగయ్యలు కోరినట్లు తెలం గాణకు చెందిన ఐదారుగురు ప్రతినిధులకు జేఎన్‌సీలో చోటు కల్పిస్తామని చెప్పారు. మరో మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రపతి ఉత్తర్వులు యథావిధిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. 610 జీవో అమలు వల్ల ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరగదని ప్రకటించారు. యూనియన్‌ నాయకుడు సుధాకర్‌ 399, 415 జీవోల రద్దుపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇచ్చిన విధంగా 610 జీవోను అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో తెలంగాణ జేఏసీ చైర్మన్‌ సుధాకర్‌తో పాటు నేతలు స్వామిగౌడ్‌, టి.ప్రభాకర్‌, గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

(Source : 15 June 2007, ఆంధ్రజ్యోతి )

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com