Feed on
Posts
Comments

బాబు పర్యటనకు వ్యతిరేకంగా టీడీఎఫ్‌ నిరసనలున్యూజెర్సీ: తెదేపా అధినేత చంద్రబాబు అమెరికా పర్యటనకు వ్యతిరేకంగా తెలంగాణ అభివృద్ధి ఫోరమ్‌(టీడీఎఫ్‌) నిరసనలు తెలిపింది. ఆల్బర్ట్‌ రాయల్‌ ప్యాలెస్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, అధిక సంఖ్యలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని టీడీఎఫ్‌ మద్దతుదారులు నిరసనలు తెలిపారు. తెదేపాకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. టీడీఎఫ్‌ అధ్యక్షుడు మధురెడ్డి మాట్లాడుతూ.. బాబు, రాజశేఖర్‌రెడ్డిలు కుల, మత రాజకీయాలతో తెలంగాణ వారిని విడదీయడానికి చూస్తున్నారని విమర్శించారు. పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులను ఆపే దిశగా తెదేపా కృషి చేయాలని, తెలంగాణ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూడాలని టీడీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపాలని టీడీఎఫ్‌ కోరింది. తెలంగాణ సాధించేంతవరకు తెలంగాణ ఎన్నారైలు కలిసికట్టుగా పోరాడాతమని ఈ సందర్భంగా మధు రెడ్డి తెలియజేశారు. మురళి చింతలపని, రాజ్‌ జనంపల్లి, రవి మే రెడ్డి, శ్రీరామ్‌ వేడిరే తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

(ఈనాడు 07 June 2007  సౌజన్యం)

Click Here for more Pictures

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com