Feed on
Posts
Comments

TDF Protest in NewJersy during Chandra Babu Naidus visit(నెట్‌డెస్క్‌): దీర్ఘకాలిక మనోభీష్టమైన ప్రత్యేక తెలంగాణాను తెలంగాణా వాసులు వాంఛిస్తున్నారని వారి కోరికను గౌరవించాల్సిన బాధ్యత మాజీ ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబునాయుడిపై ఉందని తెలంగాణా డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ పేర్కొంది. ఆయన న్యూజెర్సీ పర్యటనపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. జూలై 4న న్యూజెర్సీ,ఫోర్డ్స్‌, రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌ వద్ద ఫోరం సభ్యులు బాబుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆయన పాలనలో వేలాదిమంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రపంచబ్యాంకు నుంచి రూ.45వేల కోట్లు అప్పు తీసుకుని ఫ్లైఓవర్లు నిర్మించారని, వ్యక్తిగతంగా సొమ్ము కూడబెట్టారని, పార్టీని కూడా ఆర్ధికంగా పటిష్టం చేశారని విమర్శించారు. బిజెపి, వామపక్షాల బాటలో టిడిపి కూడా ముందుకువచ్చి ప్రత్యేక తెలంగాణాను సమర్ధించాలని తెలంగాణా ఎన్నారైలు డిమాండ్‌ చేశారు. టిడిఎఫ్‌ అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడితో పాటు ప్రస్తుత సిఎం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కూడా గతకాలపు రజాకార్‌ నేత కాశింరజ్వీ శైలిలో కుల,మత ప్రాతిపదికపై తెలంగాణావాసులను విభజించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 1940లనుంచి విశాలాంధ్ర కమ్యూనిస్టుల వ్యూహాలు తెలంగాణావారికి సుపరిచితమేనని చెప్పారు. టిడిపి, కాంగ్రెస్‌ రెండూకూడా తెలంగాణావాసులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. పోలవరం, పోతిరెడ్డిపాడు,పులిచింతల ప్రాజెక్టులను నిలుపుదల చేయించేందుకు టిడిపి చొరవచూపాలని కోరారు. నిరసన ప్రదర్శన సాయంత్రం 5గంటలకు ప్రారంభమై 8గంటలవరకు సాగింది. తెలంగాణా ఆవిర్భవించేంతవరకు తెలంగాణా ఎన్నారైలు తమవారిని వెన్నంటే ఉంటారని చెప్పారు. సహజవనరులకోసం, ఉద్యోగాల కోసం పోరుసల్పాలని పిలుపునిచ్చారు. వలసవాదులనుంచి తల్లి తెలంగాణాను రక్షించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో సిహెచ్‌.మురళి, నారాయణస్వామి, జనంపల్లి రాజ్‌, పి.సుధాకర్‌, ఎం.రవి, కె.మల్లిక్‌, ఎన్‌.కరుణాకర్‌, ఎస్‌.రాజ్‌ , వి.శ్రీరాం, జమున, శ్రీలత, జానకి, సుఖజీవన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

(ఏ.పి వీక్లీ సౌజన్యం తోటి)

3 Responses to “దీర్ఘకాలిక స్వప్నం తెలంగాణా: టిడిఎఫ్‌”

  1. 1
    Ramulu Says:

    ఇలా ఎప్పటికప్పుడు రోజువారీగా వార్తలు చదువుతూ, మన తెలంగాణావారి కార్యక్రమాలను చూస్తూ ఉంటే “తెలంగాణ దినపత్రిక” చదివినంత ఆనందంగా ఉంది/ ఉంటుంది. ఫిసికల్ పత్రిక కొన్నాళ్ళు తీసుకురాలేక పోయినా ఫర్వాలేదు ,కాని వెబ్ పత్రికను మాత్రం ఆపకండి.

  2. 2
    DZainism (Rakesh) Says:

    తెలంగాణ ఏర్పాటు తథ్యం…… తథ్యం. (ఒక కల… చిరకాల స్వప్నం…. లాంటి పదాలను మరుద్దాం)

    రాష్ట్ర విభజనను ఇక ఎలాగూ అడ్డుకోలేమని తెలిసే…… కొంతమంది ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు:

    1. అందినకాడికి దోచుకో… (రియల్ వ్యాపారాలు…, భూదానాలు, money siphoning etc)
    2. హైదరాబాదులో అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టు… చివరి అస్త్రంగా దాన్ని తెలంగాణకు దక్కకుండా ప్రయత్నించు (ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన “Cancerous growth” ని డెవలప్ మెంట్ అని చెప్పు)
    3. ఎన్నడో మరిచిపోయిన తెలంగాణభాష గురించీ, పండుగల గురించీ, కళలూ, యాత్రా స్థలాల గురించీ పుంఖానుపుంఖాలుగా ప్రచారం చేసి, ఇదంతా తెలుగువారి “సమైక్యతారాగా”లని నమ్మించు.
    కానీ……… తెలంగాణ ప్రజలను – ఈ దొంగ వినయాలూ, నక్క జిత్తులూ, భాషాబంధాలూ…….. ఇంకా వంచించగలవా?
    Just have a look at the critical time-zones of past. Ho much has changed from one stage (phase) to another………
    a) 1947 to 1953
    b) 11953 – 1956
    c) 1969 – 1972
    e) 2001 – here we are & it’s indeed in our hands to shape-up the rest of (HI)story………….

  3. 3
    Srinivas Katta Says:

    గౌరవనీయులైన ఎడిటర్ గారికి,

    నా పేరు శ్రీనివాస్ కట్ట నెను సివిల్ ఇంజనీరు మాది కరీంనగర్, ప్రస్థుతమ్ నెను తెక్ష్సాస్ (యుయస్లొ) వుంతున్నాను సాప్ప్ కన్సల్ల్తెంతు గా, నెను మీ (ఈ) సమచారమును మా దొస్థు మెదక్ నునంది పొదాను, చూసాను, చదివానూ, చాల సక్కగా వున్నది వున్నట్టూగా చూపించారు మన తెలాంగాణ ప్రాంతమ్ గురించి, మరియు తెలంగానణ ప్రజల సమస్యలగురించి, దానికి నెను (కాదు మా, మన పది జిల్లాల ప్రజల మద్దత్థు ఎల్లప్పూదూ వుతుందాని ఆసిస్స్థున్నను).

    ఈది ఒక మంచి ఆయుధమ్ (సమచారమనె), దీన్ని మీరు ఎలగె నడపాలని కొరుకుంటునాను.

    ఐథిన్క్ థిస్ ఇస్ థె బెస్త్ కమ్యునికేషన్ టుధ వరల్ద్ ఐండ్ ఇట్ స్పిక్స్ ఎబౌట్ అవర్ర్ పిపుల్ల్ అంద్ అవర్ర్ సొసైటి అంద్ అవర్ర్ కల్చర్ర్ (తెలంగాణ).

    నెను పక్క తెలంగాణ వాదిని, నాకు తెలుసు మనమెదుర్కొంటున్న సమస్యలగురించి, మన జీవన విదానమ్ గురించి, మన తెలంగాణ ప్రజల సమస్యల గురించి, నావంతు కౄషి నెను తప్పకుండా నెరవెరుస్తా, అంధరిని ఎదుకెట్ చెయటానికి ప్రయతిన్స్థాను, నెను మీ సైటు ఇన్ఫొర్ర్మీషన్ ను మన తెలంగాణ (ప్రతివొక్కరికి ఇక్కదవున్న) దొస్థులకందరికి పమ్పాను.

    మన తెలంగాణ సమస్యలు, తెలంగాణ (ప్రత్యెక) రాస్ట్రమ్ ఎర్పడిథె తప్ప తీరెవి కావు, తద్వారా మన సన్స్క్రుథిని మన భాష మన కట్టూ బొట్టూ మన పండగలు, మన అదికాదమ్, మన పరిపాలన, గౌరవించుకునె వీలు కలుగుథుంది, ఇన్క మనము అన్ని విదాల అభివ్రుద్ది చెన్ధాడానికి వీలగుథుంది.

    ఇన్కా తెలంగాణ వచ్హ్హె రొజు ఎంథొ దూరమ్ లెదని, త్వరలొ తెలంగాణ వొస్థుందాని ఆసిస్థూ,

    మీరు మాత్రమ్ ఇది ఇలాగె నడపాలని కొరుకుంటూ మనసారా,

    ఇట్లు
    మీ తెలంగాణ పౌరున్నీ, మీలొవొక్కదిని,
    శ్రీనివాస్ కట్ట

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com