జీవో 34 : తెలంగాణ రైతులపై మరో గుదిబండ
జులై 10th, 2007 by డిస్కవర్ తెలంగాణ
- ఆర్. విద్యాసాగరరావు
తెలంగాణ సాగునీటి సమస్యకు సూక్ష్మ సేద్యమే మార్గాం తరమా? సరిగ్గా ఐదు నెలల క్రితం మన రాష్ట్ర ప్రభు త్వం ఒక ఉత్తర్వు జారీచేసింది. గత ఫిబ్రవరి 9న జారీచేసిన జీ.వో. 34 ప్రాథమికోద్దేశ్యం బిందు సేద్యం, తుంపర్ల సేద్యం ద్వారా నీటిని ఆదా చేసి, తద్వారా మరింత భూమిని సాగులోకి తేవడం. వచ్చిన చిక్కేమిటంటే ఈ ఉత్తర్వును ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అమలుపరుస్తారన్నదే! సాధారణంగా ఒక జీవోను జారీచేసినప్పుడు ఆ ఉత్తర్వును ఆ తేదీనుంచిగాని లేదా తద నంతర తేదీనుంచిగానీ అమలవుతుంది. అయితే జీవో 34 అమ లు ‘పూర్వం’ నుంచే జరుగుతుందని ఆ ఉత్తర్వులోని అంశాల ను బట్టి అర్థం చేసుకోవచ్చు. గాలేరు-నగరితో సహా రాష్ట్రం లోని భారీ ఎత్తిపోతల పథకాలన్నిటికీ ఈ జీవో వర్తిస్తుంది. ఈ ఎత్తిపోతల పథకాల ఆయకట్టులో సంపూర్ణంగా సూక్ష్మ సేద్యా న్ని ప్రవేశపెడతారు. 15 వేల ఎకరాలకు 1 టిఎంసి చొప్పున నీరు అందిస్తారు. సూక్ష్మ సేద్యం ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి పంటకాలవల అవసరం ఉండదు. ఇప్పటికే ఖరారైన కాంట్రా క్టుల్లో సైతం పంట కాల్వల తవ్వకం చేపట్టరాదని ఇపిసి కాం ట్రాక్లర్లను జీవో 34 ఆదేశించింది. సూక్ష్మసేద్యానికి అవసరమైన పంపులు, తొట్టెలను నీటిపారుదలశాఖ ఏర్పాటు చేస్తుంది. 10 నుంచి 15 ఎకరాల బ్లాకుకు ఒక తొట్టెను ఏర్పాటుచేస్తారు. నది నుంచి ఎత్తిన నీటిని ఒక ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కాలు వ, మైనర్, సబ్ మైనర్ ద్వారా తొట్టెలోకి చేరవేస్తారు. ఆ తొట్టె కు మోటారు అమరుస్తారు. పంటపొలాల్లో ఏర్పాటుచేసిన గొ ట్టాలు వగైరా ఉపకరణాల సహాయంతో తొట్టెలోని నీటిని పైరు లకు అందజేస్తారు. అంటే నదినుంచి తొట్టెదాకా ఒక ఎత్తిపోతల వ్యవస్థ ద్వారా నీటిని అందచేస్తే తొట్టెనుంచి పంటకు మరో ఎత్తి పోతలన్న మాట!
పంపు మెషీన్లకు, నీటి బట్వాడా పైపులకు ఎకరానికి 15 వేల రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వ అంచనా. విద్యుత్ ఖర్చు అదనం. తొట్టె, మోటారు పంపు, పైపులు, విద్యుత్ కనెక్షన్లకు కలిపి ఎకరానికి 53 వేల రూపాయలవుతుందని రైతులు చెబు తున్నారు. మామూలుగా పంటకాలువల ఏర్పాటునకు ఎకరాని కి 1300 రూపాయలు ఖర్చువుతుంది. అదనంగా ఎకరానికి 5170 రూపాయలు ఖర్చుకూడ ఉంది. అయితే ఈ మొత్తం ఖర్చులో రైతులు ఎంత భరించాలో జీవో 34 స్పష్టం చేయనే లేదు. అసలు ఈ జీవోను ఎవరి సంక్షేమం కోసం జారీ చేశారో అర్థం కావడం లేదు. ఈ జీవోకు సంబంధించి మరో విశేషం కూడ ఉంది. ఒక పక్కన భారీ ఎత్తిపోతల పథకాలన్నింటిలో నూ సూక్ష్మ సేద్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఘోషిస్తూ మరో పక్కన ఇదే విన్నూత్న సేద్య పద్ధతిని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నామని పేర్కొ న్నారు. పరస్పర విరుద్ధమైన అంశాలకు జీవో 34 ఆస్కారమి చ్చింది. ఏదైనా పనిని ప్రయోగాత్మకంగా చేపట్టినప్పుడు దాని ఫలితాలను బట్టి ఇతర ప్రాజెక్టులకు వర్తించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి సూక్ష్మ సేద్యం అమలులో నమ్మకం లేదన్న విషయం స్పష్టమవుతోంది. శాస్త్రీయమైన నీటి నిర్వహణలో బిం దుసేద్యం, తుంపర సేద్యం చోటుచేసుకున్నాయి. వీటిని ఎక్కడ సాధ్యమవుతుందో అక్కడ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘జాతీయ జల విధానం’ నిర్దేశిస్తుంది. నీటి ఎద్ద డి ఉన్నచోట, పంట పొలాల భూమి ఎగుడు దిగుడుగా ఉండి, బాగా ఇంకుడు స్వభావం కలిగి ఉంటే అక్కడ తుంపర్ల సేద్యా న్ని అమలు చేసుకోవచ్చని, అయితే తుంపర్లసేద్యం బాగా ఖ ర్చుతోకూడినదని కేంద్ర ప్రభుత్వ ‘వాటర్ మేనేజ్‌మెంట్ మా న్యువల్’ పేర్కొంది. బిందు సేద్యం పండ్లు, కూరగాయల తోట లకు ఉపకరిస్తుందని, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో , ఇంకుడు స్వభావం ఎక్కువగా ఉన్న పొలాల్లో అమలు చేయా లని అదే మాన్యువల్ తెలిపింది. అమెరికా వంటి విద్యుత్ సమృ ద్ధ దేశంలో సూక్ష్మ సేద్యం కేవలం 37.8 శాతం, సంప్రదాయ సేద్యం 62.2 శాతం ఉన్నట్టు ‘ఇండియన్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్’ ప్రచురించిన ‘వాటర్ మేనేజ్‌మెంట్’ తెలియ జేస్తుంది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్యంపై ఇంతగా ఎందుకు మొగ్గు చూపుతున్నది? జీవో 34 విడుదలకు పూర్వం ఇతర రాష్ట్రాలలో బిందు, తుంపర సేద్యపద్ధతులను అమలవు తున్నాయా? అవుతుంటే ఎలాంటి ఫలితాలనిస్తున్నాయి అనే విషయాన్ని మన అధికారులు పరిశీలించి ఉంటే బాగుండేది. ఏమైనా ఈ జీవో వెనుక ఏదో ఇక వివక్షా పూరిత వ్యూహం ఉన్న ట్టు నేను అనుమానిస్తున్నాను. అదేమిటో వివరిస్తాను.
జీవో 34 అమలుకు నోచుకోబోయే నేల దౌర్భాగ్య తెలంగా ణ. భారీ ఎత్తిపోతల పథకాలన్నీ (ఒకటి రెండు మినహాయించి) తెలంగాణలోనే ఉన్నాయి. జలయజ్ఞం కార్యక్రమంలో భాగం గా ప్రభుత్వం ప్రకటించిన వివిధ ప్రాజెక్టుల కింద సాగయ్యే క్షేత్రం సుమారు 50 లక్షల ఎకరాలు. ఇన్ని లక్షల ఎకరాలలో సూక్ష్మ సేద్యం అమలు చేయడమంటే తెలంగాణ సాగునేల అంతటా తొట్టెలు ఏర్పాటు చేయక తప్పదు. దేవాదుల ప్రాజెక్టు మినహా ఇతర ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు 1 టిఎంసికి 10 వేల ఎకరాలచొప్పున నిర్దారిత ఆయకట్టుకు నీటి కేటాయింపును జరిపారు. ఉదాహరణకు భీమా ప్రాజెక్టుకు 2 లక్షల ఎకరాలకు 20టిఎంసిలు, నెట్టెంపాడు 2 లక్షల ఎకరాలకు 20 టిఎంసిలు కేటాయింపులు జరిపారు. ఇప్పుడు జీవో 34 చెప్పుతున్నదాన్ని బట్టి 1 టిఎంసికి 15 వేల ఎకరాలు అంటే భీమా ప్రాజెక్టుకు 20 టిఎంసిలకుబదులు 13.33 టిఎంసిలు కేటాయించడమైనా జర గాలి లేదా ఆ 20టిఎంసిలతో 2 లక్షలఎకరాలకు బదులు మూ డులక్షల ఎకరాలైనా సాగుచేయాలి. ‘కేటాయింపులు తగ్గించం, అదనంగా భూమిని సాగుకుతెస్తాం’అని ప్రభుత్వం నమ్మబలు కుతోంది. అయితే తెలంగాణ ఎత్తిపోతల పథకాల కేటాయిం పులో కోత విధించడమే ఈ జీవో 34 లక్ష్యమని ఆ ప్రాంత ఇం జనీర్లు, మేధావులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానానికి ఆధారాలు కోకొల్లలు. పోతిరెడ్డిపాడే ఒక తిరుగులేని నిదర్శనం. కృష్ణాజలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేయడం తన ఏకైక ధ్యేయమని ముఖ్యమంత్రి రాజశేఖర్ ప్రతిపక్ష నాయకుడు గా ఉన్నప్పుడు చెప్పారు. కృష్ణా జలాలను శ్రీశైలంలో బంధించి రాయలసీమకు ప్రకాశం, నెల్లూరు, దక్షిణ తెలంగాణకు ఇస్తా మని ఎన్నో ప్రకటనలు చేశారు. ఈ చర్యతో నష్టపడే నాగార్జు నసాగర్ ఆయకట్టుకు గోదావరి నీటిని దుమ్ముగూడెం ద్వారా అందిస్తామని కృష్ణా డెల్టాకు పోలవరం, పులిచింతల ద్వారా ఇస్తామని రాజశేఖర్ పదేపదే చెప్పారు. ముఖ్యమంత్రి ఇంత స్ప ష్టంగా చెప్పినా ప్రభుత్వం తప్పుడు జీవోలను సృష్టించి కృష్ణా వరద జలాలను రాయలసీమకు, గోదావరి వరద జలాలను నాగార్జునసాగర్‌కు తరలిస్తామని అసత్యప్రచారం చేస్తోంది. ప్ర భుత్వం ఆలోచనలు తెలిసిన వారికెవరికైనా జీవో 34 అంత రార్థం ఇట్టే అర్థమవుతుంది. నీటిని వృధా చేయకుండా ఉండట మే ఈ జీవో ఉద్దేశమయితే సూక్ష్మసేద్య ప్రయోగం చేయవల సింది తెలంగాణలో కాదు; 1 టిఎంసి నీటిని ఐదు లేక ఆరు వేల ఎకరాలకు వాడుతున్న తీరాంధ్రంలో! 1 టిఎంసికి 3800 ఎకరాలకు డిజైన్ చేసిన పోలవరంలో ఈ సూక్ష్మ సేద్యం అమ లు చేస్తే అసలు పోలవరం ప్రాజెక్టే అవసరం లేకుండా పుష్క రం, తాటిపూడి మొదలైన ఎత్తిపోతల పథకాలతో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. తెలంగాణ రైతాంగం కోస్తా రైతుల లాగా ఏడాదికి రెండు, మూడు పంటలు ఆశించడం లేదు. వాళ్లకు ఒక పంట పండితే చాలు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అత్యధికభాగం కలిగివుండి, ఆ నదీజలాలపై హక్కు కలిగివుండికూడా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడ్డ ఆ బడుగు రైతులపై మరో ఎత్తిపోతలపథకాన్నిరుద్దడం ఎంతవరకు సమం జసం? ప్రయోగంపేరిట తెలంగాణ వ్యవసాయరంగాన్ని అస్త వ్యస్తంచేసే జీవో 34ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. సూ క్ష్మ సేద్యంపట్ల పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అది ఏ ఏ క్షేత్రా లలో, ఏ ఏ రకాల పంటలకు అనువుగా ఉంటుందో నిపుణుల తో ఆలోచించాలి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ప్రయో గాలు నిర్వహించిన తర్వాత ఫలితాలను బట్టి రైతుల సహకా రంతో ముందుకుపోవాలే తప్ప ఏకపక్ష నిర్ణయాలతో తెలంగాణ రైతులను సంక్షోభంలోకి నెట్టివేయడం బాధ్యతాయుత ప్రభు త్వం చేయదగిన పనికాదు.
( ఆంధ్రజ్యోతి 10 జులై 2007 సౌజన్యం తోటి)





