Feed on
Posts
Comments

ఆంధ్రజ్యోతి ఆగస్ట్ 12న ‘పుట్టని పాపపై కుట్ర?’ అని వచ్చిన ధర్మవరపు సీతారాం వ్యాసానికి చందా రాములు జవాబు

సిపిఎం వాళ్ళు చేపట్టిన భూపోరాటం తుదివరకు పోరాడి పేదలకు భూములు, ఇంటి స్తలాలు సాధిస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు మంచిదే. కాని ఎంతవరకు ప్రజాస్వామ్య ఉద్యమాలతో వాటిని సాధించగలరనేది అనుమానమే. వారి పోరాటం భూముల్ని సాధిస్తుందోలేదో కాని ఇటివల వచ్చిన 610 జీఓ అమలుకు, మూడు పిపిపిల (పులిచింతల, పోలవరం, పోతిరెడ్డిపాడు)ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటాలను, ఉద్యమాని మాత్రం అడుక్కు తొక్కింది. భూపోరాటంతో సీపీఎం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా వయ్యెస్సర్ కు తలనొప్పి తెచ్చినట్లుగా అనిపించినా మరోవైపు తెలంగాణ వల్ల వచ్చిన తక్షణ సమస్యను మాత్రం తప్పించి ఎంతో సహాయం చేసింది. ఎప్పుడొ వదిలేసిన భూపోరాటాన్ని సీపీఎం తెలంగాణ ఉద్యమ కాలంలో అంటే ఇప్పుడు ఎందుకు ఎత్తుకుందా? అనేది మాత్రం ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు అనుమానిస్తున్నాడు.

ఇటివలి కాలంలో బాగాముందుకు పోయి సడ్డన్ బ్రేకు పడటంతో తెలంగాణ ఉద్యమకారుల్లో అసంత్రుప్తి, వ్యాకులత కలుగుతున్నమాట మాత్రం వాసవమే. ఔను తెలంగాణతల్లి భూషణాలను గతంకంటే ఎన్నోరెట్లు తెలంగాణ నాయకులకు, విధ్యావంతుల ఊహలకు అందనంత ఎత్తున అపహరిస్తున్నారు, పలారం కంటే పలచగా పంచేస్తున్నారు ఇప్పటి పాలకులు. ఐనా ఉద్యమకారులు ఏమీ చేయలేక పోతున్నారు. చేయలేక పోతున్నందుకు కునారిల్లి పోవడమటుంచి తెలంగాణ ఉద్యమానికి తామే కొత్త వాదనలు చేస్తూ సమస్యలు స్రుష్టించుకుంటున్నారు. “ప్రజా తెలంగాణ పౌండేషన్” వాళ్ళు వేసిన కరపత్రాలు, మాట్లాడుతున్న మాటలు అలాంటివే. ఎందు కంటే సమైక్య ఆ. ప్ర. రాష్ట్రం ఉన్నంతకాలం తమకు (వెనకబడిన కులాలకు, తరగతులకు) అధికారం అక్కరలేదన్నట్లుగా, తెలంగాణవేరైన పక్షంలో మాత్రం తమకే అధికారాన్ని అందించాలన్నుట్లుగా వారు వాదిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వారు వచ్చే ఎన్నికల్లో మొత్తం ఆ. ప్ర. సమైక్య రాష్ట్రపు అధికారాన్ని సంపాదిస్తే తెలంగాణలోని అగ్రకులాలలో, ఫార్వర్డ్ తరగతుల్లో కూడా సంతోషించే వారు ఉన్నారని గుర్తిస్తలేరు. వారు తేలేరు కనుకే భౌగోళిక తెలంగాణ అవసరమైన సంగతి వారు గుర్తిస్తే మంచిది. ముందు తెలంగాణను తేవడంలో తెలంగాణలో ఉన్న ఆన్ని పార్టీల వారు, అన్ని సిద్ధాంతవాదులూ కలిసి రండి. తదుపరి మీజెండాలను ఎజెండాలను ముందుకు తీసుకు రండి, అని కేసీఆర్ సరిగ్గనే పిలుపునిచ్చారు. అవన్ని పక్కన బెట్టి ఫౌండేషన్ వారు చేస్తున్న వాదనలు ఇంతకుముందు రాయలసీమ వారు చేసిన వాదనలను తలపిస్తున్నాయి. రాయలసీమ వారేం డిమాండ్ చేశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ. ప్ర. రాష్ట్రం సమైక్యంగా ఉంటే సరే, తెలంగాణాను వేరుచేస్తే మాత్రం అంధ్రులతో గతంలో మాదిరి (మద్రాసునుండి విడిపోయిన పిదప 1953 నుండి 1956 లో ఆ. ప్ర. ఏర్పడే వరకు పూర్వం కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం పేరుతో ఆంధ్రులతో కలిసి ఉన్నట్లు)మేము కలిసి ఉండం, మాకూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తీరాల్సిందే అంటూ అడ్వాన్స్ గా తమ డిమాండ్ ముందుకు తెస్తున్నారు. తెలంగాణ ఇన్ని కులాలచేత, ఇన్ని మతాలచేత, ఇన్ని వర్గాలచేత, ఇన్ని సిద్ధాంతాలచేత, ఇన్ని పార్టీలచేత, ఇన్నిరాజకీయాలచేత, ఇన్ని అంతర్గత వైరుద్యాలచేత వెనక్కు లాగబడుతున్నది. అందుచేతనే ఇతర తెలుగు ప్రాంతీయులు ఎన్ని లక్షలలో ఉద్యోగాలు దోచుకున్నా, ఏలెవల్ లో ఎన్నివేల/లక్షల కోట్లు ఎన్ని రంగాలలో దోచుకోంటున్నా, ఆదోపిడీ 50 ఏళ్ళకు పైబడి సాగుతున్నా ప్రత్యేక తెలంగాణను సాధించుకోలేక పోతున్నాం. బయటివాళ్ళు లోపలివాళ్ళు ఈతీరుగా అడ్డుతగులుతున్నారు, కనుకే ప్రత్యేక తెలంగాణ వచ్చినట్టే వచ్చి వెనక్కు పోతున్నది. ఇన్ని వైరుద్యాల మధ్య నిజంగా తెలంగాణ సాధిస్తే ఆశ్చర్య పడాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడం భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించడం కంటే గొప్పదని కష్టతరమైనదని నానమ్మకం.

సీతారాంగారు పుట్టని పాపపై కుట్ర? అనేవ్యాసాన్ని ఇంతకు ముందు తెలంగాణకు వ్యతిరేకంగ రాసినట్లుగా రాయకుండా (ఒక్కదగ్గర తప్ప), రాష్ట్రంలోని అందరికి అభినందనీయమైన హితోపదేశం చేస్తూరాశారు. అదేమిటంటే గతచరిత్రలో దేశాలమధ్య, రాష్ట్రాలమధ్య జరిగిన వలసలను ఉటంకిస్తూ ఆంధ్ర-సీమలనుండి వచ్చిన వలసలు కూడా అలాంటివే, సహజమైనవే అని తెలంగాణ వాళ్ళు అనుకునేట్లు/సంత్రుప్తిపడేటట్లు వివరించే ప్రయత్నం చేశారు. మన తెలుగు వారి వలసలు తెలంగాణలోనికి మొదట్లో బతుకుదెరువుకొరకు వచ్చినవే ఐనా, తదుపరి కాలంలో వచ్చిన వలసలు నిలువుగా, అడ్దంగా, ఐమూలగా దోచుకొని పోవడానికి వచ్చినవే. తదుపరి వచ్చిన వాళ్ళే వలసవాదులు, వాళ్ళే అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో దోచుకొని మనదగ్గరి తెలంగాణ సాధారణ జనాలకు బతుకు, మెతుకు లేకుండ జేశారు. కనుక సీతరాంగారు సమర్ధించిన తెలంగాణలోని ఇతర తెలుగు వారి వలసలు ఇతర దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య జరిగే వలసలతో పోల్చదగినవి కావు.

ఐతే చివరలో మాత్రం సామాజిక సంఘర్షణలు నివారించడానికి, స్తానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారం అప్పగించాలని సీతారాం గారు ఒక చక్కటి అభినందనీయమైన సలహాను/సూచనను చేశారు. ఆ సలహా మనమంతా సంతోషించదగిన, మెచ్చదగిన విషయం.

* * *

పుట్టని పాప పై కుట్ర? – ధర్మవరపు సీతారామ్‌

తెలంగాణతల్లి ప్రస్థానం గమ్యం దిశలోనే సాగు తోందా? లేక దారి మళ్ళింపబడిందా? కరీంన గర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని విజయంతో నిర్ణయాత్మక దశకు చేరినట్టు గా కన్పించిన తెలంగాణ ఉద్యమం ఇటీవల స్తబ్ధమై పోయింది. తెరాస నుంచి నరేంద్ర బహిష్కరణ, శాస నసభ్యులపై క్రిమినల్‌ కేసులు మొదలైన పరిణామా లతో ఆ పార్టీ నాయకులు దాదాపుగా క్రియారహితు లై పోయారు. ఉద్యమ తెలంగాణ ఉద్వేగోత్సాహాలు క్షీణముఖం పట్టాయి. ప్రజల నుంచి మద్దతు కొరవ డటంవలన కాదు సుమా! తెరాస, ఇతర రాజకీయ పక్షాలు లక్ష్య సాధనలో ఘోరంగా విఫలమవడం వలనే తెలంగాణ ముందుకు వెళ్ళలేకపోతోంది. తెలం గాణ ఉద్యమం వైఎస్‌ఆర్‌ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్‌గా పరిణమించనున్నదని భావించడం జరిగిం ది. అయితే అదేమీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొరకరాని సమస్య కాలేదు. కాగా తెలుగుదేశం, సిపిఎంలే ఇప్పు డు ముఖ్యమంత్రికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.

ప్రత్యేక రాష్ట్ర లక్ష్య సాధనలో తెలంగాణ ఉద్యమం నిర్ణయాత్మకంగా ముందంజ వేయలేకపోవడంపై ప్ర జలు ముఖ్యంగాయువజనులు, విద్యార్థులు, ప్రభు త్వోద్యోగులుఅమితంగా వ్యాకులపడుతున్నారు. తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. తెలంగాణ తల్లి భూషణాలు పట్టపగలే అపహరిం పబడుతున్నాయి. అభివృద్ధి పేరిట ప్రభుత్వాస్తులను అమ్మివేస్తున్నారు. లేదంటే కార్పొరేట్‌ సంస్థలకు అప్ప ణంగా ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించిన నాటి నుంచి అ మాటకొస్తే 1948లో ‘పోలీసు చర్య’ నాటి నుంచీ తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని జేగీయమానం చేసిన పరిశ్రమలతో సహా ప్రభుత్వా స్తులన్నిటినీ పరులకు బదలాయించడం జరిగింది. ఇదివరకటి హైదరాబాద్‌ సంస్థానంలో వేలాది ప్రజ లకు ఉపాధి సదుపాయం కల్పించిన అనేక పరిశ్రమ లను నెలకొల్పిన ఘనత నిజాం ప్రభుత్వానిదేనని చె ప్పకతప్పదు. 1948 అనంతరం అధికారంలోకి వచ్చి న ప్రభుత్వాలు ఆ పరిశ్రమలను ఒకదాని తరు వాత మరొకదాన్ని పరాధీనంచేస్తూ వచ్చాయి.

ఆల్విన్‌ మె టల్స్‌, హైదరాబాద్‌ ఆజ్‌బెస్టాస్‌, ఎలక్ట్రిక్‌ కార్పొరే ష న్‌, సిర్పూర్‌ పేపర్‌ మిల్లు, రేయాన్‌ ఫ్యాక్టరీ, అజాం జాహి మిల్స్‌ మొదలైనవన్నీ నిజాం ప్రభుత్వం నెలకొ ల్పినవే. ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి బిర్లాల అధీ నంలోకి వెళ్లిపోయాయి. నిజాం నెలకొల్పిన, ప్రభుత్వ రంగం నుంచి జారిపోయిన చివరి ప్రధాన పరిశ్రమ బోధన్‌ చక్కెర ఫ్యాక్టరీ. దక్షిణ, ఆగ్నేయాసియాలో కెల్లా అతిపెద్ద చక్కెర కర్మగారంగా ప్రసిద్ధి పొందిందీ సుగర్‌ ఫ్యాక్టరీ. అవన్నీ జాతి సంపదను వృద్ధి చేశా యి. తరతరాల ప్రజలకు ఉపాధి నిచ్చాయి. అయితే ఘనత వహించిన మన ప్రభుత్వాలు వాటిని ఖాయి లాపరిచాయి. అమ్మివేయక తప్పని పరిస్థితి కల్పిం చాయి. బోధన్‌ సుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, వివిధ రాజకీయ పక్షాల నాయకులు లబ్ధి పొందినట్టు వినికిడి. ప్రజల కు వాస్తవాలు తెలుసు. అయితే వారు నిస్సహాయు లు. జరిగిన తంతును చూస్తుండిపోక తప్పలేదు. ఈ వాస్తవాల విషయంలో తెలంగాణ నాయకులు ఆనం దమయ అజ్ఞానం (బ్లిస్‌ఫుల్లీ ఇగ్నోరంట్‌)లో ఉన్నా రు. లేదా తెలిసీ ఉదాసీనంగా ఉండటమో జరుగు తోంది.

తెలంగాణలోని ప్రభుత్వాస్తులను నిరాలోచన గా అమ్మివేయడం వెనుక కపట ఉద్దేశాలు ఉన్నట్టు కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ కోశాన్ని దివాళా తీయించడం, సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడే పరిశ్రమలు, ఇతర వనరులు కొత్త రాష్ట్రానికి లేకుండా చేయడమే ప్రభుత్వాస్తుల విచ్చల విడి అమ్మకాల వెనుక ఉన్న ఉద్దేశాలని పలువురి భా వన. ఇటీవల ‘ప్రజా తెలంగాణ ఫౌండేషన్‌’ (పీపుల్స్‌ తెలంగాణ ఫౌండేషన్‌) అనే సంస్థ ఒకటి ఏర్పడింది. సంస్థాపకులలో అత్యధికులు వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డు కులాలు, తరగతులకు చెందిన విద్యావే త్తలే. ఆ సంస్థ ప్రచురించిన పత్రం (డాక్యుమెంట్‌) ఒకటి, కొత్త రాష్ట్రంలో అధికారాన్ని, ఇంతవరకు అధి కార పీఠాలకు దూరంగావున్న వర్గాల ప్రజలకే అప్ప గించాలని వాదించింది. అత్యధిక సంఖ్యలో ఉన్న వర్గాలవారి పాలనే సామాజిక పరివర్తనను సాధ్యం చేస్తుందనేది ఆ వాదన సారాంశం. మరింత స్పష్టంగా చెప్పలంటే కొత్త రాష్ట్రంలో ‘సంప్రదాయక దోపిడీదా రుల’ను అధికారానికి వెలుపల ఉంచాలి. ఆ పత్రం పేర్కొన్న ‘దోపిడీదారుల’ జాబితాలో రెడ్లు, వెలమలు, కమ్మలు మొదలైన కులాలవారు ఉన్నారు.

వెల మలు వాస్తవానికి ఉత్తరాదినుంచి వలస వచ్చినవారు కనుక ఆ మేరకు వారు తెలుగువారు కాదని ఆ పత్రం పేర్కొంది. ఇక రెడ్లు, కమ్మలు శతాబ్దాల క్రితం సుఖ ప్రద జీవనపరిస్థితులను వెతుక్కుంటూ ఆంధ్ర ప్రాం తం నుంచివలస వచ్చినవారు. తెలంగాణ ప్రధానం గా లంబాడాలు, కోయలు, గోండ్లు, మాదిగ, ముది రాజ్‌, మున్నూరుకాపులు, యాదవలు, గౌడ్‌లు, ము స్లింలు తదితరవర్గాల ఆవాసమేనన్నారు. సరే, అదం తా నిజమని విశ్వసించినా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కొన్ని వాస్తవాలను తప్పక పరిగణనలోకి తీసుకోవల్సి వుంటుంది. వల సలు తెలంగాణకు మాత్రమే పరిమితమూ కావు కదా. క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో సంస్క­ృతం మాట్లాడే ఆర్యతెగలవారు మధ్యాసియా నుంచి భార త ఉపఖండానికి వలస వచ్చినట్టు చరిత్ర చెబుతోంది.

ఆర్యుల తరువాత అరబ్‌లు, పోర్చుగీస్‌లు, ఫ్రెంచ్‌ వారు, బ్రిటిష్‌వారు మన దేశాన్ని ఆక్రమించుకొన్నా రు. ఏ దేశ సరిహద్దులూ ఎప్పుడూ ఒకే విధంగా ఉం డవని, అవి కాలక్రమంలో విస్తరించడమో లేక కుదిం చుకుపోవడమో జరుగుతుందన్న సత్యాన్ని చెప్పడా నికి ఈ విషయాన్ని ప్రస్తావించాను. ప్రపంచవ్యాప్తం గా అన్ని దేశాలకూ ఇది అనుభవంలోకి వచ్చిన సత్య మే. మానవ సమూహాలు తమ ఆర్థిక సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడంలో కొన్ని ప్రమా ణాలు అనుసరించడం జరిగింది. స్థానిక ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా వ్యవహరించడం, అధికా రం వారిచేతుల్లోనే ఉండేలా చేయడమనేది వీటిలో ప్రధానమైనది. సామాజిక సంఘర్షణలను నివారిం చాలంటే ప్రతి ఒక్కరు తమ మూలాలు ఏమైనప్పటికీ ఈ ప్రమాణాలను అంగీకరించాల్సిందే.

‘ప్రజా తెలం గాణ ఫౌండేషన్‌’ పత్రాన్ని రూపొందించిన ఉస్మాని యా విశ్వవిద్యాలయ విద్యావ్తేతలు తమ దంత సౌధా లు (ఐవరీ టవర్స్‌) నుంచి దిగిరావాలి. లేనిపక్షంలో వారు తమ ఊహాపోహలు, ఆచరణసాధ్యంకాని విష యాల్లో బందీలవుతారు. ఏమైనా వీరు మన రాజ కీయవేత్తల ‘లోకజ్ఞానం’ నుంచి ఒకటి రెండు పాఠా లు నేర్చుకోవల్సివుంది. అప్పుడే వారు వాస్తవాలను విపులంగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రత్యేక తెలం గాణ ఉనికిలోకి వచ్చినప్పుడు, ప్రస్తుతదశలో మనం ఊహిస్తున్న సమస్యల కంటే, ఎక్కువ, సంక్లిష్ట సమ స్యలు, సవాళ్ళను ఎదుర్కోవలసివుంటుంది. తెలంగా ణకు ఉద్యమిస్తున్నవారు కఠోర వాస్తవాలను- జీర్ణిం చుకోలేనివే అయినప్పటికీ- అర్థం చేసుకోవల్సిన అవ సరమెంతైనా ఉంది. తెలంగాణ పలు రంగాలలో ఇంకా చాలా దూరం పయనించవలసివుంది.

(ఆంధ్రజ్యోతి 12 ఆగస్ట్ 2007)

One Response to “పుట్టని పాపపై కుట్ర?”

  1. 1
    arjuna Says:

    ఇది పూర్తిగా సత్యదూరమే. ఎందుకంటే ఆదిమ సమాజంగా భావింపబడే యానాదులే అసలైన తెలుగునేలకి హక్కుదార్లు. మిగతా అందరూ వలసవచ్చిన వారే. లంబాడాలు రెడ్లు కంటే అసలైన తెలుగువారనే వాదన పూర్తిగా సత్యదూరం. కేవలం కుళ్ళిపోయిన వ్యవస్తలో జీవించే వ్యక్తులే ఇట్లా మాట్లాడగలరు. ఆధారాలు లేకుండా ఇలా కులాల మధ్యన కుమ్ములాటలు పెట్టి పబ్బం గడుపుకునే కొందరు మేధావులు సమాజానికే ప్రమాదకరం

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com