Feed on
Posts
Comments

Monthly Archive for నవంబర్, 2007

- వి.ప్రకాశ్
నిజాం పాలనలో మతసామరస్యం వెల్లివిరిసిందని చెబుతూ, పీడకులైన రాజులు చేసిన మంచిపనులను కీర్తిస్తే తప్పెలా అవుతుందని తెరాస అధ్యక్షులు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను కొందరు వివాదాస్పదం చేస్తున్నారు. నిజాం పాలనకు కెసిఆర్ వంద మార్కులు వేసినట్లు, తెలంగాణ సాయుధపోరాటాన్ని, అమరుల త్యాగాలను అవమానపర్చినట్లు విపరీతవ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహోజ్వల పోరాటం తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. కెసిఆర్‌తో పాటు తెరాసలోని ప్రతి ఒక్కరూ ఆ పోరాటయోధుల వారసత్వాన్ని కొనసాగించాలనే ఆరాటపడుతున్నారు. అమరుల త్యాగాలను […]

Read Full Post »

వర్తమానంలో సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికీ, నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికీ గతాన్ని సవ్యంగా అర్థం చేసుకోవాలి. గతాన్ని అపార్థం చేసుకొని వర్తమానాన్ని సంక్షోభంలోకి నెట్టుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. రాజకీయ నాయకులు ప్రతి అక్షరం ఆచితూచి మాట్లాడాలి. చరిత్రను బోధించే అధ్యాపకుడు లేదా చరిత్రను అన్వయించే రచయిత హైదరాబాద్ నిజాంపైన ఎటువంటి అభిప్రాయం వెలిబుచ్చినా పెద్ద నష్టం ఉండకపోవచ్చు. నిజాం పాలన గురించి ప్రముఖ కవి కాళోజీ మాట్లాడినంత వివాదాస్పదంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరరావు (కేసీఆర్) […]

Read Full Post »

- తెలకపల్లి రవి
‘చుట్టు ముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ, నీవుండే హైద్రాబాదు, దాని పక్కా గోలకొండ, గోలకొండ ఖిల్లా కింద, గోలకొండ ఖిల్లా కింద, నీ గోరి కడ్తము కొడకో నైజాము సర్కరోడా!‘ ఎప్పుడు ఎక్కడ ఎవరు పాడినా ఉర్రూతలూపే పాట. సుప్రసిద్ధమైన ఈ ప్రజా గీతాన్ని సాహిత్య శిల్పానికి ఉదాహరణగా తరచూ చెబుతుంటాను. ఎందుకంటే ఇందులో మొదటగా భూగోళ శాస్త్రంలా ఊళ్ళ పేర్ల జాబితా ఇస్తున్న కవి యాదగిరి ఒక్కసారిగా దాన్ని మలుపు తిప్పుతాడు. నిజాం […]

Read Full Post »

(ఆన్‌లైన్, సిటీబ్యూరో): ‘తరతరాల బూజు నిజాం రాజును కీర్తించడం కె.చంద్రశేఖరరావు అహంభానికి దర్పణం. అంతేగాక, వేలాదిమంది అమరవీరుల త్యాగాలను కించపరడమే’నని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఒక ప్రకటనలో విమర్శించింది. రాచరిక పాలనను ప్రశంసించడమంటే ప్రజల గోళ్లు ఊడగొట్టి వసూలు చేసే పన్నుల పద్ధతిని సమర్థించడమే అవుతుందని కమిటీ నాయకులు పేర్కొన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని వారు పేర్కొన్నారు.

Read Full Post »

- సురవరం సుధాకర్‌రెడ్డి
ప్రజాకంటకంగా సాగిన నిజాం పాలనను పొగడటం ద్వారా తెలంగాణ విముక్తి పోరాటాన్ని కేసీఆర్ అవమానించారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. “నిజాం పాలన 20వ శతాబ్దకాలంలో ఉండకూడనిది. పౌరహక్కులు లేకుండా వెట్టిచాకిరీ, దోపిడీ వ్యవస్థతో కూడిన ఆ దుర్మార్గ పాలనపై ప్రజలే తిరుగుబాటు చేశారు.

Read Full Post »

హైదరాబాద్, నవంబర్ 26 (ఆన్‌లైన్): “నాలుగు వందల యాభై సంవత్సరాల నిజాం పరి పాలనలో మత సామరస్యం వెల్లివిరిసింది. విభిన్న సంస్కృతులకు చెందిన అన్ని మతాల ప్రజలూ సహజీవనం చేశారు. నిజాం నవాబుల సుదీర్ఘ పరిపాలనలో రజాకార్ల అరాచకాలు జరిగింది చాలా తక్కువ కాలమే. ఆ సమయంలో ప్రజలు బాధ పడింది నిజమే. అయితే ఏ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా గత వైభవాన్ని స్మరించుకోవడం సంప్రదాయం.

Read Full Post »

-వేణు సంకోజు, కూరెళ్ళ విఠలాచార్య
నల్లగొండ జిల్లా విశ్వవిద్యాలయానికి - సమస్త తెలంగాణకు, తెలుగుజాతికే గర్వకారణమైన ‘మహాకవి పోతన’ పేరును సూచించడం జరిగింది. అందుకు గల బలవత్తరమైన, సహేతుకమైన కారణమేమంటే, సంస్కర్త హృదయం గల పోతన ‘తొలి విప్లవకవి’ కూడా కావడం.
మహాకవి పోతన పేరు పెట్టుకోవడం ద్వారా మహోన్నత చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక వికాసాన్ని గౌరవించుకున్నట్లవుతుంది. ఒక మహత్తర కాలానికి నమస్కరించుకొని, కొద్దిగా రుణంతీర్చుకుంటూ, కృతజ్ఞతను ప్రకటించుకున్నట్లవుతుంది.

Read Full Post »

- ఎం. కోదండరాం, కె. సీతారామారావు
తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అనుసరించవలసిన వ్యూహాలు ఎత్తుగడలపై తెలంగాణవాదుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. 1968లో తెలంగాణ ఉద్యమ పంథా విషయంలో ఇంతటి చర్చ జరిగిన దాఖలాలు లేవు.1968లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వివిధ ఉద్యోగ, విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో మొదలయిన తర్వాత తెలంగాణ ప్రజాసమితి ఉద్యమంలో ప్రవేశించి నాయకత్వం వహించిన అనంతరం ఉద్యమానికో రాజకీయ వ్యక్తీకరణ వచ్చింది. అప్పుడు ఉద్యమం ప్రజాసమితి నేతృత్వంలో సాగింది. తెలంగాణా ప్రజాసమితి కాక ఉద్యమం […]

Read Full Post »

- యం. కోదండరాం, కె. సీతారాంరావు

I

 1956లో సమైక్యాంధ్ర రాష్ట్రం ఎర్పడ్డ తర్వాత సాగునీటిరంగంలో తెలంగాణా జల వనరులు సమగ్ర దోపిడికిలోనైనాయి. గత ఐదు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి రంగంలో అవలంభించిన వివక్షాపూరితమైన విధానాల ఫలితమే తెలంగాణాలో నేటి వ్యవసాయ సంక్షోభం. తెలంగాణా జల వనరుల చౌర్యానికవసరమైన వివక్షాపూరిత విధానాల రూపకల్పన, పథక రచన సమైక్యాంధ్ర రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతునే ఉన్నది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ”జలయజ్ఞం” దానిలోని ప్రధాన పథకాలైన పోలవరం, […]

Read Full Post »

Lakshana art gallery presents
domestic animals and rural women
an exhibition of paintings
by G Bharath Bhushan
on friday the 23rd november 2007 at 6.30 p.m
inauguration by
Padma Sri Jagadish Mittal
eminent art historian and art collector
guest of honour
Sri B.Narsing Rao
artist and film maker
Venue
101, shanty nagar, opp hockey ground,
masab tank, hyderabad 500028
phone 040-2337 8033 email lakshana_hyd[at]yahoo.co.in
till 30 the november 2007
rsvp: +91-98492-12650 […]

Read Full Post »