Feed on
Posts
Comments

- యం. కోదండరాం, కె. సీతారాంరావు

I

 1956లో సమైక్యాంధ్ర రాష్ట్రం ఎర్పడ్డ తర్వాత సాగునీటిరంగంలో తెలంగాణా జల వనరులు సమగ్ర దోపిడికిలోనైనాయి. గత ఐదు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి రంగంలో అవలంభించిన వివక్షాపూరితమైన విధానాల ఫలితమే తెలంగాణాలో నేటి వ్యవసాయ సంక్షోభం. తెలంగాణా జల వనరుల చౌర్యానికవసరమైన వివక్షాపూరిత విధానాల రూపకల్పన, పథక రచన సమైక్యాంధ్ర రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతునే ఉన్నది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ”జలయజ్ఞం” దానిలోని ప్రధాన పథకాలైన పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు, పొతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంచడం, దుమ్మగూడెం-నాగార్జున సాగర్‌ లింక్‌ కాలువ పథకం ఇవన్నీ తెలంగాణా నీటి వనరుల మళ్ళింపుకు జలయజ్ఞం పేరుతో ప్రభుత్వం వేసిన సాగునీటి పథకాలు.

ఈ మధ్యకాలంలో జారీచేసిన సూక్ష్మ సేద్యానికి సంబంధించిన జి.వొ 34 కూడా ఈరకమైన వివక్షాపూరితమైన విధానాల కొనసాగింపుకు తాజా ఉదాహరణ. ఇట్లాంటి వివక్షాపూరిత సాగునీటి విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి రంగంలో ఏర్పడ్డ ప్రాంతీయ అసమానతలు కొనసాగి స్థిరీకరింపబడే ప్రమాదం కనబడుతున్నది. ఈ కింద పేర్కొన్న గణాంక వివరాలను పరిశీలిస్తే తెలంగాణాకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం, వివక్షతతో పాటు తెలంగాణా ప్రాంతంలో వ్యవసాయరంగానికున్న సాగునీటి వనరుల ప్రస్తుత స్థితిగతులు తెలుస్తాయి. కృష్ణా, గోదావరీ నదుల పరివాహక ప్రాంతాల విస్తీర్ణం తెలంగాణాలో 68, 79 శాతాలైతే కోస్తాంధ్రలో 31, 21 శాతం. కాని ఈ రెండు నదుల్లోంచి తనకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కకపోవడమే కాక, కనీసం 15 శాతం నీటిని కూడా తన సాగునీటి అవసరాలకు వాడుకొనె పరిస్థితి ఈనాడు తెలంగాణా ప్రాంతానికి లేదు. ప్రణాళికా వ్యయంలో అత్యధిక భాగం కోస్తాంధ్ర సాగునీటి రంగ అభివృద్ధికి మళ్ళించడంవల్ల ఈ ప్రాంతంలో కాలువల కింద సాగుభూమి 1960-61, 2000-01 (అంటే 40 సంవత్సరాల కాలంలో) మధ్యకాంలో 20 శాతం పెరిగింది. ఇదే కాలంలో మొత్తం సాగుభూమి 29.09 లక్షల హెక్టార్ల నుండి 45.28 లక్షల హెక్టార్లకు పెరిగింది. ప్రభుత్వ పెట్టుబడితో ప్రాజెక్టులను ఆధునీకరించి, ఆయకట్టును స్థిరీకరించారు. 2004-05 సంవత్సరం నాటికి ప్రాజెక్టు కాలువల కింద ఉన్న సాగుభూమిలో 83 శాతం కోస్తాంధ్రలోనే ఉన్నది. 1960లలో కృష్ణా, గోదావరి డెల్టాల్లో ప్రవేశపెట్టిన హరిత విప్లవం ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని, తెలంగాణా వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక విధానాలను రూపొందించాలని, ఇక్కడ పండే పంటల అభివృద్ధికి ప్రత్యేక పరిశోధన సంస్థ స్థాపించాలని ప్రతిపాదించిన తెలంగాణ రీజినల్‌ కమిటీ సూచనలు ప్రభుత్వ చెవికి వినిపించలేదు. అంతేగాక తెలంగాణాలో చెరువులు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినవి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటికై చేసిన బడ్జెట్‌ కెటాయింపుల్లో 10 శాతం మాత్రమే చిన్న నీటిపారుదల వ్యవస్థపై ఖర్చు చేసారు. కాని తెలంగాణాలో మైనర్‌ ఇరిగేషన్‌ ప్రధానమైన సాగునీటి వ్యవస్థ అంటే, ఇక్కడది ”మేజర్‌ ఇరిగేషన్‌” అన్నమాట. చెరువుల నిర్వహణ సరిగా లేక వీటికింద ఉన్న సాగుభూమి 1960-61 నుండి 2000-01 మధ్యకాలంలో 11.51 లక్షల హెక్టార్ల నుండి 7.26 లక్షల హెక్టార్లకు, ఆ తర్వాత 2004-05 నాటికి మరింత తగ్గి కేవలం 4.77 లక్షల హెక్టార్లకు చేరుకున్నది. ఈ పరిస్థితుల్లో తెలంగాణాలో బావుల (ఓపెన్‌ అండ్‌ బోర్‌) కింద నేవ్యం పెరిగింది. ప్రస్తుతం తెలంగాణాలో మొత్తం సాగునీటి సౌకర్యం గల భూమిలో 70-80 శాతం బావుల కిందనే సేవ్యమతున్నది. 1980 దశకంలో బావుల, బోర్ల సంఖ్య పెరగడంతో పాటు అవి వాడే విద్యుచ్ఛక్తి వినియోగం కూడా బాగా పెరిగింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం బావుల్లో 62 శాతం, బోర్లలో 64 శాతం తెలంగాణా ప్రాంతంలోనే ఉన్నవి. 1994-95, 2000-01 మధ్యకాలంలో కొత్తగా తవ్విన బావులు, బోర్లలో 73 శాతం తెలంగాణా ప్రాంతంలోనే వచ్చినవి. భూగర్భ జలాల స్థాయిని నిలిపి ఉంచే ఉపరితల జలవనరులైన చెరువులు క్షీణించడం వల్ల, వర్షాభావపరిస్థితుల మూలంగా బోర్లు, బావులు ఎండిపోయినవి. రైతుల పెట్టుబడి వృధా అయి ఎందరో రైతులు బలవన్మరణాల పాలయినారు. ఈ విధంగా ప్రభుత్వ వివక్షపూరిత సాగునీటి విధానాల వల్ల తెలంగాణాలో వ్యవసాయ సంక్షోభం పెరిగి తీవ్రస్థాయికి చేరుకొన్నది.

II

 1996 నుండి మళ్ళీ అస్తిత్వంలోని కొచ్చిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా అన్ని వర్గాల ప్రజల్లో తెలంగాణా వాదం పెంచిన చైతన్యం మూలంగా సోయికొచ్చిన తెలంగాణా ఇంజనీర్లు ఈ ప్రాంత జలవనరుల రక్షణకు, వినియోగానికి ఎన్నో పథకాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలుగా పంపించినారు. తెలంగాణాలో రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులన్నీ భారీ ఎత్తిపోతల పథకాలే. ఈ ఎత్తిపోతల పథకాల నిర్మాణానికయ్యే ఖర్చు తగ్గించే ఎన్నో అనుసరణీయమైన సూచనలు, ఎత్తిపోతల దూరాన్ని తగ్గించి బ్యాలన్సింగు రిజ్వాయర్లతో గ్రావిటీ ద్వారా చేరుకోగల్గిన ప్రాంతాలకు సాగునీరందించడం వంటి పథకాలు తెలంగాణ ఇంజనీర్లు రూపొందించారు. జల విద్యుదుత్పత్తి అవసరమైన చోట నీరు కిందికి పోయి వృదా కాకుండా ప్రత్యేకంగా రివర్సిబుల్‌ టర్జైన్స్‌ రూపొందించడలో తెలంగాణా ఇంజనీర్ల కృషి ఎంతో శ్లాఘనీయం. ఈ విధంగా ఒకపక్క తెలంగాణా ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం, మరోపక్క సాంకేతికంగా తోసివుచ్చలేని విధంగా తెలంగాణ ఇంజనీర్లు రూపొందించిన ప్రత్యామ్నాయ సాగునీటి పథకాలు ప్రభుత్వ వివక్షపూరిత సాగునీటి విధానాన్ని క్రమంగా ఇరుకున పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణా జల వనరుల చౌర్యానికి మరిన్ని నూతన మార్గాంతరాలు వెదికే ప్రయత్నం మొదలుపెట్టింది. దానిలో భాగమే కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేయదలిచిన ”జలయజ్ఞం” కార్యక్రమం. ఈ ”జలయజ్ఞం”లోని తాజా పథకం సూక్ష్మ సేద్యం (ఖరిబీజీళి |జీజీరివీబిశిరిళిదీ), దానికి సంబంధించినదే జి.వొ. నెం.34. దీని ప్రాథమిక లక్ష్యం బిందు, తుంపర సేద్యాల ద్వారా నీటిని పొదుపుచేసి తద్వారా మరింత భూమిని సాగులోకి తేవడం. కాని ఈ ఉత్తర్వును ఎక్కడ, ఎప్పుడు, ఎలా అమలుచేస్తారనదే అంతుపట్టని సమస్య. తెలంగాణా ఎత్తిపోతల పథకాల నీటి కేటాయింపుల్లో కోత విధించడమే ఈ జి.వొ. 34 లక్ష్యమని ఈ ప్రాంత ఇంజనీర్లు, విద్యావంతులు సందేహిస్తున్నారు. ఈ సందేహానికి ఆధారాలు ఎన్నో చూపెట్టవచ్చు తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యాన్ని పెంచే ప్రభుత్వం నిర్ణయమే దీనికి తిరుగులేని నిదర్శనం. ఈ పూర్వరంగంలో జి.వొ.34 కు సంబంధించిన వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.

III

 జి.వొ నెం.34 తెలంగాణ సాగునీటి రంగానికి మనం ఊహించని భారీ నష్టాన్ని కలిగించగలదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది నాడు వచ్చిన ఈ జి.వొ లోని రెండవ సెక్షన్‌ ప్రకారం రాష్ట్రంలోని అన్ని భారీ ఎత్తిపోతల పథకాల కింద బిందు, తుంపర వంటి సూక్ష్మ సేధ్యాన్ని ప్రవేశపెడతారు. అందుకని భారీ ఎత్తిపోతల కింద పిల్ల కాలువలను, పంట కాలువలను తవ్వ వద్దని ఈ జి.వొ ద్వారా ప్రభుత్వం ఆదేశించింది. ఈ మధ్యలో జి.వొ.34ను సవరించిన ప్రభుత్వం పిల్ల కాలువలు తవ్వుతామని వాగ్ధానం చేసింది. దీనివల్ల జి.వొ. స్వభావంలోగాని, తెలంగాణా సాగునీటి రంగానికి అది కలిగించే నష్టంలోగాని ఫరక్‌ పడేదేమిలేదు.

బిందు, తుంపర సేధ్యం వంటి సూక్ష్మ సేధ్యం కొరకుగాను ప్రతి 10-15 ఎకరాలకు ఒక సంప్‌ నిర్మిస్తారు. ఈ సంపు లేదా హౌజ్‌ నిర్మించాలనుకోవడం వెనుక వాస్తవమైన ఒక చిన్న కథ ఉన్నది. మొదట అధికారులు కాలువల నుండి నీళ్ళను మోటర్ల ద్వారా ఎత్తి పైపుల ద్వారా ఇవ్వాలనుకున్నరు. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా నల్గొండలోని ఒక గ్రామంలో ఏర్పాటుచేసి దాని పనితీరును పరిశీలించాలనుకున్నారు. సూక్ష్మ సేధ్య వ్యవస్థ ఏర్పాట్లు చేయడానికి ఆ గ్రామానికి వెళ్ళిన అధికారులతో అక్కడున్న రైతులు కరెంటు రోజుకు 7 గంటలే వస్తది కద, మరి మిగతా సమయంలో కాలువ ద్వారా వచ్చే నీళ్ళను ఏం చేస్తరని అడిగిండ్రు. ఇంజనీర్లకు వెంటనే సమాధానం తోచలేదు. రైతులేమో ముక్కు ఎక్కడ అంటే తలకాయ చుట్టు చెయి తిప్పి చూపినట్టు కాలువలతోని నీళ్ళివ్వకుండ ఈ మోటర్లకు, పైపులకు పైనుంచి అదనపు ఖర్చు ఎందుకన్నరు. ఇంజనీర్లు, అధికారులు వాపసు వచ్చి మంత్రులతోని ఈ మాటే చెప్పిండ్రి. కానీ సూక్ష్మ సేధ్యాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయానికొచ్చిన ప్రభుత్వం కరెంటు లేనప్పుడు కాలువల్లోకి వచ్చే నీళ్ళను ఏం చేయాలో చెప్పమని పెద్ద పెద్ద నిపుణులను పిలిపించింది. వారంతా వచ్చి ఏడుగంటలు మోటార్లు పైపుల ద్వారా తీసుకొనిపోయే నీరు పోగా కాలువల్లో మిగిలిన నీటిని నిలువ ఉంచడానికి ఎన్ని సంపులు కావాల్నో, అవి ఎంతసైజులో ఉండాల్నో లెక్కలుకట్టి చెప్పిండ్రు. అగొ ఆట్లోచ్చినయి సంపులు. సంపులు కట్టిన తరువాత ఉద్యానవన శాఖ, బిందు సేద్యం కింద సాగుయోగ్యమైన పంటలను గుర్తించి ప్రతి రైతు సాగునీటి అవసరాలను అంచనావేస్తుంది. దానిని బట్టి పైపులను వేసి నీళ్ళందిస్తరు.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి బిందు, తుంపర సేద్యంతో అన్ని పంటలు సాగుచేయడం సాధ్యపడదు. ముఖ్యంగా కూరగాయలు పండించడానికి పండ్ల తోటల పెంపకానికి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చెరుకు పంటకు, పల్లి పంటకు బిందు, తుంపర సేద్యాలు పనికొస్తయని వ్యవసాయ-నీటిపారుదల నిపుణుల అభిప్రాయం. శాస్త్రీయ సాగునీటి నిర్వహణకు సంబంధిచిన పరిశోధనల ఫలితమే బిందు, తుంపర వంటి సూక్ష్మ సేద్య పద్ధతుల ఆవిర్భావం ఈ పద్ధతులు ఎక్కడ సాధ్యపడుతాయో అక్కడ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన జల విధానం నిర్దేశిస్తున్నది. నీటి కొరత ఉన్నచోట, పంటపొలాలు సమతలంగా లేనిచోట, నీటి తీపుకం ఉన్న భూముల్లో ఈ సూక్ష్మ సేద్య పద్ధతులు అమలుచేయవచ్చునని నిపుణుల అభిప్రాయం. ఇది చాల ఖర్చుతో కూడుకొన్న వ్యవహరమని కేంద్ర వాటర్‌ మేనేజ్‌మెంట్‌ మాన్యువల్‌ పేర్కొన్నది. పండ్లు, కూరగాయల తోటలకు, అంటే ”బాగాయితీసేద్యం, ఇదిబాగా ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అమెరికావంటి విద్యుత్తు సమృద్ది దేశంలోనే సూక్ష్మ సేద్యంతో సాగయ్యే భూమి 37.8 శాతమయితే 62.8 శాతం సాంప్రదాయిక సేద్యం కింద ఉన్న భూమి అన్న విషయం మనం గుర్తుచుకోవాలి.

ఈ 34 జి.వొ ప్రకారం సూక్ష్మ సేద్యంలోని మోటార్లు, పైపులు తదితర పరికరాల నిర్వహణకు ప్రత్యేకమైన రైతుమిత్ర గ్రూపులను ఏర్పాటు చేస్తరు. ఈ గ్రూపులు సంపుల నిర్మాణానికి భూమి ఇస్తమని, తమ భూమిలో పైపులు వేయడానికి అనుమతిస్తమని, పైపులు తదితర సూక్ష్మ సేద్య పరికరాలకయ్యే ఖర్చులో 30 శాతం వాటాధనాన్ని భరిస్తమని, పైపులు వేయడానికి శ్రమదానం చేస్తమని, పైపులైనుల, హౌజుల నిర్వహణ బాధ్యత స్వీకరిస్తమని, ఆరుతడి పంటలు మాత్రమే వేస్తమని, ఈ పథకం అమలుకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సహకరిస్తమని ప్రభుత్వానికి రాసివ్వాలి అట్లా రాసిచ్చిన వారికే సూక్ష్మ సేద్యం కల్పిస్తారు.

పై వివరాలను పరిశీలించినప్పుడు మనం ఇక్కడ మూడు విషయాలను గమనించవచ్చు. మొట్టమొదటగా తెలిసేదేమిటంటే ఈ సూక్ష్మ సేద్యం ప్రధానంగా తెలంగాణాలోనే ఎక్కువగా అమలులోకి రాబోతున్నదనే వాస్తవం. ఎందుకంటే తెలంగాణలో వచ్చేవన్నీ ఎత్తిపోతల పథకాలే. నిజమాబాదు జిల్లాకు సాగునీరందించడానికి నిర్మిస్తున్న గుత్ప, అలీసాగర్‌, కరీంనగర్‌, మెదకు, రంగారెడ్డి జిల్లాకు నీరందించే ప్రాణహిత - చెవెళ్ళ లింకు ప్రాజెక్టు, నల్గొండకు నీరివ్వడానికి పూర్తి కాబోతున్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, మహబూబ్‌నగర్‌ జిల్లాకు కృష్ణా నీటిని మళ్ళించే భీమా, వెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులు - ఈ రకంగా తెలంగాణలో నిర్మాణమవుతున్న ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతల పథకాలే. సూక్ష్మ సేద్యంలో వ్యవసాయ-నీటిపారుదల నిపుణల అంచనా ప్రకారం ఒక టి.యం.సి. నీటితో 15,000 ఎకరాల పైనే సాగవుతుంది. అందువలన తక్కువ నీటితో ఎక్కువ సాగుచూపించి మిగతా నీటిని రాయలసీమకు, ఆంధ్రకు మలుపుకొని పోవచ్చుననేది ఆంధ్ర వలసపాలకుల రహస్య ఎజండా. ఇది జివొ 34 జారీచేయడం వెనుక నున్న ప్రభుత్వ అసలు ఉద్దేశం, కుటిలనీతి. రెండో విషయమేమిటంటే సూక్ష్మ సేద్యం చాలా ఖర్చుతో కూడుకొన్న పని. జి.వొ. 34 ప్రకారమే సూక్ష్మ సేద్యానికి కావలసిన మోటార్లను, పైపులను కొనడానికి ఎకరాకు 15,000 రూ|| ఖర్చు వస్తుంది. సంపుల నిర్మాణానికయ్యే ఖర్చు కలిపితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. కాలువల నిర్మాణానికైతే ఇందులో పదోవంతు అంటే 1300/- మాత్రమే ఖర్చు వస్తది. దీనితో పోలిస్తే బిందు, తుంపర సేద్యానికయ్యే ఖర్చు ఐదింతలు ఎక్కువ. అంతేకాదు అందువలన నిర్మాణం ఆలస్యం కావచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. సరిగ్గా కేటాయింపులు చేయదు. ఇప్పుడు కొత్తగ సూక్ష్మ సేద్యాన్ని తెచ్చి ఖర్చు పెంచితే కేటాయింపులు జరుగక మరింత ఆలస్యం కావచ్చు. ఇక మూడవ విషయమేమిటంటే సూక్ష్మ సేద్యం ఫలితంగా రైతు పైన మోయలేని భారం పడుతది. పైపులు, ఇతర పరికరాల కొనుగొలుకయ్యే ఖర్చులో 30 శాతం భరించడమే కాక నిర్వహణ బాధ్యత రైతుదే. ఆపైన కరెంటు బిల్లుల మోత, అవి రైతులే కట్టుకోవాలి. ఇంత ఖర్చు పెట్టడమే కాదు సూక్ష్మ సేద్యం కింద సాగయ్యే పంటలకయ్యే అధిక పెట్టుబడి రైతు పెట్టుకొక తప్పదు. ఇప్పటికే మనరాష్ట్రంలో సాగునీటి రంగంలో ప్రాంతాల మధ్య తీవ్రమైన అసమానతలున్నాయి. తీరాంధ్రలో ప్రభుత్వమే తన ఖర్చుతో సాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తే తెలంగాణ రైతులు తమ ఖర్చుతో బావులు తవ్వుకొంటున్నరు, బోర్లు వేసుకొంటున్నరు. జి.వొ 34 వలన ఈ అసమానతలు శాశ్వతంగ స్థిరీకరింపబడి, వ్యవస్థితమవుతయి. బలవంతంగా బిందు, తుంపర సేద్యాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం రైతుల వీపుల మీద కొండంత భారాన్ని మోపనున్నది. ఇటు సాగునీటికయ్యే ఖర్చు, అటు దానితో సాగయ్యే వాణిజ్య పంటలకయ్యే పెట్టుబడి భారాన్ని తట్టుకోలేక చిన్న, సన్న రైతులు తమ భూమిని అమ్ముకొనే పరిస్థితి రావచ్చు. నీటిని వృధా చేయకుండా శాస్త్రీయంగా వినియోగించడమే ఈ జి.వొ లక్ష్యమయితే సూక్ష్మ సేద్య ప్రయోగాలు చేయవల్సింది తెలంగాణాలో కాదు. ఒక టి.యం.సి. నీటిని ఆరువేల ఎకరాలకు తీరాంధ్రలో, ఒక టి.యం.సి. నీటిని 3800 ఎకరాలకు వాడనున్న పోలవరం ఆయకట్టులో ఈ సూక్ష్మ సేద్య పద్ధతులు ప్రయోగాత్మకంగా అమలుచేస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే అనవసరం. పుష్కరం తాటిపూడి వంటి పోతల పథకాల ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చు కద! తెలంగాణకెందుకీ సూక్ష్మ సేద్యం పీడ!

సూక్ష్మ సేద్యం పేరుతో ప్రభుత్వం తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాకుండా చేస్తున్న కుట్రకు మరో పేరే జి.వొ 34. కాబట్టి ఈ కుట్రను వ్యతిరేకించాల్సిందే. నిశ్శబ్దంగా జరుగుతున్న ఈ కుట్రవల్ల తెలంగాణా పరివాహక ప్రాంతంలో ప్రవహిస్తున్న కృష్ణా-గోదావరి నదీ జలాల్లో తెలంగాణ రైతులకు న్యాయంగా రావాల్సిన వాటాను కోల్పోవడమే కాకుండా, వచ్చే కొద్దిపాటి నీటిని పొందడానికి కూడ రైతు మరింత పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కాలువలతో నీటిని తెచ్చి చెరువులను నింపితే అటు వ్యవసాయం ఇటు పశుపోషణకు, చేపల పెంపకానికి అవకాశం ఉంటది. భూగర్భ జలాల స్థాయి ఎప్పటికీ అందుబాటులో ఉంటది. బతుకు దెరువు దొరుకుతది. బతుకమ్మ నిలబడతది. అట్ల జరుగకుంటే సూక్ష్మ సేద్యం భారాన్ని మోయలేక తెలంగాణాలోని చిన్న-సన్నకారు రైతులు తమ భూములమ్ముకొనే ప్రమాదం త్వరలోనే రాబోతున్నది. ఈ భూమిని స్వంతం చేసుకొవడానికి కాంట్రాక్లర్లు, అగ్రిబిజినెస్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఆ భూమిని కొని పెద్ద వ్యవసాయ కమతాలుగా మార్చి పండ్లు, కూరగాయలు పండించి హెరిటేజ్‌ కంపెనీ దుకాణాల ద్వారాకాని, ఇతర గుత్త సంస్థల దుకాణాల ద్వారాకాని లాభాసాటిగా అమ్మి పైసలు సంపాదించవచ్చునని ఆంధ్ర వలస పాలకులు ఆశపడుతున్నరు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో తెలంగాణా జలవనరుల చౌర్యానికవసరమైన విధి-విధానాలు, పథకాలు రూపొందిస్తే వీటి ఫలితంగా తెలంగాణా చిన్న, సన్నకారు రైతులు నిండ మునిగి భూమలమ్ముకుంటే వాటిని కొని కాంట్రాక్టు వ్యవసాయం, సూక్ష్మ సేద్యంతోని కూరగాయలు, పండ్లు పండించి తమ హెరిటేజ్‌ కంపెనీ దుకాండ్లతోని అమ్ముకొని విపరీతంగా లాభపడాలని చంద్రబాబునాయుడు పథకాలేస్తున్నడు. తెలంగాణాను ముంచుట్ల (లోపట లోపట) ఇద్దరిదీ ఒక్కటే మాట, ఒక్కటే బాట.

IV

 శాస్త్రీయ సాగునీటి నిర్వహణ పద్ధతుల్లో భాగంగా వచ్చిన సూక్ష్మ సేద్య పద్ధతులను పనిగట్టుకొని వ్యతిరేకించాల్సిన అవసరమెవ్వరికుండదు. ఏ సాంకేతిక విజ్ఞానమైనా ఆలంబనచేసుకోబడి అనుసరించడానికో అవసరం, సందర్భం ఉంటుంది. ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలకనుగుణంగా సాంకేతిక విజ్ఞానం తోడ్పడితే సమస్యలేమి రావు. అది ప్రజలకు త్వరలోనే ఆమోదయోగ్యమయి ఆచరించబడుతుంది. కాని ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా ఏ సాంకేతిక విజ్ఞాన్నానైనా బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తే ప్రజల నుండి వ్యతిరేకత మొదలవుతుంది. తెలంగాణాలో సూక్ష్మ సేద్య పద్ధతులను ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా అమలుచేయాలనే విషయాలపై ప్రభుత్వం నిపుణులచే శాస్త్రీయ అధ్యయనం చేయించే ప్రయత్నమే చేయలేదు. తెలంగాణా రైతుల అనుభవాలను, అభిప్రాయాలను, అవసరాలను పరిగణనలోకి తీసుకొనే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేయలేదు. వ్యవసాయరంగ ఉత్పత్తి పద్ధతుల్లో వచ్చే మార్పులు, సాగులో భాగమైన రైతుల నైపుణ్య అవసరాలకు, సాంకేతిక విజ్ఞానానికి, పెట్టుబడికి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి రైతులు తమ పొలాలను వ్యవసాయ-పర్యావరణ పరిస్థితులకు (జువీజీళి-లిబీళిజిళివీరిబీబిజి), సామాజికార్థిక పరిస్థితులకనుగుణంగా మలుచుకొంటాడు. తెలంగాణాలో కూడా తరతరాలుగా రైతులు సమర్ధవంతంగా చేసిన పని ఇదే. అందుకే తెలంగాణాలో ప్రధానమైన సాగునీటి వనరు చెరువు. తెలంగాణా ప్రాంతంలో ”ఊట చెరువులు, గొలుసుకట్టు చెరువులు” వ్యవసాయానికి సాగునీరందించడమే కాకుండా భూగర్భ జలస్థాయిని నిరంతరంగా నిలిపి ఉంచాయి. ప్రస్తుతం తెలంగాణాలో చిన్న-సన్నకారు రైతుల వ్యవసాయమంతా బావులు, బోర్లపై ఆధారపడి ఉన్నది. ఈ బావుల, బోర్ల వ్యవసాయానికి కరెంటు కీలకమై కూర్చున్నది. ఈ బావులకు, బోర్లకు నీరందించే ”జల” భూగర్భ జలస్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ఈ భూగర్భ జలస్థాయి ఉపరితల జలవనరులైన చెరువుల నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా తెలంగాణాలో వ్యవసాయాభివృద్ధికి కీలకమైన చెరువులను విస్మరించి, నిర్లక్ష్యం చేసి, వాటిని నీటితో నింపే ప్రయత్నం చేయక సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగమేమి? నీటి కొరత ఎక్కువగా ఉన్న ఖుష్కీ భూముల వ్యవసాయానికి సూక్ష్మ సేద్య పద్ధతులు ఒక ఐచ్చికంగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. తెలంగాణాలో కూడా పండ్ల తోటల పెంపకానికి ఈ సూక్ష్మ సేద్య పద్ధతులను వాడిన అనుభవం కొంత రైతులకున్నది. సూక్ష్మ సేద్య పద్ధతులను వాటికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని ఏయే భూముల్లో, ఏయే పంటలకు, ఎప్పుడు వాడుకోవాలనేది రైతులే నిర్ణయించుకోవాలి. ఎంతటి ప్రజాస్వామిక ప్రభుత్వమైనా సూక్ష్మ సేద్య పద్ధతులను ఏకపక్షంగా, బలవంతంగా ఏ ప్రాంతంలోని రైతులపైనా రుద్దడానికి వీల్లేదు. పంటల తీరును, అవసరాలను బట్టి మార్కెట్‌ పరిస్థితుల కనుగుణంగా సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించే స్వేచ్చ రైతులకుండాలి.

ప్రస్తుతమున్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో వ్యవసాయాన్ని కూడా వ్యాపారంలా నిర్వహించాలి నిజమే కాని ఈరోజు తెలంగాణా రైతులు (ప్రధానంగా చిన్న-సన్నకారు రైతులు) చేస్తున్న సేవ్యం వ్యాపార-వ్యవసాయం (జువీజీరి-లీతిరీరిదీలిరీరీ) కాదు. వీలైనంత వరకు వ్యవసాయంలో వచ్చే రకరకాల అపాయాలు తగ్గించుకొని, ప్రతికూల పరిస్థితుల్లో కూడ తన కుటుంబ పోషణకవసరమయ్యే ఆదాయాన్ని సంపాదించుకొనే వ్యూహాత్మక వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు తెలంగాణా రైతులకున్నవి. ఇది తెలంగాణా వ్యవసాయానికి సంబంధించిన అత్యంత కీలకమైన వాస్తవం. ఈ వాస్తవాలను విస్మరించి తెలంగాణా వ్యవసాయాన్ని, పేద రైతుల జీవితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక నిర్ణయమైన సూక్ష్మ సేద్య విధానానికి సంబంధించిన జి.వొ. 34ను ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఎలా జారీ చేసిందనేదే ఆశ్చర్యం కల్గించే విషయం.

ప్రస్తుతమున్న వ్యవసాయం సంక్షోభ పరిస్థితుల్లో తెలంగాణ వ్యవసాయానికి జివో 34లో వివరించిన సూక్ష్మ సేద్య పద్ధతులు ఉపయోగపడవు. దీనికి ప్రత్యామ్నాయంగా 34 జివోను రద్దుచేసి నేల పొరల్లోని తేమను, భూగర్భ జలస్థాయిని నిలిపి ఉంచే చెరువులను కాలువల ద్వారా నింపే కార్యక్రమం చేపట్టాలి. సూక్ష్మ సేద్య పద్ధతులను బలవంతంగా, ఏకపక్షంగా తెలంగాణా రైతులపై రుద్దకూడదు. తాము వేసుకొనే పంటల అవసరాల కనుగుణంగా బిందు, తుంపర సేద్యాన్ని వినియోగించుకొనే స్వేచ్చ రైతులకుండాలి. చివరిగా ఒక్కమాట తెలంగాణాలోని చెరువులను సక్రమంగా పునరుద్దరించి వాటికి జలకళను ప్రసాదిస్తే రైతులకు సూక్ష్మ సేద్య పద్ధతులను వాడుకునే స్వేచ్చ ఇచ్చినట్టే లెక్క.

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో