నిజామ్కు సలామ్ : వలసవాదుల దుష్ప్రచారంతోనే అపోహలు
నవంబర్ 26th, 2007 by డిస్కవర్ తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 26 (ఆన్‌లైన్): “నాలుగు వందల యాభై సంవత్సరాల నిజాం పరి పాలనలో మత సామరస్యం వెల్లివిరిసింది. విభిన్న సంస్కృతులకు చెందిన అన్ని మతాల ప్రజలూ సహజీవనం చేశారు. నిజాం నవాబుల సుదీర్ఘ పరిపాలనలో రజాకార్ల అరాచకాలు జరిగింది చాలా తక్కువ కాలమే. ఆ సమయంలో ప్రజలు బాధ పడింది నిజమే. అయితే ఏ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా గత వైభవాన్ని స్మరించుకోవడం సంప్రదాయం. ప్రజలను పీడించిన ఎంతోమంది రాజులు చేసిన మంచిని కీర్తిస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి మేలు చేసిన నిజాం, కాక తీయ రాజులకు సైతం సలాం చేస్తాం. దాంట్లో తప్పే ముంది?” అని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. నిజాం పాలనను అరాచకమైందిగా, హిందువులకు వ్య తిరేకమైందిగా చూపుతూ వలసపాలకులు 50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలిగించా రని ఆయన విమర్శించారు.
ఇప్పటికైనా దానిని వదిలి అంతా సహజీవనం చేద్దామని విజ్ఞప్తి చేశారు. ఏడో నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ 41వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబా ద్‌లోని కింగ్‌కోఠిలో గల ఆయన సమాధి వద్ద కేసీఆర్ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఆయనతో పా టు టీఆర్ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, రవీంద్రనాయక్, ఎమ్మెల్యే టి.పద్మారావుగౌడ్, అధికార ప్రతినిధి ఎస్.మ ధుసూదనాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రెహ్మాన్ నివాసం లో కేసీఆర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. “నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిజాం నవాబు చనిపోయిన రోజు స్వ యంగా వచ్చి నివాళులర్పించారు. తన పోరాటం నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగానే తప్ప ఆయనకు వ్యతి రేకంగా కాదని స్పష్టంచేశారు. దాశరథి కృష్ణమాచార్యను జైల్లో పెట్టిన నిజాం నవాబును నేను పొగిడానంటూ విమర్శలు చేస్తున్నారు.
మరి గాంధీని జైల్లో పెట్టిన కింగ్ జార్జి పేరిట విశాఖపట్నంలో ఆసుపత్రి ఉంది కదా! మన దేశాన్ని రెండువందల సంవత్సరాల పాటు పీల్చి పిప్పి చేసిన ఇంగ్లాండ్ దేశ రాణి విక్టోరియా పేరిట కోల్ కతాలో మెమోరియల్ హోం లేదా? బకింగ్‌హాం కాలువ లేదా? దేశ ప్రజలను పీడించిన ఔరంగజేబు పేరిట రోడ్డు లేదా? ఢిల్లీలో నేనుండేది తుగ్లక్ రోడ్డులో. మరి వాళ్లంతా ప్రజలకు అన్యాయం చేసిన రాజులే కదా!” అని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ కూర్చుంటున్న అసెంబ్లీ, జూబ్లీ హాల్‌తోపాటు హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి… ఇలా అన్నీ నిజాం నవాబు కట్టించినవే అని ఆయన అన్నారు. “నిజాం నవాబులు ముస్లింల కోనమే కాదు. ఇక్కడి ప్రజల కోసం దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్, నిజాం సాగర్… ఇలా ఎన్నో కట్టించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద మూడు లక్షల ఎకరాలు అప్పటి నుంచే సాగవుతోంది. దాని వల్ల లబ్ధి పొందిన వారంతా హిందువులే. గతంలోని మంచిని కీర్తించడం తప్పేం కాదు” అంటూ తన చర్యను ఆయన సమర్థించు కున్నారు.





