Feed on
Posts
Comments

-వేణు సంకోజు, కూరెళ్ళ విఠలాచార్య

Pothanaనల్లగొండ జిల్లా విశ్వవిద్యాలయానికి - సమస్త తెలంగాణకు, తెలుగుజాతికే గర్వకారణమైన ‘మహాకవి పోతన’ పేరును సూచించడం జరిగింది. అందుకు గల బలవత్తరమైన, సహేతుకమైన కారణమేమంటే, సంస్కర్త హృదయం గల పోతన ‘తొలి విప్లవకవి’ కూడా కావడం.

మహాకవి పోతన పేరు పెట్టుకోవడం ద్వారా మహోన్నత చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక వికాసాన్ని గౌరవించుకున్నట్లవుతుంది. ఒక మహత్తర కాలానికి నమస్కరించుకొని, కొద్దిగా రుణంతీర్చుకుంటూ, కృతజ్ఞతను ప్రకటించుకున్నట్లవుతుంది.

ప్రపంచంలోనే బహుశా, ప్రపధమంగా- ‘హాలికులైననేమి సత్కవుల్’ అని సగర్వంగా చాటినవాడు మహాకవి పోతన. తెలంగాణలోని-నల్లగొండ జిల్లాలో, పేద-రైతు కుటుంబంలో జన్మించి, ఆజన్మాతం శ్రమను నమ్ముకొని జీవిస్తూ, కవితాసాధనచేసి, అనితరసాధ్యమైన, అత్యంత మ«ధురమైన శైలీ విన్యాసాన్ని చూపుతూ, తేనెలొలుకు తెలుగు పలుకుబడులను విరివిగా తన కవితల్లో చొప్పించినవాడు పోతన.

‘ఊరకరారు మహాత్ములు’, ‘లావొక్కింతయు లేదు’ వంటి పోతన మాటలు, పదప్రయోగాలు, తెలుగు జానపదుల నాల్కల మీద కూడా నర్తిస్తాయి. భక్తిని జీవిత తాత్వికతను తన కవిత్వం ద్వారా ప్రజలందరికీ, అంతటి సులభమైన, అసాధరణమైన శైలితో చేరవేయగలిగిన మహానిపుణుడు పోతన ఒక్కడే. ఒక్క వేమనకు మాత్రమే అటువంటి శైలీసొబగత్వం సాధ్యమైంది. ఇది సరియైన సందర్భం గనుక ఇక్కడ రెండు విషయాలను ప్రస్తావించాలి.

1. కడప జిల్లాలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి ఎంతో ఔచిత్యవంతంగా యోగివేమన పేరు ను ఖరారు చేసుకున్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి అదికవి నన్నయ్య పేరు ను ఆత్మీయంగా పెట్టుకున్నారు. మరి అంతటి మహానుభావుడు- భాగవతాన్ని తెనిగించిన మహాప్రతిభావంతుడు - ఈ (నల్లగొండ) జిల్లాలో పుట్టినవాడు పోతన. గ్రామీణ ప్రజలస్వచ్ఛత, అమాయకత్వం, నిరాడంబరత, జాలి, కరుణ - అన్నింటినీమించిన అగణిత ప్రేమతత్వాలు పోతనలో అమృతధారలుగా కురుస్తాయి. మందార మకరంద మాధార్యులై విరుస్తాయి. అజరామర కవితలై మెరుస్తాయి. అటువంటి అలంకారికుని పేరుగాక నల్లగొండలో ఏర్పాటు చేయబోయే విశ్వవిద్యాలయానికి మరేపేరు గొప్పగా ఉంటుంది ?

ఈ ప్రాంతంలో సాయుధ తెలంగాణ పోరాటం జరిగిన నేపధ్యంలో ఇక్కడ ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయానికి పోరాటయోధుల పేర్లను, త్యాగధనుల పేర్లను పెట్టాలని సూచించారు కొందరు. నిజమే. ఆ లెక్కన ఈ విశ్వవిద్యాలయానికి ‘తెలంగాణ విశ్వవిద్యాలయం’ అని నామకరణం చేయాలి. కానీ అంతకు ముందే ఏర్పాటైన నిజామాబాద్ విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టుకునే అవకాశం కలిగింది. అందుకని, నల్లగొండ జిల్లా విశ్వవిద్యాలయానికి - సమస్త తెలంగాణకు, తెలుగుజాతికే గర్వకారణమైన ‘మహాకవి పోతన’ పేరును యోచించడం, సూచించడం జరిగింది. అందుకు గల బలవత్తరమైన, సహేతుకమైన కారణమేమంటే, సంస్కర్త హృదయం గల పోతన ‘తొలి విప్లవకవి’ కూడా కావడం. ఈ విషయాన్ని - ఆధునిక ప్రగతివాద కవులంతా ఈ మేరకే ముక్తకంఠంతో చాటియుండడం గమనార్హం. ఎందుకంటే తన ఆస్థానాధీశుడైన సర్వజ్ఞ సింగభూపాలుడు భాగవతాన్ని అంకితమీయమని ఆడిగినప్పుడు పోతన ఇవ్వనుగాక ఇవ్వనన్నాడు. అంతటితో ఆగక ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి’ బందీని చేయలేనని సరస్వతికి నివేదించుకున్నాడు..

ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకున్నాడు. గనుకనే, క్రూర నిజాముపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మహాకవి దాశర«ధి - ‘ఈ నిజాము రాజు జన్మజన్మాల బూజు’ ఆనగలిగినాడు. పోతన ఎంతటి తాత్వికుడో అంతటి హేతువాద దృక్పథం కలవాడు, కనుకనే ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపల నుండు లీనమై’ అనగలిగినాడు. శివేతరక్షయే (మంచితప్ప ఇతరమైనదేదీవుండకూడదని)- మనసా, వాచా నమ్మినవాడు. నమ్మిన దానిని అక్షరాలా ఆచరించిన ధన్యుడు. ఆ«ధ్యయానికి, పరిశోధనకు కావాల్సిన దృష్టికోణాన్ని, దార్శనికతను తన కవితల ద్వారా అద్భుతంగా ఆమోదయోగ్యంగా చెప్పినవాడు పోతన. అటువంటి సత్యశోధన, సమ్యక్‌దృష్టులే ఈనాటి పరిశోధక కేంద్రాలకు, విశ్వవిద్యాలయాలకు అత్యంత అవశ్యకాలు.

ఆరాధన భావాన్ని ఎంతగా ప్రకటించాడో సార్వజనీన, సార్వకాలీక, మహోన్నత ప్రేమతత్వాన్ని కూడ పోతన మధురమధురంగా, కర్ణపేయంగా, మనఃపూర్వకంగా చాటాడు. ప్రతి సన్నివేశంలో సర్వప్రాణ సమానత్వాన్ని, భూతదయను ప్రబోధించిన అఖిల విశ్వజనుడు పోతన. శాంతికాముకులు, వ్రవక్తలు ఆకాంక్షించి, ప్రబోధించినదంతా-విశ్వశాంతి, విశ్వశ్రేయం, ఆక్షరమైన ప్రేమతత్వమే. ఇవాళ లోకంలో కొరవడుతున్నది అక్షరాలా సకజనుల మధ్య వెల్లి విరియాల్సినది అవాజ్యమైన ప్రేమే, సౌభ్రాతృత్వమే. అందుకే మనం ఏకంగా మన భారతరాజ్యాంగలోని లక్ష్యాలలో ఒకటిగా (ప్రవేశికలోనే) సౌభ్రాతృత్వాన్ని చేర్చుకున్నాం. మహామహుల దూరదృష్టి అటువంటిది. మహాకవి పోతన దృక్కోణం మహిమాన్వితమైనది.

మహాకవి పోతన మహిమనెరిగిన కొందరు అభిమానులు (?)-పోతన మావాడం టే, మావాడంటూ సొంతం చేసుకునే ప్రయత్నం చేయసాగారు. ‘ఏకశిల’ అంటే దాని ‘ఒంటిమిట్ట’ గా యెంచి, పోతన కడపవాడంటూ చర్చలు లేవదీశారు. వీటన్నంటిని ఓపికగా చూస్తూ వచ్చిన బహూభాషా కోవిదులు, కీర్తిశేషులు పి.వి. నరసింహారావు (మాజీ ప్రధానమంత్రి), అన్ని వాదాలలోని డొల్లతనాన్నీ ఎత్తిచూపి, పోతన తెలం గాణా వాడు కాదుపొమన్న వితండవాదాలన్నింటినీ పూర్వపక్షంచేసి, పోతన పుట్టిం ది నల్లగొండ జిల్లాలోని జనగాం తాలుకాలో అనీ, జిల్లాల పునర్‌నిర్మాణం కావడం తో వరంగల్ జిల్లావాడయ్యాడన్నసత్యాన్ని స్థాపించారు.

వరంగల్‌లో ఏకంగా ఒక పోతన పీఠాన్నే ఏర్పాటు చేశారు. అనాటి నుండి ఆ కేంద్రంవారు సాహిత్య-సంగీత -సాంస్కృతిక కార్యక్రమాలనేకం ఏర్పాటు చేసి నిర్వహి స్తూ వస్తున్నారు. ఈ పీఠం వారు కూడా నల్లగొండలో ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయానికి పోతన పేరు పెట్టడమే సముచితమంటూ ప్రభుత్వానికొక లేఖను సమర్పించడం కూడా జరిగింది.

జడ పదార్థం కంటే చైతన్యం గొప్పది. విశ్వవిద్యాలయానికి ఊర్లు, కొండలు, కోనలు, నదుల వంటి పేర్లు పెట్టడం కంటె, విశ్వశ్రేయమే పరమాదర్శంగా, శ్రమైక జీవనం,ఆత్మాభిమానం లక్ష్యాలుగా-జీవించినతంకాలం మానవత్వమే పరిమళింపజేస్తూ, తరతరాలుగా తెలుగుజాతి ఉత్తేజ పరచిన మహాకవి పేరు పెట్టడం సమంజసం.

ఈ (నల్లగొండ) జిల్లాలో పుట్టిన సాధుజనుడు, సహజ పండితుడైన పోతన కవితా ప్రస్థానంలో అధిరోహించిన అందలాల్లో కనీసం దరిదాపులకైన చేరతగిన వారుండరంటే అతిశయోక్తి కాదు. తదనంతరం ఉద్భవించిన మహానుభావులు ఉండవచ్చు -సందేహంలేదు. త్యాగపురుషులుండవచ్చు-వివాదంలేదు.

పోరాటయోధులుండవచ్చు- సత్యసమ్మతమైన విషయమే. కాని, వారంతా పోతన అనే మహాకవి విరాట్‌రూపపు అందమైన ప్రతీకలే, ప్రతిఫలనాంశాలే. ఆ మహానుభావుడి నుండి స్ఫూర్తిని పొందిన వారే. పోతనపద్యం రాని తెలుగువాడుండడు. తెలుగుభాష ఉన్నంత వరకు, తెలుగువాళ్ళు బ్రతికినంతకాలం పోతన రచన చిరంజీవి అవుతుంది. కనుక, ఏ కోణంనుంచి చూసినా నల్లగొండ విశ్వవిద్యాలయానికి మహాకవి పోతన పేరు పెట్టడమే అన్ని విధాలా సమంజసంమౌతుంది.

ల్లగొండలో ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయానికి మహాకవి పోతన పేరు పెట్టాలని మహజర్లు సమర్పిస్తూ, జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ, సభలు - సమావేశాల ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిచేస్తూ, పత్రికల్లోనూ - మీడియా ద్వారాను అభిప్రాయాన్ని ప్రోది చేస్తూ ఉండగా, విశ్వవిద్యాలయపు స్థల స్థీరీకరణ జరిగి కొన్ని వాయిదాల అనంతరం శంకుస్థాపన మహోత్సవం కూడా జరిగింది. ప్రజలందరు ఆనాడు మహాకవి పోతన పేరు ప్రకటితమవుతుందని, వీనులార విందామని ఎదురు చూశారు. కాని, పెద్ద నిరాశే మిగిలింది. కేవలం నల్లగొండ విశ్వవిద్యాలయం అంటూ చేతులు దులుపుకున్నారు- అటు ఏలినవారు, ఇటు అ«ధికార వర్గం. కాంక్షించిన ప్రజల ముఖం మీద మట్టి చల్లినంత బాధ అయ్యింది.

ఎవరో ఏదో సణిగారని, గొణిగారని, మనం సత్యాన్ని విస్మరిస్తామా? చెప్పుడు మాటలు - వదంతులు వల్ల సత్యం దాగుతుందా? అనేకులు అనేక పేర్లు సూచిం చారు కనుక-విసిగి వేసారి ఇక ఏదో ఒక పేరని ‘నల్లగొండ’ పేరును ఖాయపరుస్తామా?మొదట ‘తెలుగు విశ్వవిద్యాలయం’ అనుకున్నదాని పేరు ‘పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం’గా ఎట్లా మారింది? ఏ ప్రజల ఆమోదం ఉంది దానికి? ఆం.ప్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ముందర యన్.జి.రంగా గారి పేరు ఎట్లా వచ్చి చేరింది? ఎవరి డిమాండ్‌వల్ల? కడప విశ్వవిద్యాలయానికి మహానుభావుడయిన యోగివేమన పేరు సమంజసమైనప్పుడు, రాజమహేంద్రవరానికి ఆదికవి నన్నయ్య పేరు యోగ్యమనప్పుడు-ఒక్క తెలంగాణకేనా అన్యాయం తలపెట్టేది? ఒక్క తెలంగాణ ప్రాంతమేనా అన్యాయానికి గురి కావలసింది? ఇతర ప్రాంతాలకు మహాత్మా గాంధీ పేరు అచ్చిరాదా? అక్కరలేదా? తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణా వైతాళికుల-తెలంగాణ ముద్దు బిడ్డల పేర్లు ఎందుకు పెట్టకూడదనుకుంటున్నారు.

గాంధీజీ జయంతి రోజున పెద్దలు శ్రద్ధగానే యోచించి ఒక ఉన్నత సంస్థకు మహాత్ముని పేరును సూచించాలనుకోవడం శ్రే యస్కరం, అభి లషణీయం. కాని, గాం«ధీ ఎంతటివాడు! ఒక ఏనుగు కొని తెచ్చి కూజాలోకి దూర్చయత్నిస్తామా? ఒక అంతర్జాతీయ వ్యక్తి, అహింసావాది, స్వేచ్ఛ ప్రియుడు, భారత స్వాతంత్ర సమరయోధులలో అగ్రగామి- వారి పేరు పెట్టాలనుకుంటే దేశంలో, యావత్‌ప్రపంచంలో మహోన్నత సంస్థలు ఉండవా? ఒక్క తెలంగాణ ప్రాంతంలోని నల్లగొండ విశ్వవిద్యాలయమే కావలసివచ్చిందా? ఆ మహానుభావుని జన్మదినం ఆనందదాయక సందర్భమనే మేము నమ్ముతాం. సంపూర్ణంగా స్వాగతిస్తాం. కానీ, ఏకంగా వారి పేరునే ఇక్కడి విశ్వవిద్యాలయానికి పెట్టబోవడమనేది ఏవిధంగా సమంజసమైనది? దేశంలో గొప్ప ప్రణాళికలు-పథకాలు- ప్రాజెక్టులు-నిర్మాణాలు ఎన్నెన్నీ లేవు? వాటికి గాంధీ వంటి గొప్ప పేర్లు అక్కర లేదా? ఇదంతా ఒక ప్రాం తాన్ని, ప్రాంతీయ అభిమానాన్ని,ఆ ప్రాంతంలో పెనవేసుకున్న యెనలేని అనుబం ధాన్ని కాలరాయడం కాదా? గాంధీ ఒక వ్యక్తి కాదు. కేవలం రాజకీయ- సామాజిక శక్తి కూడా.

అతడు ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక విశిష్ట సిద్దాంతం. ఒక ఆచరణ సాధ్యం కాగల ఆదర్శమూర్తి. మేము పాలు అడుగుతున్నాం. ఏకంగా మామీద పాయసం గుమ్మరిస్తున్నారు. మేమిప్పుడు తట్టుకోలేని తిప్పలపాలవుతున్నట్లుగా ఉంది. మా తలకు బొప్పి కట్టినట్టుగా ఉంది. కక్కలేని, మింగలేని ఆయాసం. అందుకని మళ్లీ మేము మొదటికే వస్తున్నాం. మహాకవి పోతన పేరు పెట్టుకోవడం ద్వారా మనం మహోన్నత చారిత్రక వారసత్వాన్ని, సాంస్కృతిక వికాసాన్ని గౌరవించుకున్నట్లవుతుందని విన్నవించుకుంటున్నాం. ఒక మహత్తర కాలానికి వినమ్రంగా నమస్కరిం చుకొని, కొద్దిగా రుణంతీర్చుకుంటూ, కృతజ్ఞతను ప్రకటించుకున్నట్లవుతుందని- మరొక్కమారు విజ్ఞప్తి చేస్తున్నాం. మహాకవి పోతన పేరును మన నల్లగొండ విశ్వవిద్యాలయానికి నిర్ణయించమని అభ్యర్థిస్తున్నాం. కావాలంటే, ఆ ప్రాంగణాన్ని మహాత్మగాంధీ ప్రాంగణమనటం సర్వవిధాల ఔచిత్యవంతం అవుతుందని అభిప్రాయపడుతున్నాం.

Share/Save/Bookmark

One Response to “పోతన పేరు ఎందుకు పెట్టాలంటే”

  1. 1
    Krishna Murthy Lenkalapally Says:

    ఛలా భాగునందఇ, ప్రథి పధమఉ కూడ నచిచినది,Pothana name should put the University of Nalgonda, It’s honour for the greatest person.

    Krishna Murthy

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో