Feed on
Posts
Comments

- వి.ప్రకాశ్

నిజాం పాలనలో మతసామరస్యం వెల్లివిరిసిందని చెబుతూ, పీడకులైన రాజులు చేసిన మంచిపనులను కీర్తిస్తే తప్పెలా అవుతుందని తెరాస అధ్యక్షులు కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను కొందరు వివాదాస్పదం చేస్తున్నారు. నిజాం పాలనకు కెసిఆర్ వంద మార్కులు వేసినట్లు, తెలంగాణ సాయుధపోరాటాన్ని, అమరుల త్యాగాలను అవమానపర్చినట్లు విపరీతవ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన మహోజ్వల పోరాటం తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. కెసిఆర్‌తో పాటు తెరాసలోని ప్రతి ఒక్కరూ ఆ పోరాటయోధుల వారసత్వాన్ని కొనసాగించాలనే ఆరాటపడుతున్నారు. అమరుల త్యాగాలను సదా స్మరిస్తూనే ఉంటారు. నిజాం పాలన చివరి రోజుల్లో జరిగిన రజాకార్ల నరహంతక చర్య లను సాకుగా చూపి 224 ఏళ్ళ నిజాం నవాబుల పాలనను దుష్టపాలనగా, మతోన్మాదపాలనగా చిత్రించే కుట్ర గత అరవై ఏళ్ళుగా జరుగుతున్నది. ముస్లింలంటేనే రజాకార్ల వారసత్వమని, తెలంగాణా వస్తే రజాకార్లపాలన ఏర్పడుతుందని, ముస్లింల ఆధిపత్యం పెరుగుతుందనే విషప్రచారం జరుగుతోంది.

తెరాస స్థాపించిన తొలినాళ్ళలో కొందరు ఆంధ్రప్రాంత నిర్మాతలు ఈ ఉద్యమాన్ని పరిహసిస్తూ ‘రజాకార్లు’ పేరు తో సినిమా తీసే ప్రయత్నం కూడా చేసి విరమించుకున్నారు. ఇవన్నీ తెలంగాణా సమాజం ఐక్యంగా ఉండకుండా జరిగిన వలసవాదుల కుట్రలే! వలస వాదులు, హిందూ మతోన్మాదులు ఒక పద్ధతి ప్రకారం సాగిస్తున్న ఈ విష ప్రచారాన్ని, చరిత్ర వక్రీకరణలను తిప్పికొట్టి ప్రజలు వాస్తవాలు తెలుసుకునేలా, అపోహలను తొలగించి తెలంగాణా ప్రజ ల్లో గణనీయంగా ఉన్న ముస్లింలను రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగ స్వాములుగా చేయడంకోసం కెసిఆర్ ఆరోగ్యకరమైన చర్చకు తెర తీశారు. నేటి పాలకులు నిజాం పాలకులకన్నా మెరుగైన పాలన (రజా కార్ల దురాగతాలను, ప్రజావ్యతిరేక చర్యలను మినహాయించి) అందిం చి ఉంటే నిజాం పాలనలో జరిగిన మంచి పనులను కీర్తించవలసిన అవసరం ఏర్పడేదికాదు. 1724-1948 మధ్యకాలంలో సాగిన నిజాం పాలన ఒక రాచరిక పాలన. ఓట్లేసి గెలిపించుకున్న పాలకులలోనే ప్రజాస్వామిక ఛాయలు కనిపించని ఈ రోజుల్లో గతితార్కిక, చారిత్రిక భౌతిక వాదానికి ప్రతి నిధులమని చెప్పుకునే కొందరు నిజాం రాచరికపు పాలనలో ప్రజాస్వామ్యం లోపించిందని విమర్శిస్తున్నారు.

వేలాది ఏళ్ళుగా తెలంగాణా పల్లెల్లో వేళ్ళూనుకున్నది ఫ్యూడల్‌వ్యవస్థ. భూస్వాముల దురాగతాలను నిజాంకు ఆపాదిస్తున్నారు. నిజాం గద్దెదిగిన తరువాత సాగిన పోరాటా న్ని, జరిగిన నష్టాలను నిజాంఖాతాలోనే జమచేస్తూ చరిత్రను వక్రీకరి స్తున్నారు. ఎవరిపరిపాలనలోనైనా, రూపాయిబిళ్ళకు బొమ్మ, బొరుసు ఉన్నట్లు మంచీ-చెడూ రెండూ ఉంటాయి. నిజాం ముస్లిం మతస్థుడైనందున సహజంగానే ఉర్దూ రాజ భాషగా మారి తెలుగు ప్రజలపై రుద్దబడింది. నిజాం మతోన్మాది అయివుంటే గ్రామాల్లో పాలన హిందూ దేశ్‌ముఖ్‌ల, జాగీర్దార్ల, భూస్వాముల చేతుల్లో ఉండకపోయేది. వేలాది గ్రామాల్లో బ్రాహ్మణులు, పటేల్, పట్వారీలుగా ఉండకపోయేవారు. శిథిలమౌతున్న హిందూదేవాలయాలకు మరమ్మతులు జరగకపోయేవి. ఉస్మాని యా హాస్టళ్ళలో హిందూ ప్రార్థనా మందిరాలకు అనుమతి లభించక పోయేది. క్రిస్టియన్లు చర్చిలను స్థాపించి ఉండేవారు కాదు. మూసీ వర దల్లో హైదరాబాద్ మునిగినపుడు హిందూ పూజారుల సలహామేరకు నిజాం హిందూ సాంప్రదాయం ప్రకారం వస్త్రాలు ధరించి హిందూ దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి ఉండేవారేకాదు.

నిజాం పాలనలో సాగిన మతోన్మాద చర్యలకు బాధ్యులు 1927లో స్థాపించబడిన మజ్లీస్ -ఇత్తెహాదుల్-ముసల్మీన్ పార్టీ, దాని అధ్యక్షుడు కాశీం రజ్వీ. రజాకార్ల దురాగతాలను అదుపు చేయలేక పోయినందున రాజుగా నైతిక బాధ్యత మాత్రం నిజాంపై ఉంది. తెలంగాణా పల్లెల్లో భూస్వామ్య దౌర్జన్యాలను అదుపు చేయలేక పోవ డం, నిర్బంధ లెవీ వసూళ్ళు వంటి ప్రజా వ్యతి రేక కార్యకలాపాలకు బాధ్యత కూడా నిజాందే. నిజాంపాలన అంతా సవ్యంగానే ఉన్నదని కెసి ఆర్ లేదా తెరాస నేతలెవరూ ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. 1902లో ఇండియన్ ఇరిగేషన్ కమీషన్ నల్గొండ, పాలమూరు జిల్లాలు భవిష్యత్తులో దుర్భిక్ష జిల్లాలుగా మారనున్నాయని నివేదిక ద్వారా వెల్లడిస్తే నిజాం స్పందించి నల్గొండ, పాలమూరు జిల్లాల్లో సుమారు 20 లక్షల ఎక రాలకు సాగునీటిని గ్రావిటీతో అందించే నంది కొండ, గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఎగువకృష్ణా భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణా ళికలు రూపొందించారు. నిజాంసాగర్, తుంగభద్ర ప్రాజెక్టులను నిర్మిం చి లక్షలాది ఎకరాలకు సాగు నీరందించారు. వేలాది చెరువులను పున రుద్ధరించారు. నిజాం పాలనలో రూపొందించిన ప్రాజెక్టులను రద్దు చేసి నల్గొండ, పాలమూరు జిల్లాల నుండి 18 లక్షల మంది ఏటా వలస పోయే దుస్థితిని కల్పించారు నేటి పాలకులు.

12 లక్షల ఎకరాలు చెరు వుల క్రింద సాగుకాగా ఆ విస్తీర్ణాన్ని 3 లక్షల ఎకరాలకు తగ్గేలా చెరువులు శిధిలం కావడానికి కారణం నేటి పాలకులే. నిజాం స్థాపించిన పరి శ్రమలన్నీ ఒక్కొక్కటిగా మూసివేశారు. విలువైన స్థలాలను సన్ని హితులకు కట్టబెట్టారు నేటి పాలకులు. నిజాం షుగర్స్, సింగరేణి నిజాం కాలంలో స్థాపిస్తే ప్రస్తుత పాలకులు నష్టాల పాలుచేసి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. 15 సంవత్సరాల స్థిర నివాసం ఉంటేనే ముల్కీ అని నిజాం ఫర్మానా ఇచ్చి స్తానికులకు ఉద్యోగాలు కల్పిస్తే సుప్రీంకోర్టు ముల్కీ న్యాయమేనని తీర్పుచెప్పిన తర్వాత కూడా ముల్కీ ని రద్దు చేసి 4 సంవత్సరాల స్థిరనివాసం ఉంటే స్థానికుడేనని చెప్తూ చివరకు అదీ అమలు చేయక తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన 3 లక్షల కు పైగా ఉద్యోగాలను కొల్లగొట్టినందుకు ఈనాటి పాలన నిజాం పాలన కన్న మెరుగైనదని భావించాలా? రజాకార్ల దురాగతాలకన్న ఎన్నో రెట్లు అధికంగా పోలీసు లాకప్‌లలో నక్సలైట్ల పేరుతో అమాయకులను చిత్ర హింసలు చేస్తూ, కాల్చి చంపుతున్నందుకు ఈనాటి పాలన మంచిదని అనుకోవాలా? కరువు కాటకాలు, వరదలు వస్తే నిజాం స్వంత ఖజానా నుండి డబ్బు చెల్లించి ఆహార ధాన్యాలు కొని పల్లెలకు ఎడ్ల బండ్లపై అం దించేవారు. వేలాదిమంది ఆకలితో చస్తూ లేదా ఆత్మహత్యలు చేసుకుం టున్న దుస్థితి ఈనాటిది.

నిజాం పాలనలో నేలకొరిగిన ఆదివాసీలు వేళ్ళమీద లెక్కించే సంఖ్యలో ఉంటే అంటురోగాలతో, ఎన్‌కౌంటర్లలో నేడు వేలాదిమంది చనిపోతున్నారు. నిజాం రాజు సర్వ స్వతంత్రుడైనా ప్రభుత్వభూములను స్వప్రయోజనాలకోసమో, పాలనావసరాలకోస మో ఒక్క ఎకరమైనా అమ్మిన దాఖలా లేదు. ఏ విషయంలో ఈనాటి పాలన నిజాం పాలనకన్న భిన్నంగా, మెరుగ్గా ఉన్నదని భావించాలి ? ఆంధ్రజ్యోతి వ్యాసం ‘నిజామూ,నిజమూ’ (28 నవంబర్)లో తెలకపల్లి రవి ‘బండెన్కబండి’ పాటను ప్రస్తావించారు. ఆయనకు తెలియని ‘నిజము’ ఏమిటంటే ఆ పాట రాసిన యాదగిరి ‘నైజాము సర్కరోడా’ అనే పదాలు రాయలేదు. ‘నాకొడక ప్రతాపరెడ్డి’ అని ఎర్రబాడు దొర గురించి రాసాడు. ఈ మార్పు వెనుక పెద్ద కథే ఉంది. నైజాం గద్దెదిగగానే పోరాటాన్ని విరమించాలని కొందరు కమ్యూనిస్టు నాయకులు నిర్ణయం తీసుకుంటే ఈ పోరాటం నిజాంను గద్దె దించడానికి కాదు- భూమి, భుక్తి, రైతాంగ విముక్తికోసం, చైనా తరహా నూతన ప్రజాస్వా మ్య విప్లవంకోసం అని మరికొందరు నాయకులు పోరాటాన్ని కొనసాగించారు.

గ్రామాల్లో ఫ్యూడల్‌వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటాన్ని కేవలం నిజాంను గద్దెదించే పరిమిత లక్ష్యం గల పోరాటంగా దిగజార్చే కుట్రలో భాగంగానే ఈ పాట వక్రీకరణ. నిజాం వ్యతిరేక పోరాటం గురించి రాస్తూ తెలకపల్లి రవి ‘నాలుగు వేలమంది అమరులైనారని, పదివేల మంది జైలు శిక్షలనుభవించారని, యాభైవేలమంది చిత్రహింస లెదుర్కున్నారని వేలాది గ్రామాలు దాడులకుగురైనాయని, మహిళలపై వేలసంఖ్యలో అత్యాచారాలు జరిగాయని పేర్కొన్నారు. ఇవన్నీ వాస్తవాలే. కానీ ఈ ఘోరాల్లో ఇరవైశాతం పటేల్ పంపిన జనరల్ చౌదరి, వెల్లోడిల నేతృత్వంలో కాంగ్రెస్ పాలనలో జరిగినవి. నల్గొండ, వరంగల్, కొంతభాగం కరీంనగర్, హైద్రాబాద్‌లలో మాత్రమే నిజాం పాల నలో దురాగతాలు జరిగితే పోలీసు చర్య తర్వాత మూడేళ్లు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘోరాలు జరిగాయి. ఈ పచ్చి నిజాలను కప్పిపెట్టి పాపాలన్నీ నిజాంకే మూటగట్టడం ఎంత వరకు సరైనది? 1948-51 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపల్లెల్లో సృష్టించిన భీభ త్సం, మారణకాండపై చర్చజరగాలి. ఈ ఘాతుకాలకు బాధ్యత సర్దార్ పటేల్‌దే.

రజాకార్ల చర్యలకు బాధ్యడైన నిజాంను స్మరించడమే తప్పయితే సర్దార్ పటేల్‌ను ఎందుకు గౌరవించాలి? నిజాం కవితను అనువదించిన కీ.శే. దేవులపల్లి మదన్‌మోహన్‌రావు ఏడవ నిజాం నవాబుపై రాసిన వ్యాసంలో ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వతహాగా, మనస్తత్వ రీత్యా మతోన్మాది గానీ, మతతత్వవాది గానీ కాదు. అతను ఉదార స్వభావుడు. ప్రజాహిత కార్యక్రమాలను ఎన్నింటినో నిర్వహించినాడు. ఉర్దూ, పార్సీ భాషలలో కవి. దురదృష్టవశాత్తు కొందరు మతోన్మాదులు ఒత్తిడులు తెచ్చి, అపఖ్యాతి పాలు జేసినారు’ అని రాసినారు. లాతూర్ జిల్లా వాసి ఖాసీం రజ్వీ 1946లో మజ్లీస్ ఇత్తెహదుల్ ముసల్మీన్ అధ్యక్షుడైన తర్వాతనే మతోన్మాదం విజృంభించింది. 25వేల మందికి సాయుధ శిక్షణ నిచ్చి నిజాం రాజును బెదిరించి తన అదు పాజ్ఞలలో ఉంచుకున్నాడు ఖాసీం రజ్వీ. రజ్వీ సృష్టించిన మతోన్మాదు లైన రజాకార్లకు నిజాంసైనికులు ధరించే సైనిక యూనిఫాం పోలివుండే ఖాకీదుస్తులు ఇవ్వడంవలన వీరు సాగించిన మారణకాండ అంతా నిజాం ఖాతాలో చేరింది. రజాకార్లను నిజాం పంపించాడని జనం నమ్మారు.

జాయిన్ ఇండియా ఉద్యమాన్ని రజ్వీ వ్యతిరేకించి పాకిస్తాన్ లో విలీనం చేయాలని నిజాం పై వత్తిడి తెచ్చాడు. భారత్‌తో యధాస్థితి ఒడంబడికకై నిజాం నియమించిన ప్రతినిధి వర్గాన్ని బెదిరించి, రద్దు చేయించి, తన ప్రతినిధులను ఢిల్లీ చర్చలకు పంపేలా నిజాంపై వత్తిడి తెచ్చాడు రజ్వీ. నిజాంపై వత్తిడితెచ్చి జిన్నా ఏజెంటైన తన సన్నిహి తుడు మీర్ లాయక్ అలీని ప్రధానమంత్రిగా నియమింపచేశాడు. ఇమ్రోజ్‌పత్రికలో రజ్వీ ఆగడాలను విమర్శించినందుకు, ఇండియాలో నిజాం విలీనం కావాలని రాసినందుకు షోయెబుల్లాఖాన్‌ను లింగంపల్లి (కాచిగూడ)చౌరస్తాలో చేతులు నరికి కాల్చిచంపాడు. రజ్వీ మారణ కాండను అదుపు చేయడంలో విఫలమైనందుకే రజ్వీ దురగతాలకు, నిజాం బాధ్యత వహించాల్సి వస్తున్నది. ఇలాంటి మరుగున పడిన సత్యాలను, వెలికి తీస్తూ చరిత్రకు జరిగిన వక్రీకరణలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని తెరాస భావిస్తున్నది. నాటి రాచరికపు పాలనలో జరిగిన మంచి పనులను స్మరించుకోవడం ద్వారానైనా ఈనాటి పాలకులకు కనువిప్పుకాగలదేమో చూడాలి. తెలంగాణ సమాజం ఒక్కటిగా ఉండాలి. హిందూ-ముస్లిం భాయి భాయి.

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com