Feed on
Posts
Comments

Monthly Archive for డిసంబర్, 2007

- సంగిశెట్టి శ్రీనివాస్
‘మీకు చరిత్ర లేదు. ఉంటే గింటే అది హీన చరిత్రే, చరిత్ర హీనులే’ అని యాభై ఏళ్ళుగా ఆంధ్ర వలసవాదులు రాస్తున్న పుస్తకాలు, చేస్తున్న విష ప్రచారం తెలంగాణ అంతటా పాఠ్యపుస్తకాలై విస్తరించాయి. ‘ప్రారంభం నుంచి చివరి వరకూ ఏ ప్రాంతీయ తేడాలు లేకుండా తెలంగాణ పోరాటం తెలుగు ప్రజలందరి పోరాటంగా విశాలాంధ్ర కమ్యునిస్టు కమిటీ నాయకత్వంలో జరిగిం’దని అబద్ధాల్ని అక్షరబద్ధం చేస్తున్నారు. ‘ఈ పోరాటంలో వీర తెలంగాణ రైతాంగమూ, ఈ రైతాంగ ప్రజల […]

Read Full Post »

- వరవరరావు
హైదరాబాద్ నగరంలో చార్మినార్ పాతబస్తీలో ప్రవేశిం చండి- లేదా నగరంలో ఎక్కడైనా కాళ్లు చేతులాడించే బతుకుదెరువు మార్గాలను వెతుక్కునే వాళ్లను చూడండి-వాళ్లు ముస్లింయి ఉంటారు, లేదా దళితులయి ఉంటారు. చంద్రశేఖర్‌రావు నాలుగున్నరవందల సంవత్సరాల వీళ్ల సంస్కృతి గురించి మాట్లాడి ఉండవలసింది. వీళ్లు భాషా సాహిత్యాలకు చేసిన సృజనాత్మక సేవ గురించి మాట్లాడి ఉండవలసింది.

Read Full Post »

- ఎన్. వేణుగోపాల్
జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర- ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిధ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్ర నుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిధ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నటున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకిత్తించారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, ‘చారానా దావత్‌కు బారానా టాంగా’ అన్నట్టు పావలా […]

Read Full Post »

- నందిని సిధారెడ్డి
మరోసారి కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్య చేశారు. ఈ సారి వ్యాఖ్య వరకే ఆగకుండా సాగదీసి నిర్భయంగా సహజ అతివాదానికి పూనుకోవటం మరింత చర్చకు దారితీసింది. నిజాం రాజులు మంచివారని, వాళ్ల పాలన భేషుగ్గా ఉందని సమాధి దగ్గర ప్రస్తుతించటంతో పాటు తర్వాత అదేమాట వెయ్యి సార్లు అంటానని ప్రకటించుకున్నారు. తెరాస ప్రతినిధి ప్రకాశ్ అయితే గ్రామ గ్రామాన నిజాం విగ్రహాలు నెలకొల్పుతాని కూడా పొడిగించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లకోసం కెసిఆర్ అట్లా […]

Read Full Post »

- కె. రామచంద్రమూర్తి
ఉన్నత పదవులలో ఉన్న రాజకీయ నాయకులకు అనేకమంది సలహాదారులు ఉంటారు. నాయకుడు అడిగితే సలహాలు చెప్పేవారు కొందరైతే అయాచితంగా సూచనలు చేసేవారు కొందరు. ఏ సలహాను స్వీకరిస్తారన్న దానిపైన నాయకుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఎంతమంది ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా అంతిమ నిర్ణయం తీసుకోవలసింది నాయకులే.

Read Full Post »

- కట్టా శేఖర్‌రెడ్డి
నిజాం నవాబుల సుదీర్ఘపాలనలో రజాకార్ల ఆగడాలు జరిగింది చాలా తక్కువ కాలమే. ఆ సమయంలో ప్రజలు బాధ పడింది నిజమే. అయితే ఏ దేశంలోనయినా, ఏ సమాజంలో నయినా గత వైభవాన్ని స్మరించుకోవడం సంప్రదాయం. ప్రజలను పీడించిన రాజుల మంచి పనులనూ కీర్తిస్తూనే ఉన్నాం. అదే విధంగా ఈ ప్రాంతానికి మేలు చేసిన నిజాంకు, కాకతీయ రాజులకు సైతం సలాం చేస్తాం. దాంట్లో తప్పే ముంది?… అవును. నిజాంల గురించి ఒకటి కాదు… వెయ్యి […]

Read Full Post »

- అల్లం నారాయణ
నిజామ్‌కు మొక్కుమంటవా !
దొరా !
నీబాంచెన్.
నిజాం ఏడేడు తరాలకు
దండేసి దండం పెట్టమంటవా !
ఆయనకే కాదు. తెలంగాణను పొరుకపోడుచేసిన జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, రెడ్లు, వెలమదొరలకు కూడా సాగిలపడి సలామ్ చెయ్యమంటవా! ఎన్నేండ్లు మొక్కమంటవు. ఎన్నేండ్లు బాంచెగిరి చెయ్యమంటవ్.

Read Full Post »

- తెలంగాణ కవులు, రచయితలు
ఎన్నాళ్లుగానో ఇటు కమ్యూనిస్టులు, అటు భారతీయ జనతాపార్టీ- నిజాం పాలనా కాలాన్ని తప్పుగా చిత్రిస్తూ వస్తున్నాయి. ఇంత కాలానికైనా మంచి చర్చకు కెసిఆర్ తలుపులు తెరిచారు. కెసిఆర్ మాట్లాడిన విషయాల మీద ఎప్పటికైనా చర్చ జరగవలసిందే. ఆయన చెప్పినవి వాస్తవాలే. ఇప్పటికైనా ఆ విషయాలు చర్చకు వచ్చినందుకు సంతోషం. అప్పటి పోరాటాలను స్మరించుకుంటూనే, రజాకార్ల దుర్మార్గాలను విమర్శిస్తూనే, నిజాం రాజు దురాగతాలను ఖండిస్తూనే ఆయన చేసిన మంచిని గుర్తుచేసుకోవడం, స్మరించుకోవడం ఎంత మాత్రము […]

Read Full Post »