జలయజ్ఞం బూటకాలు
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, తెలుగు, వీడియో on జనవరి 26th, 2008
తెలంగాణను తెలుసుకుందాం!
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, తెలుగు, వీడియో on జనవరి 26th, 2008
Posted in 1857 హైదరాబాద్ గాథలు, తెలుగు, తెలంగాణ చరిత్ర, పుస్తకాలు on జనవరి 6th, 2008
1857 తిరుగుబాటులో హైద్రాబాద్ పాత్రను లోకానికి చాటాలన్న కోరికతో, ఆ అమరవీరులను స్మరించుకోవాలన్న ఆశతో, ఈ తరం వారికి ఆ అమరులను పరిచయం చేయాలన్న సంకల్పంతో ఈ కథల పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాను.
1857కు ఈ ఏడు 150 ఏండ్లు నిండాయి. అయినా ఆ పోరాటం ఇంకా కొనసాగుతున్నట్లే అనిపిస్తుంది. నేల తల్లి విముక్తి పోరాటం నుండి అనేకానేక అంతర్గత, బాహ్య నయావలసవాద వ్యతిరేక పోరాటాల వరకు, పోరాట రూపం మారిందేమో గాని ‘సారం’, ”అంతస్సూత్రం” మాత్రం […]
Posted in 1857 హైదరాబాద్ గాథలు, తెలుగు on జనవరి 6th, 2008
అంకితం
1857 హైదరాబాద్ తిరుగుబాటులో అమరులైన వారందరికీ,
త్యాగాలు చేసి శిక్షలు అనుభవించిన వారందరికీ.
నిజానికి ఇవేవీ నా స్వంత కథలు కావు. విషయ సేకరణ కోసం అనేక చరిత్ర గ్రంథాలపై ఆధారపడ్డాను. కొంత కల్పన, కొన్ని సన్నివేశాలు, మరికొన్ని వర్ణనలు లాంటి సృజన మాత్రమే నాది.
Posted in 1857 హైదరాబాద్ గాథలు, తెలుగు on జనవరి 6th, 2008
- ఎన్. వేణుగోపాల్
సరిగ్గా మూడు యాభైలకింద దేశమంతా అట్టుడికిపోయింది. పరాయిపాలన దోపిడీ పీడనలు ఇంకానా, ఇకపై చెల్లవు అని ఈ నేల గర్జించింది. ఉత్తర భారతంలో ప్రధానంగానూ, దేశవ్యాప్తంగా అక్కడక్కడా అన్ని వర్గాల ప్రజలూ ఆ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. తమ మీద, తమ దేశంమీద దౌర్జన్యం సాగిస్తున్న తెల్లవాళ్లపై విరుచుకుపడ్డారు. దాదూ ఫిర్యాదూ లేకుండా వందలాది మంది భారతీయులను ఊచకోతకోసిన తెల్లవాళ్లకు అదే పద్ధతిలో జవాబుచెప్పారు.
Posted in 1857 హైదరాబాద్ గాథలు, తెలుగు on జనవరి 6th, 2008
’అల్లాహో అక్బర్’ గట్టిగా అరిచాడు అమీర్‌ఖాన్.
”ఫిరంగీ హుకూమత్ ముర్దాబాద్” అందుకున్నాడు ఫిదా అలీ.
”ఫైర్’ మిన్నూ మన్నూ ఏకం అయ్యేటట్లు అరిచాడు మేజర్ జనరల్ ఉడ్‌బర్న్.
”ఆగండి. నేను డర్‌పుక్‌ను (పిరికివాణ్ణి) కాను. మై పఠాన్‌గా బేఠాహుఁ. నన్ను ఫిరంగి మూతికి కట్టేయండి. నేనే ఫిరంగికి ఎదురుగా నిలుచుంటాను. నేను మృత్యువును ముఖాముఖంగానే చూడదలచుకున్నాను. ఈ భగావత్ (తిరుగుబాటు)లో పాల్గొని నా జన్మను సార్థకం చేసుకున్నాను. గతంలో నేను చేసిన పాపాలన్నింటినీ ఈ పవిత్ర జిహాద్ ద్వారా శుభ్రపరుచుకున్నాను. నేను […]
Posted in 1857 హైదరాబాద్ గాథలు, తెలుగు on జనవరి 6th, 2008
సయ్యద్ మౌల్వీ అల్లా ఉద్దీన్
మక్కా మస్జీద్ జుమ్మా నమాజులు
1857 జూన్ 13 మధ్యాహ్న సమయం.
జుహర్ నమాజుల కోసం మక్కా మసీదు ప్రాంగణంలో అందరూ సమావేశమవుతున్నారు. కాని అందరి ముఖాలలో ప్రశాంతత కరువైంది. ఆందోళన, భయం అందర్నీ కమ్ముకుని ఉంది. దానికి కారణం మక్కా మసీదు గోడల మీద, తలుపుల మీద అంటించిన పెద్ద పెద్ద చేతిరాతల పోస్టర్లు. తెల్లని కాగితాల మీద ఆకుపచ్చ రంగుల రాతలు.
Posted in 1857 హైదరాబాద్ గాథలు, తెలుగు on జనవరి 6th, 2008
పుట్టినప్పట్నించీ నేను ‘ఢిల్లీ’ నగరం గురించి వింటూనే ఉన్నాను.
నేను చిన్నపిల్లవాడిగా ఉన్నపుడే మా అమ్మ చక్రవర్తి ఔరంగజేబు గురించి చెప్పింది. వాడు మా సిక్కుమతం ‘గురువు’ను చాందినీ చౌక్ ప్రాంతంలో ఎట్లా చిత్రవధ చేసి చంపిందీ తర్వాత కాలంలో అదే స్థలంలో మా వాళ్ళు అతి పెద్ద అందమైన గురుద్వారాను ఎట్లా నిర్మించిందీ ఒక కథగా వినిపించేది. ఆమెకు ఔరంగజేబు పట్ల ఎంత అసహ్యం ఉండేదంటే ఆ పేరును ఉచ్చరించిన ప్రతీసారీ ‘థూ’ అని ఉమ్మివేసేది. నేను […]