Posted in తెలంగాణ ప్రజలు, ఆంధ్రజ్యోతి, తెలుగు on ఫిబ్రవరి 27th, 2008
2008, ఫిబ్రవరి 15న రామగుండం ఓపెన్ కాస్టు-3 బొగ్గు గని విస్తరణలో భాగంగా మంగళపల్లి - పెద్దంపేట గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ సభలో ప్రభుత్వ పర్యావరణ శాస్త్రవేత్తలతోపాటు కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్, సంబంధిత సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read Full Post »
Posted in ఆంధ్రజ్యోతి, తెలుగు on ఫిబ్రవరి 26th, 2008
- చుక్కా రామయ్య
కాలంతో పాటుగా వస్తోన్న అనేక రకాల కొత్త చదువులను తెలంగాణ యువత అందుకోలేకపోవడానికి కారణమేమిటి? దారిద్య్రం. తెలంగాణ వెనుకబాటుతనానికి, లేదా వెనుకబడేసిన సందర్భానికి కారణం ఆ ప్రాంతంలో తాండవిస్తున్న పేదరికాన్ని నామరూపాలు లేకుండా చేయలేకపోవడమే. నవాబులు, దొరల ఆధిపత్యం కింద శతాబ్దాలుగా నలిగిపోయిన తెలంగాణుల దుస్థితి ‘పోలీసు చర్య’ అనంతరం కూడా తొలగిపోలేదు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రలో విలీనం చేస్తూ సంతకం చేసిన ఐదు దశాబ్దాల తరువాత కూడా […]
Read Full Post »
Posted in తెలంగాణ సినిమా, తెలుగు on ఫిబ్రవరి 24th, 2008
- వెంకట్
వ్యాపార రంగానికి దూరంగా సామాజికతకు, సమ్స్యలకు అద్దంపడుతూ మానవ జీవన చిత్రాలను విలక్షణంగా ఆవిష్కరించిన 84 లఘు మరియు డాక్యుమెంటరీ సినిమాలతో కూడిన ద్వితీయ జాతీయ చిత్రోత్సవం మహానగరాలకు దూరంగా కరీంనగర్ లో నిర్వహించబడి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది, ఆలోచింపజేసింది. జాతీయవేడుకగా నిర్వహించిన ఈ చిత్రోత్సవం కొత్త దర్శకులకు వేదికగా కూడా నిలిచింది.
Read Full Post »
Posted in సభలు సమావేశాలు, English, వీడియో, వార్తల్లో on ఫిబ్రవరి 23rd, 2008
‘Discover Telangana’ in association with ‘Musi-TV’ was successfully able to broadcast live, the launch of the seminar by Telangana Vidyavantula Vedika (TVV) on ‘Telangana Demand – Problems & Prospects’. The event was attended & made successful by several Telangana NRIs. The event started at 11:30pm EST on 22nd February 2008, concluded around 01:00am EST.
Read Full Post »
Posted in Print PDFs, తెలుగు, వ్యాసాలు on ఫిబ్రవరి 20th, 2008
- ఎం. కోదండరాం, కె. సీతారామారావు
వ్యవసాయం ప్రధాన జీవికగా ఉన్న దేశాలలో భూసంబంధాలే సమాజ పరిస్థితిని, రాజకీయ ఉద్యమాల స్థితిగతులను నిర్ణయిస్తాయి. తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోకతప్పదు.
బ్రిటిష్ పాలనకు వెలుపల వున్న తెలంగాణ చరిత్రక్రమాన్ని 1956దాకా ఇక్కడి ప్రజలే నిర్ణయించుకున్నా 1956 నుండి కోస్తాంధ్ర పాలక వర్గాలు శాసిస్తున్నాయి, నిర్ధేశిస్తున్నాయి.
Read Full Post »
Posted in G.Os, తెలుగు, వ్యాసాలు on ఫిబ్రవరి 20th, 2008
1956లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల విలీనం బేషరతు విలీనం కాదు. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాలలో అత్యంత ప్రధానమైనది ముల్కీ రూల్సు కొనసాగింపు. 1956 నుండి 1975 దాకా అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచరణలో విఫలమైనా అధికారికంగా ముల్కీ రూల్సు అమలులో ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలలో, కళాశాలల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ముల్కీ సర్టిఫికేట్లు సమర్పించవలసి వచ్చేది. అయితే సమైక్యరాష్ట్రంలో ముల్కీ రూల్సు యధేచ్చగా ఉల్లంఘించబడినాయి. […]
Read Full Post »
Posted in ఈనాడు, తెలుగు on ఫిబ్రవరి 19th, 2008
హైదరాబాద్, న్యూస్‌టుడే: మంగళవారం.. సమయం ఉదయం 11.30. శాసనసభ ఆవరణలో ఒక్కసారిగా కలకలం. పోలీసులు, మీడియా అందరూ కలకలం వినిపిస్తున్నవైపు పరుగులు. ఒకపక్క అసెంబ్లీ సందర్శకులు, మరోవైపు పాత్రికేయులు, ఇంకోవైపు పోలీసులు.. ఏం జరుగుతోందో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. తెలంగాణ విద్యార్థి సంఘం, తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్యలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించి నినాదాలు చేసినప్పుడు తొలుత నెలకొన్న పరిస్థితి ఇది.
Read Full Post »
Posted in కౌంటర్, ఆంధ్రజ్యోతి, తెలుగు on ఫిబ్రవరి 17th, 2008
-కట్టా శేఖర్‌రెడ్డి
ఇప్పటికిప్పుడు తెలంగాణపై అవుననో కాదనో చెప్పే అవకాశం ఏమాత్రం లేదు. ఇది తీవ్ర సమస్య. చత్తీస్‌ఘడ్ లాంటి చిన్న రాష్ట్రాల్లో తీవ్రవాదుల కద లికలు ఎక్కువై పరిస్థితి దారుణంగా తయారయింది. రాష్ట్రంలో కూడా నక్సలైట్లు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నందున ఉగ్రవాద సమస్య మరింత పెరిగే అవ కాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి…కాశ్మీర్ సమస్యపై పాక్‌తో భారత్ ఓ వైపు పోరాడుతూనే మరోవైపు ఇతర విషయాలపై చర్చలూ జరుపుతోంది. అలాగే మనమూ వ్యవహరిద్దాం.
-ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి
[…]
Read Full Post »
లెక్కల్లో హైదరాబాద్ ఎవరికి దక్కేను? వ్యాసానికి సి. శ్రీనివాస్ జవాబు
నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగర నిర్మాణ పునాది నుంచి అణువణువునా తెలంగాణ ప్రజలతోపాటు కోస్తా, రాయలసీమ ప్రజల కష్టం కలగలిసి ఉంది. ఎవరో ఏదో చెప్పారనో లేదా కేవలం కొన్ని ప్రాంతాల నాయకులు హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో న డిపారనో దాని మీద కోస్తా, రాయలసీమవాసులకు హక్కుందని అంటున్నారన డం అర్థరహితం. గోల్కొండ కోట కట్టించింది నిడదవోలు వీర భద్రుడి బంధువులు ఆంధ్రనగరి పాలకులైన కాకతీయులైతే […]
Read Full Post »
Posted in తెలంగాణ ప్రాజెక్టుల, సంపాదకీయం, తెలుగు on ఫిబ్రవరి 13th, 2008
- టి. శివాజీరావు
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వ్యవసాయం, విద్యుదుత్పత్తి, త్రాగునీరు, పారిశ్రామికాభివృద్ధే పోలవరం ప్రాజె క్టు ముఖ్యోద్దేశమని గత అరవై ఏళ్ళుగా ప్రభుత్వం చబుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు ను బ్యారేజిగా నిర్మించి దాదాపు 100 శతకోటి ఘనపుటడుగుల గోదావరి నీటిని కృష్ణానదిలోకి విజయవాడ వద్ద కలిసేటట్లు చేయవచ్చని ప్రఖ్యాత ఇంజనీర్లు ఎఎన్ ఖోస్లా 1953లోను, గుల్హటి 1963లోను కేంద్ర ప్రభుత్వానికి […]
Read Full Post »
Posted in తెలంగాణ సినిమా, తెలుగు, వీడియో on ఫిబ్రవరి 13th, 2008
- వరాల ఆనంద్
కరీంనగర్ ఫిలిం సొసయిటీ (KAFISO) ఆధ్వర్యంల ఫిబ్రవరి 13 న “2nd National Short & Documentary Film Festival” కరీంనగర్ ఫిలిం భవన్‌ల మొదలయింది. ఫిలిం మేకర్ బి.నరసింగరావు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింరు. ఈ చిత్రోత్సవాలు ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతది.
Read Full Post »
Posted in హైదరాబాద్ ఎవరిది?, ఆంధ్రజ్యోతి, తెలుగు on ఫిబ్రవరి 12th, 2008
- సి. విఠల్, శ్రీధరరావు దేశ్‌పాండే
అసమ అభివృద్ధికి సంబంధించిన అసంతృప్తులు దేశంలోని అనే క ప్రాంతాలలో స్వాతంత్య్రసిద్ధి నాటినుంచి ఉన్నప్పటికీ ప్రత్యే క రాష్ట్రం కోసం తొలినుంచి డిమాండ్ చేసిన గడ్డ బహుశా తెలంగాణ ఒక్కటేనేమో? ప్రత్యేక తెలంగాణ ఆరాటంలో ముల్కీ ఉద్య మం (1952) తొలి దశ కాగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం (1969) మలి దశ. వర్తమాన తెలంగాణ ఉద్యమం (ఇది తుది, ఫలప్రదమైన దశ అవగలదని ఆశిద్దాం) 1990ల నుంచి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ […]
Read Full Post »
- కట్టా శేఖర్ రెడ్డి
ఇప్పుడు తెలంగాణను తెచ్చుకున్నా అది దొరలపాలవుతుంది. బడుగులకు రాజ్యాధికారం దక్కదు. వై.ఎస్. నేతృత్వంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరిగాక ప్రత్యే క రాష్ట్ర అంశం తెరపైకి రావాలి. ప్రస్తుత తరుణంలో ప్రత్యేక రాష్ట్రం కంటే అభి వృద్ధే ముఖ్యం.
-తెలంగాణ డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీలు
‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయితే కోస్తాంధ్రుల పెత్తనం ఎక్కువయి పోతుంది. వారితో నెగ్గలేం. మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు. మద్రాసు రాష్ట్రం లోనే కొనసాగుతాం’- ఇది అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్య మానికి […]
Read Full Post »
Posted in వివిధ, తెలుగు, కళాకారులు on ఫిబ్రవరి 8th, 2008
అతడిది జిల్లా వరంగల్లు, మండలం మద్దూరు, ఊరు రేబర్తి.
అంటరానింటిలో అంటరానివానిగానే పుట్టాడు.
పాడితే కంఠనాళం తెగి పడాలి. పల్లవితో అంటుకునే అగ్ని కావాలి. అంతిమ చరణం శ్రోతల్లో బడబాగ్ని పుట్టించాలి. తాను జన్మించిన నేల, తన ప్రజలు, తన సాహిత్య కళారంగం పట్ల తనదైన బాధ్యత ఉందని నమ్మే కవి అందెశ్రీ
Read Full Post »