Feed on
Posts
Comments

- కట్టా శేఖర్‌ రెడ్డి

చరిత్ర పునరావృతం (Cartoon: Shekhar)ఇప్పుడు తెలంగాణను తెచ్చుకున్నా అది దొరలపాలవుతుంది. బడుగులకు రాజ్యాధికారం దక్కదు. వై.ఎస్‌. నేతృత్వంలో పూర్తిస్థాయి అభివృద్ధి జరిగాక ప్రత్యే క రాష్ట్ర అంశం తెరపైకి రావాలి. ప్రస్తుత తరుణంలో ప్రత్యేక రాష్ట్రం కంటే అభి వృద్ధే ముఖ్యం.

-తెలంగాణ డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీలు

‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయితే కోస్తాంధ్రుల పెత్తనం ఎక్కువయి పోతుంది. వారితో నెగ్గలేం. మాకు ప్రత్యేక రాష్ట్రం వద్దు. మద్రాసు రాష్ట్రం లోనే కొనసాగుతాం’- ఇది అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్య మానికి వ్యతిరేకంగా రాయలసీమ నాయకులు చేసిన వాదన. మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా రాయలసీమ నాయకులను ప్రోత్సహించారు. తన మంత్రివర్గంలో కూడా రాయల సీమ వారికి స్థానం కల్పించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకో సం కోస్తానాయకులు మద్రాసు అసెంబ్లీలో తీర్మానం చేయడానికి రాయలసీమ నాయకులు సహకరించలేదు.

కోస్తాంధ్ర నాయకుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంపై విభేదాలు ఉండేవి. కొందరు జస్టిస్‌ పార్టీ నాయకులు, జమీందార్లు సైతం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకిం చారు. కాంగ్రెస్‌ నాయకుల్లో కూడా స్వాతంత్య్రోద్యమ మా? ఆంధ్ర రాష్ట్ర ఉద్యమమా? ఏది ముందు? అన్న అంశంపై వివాదాలు నడిచా యి. ఆ తరుణంలోనే ఆంధ్ర రాష్ట్ర నాయకుల మధ్య కలహాలు చూసి, కలత చెంది కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆగ్రహంతో ఒక పద్యం రాశారు. అదేమంటే: అరవల మూతినాకి, అహహాయని తోకలు త్రిప్పి, నేలపై దొరలుచు, వీలుచూచుకొని దూరుచు చీకటి సందుగొందులన్‌ దిరిగెడు గ్రామ సింహముల తీరున నాయకులుండ, తెల్గుసో దరుల యదృష్టమందు గలదా అభివృద్ధియు రాష్ట్ర సిద్దియున్‌ తెలుగుసీమలో ఆరు దశాబ్దాల తర్వాత చరిత్ర పునరావృత్తమవుతోంది. అవే వాద నలు. అవే దృశ్యాలు.

అటువంటి పాత్రలే. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. అప్పుడు రాజాజీ. ఇప్పుడు రాజశేఖర్‌రెడ్డి. అప్పుడు రాయలసీమ నేతలు. ఇప్పుడు తెలంగాణ జూనియర్లు. అప్పుడు మద్రాసుపై వివా దం, ఇప్పుడు హైదరాబాద్‌పై వివాదం. ‘మద్రాసు శాసనసభలో ఆంధ్ర, కన్నడ, కేర ళ ప్రతినిధులందరినీ కలిపినా కూడా వారికంటే తమిళ ప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు. తమిళ యాజమాన్యము కింద నడుస్తున్న మద్రాసు ప్రభుత్వంలో ఆంధ్రుల వ్యక్తిత్వం, ఆత్మగౌరవం పోయినవి. ఆంధ్రుల చరిత్ర రెండు వందల సంవత్సరముల నుండి మరచిపోబడినది…మద్రాసు నగరంలో తమిళుల సంఖ్య క్రమేణ హెచ్చి తమి ళ నగరమైనది. రాష్ట్ర ప్రభుత్వం కింద తమిళులే అన్ని సౌకర్యములు అనుభవించు చుండగా ఆంధ్రులు అన్ని రంగములలోనూ, అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారు.

తమిళ లాయర్లు, తమిళ ఇంజనీర్లు ఆంధ్ర దేశమునుండి విశేషముగా ధనమును గొని పోవుచున్నారు…’ అని ఆంధ్రులు ఆవేదన చెందినట్టు అయ్యదేవర కాళేశ్వరరావు ‘నవ్యాంధ్రము- నా జీవిత కథ(పేజీ 216-217)’ అనే గ్రంథంలో రాశారు. ఇప్పుడు ఇవే అంశాలను తెలంగాణ నాయకులు చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవ తరణకు రాజాజీయే ప్రధాన అడ్డంకిగా నాడు ఆంధ్ర ఉద్యమ నాయకులు భావించా రు. రాజాజీకి వ్యతిరేకంగా పాటలు కట్టి పాడారు. నినాదాలు చేశారు. ఇప్పుడు తెలంగాణ నాయకులూ అదే బాణీలో రాజశేఖర్‌రెడ్డిపై విరుచుకుపడుతు న్నారు.

అప్పుడు కూడా కేంద్రం వద్ద రాజాజీయే శక్తిమంతుడు. నెహ్రూకు ఆయన ఎంత చెబి తే అంత. ఇప్పుడు కేంద్రంలో రాజశేఖర్‌రెడ్డి బలమూ అటువంటిదే. జవహర్‌లాల్‌, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, పట్టాభిలతో ఏర్పాటైన కాంగ్రెస్‌ కమి టీ చివరకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చే స్తూ, మద్రాసు నగరంపై మాత్రం ఆంధ్రులు తమ హక్కు ను వదులుకోవాలని సిఫారసు చేసింది. మద్రాసును వదు లుకోవాలన్న సిఫారసుపై ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి, తెన్నేటి విశ్వనాథం ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్రాసును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పట్టాభి సూచించారు. అందుకు ఆంధ్ర నాయకులూ ఒప్పుకోలేదు. తమిళ నాయకులయితే ఆగ్రహోదగ్రులయ్యారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత సొంత రాజధాని ఏర్పాటు చేసుకు నే వరకు ఐదేళ్లపాటు మద్రాసు నుంచే పరిపాలన సాగించు కునేందుకు అవకాశం ఇస్తే సరిపోతుందని మధ్యే మార్గం గా కొందరు కాంగ్రెస్‌ పెద్దలు ప్రతిపాదించారు. రాజాజీ అందుకూ ఒప్పుకోలే దు. అల్లర్లు చెలరేగగలవని బెదిరించారు. చివరకు కర్నూలుకు వెళ్లారు. ఇప్పుడు తెలంగాణపైన, హైదరాబాద్‌పైన వివాదమూ అటువంటిదే. కాక పోతే అప్పటికీ ఇప్పటికీ బాధితులు మారారు.

(11 ఫిబ్రవరి 2008 ఆంధ్రజ్యోతి సౌజన్యం)

One Response to “చరిత్ర పునరావృతం”

  1. 1
    A Venkatesh Says:

    అద్ద్ల్ల్ చ

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com