లెక్కల్లో హైదరాబాద్ ఎవరికి దక్కేను?
ఫిబ్రవరి 12th, 2008 by డిస్కవర్ తెలంగాణ
- సి. విఠల్, శ్రీధరరావు దేశ్‌పాండే
అసమ అభివృద్ధికి సంబంధించిన అసంతృప్తులు దేశంలోని అనే క ప్రాంతాలలో స్వాతంత్య్రసిద్ధి నాటినుంచి ఉన్నప్పటికీ ప్రత్యే క రాష్ట్రం కోసం తొలినుంచి డిమాండ్ చేసిన గడ్డ బహుశా తెలంగాణ ఒక్కటేనేమో? ప్రత్యేక తెలంగాణ ఆరాటంలో ముల్కీ ఉద్య మం (1952) తొలి దశ కాగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం (1969) మలి దశ. వర్తమాన తెలంగాణ ఉద్యమం (ఇది తుది, ఫలప్రదమైన దశ అవగలదని ఆశిద్దాం) 1990ల నుంచి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యమవుతోన్న ప్రస్తుత తరుణంలోతెలంగాణ ఉద్యమాన్ని బలహీ నపరిచేందుకు కోస్తా వలసవాదులు, పాలక వర్గాలు తమ దళారులచే ఒక సంఘాన్ని పుట్టించి ఒక వింత డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని లేదా రంగారెడ్డి జిల్లాతో కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఆ డిమాం డ్! ఈ డిమాండ్‌కు ప్రాతిపదిక ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 60 శాతంకు పైగా రాబడిని హైదరాబాద్ నగరమే సమకూర్చడమే. అయి నంతమాత్రాన హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా కాకుండా ప్రత్యేకంగా ఉంచాలనడం సమంజసమేనా? మూడు అంశాలను నిశి తంగా పరిశీలిస్తే వాస్తవాలు నిగ్గు తేలుతాయి. అసలు హైదరాబాద్ ఎవరిది? ఇది మొదటి అంశం. 16వ శతాబ్ది ఉత్తరార్ధంలో కుతుబ్‌షాహిలచే ఊపిరి పోసుకొని అసఫ్ జాహిల ఏలుబ డిలో పెరిగి, వలసపాలన నుంచి భారత్ విముక్తమయ్యేనాటికి దేశంలో నే 5వ పెద్ద నగరంగా ఆవిర్భవించిన హైదరాబాద్ వైభవాల నిర్మాణాని కి స్వేదాన్ని, రుధిరాన్ని ధారవోసిన వారు తెలంగాణ ప్రజలే.
ఈ మహా నగరంతో చారిత్రికంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా ఆంగిక (ఆర్గానిక్) సంబంధం కల్గిన ప్రాంతం తెలంగాణ మాత్రమే. తెలంగా ణకు రాజధానిగా,మేధా సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లిన హైదరాబా ద్, కేవలం ఐదు దశాబ్దాలుగా అక్కడ అడ్డా బిఠాయించిన వలసవాదు ల ఆధిపత్యంలో, విశిష్ఠ చరిత్ర సమసిపోతుందా? ఇక రెండో అంశం- ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో హెచ్చు రాబడిని హైదరాబాద్ సమకూరు స్తుందన్న వాదన. ఇది వాస్తవమే. అయితే హైదరాబాద్ నగరానికే పరి మితమైన వాస్తవం కాదు. ఏ రాష్ట్రానికైనా రాజధాని నగరం నుంచే అత్యధిక ఆదాయం సమకూరడం సహజం. ఏమంటే అన్ని రకాల వ్యాపార సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు రాజ ధానిలోనే నెలకొనివుంటాయి.
ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ వలెనే తమి ళనాడుకు చెన్నై, పశ్చిమ బెంగాల్‌కు కోల్‌కొతా, గుజరాత్‌కు అహ్మదా బాద్ అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఈ వాస్తవం ఇతర రాష్ట్రాల రాజధాని నగరాలకు కూడా వర్తిస్తుంది. 1956కు పూర్వమే గుజరాతీలు, మార్వారీలు, మహారాష్ట్రులు, కన్నడులు, తమిళులు, పంజాబీలు, మళయాళీలు మొదలైనవారు హైదారాబాద్‌లో తమ వ్యాపారాలను ప్రారంభించారు. ఆవ్యాపారాలు ఇప్పటికీ కొనసాగుతు న్నాయి. కోఠీ, బేగం బజార్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలు హోల్ సేల్ మార్కెట్లుగా ఉత్తర, దక్షిణ భారతాలలో పేరు పొందాయి. సమైక్య రాష్ట్రం ఏర్పడి ఆంధ్రులు తరలివచ్చిన తరువాత కూడా ఇదే పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే కాదు అలనాటి నైజాం సంస్థానానికి కూడా హైదరాబాద్ నగరమే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చింది. మరి తాము రావడం ప్రారంభమైన తరువాతనే హైదరాబాద్ ఇంతగా అభి వృద్ధి చెందిందని కోస్తాంధ్ర ప్రాంతం వారు వాదించడం సబబేనా? రాజ ధాని నగరాలు రాష్ట్ర ఖజానాలకు గణనీయమైన ఆదాయాన్ని సమకూ ర్చడం సహజం. దీన్నొక చర్చనీయాంశంచేసి హైదరాబాద్‌ను తెలం గాణ ప్రజలకు కాకుండా చేయడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? ఇక మూడో అంశం (ముఖ్యమైన అంశం కూడా) తెలంగాణ ఆదా యం ఎంత? ఆంధ్రప్రదేశ్ ఖజానాకు మొదటి నుంచీ తెలంగాణ ప్రాంత మే అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నదని మేము నిస్సంకోచంగా చెప్పగలము.
పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఆర్థిక పరిపుష్ఠి కలిగి ఉన్నరాష్ట్రమన్న వాస్తవాన్ని ఫజల్ అలీ కమిషన్ కూడా రికార్డు చేసింది. ఆంధ్ర, తెలంగాణలను విలీనం చేయడం వల్ల తమ స్థిరాదాయవనరులను ఆంధ్రతో పంచుకోవల్సి వస్తుందని, ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఆ డబ్బును ఆంధ్ర అభివృద్ధికే ఖర్చు పెట్ట వచ్చనే భయం తెలంగాణ ప్రజలు, నాయకుల లో ఉందని కూడా ఫజల్ అలీ కమిషన్ పేర్కొంది. ఆ భయాలు నిరాధా రం కావని ఆంధ్రప్రదేశ్ తొలిదినాల చరిత్రే రుజువు చేసింది. తెలంగాణ మిగులు నిధులను తెలంగాణ అభివృద్ధికే వినియోగిస్తామన్న హామీ హామీగానే ఉండిపోయింది. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ లో ఇచ్చిన ఆ హామీని అమలుపరచాలని ‘తెలంగాణ ప్రాంతీయ కమిటీ’ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.
1969లో వేర్పాటు ఉద్యమం ప్రజ్వరిల్లిన తరువాతనే 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు తెలంగాణకు చెందవల్సిన మిగులు నిధుల మొత్తాన్ని తేల్చడాని కి ఆడిటర్ జనరల్ కె. లలిత్‌ను నియమించారు. లలిత్ నివేదిక ఆ 12 సంవత్సరాల రాబడి వ్యయాలను క్రోడీకరించింది. ఆ ద్వాదశ వత్సరాల లో ఆంధ్రప్రదేశ్ రాబడి 1233.45 కోట్ల రూపాయలు కాగా తెలంగాణ వాటా 514.46 కోట్లు (41.7 శాతం). వ్యయాన్నిచూస్తే రాష్ట్రం మొత్తా నికి 1223.01 కోట్లు కాగా తెలంగాణ వంతు 450.53 కోట్లు (36.8 శాతం). దీన్ని బట్టి 63.93 కోట్ల రూపాయల తెలంగాణ మిగులు నిధు లు ఆంధ్రప్రాంతాభివృద్ధికి వినియోగింపబడి వుంటాయని అర్థమవడం లేదా? విలీనమయ్యేనాటికి ఆంధ్రరాష్ట్ర బడ్జెట్ లోటు 53.49 కోట్లు అని లలిత్ నివేదిక పేర్కొంది.
ఈ లోటును తెలంగాణ మిగులుతో సర్దు బాటు చేసినా తెలంగాణకు ఇంకా రెవెన్యూ మిగులు 10-44 కోట్లుగా ఉంటుంది. ఈ రెవెన్యూ మిగులును కూడా తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయకుండా ప్రభుత్వ పెట్టుబడి పద్దుకు తరలించారని ప్రముఖ ఆర్థికవేత్త సిహెచ్. హనుమంతరావు విశ్లేషించారు. ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి ఆ 12 సంవత్సరాలకు గాను వచ్చిన ఆదాయాన్ని కూడా కలు పుకుంటే తెలంగాణ మిగులు మొత్తం 85.83 కోట్లకు పెరుగుతుందని హనుమంతరావు పేర్కొన్నారు. మరి ఈ మిగులు అంతా ఆంధ్రకు తర లివెళ్ళినందున ఆ సొమ్మును ఆంధ్రకు అందించిన రుణంగా భావించి సాలీనా 6 శాతం చక్రవడ్డీని లెక్కిస్తే 31. 62 కోట్లు అవుతుందని, దీంతో తెలంగాణ మొత్తం మిగులు 85.83 + 31.62 = 117.42 కోట్ల రూపా యలకు పెరుగుతుందని హనుమంతరావు విశ్లేషించారు.
సరే, లలిత్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? బుట్ట దాఖలు చేయడమే! కాలక్రమేణా తెలంగాణ ఆదాయ వ్యయాల ను విడిగా చూపే సంప్రదాయం రద్దయింది. ఆరు సూత్రాల పథకంలో భాగంగా ప్రాంతీయ కమిటీ రద్దయింది. నామమాత్రంగా ఉన్న ప్రాంతీ య అభివృద్ధి బోర్డును ఎన్‌టిఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక అప్పటి నుంచి తిరిగి వర్తమాన తెలంగాణ ఉద్యమం తలెత్తేవరకు పాలకులను అడిగే నాథుడు లేడు. తెలంగాణ నిధులను కోస్తా అభివృద్ధికే ఖర్చు పెడుతున్నారని మేధావులు విశ్లేషించడం మొదలుపెట్టినారు. హైదరా బాద్‌తో సహా తెలంగాణ ఆదాయం రాష్ట్ర ఆదాయంలో 60 శాతంకు పైగానే ఉంటుందని. తెలంగాణ వ్యయం మాత్రం 50 శాతంగా ఉంటుందని గణాంకాలతో నిర్దారించారు.
శాసనసభ గత సమావేశాల్లో చాడ వెంకటరెడ్డి (సిపి ఐ) అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థిక మంత్రి రో శయ్య సమాధానమిస్తూ వెల్లడించిన వివరాలు: 2006-07 ఆర్థిక సంవత్సరం లో రాష్ట్ర ప్రభుత్వపు ఆదాయం 25069 కోట్ల రూపాయలు. ఇందులో ఆంధ్ర నుంచి 3690 (14.71 శాతం), రాయలసీమ నుంచి 987 కోట్లు (3.90 శాతం), తెలంగాణ నుంచి 6093 కోట్లు (24.3 శాతం), హైద రాబాద్ నుంచి 9319 కోట్లు (37.17 శాతం) కేంద్ర ప్రభుత్వం నుంచి 4930 (19.86 శాతం) కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వ్యయాల విషయానికొస్తే ఆంధ్రలో 3489 (26.75 శాతం) , రాయలసీ మలో 2881 ( 22.09 శాతం), తెలంగాణలో 5987 (45.92 శాతం) రాజధానిలో 682 (5.23 శాతం) కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
మొత్తం వ్యయం 13039 కోట్లు. వ్యయాలను పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? తెలంగాణ మిగులు ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికే మళ్ళిస్తున్నారనే కాదా? ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే సహజంగానే కొన్ని సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఆంధ్ర ప్రాంతపు నగరా లు, పట్టణాలకు తరలిస్తాయి. హైదరాబాద్ ఆదాయాన్ని ప్రాంతాలవారీ గా విభజిస్తే తెలంగాణ వాటా 42 శాతం అనగా 3914 కోట్ల రూపా యలు దక్కుతుంది. కేం ద్రప్రభుత్వం ద్వారా అందే ఆదాయంలో తెలం గాణ వాటా 42 శాతం అంటే 2100 కోట్లు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయానికి దీన్ని కలిపితే తెలంగాణ మొత్తం ఆదాయం 6093+ 3914+2100 = 12107 కోట్ల రూపాయలు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆదాయంలో 48.29 శాతం. మరి ఈ ఆదాయాన్నంతా పూర్తిగా తెలం గాణకే ఖర్చు చేస్తే అచిరకాలంలోనే ఆ గడ్డ యావద్భారతంలోనే సంప న్న రాష్ట్రం కాదా?
(12 ఫిబ్రవరి 2008 ఆంధ్రజ్యోతి సౌజన్యం)






ఆగస్టు 6th, 2008 at 3:53 am
మస్తు చెప్పినవన్న…..వెధవల్కి బుద్ది రావాలె ….ఇది సదివి……