కరీంనగర్ చిత్రోత్సవాలు ప్రారంభం
ఫిబ్రవరి 13th, 2008 by డిస్కవర్ తెలంగాణ
- వరాల ఆనంద్
కరీంనగర్ ఫిలిం సొసయిటీ (KAFISO) ఆధ్వర్యంల ఫిబ్రవరి 13 న “2nd National Short & Documentary Film Festival” కరీంనగర్ ఫిలిం భవన్‌ల మొదలయింది. ఫిలిం మేకర్ బి.నరసింగరావు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింరు. ఈ చిత్రోత్సవాలు ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతది.
చిత్రోత్సవంలో రెండవ రోజు
కరీంనగర్ గురువారం ఎస్.ఆర్.ఆర్ కాలేజిల జరిగిన కార్యక్రమంల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ కుమార్ విధ్యర్థులను ఉద్దెశించి మాట్లాడారు. టీవీ, సినీమాలల్ల తెలంగాణ విధ్యార్థులు కృషి చేయాలన్నారు. వారాల ఆనంద్ మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజి తోటి సినిమాలు తీయడం సులభం అన్నారు. సభలో ప్రభాకర్ ముజఫ్ఫర్ పాల్గొన్నారు విధ్యార్థులు డాక్యుమెంటరీలకు బాగా స్పందించారు.

సాయంత్రం ఫిలిం భవన్ల జరిగిన సభలో టీవీ దర్శకులు పీ.వీ రామ్మొహన్ నాయుడు, డైరెక్టర్ లతామొహన్, రాజు, చిలివేరి కిషొర్ లు మాట్లాడారు అనంతరం పచ్చబొట్టు, విముక్తి, థలైవా మొదలైన… సినిమాలు ప్రదర్శించారు.
కాకతీయ ఫిలిం సొసయిటీ గురించి విడియో
మరిన్ని వివరాలకు కాకతీయ ఫిలిం సొసయిటీ వెబ్‌సైట్‌ను చూడంరి.
మిగిలిన కరీంనగర్ చిత్రోత్సవాల ఫొటోలు ఇక్కడ చూడంరి





