Feed on
Posts
Comments

- టి. శివాజీరావు

Satellite picture of Polavaram site: Courtesy WikiMapia.Orgరాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వ్యవసాయం, విద్యుదుత్పత్తి, త్రాగునీరు, పారిశ్రామికాభివృద్ధే పోలవరం ప్రాజె క్టు ముఖ్యోద్దేశమని గత అరవై ఏళ్ళుగా ప్రభుత్వం చబుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు ను బ్యారేజిగా నిర్మించి దాదాపు 100 శతకోటి ఘనపుటడుగుల గోదావరి నీటిని కృష్ణానదిలోకి విజయవాడ వద్ద కలిసేటట్లు చేయవచ్చని ప్రఖ్యాత ఇంజనీర్లు ఎఎన్‌ ఖోస్లా 1953లోను, గుల్హటి 1963లోను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అలాగే పోలవరం బ్యారేజికి తగినంత నీరు సంవత్సరం పోడవునా సరఫరా చేసేందుకు గోదావరి ఎగువ ప్రాంతంలో దాని ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహి తలపై భారీ జలాశయాలు, జలవిద్యుత్‌ కేంద్రాలు నిర్మించాలని చెప్పారు.

నిపు ణుల సిఫారసులను పెడచెవిన పెట్టి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నివేదికను 1970లో తయారుచేసి, మళ్ళీ దాని స్వరూపాన్ని 1978లో మార్చింది. ఒరిస్సాలోని మోటు,ఛత్తీస్‌ఘడ్‌లోని కొంటా తాలూకాలలోని గిరిజన గ్రామాలు విపరీతమైన ముంపుకు గురయ్యే ప్రమాదమున్నందున వరదనీటి మట్టం 150 అడుగులకు మించరాదని బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఆ రాష్ట్రాలు షరతులు పెట్టాయి. ఆ మేరకు కేంద్ర జలవనరుల సంఘం 1979లో ఆయా రాష్ట్రాలకు తగు సూచనలతో లేఖ రాయడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం పోలవరం వరద తూముల సామర్ధ్యం 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహానికి మాత్రమే పరిమితమై నిర్మించాలని, ప్రాజెక్టు ఎత్తు సముద్ర మట్టానికి 150 అడుగుల స్థాయి వరకు ఉండాలన్న షరతులతో కూడుకున్నది.

దురదృష్టవశాత్తు 1986 ఆగస్టునెలలో దాదాపు 36 లక్షల క్యూసెక్కుల స్థాయి లో వరద వచ్చింది. ఈ వరదను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 500 సంవత్సరాలకొక్క సారి వచ్చే వరదగా పరిగణించి 2005లో ఈ అంచనాలననుసరించి ముంపు కు గురయ్యే స్థలాలను, గ్రామాలను, అడవులను గుర్తించడమే కాకుండా దానికి తగ్గ ట్టు నిర్వాసితుల పునరావాస పథకాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమ తిని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతిని పొందింది. అంతే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ముంపుకు గురవుతున్న ప్రాంతాల విషయమై ఆయా రాష్ట్రాల తో సంప్రదించి, అనుమతులు పొందకుండానే ప్రాజెక్టు కాలువ నిర్మాణాన్ని బచా వత్‌ ట్రిబ్యునల్‌ తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టి వేగవంతం చేస్తోంది.

బచావత్‌ వడంబడికలో ఉన్న గరిష్ట వరదస్థాయిని 36 లక్షల నుంచి 2006లో ఎగువ రాష్ట్రా ల అనుమతి లేకుండానే దాదాపు 50 లక్షల స్థాయికి పెంచుతూ పోలవరం ప్రాజె క్టునిర్మాణానికి తదనుగుణమైన మార్పుల్ని చేయమని కేంద్ర జలసంఘాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. దీంతో ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలు ముంపు విషయంలోనూ, గరిష్ట వరద స్థాయిని పెంచడంలోనూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోతోందని సుప్రీంకోర్టులో దావావేశాయి. దీనికి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం వరద పెరగడం వల్ల ముంపు ప్రాంతాలు పెరిగినప్పటికీ నష్టపరిహారా న్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నామనీ, వరద నష్టాన్ని నివారించడానికి గోదావరి దాని ఉపనదుల గట్టులకు ఇరువైపులా పటిష్టమైన కరకట్ట గోడలను ఎంత ఖర్చ యినా నిర్మిస్తామనీ వాదిస్తోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు తరువాత 1985 నుండి ప్రాజెక్టుల రూపకల్పనలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక మార్పులు వచ్చాయి.

అంతర్జాతీయ భారీ జలాశయాల సంఘ అధ్యక్షులుగా ఉన్న ఫ్రాన్సు, స్పెయిన్‌ దేశాల నిపుణు లైన లెంపరరీ మరియు బెర్గ్‌ల పరిశోధనల ప్రకారం గరిష్ట వరదను బేరీజు వేసేట ప్పుడు చారిత్రికంగా సంభవించే వరదలకంటే రెండు లేక మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో అంచనాలుండాలన్నారు. దాని ప్రకారం పోలవరం ప్రాజెక్టు రూపకల్ప నలో గరిష్ట వరద ప్రవాహం 2005 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన 36 లక్షల క్యూసెక్కుల కంటే కనీసం రెట్టింపయినా ఉండాలి. కానీ ఆగస్టు 2006లో సంభ వించిన భారీ వరద 28 లక్షల కూసెక్కులకే 100 గ్రామాలు అదనంగా భద్రా చలం ప్రాంతంలో మునిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు రూపకల్పనకై దాదాపు 50 లక్షల క్యూసెక్కులకు గరిష్ట వరద పరిమాణా న్ని ఎగువ రాష్ట్రాల అనుమతులు లేకుండానే పెంచారు. అంతర్జాతీయ నిపుణుల సూచనకు ఇవన్నీ విరుద్ధంగానే ఉన్నాయన్నది తేటతెల్లం.

ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంభవించే ప్రమాదాలు జరిగినపుడు ఇలాంటి భారీ ప్రాజెక్టులకు సంభవించే నష్టాలు భయంకరంగా ఉంటాయన్న వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరిం చడానికి వీలులేదు. కోట్లలో ఆస్తి నష్టం, అక్షల్లో ప్రాణ నష్టం ఉంటుందన్నది గమ నార్హం. ఇటువంటి ఘోర విపత్తుల్ని నిరోధించి గొదావరి డెల్టా సుస్థిరాభివృద్ధి సాధించాలంటే పోలవరం ప్రాజెక్టు బదులు బ్యారేజి నిర్మించడం చౌకయిన, భద్ర మైన చర్య అవుతుంది. ప్రఖ్యాత ఇంజనీరు డాక్టర్‌ కెఎల్‌ రావు పోలవరం ప్రాజెక్టు ప్రమాదభరితమైందని 1983లోనే హెచ్చరించారన్న విషయాన్ని మరువకూడదు. దానిస్థానే కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో రెండు పెద్ద జలాశయాలు ఆపైన పెద బళ్ళాల, ఎల్లంపల్లి, ఎదిర, దుమ్ముగూడెం, పోలవరం దగ్గర అదనంగా బ్యారేజి లు నిర్మించినట్టయితే గోదావరి జలాలను సద్విని యోగం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో రష్యన్‌ నిపుణులు వ్లాదిమిర్‌ స్మఖ్తిన్‌ పోలవరం దగ్గర ఆశించినంత నీరు లభ్యంకాదని, అందువల్ల పోలవరం నుండి కృష్ణానదిలోకి నీరు మళ్ళించడం సాధ్యం కాదని నిరూపించారు.

ఇదే అంశాన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయో జనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. 75 శాతం నీటిలభ్యతవద్ద నదిలో ప్రవహిం చే నీటిని అనేక సంవత్సరాల గణాంకాలను పరిశీలించి రోజువారీ, నెలవారీ, సాంవత్సరిక ప్రవాహాలను లెక్కగట్టినట్ల యితే రోజువారీ, నెలవారీ ప్రవాహాల మధ్య అంతగా తేడా ఉండదు. అదే సాంవ త్సరిక ప్రవాహంతో సరిపోల్చినట్ల యితే నెలవారీ ప్రవాహం దాదాపు 10వ వంతు మాత్రమే ఉంటోంది. గోదావరి లో పోలవరంవద్ద లభ్యమయ్యే 530 టిఎంసి నీరు అదనంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ జాతీయ జలవనరుల సంస్థ (ఎన్‌డబ్యుడిఎ) వాదిస్తుంటే రష్యన్‌ నిపు ణులు తయారు చేసి అంతర్జాతీయ నీటి వనరుల నిర్వహణ సంస్థ (ఐడబ్యు ఎమ్‌ఐ)కు నివేదించిన రిపోర్టులో పోలవరం వద్ద భారీ స్థాయి నీటి కొరత 1300 టియంసిలుగా ఉందని తెలియజేసింది.

దీని ప్రకారం గోదావరి నుండి కృష్ణలో ప్రజలు, ప్రభుత్వం ఆశించిన ట్లుగా నీరు కలవడం అసాధ్యమని రష్యన్‌ నిపుణులు నొక్కి వక్కాణిస్తున్నారు. అదే విషయాన్ని ప్రఖ్యాత ఇంజనీరు డాక్టర్‌ కెఎల్‌ రావు కూడా 1983లోనే చప్పారు. అంతేకాక, భూమండలంపై కాలుష్యం, ఉష్ణోగ్రత, వాతావరణ స్థితిగతులలో వస్తున్న దుష్ప రిణామాలవల్ల గోదావరినది పరీవాహ క ప్రాంతాల్లో రాబోయే కాలంలో వచ్చే తుపానుల ఉధృతి పెరగడం, తత్ఫలితం గా సంభవించే కుంభవృష్టి తీవ్రత, వ్యవధి పెరగనుందని, ఫలితంగా వరదల ప్రమాణం కూడా విపరీతంగా 20 నుండి 30 శాతం పెరుగుతుందని నిపుణుల అంచనా. ఇన్ని కష్టాలకోర్చి పోలవరం ప్రాజెక్టును అనుకున్నట్టే పూర్తిచేస్తే సాగు రీత్యా గణనీయమైన అభివృద్ధి సాధ్యమా అంటే అదికూడా అవాస్తవమని లెక్కలు చెప్తు న్నాయి.

క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లయితే ఈ ప్రాజెక్టువల్ల కుడి కాలవ కింద 3.2 లక్షల ఎకరాలకు, ఎడమకాలవ కింద 4 లక్షల ఎకరాలకు నీరు సరఫరా అవు తుందని ప్రతిపాదనలు చెప్తున్నప్పటికీ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తాడి పూడి పుష్కరం ఎత్తిపోతల పథకాలు, చాగల్నాడు పథకం తదితర నీటివనరుల పథకాలు పెంచడంతో సాగులోకి వచ్చే దాదాపు 4.5 లక్షల ఎకరాలు పోలవరం ఆయకట్టులో భాగమైపోతుంది. దాంతో పోలవరం ప్రాజెక్టువల్ల అదనంగా సాగు లోకి వచ్చే భూమి 2 నుండి 3 లక్షల ఎకరాల వరకు మాత్రమే ఉంటుందని అంచ నా. ఇక ఈ ప్రాజెక్టునుంచి 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేద్దామనుకొన్న ప్రభు త్వ ఆశయం నెరవేరడానికి వర్షాకాలం తప్ప మిగతా కాలంలో సాధ్యం కాదు.

ఏ వైపునుండి చూసినా పోలవరం ప్రాజెక్టును ఇంత భారీ స్థాయిలో నిర్మించడం లాభంకంటే నష్టాలే అధికం అన్నది నిపుణుల అంచనా. ఇప్పటికైనా రాయలసీమ, తెలంగాణ, కృష్ణాడెల్టా ప్రాంతాలలో వ్యవసాయాభివృద్ధికి పోలవరం ప్రాజెక్టును ఎలా రూపకల్పన చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి స్వాతంత్య్రసమరయో ధులను, విద్యావేత్తలను, పర్యావరణవేత్తలను ఆహ్వానించి వారి సలహాలు, సూచ నలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం మంచిది. భవిష్యత్‌ తరాల బాగోగులను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఆలోచ నాత్మకంగా వ్యవహరించి, భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి రాజ్యాంగం లోని 51ఎ (జి) నియమావళి ప్రకారం పర్యావరణం, ప్రకృతి వనరు లను సంర క్షించాల్సిన సమయం ఆసన్నమయింది.

(13 ఫిబ్రవరి 2008 ఆంధ్రజ్యోతి సౌజన్యం)

2 Responses to “పోలవరాన్ని పునఃసమీక్షించాలి”

  1. 1
    పోలవరాన్ని పునఃసమీక్షించాలి « Polavaram Says:

    [...] పూర్తిగా చదవండి >> 1 వ్యాఖ్య 1 వ్యాఖ్య ఇప్పటి వఱకు మీ ఉద్దేశ్యం… [...]

  2. 2
    gunnam prasad rao Says:

    పొలవారమ్ ప్రొజెచ్త్ గురుంచి మెదువూతు అలొచ్న చసిన తరువత్ పుర్థ్ నిర్నయమ్ తిసుకొవలి

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com