Feed on
Posts
Comments

లెక్కల్లో హైదరాబాద్‌ ఎవరికి దక్కేను? వ్యాసానికి సి. శ్రీనివాస్‌ జవాబు

హైదరాబాద్‌ అందరిదీ! (illustration : Akbar)నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగర నిర్మాణ పునాది నుంచి అణువణువునా తెలంగాణ ప్రజలతోపాటు కోస్తా, రాయలసీమ ప్రజల కష్టం కలగలిసి ఉంది. ఎవరో ఏదో చెప్పారనో లేదా కేవలం కొన్ని ప్రాంతాల నాయకులు హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో న డిపారనో దాని మీద కోస్తా, రాయలసీమవాసులకు హక్కుందని అంటున్నారన డం అర్థరహితం. గోల్కొండ కోట కట్టించింది నిడదవోలు వీర భద్రుడి బంధువులు ఆంధ్రనగరి పాలకులైన కాకతీయులైతే బల పరిచింది కాపయ్యనాయకుడు.

తరువాత బహమనీలు, కుతుబ్‌ షాహీలు, నిజాం ఉల్‌ ముల్క్‌ల సమయంలో నైజాం, ఆంధ్ర, కోస్తా, రాయలసీమలు చాలా వరకు కలిసే ఉండేవి. 1550 నుం చే గోల్కోండ సామ్రాజ్యంలో కోస్తా, రాయలసీమలు భాగం కావడం ప్రారంభమైంది. అప్పటినుంచే వివిధ రూపాల్లో ప్రత్యక్ష, పరోక్షపన్నులు, లీజులరూపేణా అన్నిప్రాంతాలనుండీ గోల్కొం డ లేదా తెలంగాణ ప్రాంతానికి ధనప్రవాహం ప్రారంభమైంది.
1753 జమాబందీ లెక్కల ప్రకారం ఉత్తర కోస్తా జిల్లాలనుంచి 53 లక్షల మిగులు ఆదాయం తరలించబడింది. నిజాంలు ఎప్పు డూ ప్రపంచంలో అత్యంత ధనికులుగా ఉండేవారన్న మాట అవాస్తవం. కోస్తా, రాయలసీమలు విడిపోయిన తరువాత దివా ళా తీసిన నిజాం రాజులు తమ నగలు కూడా తాకట్టు పెట్టుకు న్నారు. పామర్‌ కపెనీకి చెల్లించాల్సిన అప్పును రద్దు చేయడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారన్నది కూడా చరిత్రే. ముల్కీ ఉద్యమ తొలి దశగా 1952ని, మలిదశగా 1969ని వర్ణించడం సత్యదూరమే. నాన్‌దక్కనీ-గైర్‌ ముల్కీ ఉద్యమం 15వ శతాబ్దంలోనే వచ్చింది. తరువాత 1880లలో పరిపాలనా వ్యవస్థని చక్కదిద్దటానికి దివాన్‌ సాలార్‌జంగ్‌ ఉత్తర భారత దేశం, లాహోర్‌ లాంటి ప్రాంతాలనుంచి అనేకమందిని పిలిపిం చుకున్నాడు. అప్పట్నుంచే ఆ విధానానికి వివిధ రూపాల్లో నిర సనలు ప్రారంభమైనాయి. అయితే అవి ప్రజా ఉద్యమ రూపం తీసుకోలేదు.1915 నుండీ వత్తిడి ఎక్కువ కావడంతో దానికి తలొగ్గిన నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1919 రంజాన్‌ మాసం లో ముల్కీ నిబంధనల ఫర్మానా జారీ చేశాడు. ఆర్టికల్‌ 39 హైద రాబాద్‌ సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌లో ఆ వివరాలు ఉన్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును అధ్యయనం చేయడానికి నియమించిన మొదటి ఎస్సార్సీ సిఫార్సులన్నీ కూడా ఒంటెత్తు పోకడ గానే జరిగాయన్నది జగద్వితం. దారిద్య్రంతో కొట్టుమి ట్టాడే మరట్వాడా లాంటి ప్రాంతాలని బొంబాయి రాష్ట్రంలో కల పడానికి ఫణిక్కర్‌ లాంటి సభ్యులు సందేహించలేదు. గుల్బర్గా ను ఎక్కడో ఉన్న బెంగుళూరు/మైసూరుకి అనుసంధానం చెయ్యడంలో సందేహించని ఆ కమిటీ స్వార్ధ ప్రయోజనాలతోనే తెలుగువారు ఒక్కటవ్వటాన్ని సహించలేక పోయిందనే భావన ఉంది. ఆ తరువాత జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు అన్నీకూడా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి వాటి వాస్తవ స్ఫూర్తికి భిన్నంగా అమలు జరుగు తున్న విషయం అందరికీ తెలిసిందే.

పెద్ద మనుషుల ఒప్పందం కాలపరిమితితో కూడుకున్నదైనప్పటికీ ఏదో ఒక రూపంలో దాని ని సాగదీస్తూనే ఉన్నారు. అలాగే ఆరు సూత్రాల పథకం, 32వ రాజ్యాంగ సవరణ ప్రకారం కూడా రాష్ట్ర స్థాయి విభాగ కార్యాల యాలు, రాష్ట్ర ప్రభుత్వ సాధారణ సంస్థలైన సచివాలయం, నగర పోలీస్‌ కమిషనరేట్‌, కార్పోరేషన్లు లాంటి సంస్థల్లో ప్రాం తంబట్టి రిజర్వేషన్లు ఉండకూడదు. ప్రస్తుత ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి అలాంటి సంస్థల్లోకూడా ప్రాంతీయ రిజర్వేషన్లు పెట్టే ప్రయత్నం చేస్తోంది. మొన్న జారీ చేసిన స్థానికేతరుల బదిలీ ఉత్తర్వులలో మహారాష్ట్ర లేదా ఇతర ప్రాంతాలలో చదువుకుని ఇక్కడ ఉద్యోగాలు సంపాదించిన వారు మాత్రం హైదరాబాద్‌ లో ఉండవచ్చని, తోటి తెలుగు వారిని వారి స్వంత రాష్ట్ర రాజధా నిలో స్థానికేతరుల పేరిట 22 జిల్లాలకి బదిలీలు చెయ్యటం ఎలా న్యాయమవుతుందో అర్థం కాదు. అలా బదిలీలకు గురయిన చిన్నా చితకా ఉద్యోగులైన కానిస్టేబుల్స్‌, ఎన్‌జివొల ఆవేదనని పక్కన పెట్టటమే కాక ఈ విషయాలనన్నిటినీ దాచి నిరుద్యోగుల ను, యువతను తప్పుదోవ పట్టించడం సరైనదికాదు.

ఇక ఆదాయ, వ్యయాల విషయాన్ని చూస్తే- 1956 నాటికి హైదరాబాద్‌ మిగులు ఆదాయం 5 కోట్లు ఉంటే ఈనాడు అది దాదాపు 13 వేల కోట్లకి చేరింది. పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా సమైక్య రాష్ట్రంలో రాజధానిని ప్రణాళికా బద ్ధంగా అభి వృద్ధి చేసారనే విషయాన్ని మరువకూడదు. పారిశ్రామికంగానే కాక అభివృద్ధి కొలమానంగా భావించే విద్యుత్‌ వినిమోగంలో చూసుకుంటే ఆనాటి అవిభక్త హైదరాబాద్‌ జిల్లా(రంగారెడ్డి, హైదరాబాద్‌) మొత్తం వినియోగం కంటే కృష్ణా జిల్లా వినియో గం 50 శాతం పైగా ఎక్కువనీ, పారిశ్రామిక వినియోగం దాదా పు 100 శాతం ఎక్కువనీ 1961 గణాంకాలు స్పష్టంగా చెబుతు న్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల పరిశ్రమలు పెడితే సబ్సి డీలని, అవనీ మొత్తం పెట్టుబడులు ఇక్కడే పెట్టించారు.1956 తరువాతే ఇసిఐఎల్‌,మిధాని, బిహెచ్‌ఇఎల్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని హైదరాబాద్‌లో ఏర్పరచారు.

కోస్తా, రాయల సీమ పారిశ్రామిక, ఉపాధి కేంద్రాలను పథకం ప్రకారం నిర్వీర్యప రచారు. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడేనాటికి రాష్ట్రంలో తెలంగాణ జనా భా దాదాపు మూడవ వంతు. తరువాత హైదరాబాద్‌కి కోస్తా, రాయలసీమ ప్రాంత వాసులు వలస వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో హైదరాబాద్‌ నగర జనాభా 9 శాతంకాగా అందులో కోస్తా 41 శాతం, తెలంగాణ 32 శాతం, రాయలసీమ 18 శాతం గా ఉంది. హైదరాబాద్‌ ఆదాయంలో ఇతర ప్రాంతాలలోగల కేంద్రకార్యాలయాల ద్వారా జరిగే పన్ను చల్లింపులు కూడా ఉన్నా హైదరాబాద్‌ నగరం స్వంత ఆదాయం కూడా ఎక్కువే. అయితే 1968లలో తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉందనీ, దాన్ని ఇతర ప్రాంతాలకు మళ్ళించారనే లెక్కలలో హైదరాబాద్‌ ప్రాంత ఆదాయం కలిసి ఉంది. అంటే దానిలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిహైదరాబాదులో ఉన్నవారి ఆదాయం, కేంద్ర కార్యా లయాల ఆదాయం కలిసి ఉన్నాయన్నది గమనార్హం.

రాష్ట్రావతరణ సమయంలో హైదరాబాద్‌ రాష్ట్ర ఆదాయం ముందు ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ఆదాయం దిగదుడుపేననీ, వారు లోటులో ఉన్నారనీ కొంతమంది మేధావులు ప్రచారం చేస్తున్నా రు. అది నిజాలను వక్రీకరించడమే. 1954-55లో 82,170 చద రపు కిలో మీటర్ల విస్తీర్ణంగల అవిభక్త హైదరాబాద్‌ రాష్ట్ర బడ్జెడ్‌ కేవలం 100 కోట్లుకాగా, 63,610 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్‌ 116.2 కోట్లు ఉందన్నది వాస్తవం. అభి వృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే నిధులు హైదరాబాద్‌ రాష్ట్రం కంటే ఆంధ్ర రాష్ట్రంలో 50 శాతం ఎక్కువ. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మధ్య నిషేధం అమలులో ఉండటం మూలంగా అబ్కారీ ఆదాయం శూన్యం కాగా హైదరాబాద్‌ రాష్ట్ర ఆదాయం లో అదే గణనీయమన్న మాట కూడా వాస్తవం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలను పరిశీలిస్తే- రాజధాని ప్రాంతం నుంచి 39 శాతం, కోస్తానుంచి 16 శాతం, రాయలసీమ నుంచి 4 శాతం రాగా తెలంగాణ ప్రాంతం నుంచి 21 శాతం వస్తోంది. ఈ లెక్కల్ని పరిశీలిస్తే ఏ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు? పైగా తెలంగాణ ప్రాంతానికి 60 శాతం నిధులు ఖర్చుపెడుతున్నట్టు ఆధారాలతో సహా నీటిపారుదల శాఖామాత్యులు చెబుతున్నారు
. మిగిలిన దాంట్లో రాయలసీమకు 25 శాతం. మిగిలింది కోస్తాకు. చారిత్రికాధారాలు, లెక్కలు చెబుతున్న వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉండగా, ఇప్పుడు రాజధానీ నగరమైన హైదరాబాద్‌ మాదేనని, దాంతోపాటే ప్రత్యేకమైపోతామనీ, మిగతా ప్రాంతా లు ఎటుపోయినా మాకనవసరమనీ, ఎవరిపాట్లు వారు పడాల నీ దబాయింపులకు దిగడం న్యాయమేనా? నిజంగా అభివృద్ధిని కోరుతూ ప్రత్యేక రాష్ట్రాలు కావాలని పోరాడాల్సింది కోస్తా, రాయలసీమ వాసులు కాదా? ఎక్కడెక్కడి నుండో వలస వచ్చిన వారు కూడా తెలుగు సోదరులను వలసవాదులుగా ముద్రలే స్తూ, మిత్రులుగా వారికున్న పాటి హక్కు కూడా రక్త సంబంధీ కులైన తెలుగు సోదరులకు లేదని వాదించడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించమని మనవి చేస్తూ, అభివృద్ధి పథంలో భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్‌ నగరం భార తీయులందరిదీ అన్న విషయాన్ని మరువకూడదని మనవి.

(16 ఫిబ్రవరి 2008, ఆంధ్రజ్యోతి సౌజన్యం)

Share/Save/Bookmark

4 Responses to “హైదరాబాద్‌ అందరిదీ!”

  1. 1
    kumar Says:

    నువ్వు ఇన్కొక కొత్త నాటకము మొదలుపెట్టినవా??….

  2. 2
    satyapal reddy Says:

    complete wrong information. u doesn’t know anything.
    that is ur weakness. shameless…………………..

  3. 3
    ayya Says:

    kotha natakam shuru chesindu seenu babu.naku telisi motham desam la evaniki telvadanukonta ee statistics.
    ni istam vachi nattlu history marchukovadamla great ra miru anduke miru akkada unnaru,memu ikkada unnamu.
    inka enni dinnallu ra,ee latkoru vesalu
    Jai telangana,jai jai telangana

  4. 4
    jagmoh Says:

    Mr Srinivas, Yours topic is baseless and a virtual story with all virtual statistics. No doubt you are fast food center and Stop cooking stories.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో