Feed on
Posts
Comments

RajaPoshavva2008, ఫిబ్రవరి 15న రామగుండం ఓపెన్‌ కాస్టు-3 బొగ్గు గని విస్తరణలో భాగంగా మంగళపల్లి - పెద్దంపేట గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ సభలో ప్రభుత్వ పర్యావరణ శాస్త్రవేత్తలతోపాటు కరీంనగర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, సంబంధిత సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్‌ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అక్కడికి మురికి బట్టలతో… నెరిసిపోయిన జుట్టుతో.. పీక్కుపోయిన మొహంతో ఓ అవ్వ అక్కడికి వచ్చింది. ఆమె పేరు రాజపోషవ్వ. అరవై ఏళ్ల దళిత మహిళ. ఆమె మాట్లాడిన మాటలు బొగ్గు గనుల కింద నిర్వాసితులు అవుతున్న స్థానికుల ఆవేదనకు, ఆక్రందనకు, దుఃఖానికి సజీవ సాక్ష్యంగా నిలిచిపోతాయి..

“అయ్యా నేను రాజపోషవ్వను మాట్లాడుతున్నా…

RajaPoshavvaనాకు ఇద్ద రు కొడుకులు.., ఎవరు తిండి పెడ్తలేరు… కైకిలి చేసుకొనే బతుకు మాది… కైకిలి దొరికితనప్పుడు దొరుకుతుంది, దొరకనప్పుడు దొరకదు… వాళ్ళ పోర గాండ్లకే తిండికి సరిపోతలేదు… నాకేం పెడ్తరు…” చాతనై చాతకాక కూలికిపోతా..! పడుసు పొరగాండ్లకే పనులు దొరుకత లేవు… నా అటువంటి ముసలిదానికి పను లేమి దొరుకు తాయి… పని దొరికినప్పుడు తింటా.. లేనప్పుడు కాళ్ళు కడుపులకు దోపుకొని పస్తులు పంట… నిన్నటి నుంచి తిండి లేదు… ప్రాణం సొడ సొడలు పోతాంది… మాట్లాడ వస్తలేదు… అయి నా మాట్లాడుతా… ఇప్పుడు మాట్లాడ కుంటే ఇక ఎప్పుడు మాట్లాడినా దండుగే… నాకు గీ కష్టం వస్తదనుకోలే… నా పెండ్ల యిన ఎరుకల మా పెద్దంపేట ఊరు ఎట్లా ఉండే… జల్లారం చెరువు కింద పన్నెండు నూర్ల ఎకరాలు పారే ది… తీరొక్క పంట పండేది… గుమ్ముల కొద్దీ చేసుకొని బ్రతికినం… అన్ని రకా ల పంటలు పండించుకొని బ్రతికినం… బారెడు లోతు తవ్వితే జలజల మం టూ గంగమ్మ తన్నుకొని బయటికి వచ్చేది… ఇంటి ముందు ‘అమ్మ’ అని అడుక్కోను వచ్చినోడెవడు వట్టి చేతులతోని వెనక్కి పోయేటోడుకాదు… చెట్టు, చేమ, పుల్ల, పురుగు, పక్షి అంతా కలిసి బ్రతికినం…ఆ రోజులు పోయి నాయి… ఏదో మాయ కమ్మింది… ఎవరికన్నా కోపం వస్తే నీ ఇంట్ల మన్ను బొయ్య అని తిడ్తరు… కాని ఏ కోపం లేకుండానే కంపినోడు మా బ్రతుకుల మీద టన్నుల కొద్ది మన్ను గుట్టలు గుట్టలుగా పోసిండు… మా బతుకులు ఆగమైనవి…

మా పిల్లల ఒంటి మీద చటాకు మాంసం లేదు

RajaPoshavvaపదిహేను, ఇరువై ఏండ్ల క్రింద మా ఊరిని ఆనుకొని ‘లెవన్‌ ఎ’ బాయి వచ్చినప్పుడు గిట్లనే మా భూములు గుంజుకొనుటకు కంపినోళ్లు వచ్చిం డ్లు… అప్పుడే మా రైతులు మేం భూములు ఇవ్వమంటే మా బతుకులు ఇట్లా ఉండేటివి కావు… మావోళ్లంతా ఎడ్డోళ్ళు… మేం ఎందుకు భూములు ఇవ్వాలి… మా భూములు ఇచ్చి మేం ఎట్లా బతకాలని మా వోళ్లు ఖచ్చితంగా నిలబడి అడగాలే… అదే మా తప్పయిపోయి ంది… మా బతుకులు నాశనమ యిపోయినవి… మా కడు పుల పుట్టిన పాపానికి మా పోరగాండ్ల బతుకులు ఆగమయినాయి… నా మనుమని ఒంటి మీద చటాకు మాంసం లేదు… కండ్లు పీక్కుపోయి కంతలు తేలేటివి కాదు… కొన్ని చూస్తే నా కడుపులదేవినట్టయితది… మా భూములు గుంజుకున్నప్పుడు ఇగ్గో గిట్లనే మాయమాటలు చెప్పిం డ్లు… భూముల క్రింద భూములు ఇస్తమన్నారు… ఉద్యోగాలిస్తామ న్నారు… ఇండ్లకు జాగలు ఇస్తమన్నారు… అక్కడ అన్ని సౌలత్‌లు(సౌకర్యాలు) కల్పిస్తమన్నారు… కాని ఇచ్చిన మాటలేమి కంపినోళ్ళు నిలబెట్టుకోలే… మమ్మల్ని నీళ్ళులేని కాడ బొండిగ కోసినట్లు చేసిండ్లు… బొగ్గు గనుల కోసం ఫారెస్టు వాళ్ళ భూములు తీసుకుంటే ఎకరానికి మూడు ఎకరాలు ఇస్తాండ్లు. అట్లనే చెట్లకు బదులు చెట్లు పెంచి ఇస్తాండ్లు… కాని రైతు భూమి తీసుకుని రైతుకు భూమికి బదులు భూమెందుకు ఇవ్వరు…! ఇదేం లెక్క? భూమి లేకుండా రైతెట్ల బతుకుతడు…?

మా ఊరి తాటివనం మాయం…

RajaPoshavvaనష్ట పరిహారం క్రింద ఎకరానికి పన్నెండు వందలు ఇచ్చిండ్లు… అవి ఏ మూలకు సరిపోతాయి… కూసోని తింటే గుమ్ములైనా కరిగిపోతాయి… వచ్చి న పైసలు పుట్ట పిత్తుల్లా ఎగిరిపోయినాయి… అప్పులోల్లు వచ్చి ఇంటి ముం దు కూర్చున్నారు… బిడ్డల పెండ్లిల్లు చేసినోళ్లు చేసి ఉత్త చేతులతోని మిగిలిం డ్లు… తాగి, తిని వచ్చిన పైసలు కరాబు చేసుకున్నోళ్లున్నారు… బాగా భూములున్న భూస్వాములు వచ్చిన పైసలు తీస్కోనిపోయి గోదావరిఖనిలో బ్రాం డీ షాపులు పెట్టుకున్నరు.కంట్రాక్టులు చేస్తాండ్లు… వాళ్ళ పని బాగానే ఉం ది… ఎటొచ్చి చిన్న చిన్న రైతులు… ఊరిని నమ్ముకొని సబ్బన్న వర్ణాల వాళ్లు, కుల వృత్తుల వాళ్లు ఆగమయిండ్లు… జల్లారం చెరువు కింద ఊరి చుట్టు ఆరేడువందల తాటివనం ఉండేది… ఇప్పుడు చుద్దామంటే ఒక్కటి కనిపిస్త లేదు.. దానిమీద బ్రతికే గౌండ్లోల్ల బ్రతుకులు ఆగమయ్యాయి… ఇప్పుడిక తిండి మాట దేవుడెరుగు, సచ్చెటోనికి ఇంత జీవగంజి పోత్తా మంటే కూడా గుక్కెడు నీళ్ళు దొరుకుతలేవు… గోరుతోని గోకితే చెమ్మగిల్లే నేలలు బొగ్గు దుబ్బతోని నిండిపోయినాయి… బాయిలల్ల నీళ్లెండిపోయినా యి… ఎంత కొట్టినా బోర్లల్ల చుక్క నీరు వస్తలేదు. గా ఓసిపి బాయిలతోడి వాడేసిన మురికి నీళ్ళతోని పనులు ఎల్లదీసుకుంటాన్నం… ఆ నీళ్ళెమో చిలు ము చిలుము మడ్డి మడ్డి, గ్రీసు వాసనలు, నోట్లో పోసుకుంటే వాంతి కొస్త ది… పెయ్యంత గోకుడు లేస్తది… అగ్గో అటువంటి వేష్టుగా పోయే నీళ్ళ తోని మా వాళ్ళు ఖాళీ జాగల నాలుగు గింజలు వేసి పొలంకు నీళ్ళు మళ్లించుకుం టే… పొలం పొట్టకొచ్చిన సమయం కంపినోళ్ళు బుల్‌ డోజర్లతోని తొక్కించిం డ్లు… మేం అంత పాపం ఏం చేసినం…?

మురికి నీళ్లు తాగి నలుగురు సచ్చిండ్లు

RajaPoshavvaమా వూరునుంచే కంపెనీ కాలరీకి మంచినీళ్ళ పైపులు పోతున్నాయి… తాగేందుకు నీళ్ళు కావాలని మేమంతా పోయి ఎన్నిసార్లు ఆఫీసుల ముందు ధర్నాలు చేసినా ఎవరు పట్టించుకోలే… ఇక ఇట్లయితే లాభం లేదనుకొని మా పోరగాండ్లు పైపులకు పొక్కలు చేసి తాగేందుకు నీళ్ళు తెచ్చుకుంటే… పైపు లు పగలగొట్టిండ్లని పోలీసులను ఎగదోసి కేసులు పెట్టి జైలుకు పంపిండ్లు.. గ మట్టిదిబ్బ ఆవల ఉన్న ‘లెవన్‌ ఎ’ బాయికాడున్న పంపుకాడి నుంచి బిందె లతోని మోసుకొచ్చుకుని ప్రాణాలు నిలుపుకుంటాన్నం… పోయిన ఎండా కా లం ఆ పంపుకాడ నీళ్ళు రాక బొగ్గుబాయి మురికి నీళ్ళు తాగి నలుగురు సచ్చిండ్లు… విషపు నీళ్ళు తాగటం వల్లనే సచ్చిండ్లని వాళ్లెవలో పెద్దసార్లు వచ్చి చెప్పిండ్లు… పోయిన పెద్దకాశినాడు చాతనయి, చాతకాక బిందెతోని నీళ్ళు మోసు కొని వస్తాంటే కాలు జారిపడి నాలుగు నెలలు మంచంల పడిలేవలే… మా వూరు చుట్టు ఉండే పచ్చపచ్చని చెట్లు మాయమైనవి… తాటిచెట్టు గుట్టల లెక్కల ఓసిపి మట్టి దిబ్బలు వెలిసినయ్‌… ఆ మటి ్టదిబ్బల మీద సర్కారు తుమ్మలు మొలిచినయ్‌. అండ్లకెల్లే ఊళ్ళకు దారి. రాత్రయితే ఆ తుమ్మల్ల దొంగల భయం… చీకట్ల ఆ దారంటా వస్తే దొంగలు మీదపడి మా దగ్గరున్న పావులా పర్కా దోసుకుపోతాండ్లు… అసలే లేకి బతుకు… అందు లో లేకిల లేకి… చేస్తామంటే కైకిలిలేదు… తిందామంటే తిండిలేదు… కాళ్ళు చేతులు సక్కంగా ఉన్నాళ్ళు ఊరువిడిచి బోళ్ళు కడుగ బొంబాయి పోతాం డ్లు.. దుబాయికి పోతాండ్లు. మట్టిని నమ్ముకున్నాళ్ళం మట్లే కలిసిపోతానం…

ఆ సప్పుడుకు మాట కూడా వినిపించదు

RajaPoshavvaఒక చాకు తీసుకొని ‘సేపు’(ఆపిల్‌) ను తాపకింత కోసుకొని తిన్నట్లు మమ్ముల్ని ఒకసారి చంపుక తినకుండా కొద్దికొద్దిగా చంపుకతింటాండ్లు… మా భూములు తీసుకున్నప్పుడు ఎక్కువ నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుం దని మా ఇండ్లు తీసుకోలే… భూములు పోయి మేం గత పదిహేనేండ్లుగా ఎట్లా బతుకుతున్నమో ఎవరు పట్టించుకోలే… ఓసిపి బ్లాస్టింగ్‌ వల్ల ఇండ్లు కూలిపోతున్నయ్‌… గోడల పెచ్చులూడుతున్నయ్‌… కప్పులు కూలుతున్న య్‌… బ్లాస్టింగ్‌ పొగలతోని ఊపిరి సలుపుత లేదు… ఇవ్వాళ ఇంతమంది పెద్దసార్లు వచ్చిండ్లని ‘లెవన్‌ ఎ’ బాయి ఫ్యాన్‌ హౌజ్‌ బంద్‌ చేసిండ్లు కాని, ఆ ప్యాన్‌ నడిచేదుంటే ఇక్కడ కూచున్న వాళ్ల కెవరికి ఒకల మాట మరొకరికి వినిపించదు… అంత సప్పుడైతది… మా తినే కంచం గుంజేసి ఎంగిలి మెతు కులు ఎగజల్లినట్టు పోయి నేడు మంగళపల్లిల కంపి నోళ్ళు హెల్త్‌ క్యాంపు పెట్టిండ్లు.. కాని అయ్యా మాకున్న రోగమల్లా ఒక్కటే. ఆకలి రోగం… ఆ రోగానికి మందు కావాలి… ఖాళీగా ఉన్న మా చేతులకు పనులు కావాలి… మా పోరగాండ్లకు బళ్ళుకావాలి… పోరగాండ్లంటే జ్ఞాపకం వచ్చిందయ్యా… ‘లెవన్‌ ఎ’ బాయిల బొగ్గు తీయం గా ఖాళీ అయిన పేసుల్ల ఇసుక నింపేందుకు మా వూరిని ఆనుకొని ఇసుక బంకరు కట్టిండ్లు… అక్కడంతా లారీలతోని ఇసుక తెచ్చి పోసిండ్లు… తెలిసి తెలియక పోరగాండ్లు ఆడుకోనుబోయి అందులో ఒక పోరడు.. ఇసుక బంక ర్ల పడి చనిపోయిండు… అట్లా సచ్చిపోయిన పొల్లగాని కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని మేం లొల్లిపెడ్తే… నిషిద్ద ప్రాంతంలోకి ఎందుకు వచ్చిం డ్లని కంపెనీ కేసులు పెడుతామని బెదిరించె…

అన్నీ ఇస్తమన్నరు.. ఏదీ ఇవ్వలే…

RajaPoshavvaమా వూరు ఉన్నా లేనట్టే లెక్కయింది… గత పదిహేనేండ్లుగా రేపోమాపో బొగ్గు బాయి క్రింద ఊరు పోతదని ఇందిరమ్మ పథకాలు మంజూరు కాలే. ‘సేప్‌’ (Sorrounding Habitation Asistence Programme) నిధులు రాలే.. ముసలోల్లకు ఇచ్చే పింఛన్లు రాలేదు.. అప్పుసొప్పు చేసుకొని తింటాన్నం… ఉన్న ఊరు కన్నతల్లితోని సమానమంటరు… మీరు ఏమి ఇచ్చినా కన్నతల్లితో సమానం కాదు… అయినా మేం గత పదిహేనేండ్లుగా మా వూరును ఎప్పుడు కంపినోడు తీసుకుంట డోనని కొండకు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తా న్నం… అప్పులోల్లు అగుత లేరు… కంపినోడు ఒకసారి వచ్చి ఎర్రగీత గీస్త డు… మళ్ళోసారి వచ్చి కొలిచి పోతడు… మూడేండ్ల క్రింద వచ్చి వీడియో తీసిండు… ఇగ్గో మళ్ళ గిప్పుడు వచ్చిండ్లు… పెద్దపెద్ద సార్లు వచ్చిండ్లు… ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులు వచ్చి మీకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని హామీ మీద హామీ ఇచ్చి నెగ్గిన తరు వాత ఏం చెయ్యనట్టు… ఇప్పుడు కంపినోళ్ళు మళ్ళోసారి వచ్చి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటాండ్లు… ఇప్పుడేమో ఊరును తీసుకొని ఊరును ఆనుకొని ఉన్న మాదిగిండ్లను తీసుకోమంటాండ్లు… అది లెక్కలోకి రాదంట… ఇదేం లెక్క? ఊరు లేకుంటే మా బతుకు ఎక్కడ ఉంటది… ఊరు ఉంటేనే కూలో, నాలో దొరుకుతది… ఊరుతోపాటే మా మాదిగవాడను కూడా తీసుకోవాలి… అందరికి అందరం కట్టకట్టుకొని చావో, బతుకో బతుకతం… మేం కోరుకున్న చోట మాకు ఇండ్లు కట్టి య్యాలి… అక్కడ కరంటు, నీళ్ళు, పోరగాం డ్లకు బళ్ళు, మొక్కటానికి గుడి, చేసుకోను పనులు… అన్ని సౌలత్‌లు ఉండాలి… అట్లా సౌలత్‌లు కల్పించిన తరువాతే ఊరు ఖాళీ చేయించాలి… ఒడ్డు ఎక్కినంక తెడ్డు మల్లన్న అన్నట్టు ఊరు ఖాళీ చేసినంక ఇచ్చిన మాట నిలబెట్టుకోరు… మొన్న దస్నాపూర్‌లో అట్లనే జరిగింది. నిన్న వకీల్‌పల్లిలో అదే జరిగింది. అటువంటి పరిస్థితి మాకు రావద్దు… ఇంత మంది పెద్ద పెద్ద సార్లున్న ఈ నిండుసభలో పుట్టెడు దుఃఖంతో చెపుతాన… అన్ని ఏర్పాట్లు చేస్తా మని స్పష్టమయిన హామి ఇవ్వాలి… లేకుంటే ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలో మీ కండ్ల ముందే మందు తాగిచస్తా… ”(అంటూ ఆమె ఎక్కెక్కి పడి ఏడ్వసాగిం ది… కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆమెను మైకు నుంచి దూరంగా తోడ్కొనిపోయారు. ఆమె ప్రశ్నలకు జవాబు ఇచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు.)

– ఎం.డి. మునీర్‌, ఆన్‌లైన్‌, మంచిర్యాల

(ఆంధ్రజ్యోతి 27 ఫిబ్రవరి 2008 సౌజన్యం)

Share/Save/Bookmark

2 Responses to “నేను…రాజపోషవ్వను మాట్టాడుతున్నా….!”

  1. 1
    Bharath Kumar Sankapally Says:

    అన్న తెలంగాణ ప్రంతంలొ వున్న ప్రజ సమస్యలు అద్బుతంగ నెట్ లొ చుపిస్తున్న మెకు వందనలు కని ప్రజ సమస్యలు అదికరుల ద్రుస్థి కి పొవలె తెలంగన బగు పదలె అన్న మరొ ఉద్యమమ్ చెయలె ప్రజ్లె దెవుల్లు అని చెప్పె ఈ ప్రభుత్వమ్ తెలంగనొల్లమిద పెదుత్తున్న కస్తల పథకలు పొవలె తెలంగన అభివ్రుద్ది చెందలె అన్న తెలంగన శాసనసభులు, మినిస్తర్లు ఒకతవ్వలె, తెలంగన తెవలె,న తెలంగాణ కొటి రతనల వీణ.
    జై తెలంగాణ……!

  2. 2
    ఉప ఎన్నికలు తెలంగాణా వాదుల కర్తవ్యం « నా మాట నా తెలంగాణ కై…………………………… Says:

    […] నేను…రాజపోషవ్వను మాట్టాడుతున్నా&#823… Bharath Kumar Sankapally […]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో