Feed on
Posts
Comments

- సి.విఠల్, శ్రీధరరావు దేశ్‌పాండే

వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధికి ఒక చట్టబద్ద సంస్థను ఏర్పాటు చేస్తాం, దీనిపై మీరు చర్చకు సిద్ధమేనా అని ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద పెద్ద పత్రికా ప్రకటనల ద్వారా చర్చకు తెరతీసారు. తెలంగాన ప్రజలకు ఇటువంటి తాయిలాలు ఆంధ్రా వలస ప్రభుత్వాలు ప్రకటించడం కొత్తకాదు. తెలంగాణ ఆకాంక్షలు బలంగా తలెత్తిన ప్రతిసారి ఇటువంటి తాయిలాలను వారు తెలంగాణ ప్రజలకు చూపిస్తూపోయారు. 1956లో పెద్దమనుషుల ఒప్పందం, 1969లో జీవో36, 1973లో ఆరుసూత్రాల పథకం, 1975లో రాష్టపతి ఉత్తర్వులు, 1985లో 610జివోఒ, 2004లో గిర్‌గ్లానీ కమిషన్, 2006లో ప్రాంతీయ అభివృద్ధి బోర్డు… ఇట్లా తాయిలాలు ఇస్తూనే పోయారు. ఇపుడు మరో చట్టబద్ధ సంస్థ ఆ జాబితాలో చేరబోతున్నది. గత 50ఏళ్ళుగా అన్ని చట్టబద్ధ ఒప్పందాలు ఉల్లంఘనలకు గురి అయినాయి. చట్టబద్ధ సంస్థలు, కమిషన్లు ఇచ్చిన రిపోర్టులు బుట్టదాఖలైనాయి. ఇక ఏ ఆశతో మరో చట్టబద్ధసంస్థను తెలంగాణ ప్రజలు అంగీకరించాలి? ఈ సందర్భంలో సంక్షిప్తంగానైనా ఈ తాయిలాలు, వాటి ఉల్లంఘనల చరితను మననం చేసుకోవాలని మేం భావిస్తున్నాం.

ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పింది?

విలీనం వల్ల జరగబోయే నష్టాలను ఫజల్ అలీ కమిషన్ ముందు తెలంగాణ ప్రజాసంగ్హాలు వివరంగా చెప్పాయి. తెలంగాణ కోస్తాకు వలస ప్రాంతంగా మారుతుందని, నీళ్ళు, నిధులు, నియామకాలు కోస్తాకే తరలిపోతాయని ఏకరువుపెట్టుకున్నారు. ఈ భయాలకు, అనుమానాలకు విరుగుడుగా కోస్తా నాయకులు అనేక రక్షనలను హామీ ఇచ్చారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాలు అమోదించారు. ఈ అంశాలన్నింటిని కమిషన్ కూలంకషంగా చర్చించింది. కమిషన్ ఈ విధంగా తమ అభిప్రాయాలను పొందుపరిచింది.

“తెలంగాణ విశాలాంధ్రలో భాగం కాదల్చుకుంటే, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు తగిన ఏర్పాట్లకు సమ్మతించడానికి ఆంధ్ర రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నట్లు మాకు అవగతమయింది. ఈ ఏర్పాట్లు (రాయలసీమ, కోస్తాంధ్రల మధ్య జరిగిన శ్రీబాగ్ ఒప్పందం తరహాలో) ప్రభుత్వోద్యోగాలలో మూడవవంతు అవకాశాలను, అంటే ఇంచుమించు జనాభా దామాషాలో తెలంగాణవారికి కల్పించడానికి, తెలంగాణ ప్రాంత అభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టిని పెట్టడానికి హామీ ఇచ్చేరూపంలో ఉండవచ్చు. ఈ తరహాలో చేయగల ఏర్పాట్ల గురించి వివరాలను మేం జాగ్రత్తగా పరిశీలించాం. శ్రీబాగ్ ఒప్పందం తరహాలోకాని,

Click here to download the PDF and read the complete article

తెలంగాణ ప్రజలు కోరుతున్నది ప్రత్యేక రాష్ట్రమే - సి.విఠల్, శ్రీధరరావు దేశ్‌పాండే

(03 మార్చ్ 2008, వార్త సౌజన్యం)

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో