Feed on
Posts
Comments

Monthly Archive for ఏప్రిల్, 2008

- యం. కోదండరాం, కె. సీతారామారావు
I
 తెలంగాణ రాష్ట్ర సమితి తరపున శాసనసభకు, శాసన మండలికి, పార్లమెంటుకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల రాజీనామాతో తలెత్తిన పరిస్థితిని అంచనా వేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సాధనఉద్యమం అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేసుకోలేము. రాజీనామాకు దారితీసిన కారణాలను తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌ అనబడు సామాజికార్థిక, రాజకీయ వ్యవస్థ స్వరూప, స్వభావాలను అర్థం చేసుకోవాలె. తెలంగాణ పోరాటం, భాషా ప్రయుక్తత పేరుతో ఏర్పడిన ”ఆంధ్రప్రదేశ్‌” ఉమ్మడి వనరులను వాడుకొని ఎదిగి, సామాజికార్థిక వ్యవస్తలన్నింటిని శాసిస్తున్న ఆంధ్ర […]

Read Full Post »

తెలంగాణ కోసం ప్రజలు ఏ త్యాగాలకైనా సిద్ధమేనని, అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని, అంతర్గత వలసవాదాన్ని ఓడించేందుకు అవకాశవాద నాయకుల్ని కాదని ఉద్యమించాల్సిందేనని అంటున్నారు నాగోబా
భారతదేశం స్వాతంత్య్రం అందినాక దేశంలో జాతుల పోరాటాలు, ఉపజాతుల ఆకాంక్షలు పెల్లుబికాయి. బ్రిటిష్‌ ఇండియాలో ఏర్పడిన రాష్ట్రాలు, ప్రావిన్సులు, సంస్థానాలు ప్రజల ఆకాంక్షలను గౌరవించి, జాతుల, ఉపజాతుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినవి కావు. బ్రిటిష్‌ రాజ్యాధికారానికి, వారి వలస దోపిడీకి అనుకూలమైన రాజ్యవ్యవస్థనే వారు ఏర్పాటు చేసుకున్నారు.

Read Full Post »

ఏ పార్టీ వైఖరి ఎట్లున్నా తెలంగాణ అంశం అన్ని పార్టీలను ఒక చౌరస్తాలో నిలబెట్టిందనీ, ఉపఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల పరిస్థితి సంక్షోభంలో పడనున్నదనీ అంటున్నారు నాగోబా
టి.ఆర్‌.ఎస్‌. ప్రజాప్రతినిధుల మూకుమ్మడి రాజీనామాలు తెలంగాణ రాజకీయోద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. అదే సమయంలో సమైక్యవాదాన్ని సమర్థించే రాజకీయ పార్టీలలో తెలంగాణ వాదుల ఒత్తిడి తీవ్రతరమైంది. టి.ఆర్‌.ఎస్‌. ప్రజా ప్రతినిధుల రాజీనామాలను తెలంగాణ ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు స్వాగతించారు.

[…]

Read Full Post »