Feed on
Posts
Comments

తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై  గళమెత్తిన శి’వాణి’ , ప్రసంగాలతో అబ్బురుపరుస్తున్న చిన్నారిమెట్‌పల్లి/ఇబ్రహీంపట్నం, కరీంనగర్, మే 18 (ఆన్‌లైన్‌): ఆ బాలిక పేరు మామిడి శివాని… వయస్సు నాలుగు సంవత్సరాలు… చదు వుయుకేజి… ఆమె వయస్సు పిల్లలకు మైక్‌ అన్నా తెలియదు… ఉపన్యాసమన్నా తెలియదు… ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వారితో మాట్లాడడానికి జంకుతా రు… ఈ బాలిక మాత్రం వేల మంది ముందు మైక్‌ పట్టుకొని నిలబడి ధైర్యంగా మాట్లాడిం ది… పాడింది… చాక్లెట్లు, ఐస్‌క్రీం అడగాల్సిన వయసులో ఏకంగా ప్రత్యేక రాష్ట్రాన్ని అడిగింది… అద్భుత జ్ఞాపకశక్తి… అబ్బురపరిచే ప్రతిభతో పలువురిని ఆకర్షింపజేస్తుంది. ఏ విషయాన్నైనా చెప్పగానే ఇట్టే మనస్సులో దాచేస్తుంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే చందంగా చిన్నారి శివాని ఎప్పుడు, ఎక్కడ… ఎలా… తాను నేర్చుకున్న విషయాన్ని చెప్పమన్న క్షణాన్నే గడగడ చెప్పేయడం అభిరుచిగా మలుచుకుంది. ఇబ్రహీంపట్నం మం డలం బండలింగాపూర్‌ చెందిన ప్రభుత్వ ఉద్యోగి మామిడి దేవేందర్‌, రాధిక ప్రథమ సం తానమైన శివాని పలు రకాల శ్లోకాలను, సినీ, జానపద, దేశభక్తి, తెలంగాణ గేయాలను రాగాలాపనతో కంఠస్తం చేయడం ఎటువంటి జంకు లేకుండా ప్రదర్శించడం అలవాటు చేసుకుంది.

తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణ తోడైంది. నర్సరీ, ఎల్‌కేజిలను బం డలింగాపూర్‌లోని విజయసాయి పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన శివాని యుకేజిని మెట్‌పల్లి పట్టణంలోని విజ్‌డమ్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో పూర్తిచేసింది. పలుమార్లు పాఠశాల, గ్రామం లో జరిగిన పలు వేదికలు, జాతీయ దినాల్లో తన ప్రతిభను కనబరిచి మన్ననలు అందుకుంది. జనరల్‌ నాలెడ్జికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ ప్రశ్నలకు సమాధానం టక్కున ఇట్టే చెప్పేస్తుంది. టివిల్లో, రేడియోల్లో వచ్చే కార్యక్రమాలు, తండ్రి అందించే శిక్షణతో తెలంగాణ అంశంపై ధారాళంగా ఉపన్యసించడం, తెలంగాణ ప్రత్యేకత, ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించే పాటలను అతి మధురంగా పాడడం నేర్చుకుం ది. ఈ నేపథ్యంలో మెట్‌పల్లికి చెందిన మాజీ ఆర్‌టిసి జోనల్‌ చైర్మన్‌, టిఆర్‌ఎస్‌ నాయకు లు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును ఓ కార్యక్రమంలో కలిసారు. తెలంగాణపై తాను కం ఠస్థం చేసిన ఉపన్యాసాన్ని, పాటలను వినిపించింది. చిన్నారి తెలంగాణపై కనబరుస్తున్న ప్రతిభను కెసిఆర్‌ దృష్టికి తీసుకవెళ్లడానికి నాయకులు వ్యూహం రూపొందించారు. ఇంకేముంది జగిత్యాలలో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ధూంధాం, కెసిఆర్‌ సభలో వేదికపై తన గానం… గళం వినిపించే అవకాశం శివానికి వచ్చింది.

జయ జయహే… తెలంగాణ
జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు
ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లాలలోని పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ… జైజై తెలంగాణ

అనే పాటతో పాటు

అయ్యోనివా… నువ్వు ఆంధ్రోనివా…!
తెలంగాణోనికి తోటి పాలోనివా..!
గోల్కొండ రాళ్లు మోసినావా!
చార్మినార్‌కు సున్నమేసినావా!
పప్పులో ఉప్పేసి పొత్తంటివా!
తెలంగాణ మొత్తం మింగేస్తివా!

అనే జానపద గేయాన్ని ఆలపించి సభికుల హర్షధ్వానాలు అందుకుంది.

(మే 19, 2008 ; ఆంధ్రజ్యోతి సౌజన్యం)

One Response to “తెలంగాణపై గళమెత్తిన శి’వాణి’”

  1. 1
    JAY BODA Says:

    ఈ అమ్మాయి గురి0చి చదువుతుంటె మనసు జళ్ళుమ0ది తరతరాల నా తెల0గాణా బాదలు ఆ పాప లో కలుపి0చినట్టయి0ది. వేములాడ రాజన్న ఆ తల్లిని చల్లగా చూడాలి.
    జై జై…తెల0గాణ జై జై
    దుబాయి తెల0గాణ
    జయ రెడ్ది
    అబు ధాబి

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com