Feed on
Posts
Comments

తెలంగాణ  యెన్జీవోస్‌ యూనియన్‌,   తెలంగాణ భవన్‌, నాంపెల్లి, హైదరాబాద్‌
అధిక ధరలకు నిరసనగా  కాగడాలతో ప్రదర్శన  తేది.9.6.2008

కాగితంపై కలం కదిలించుటే కాదు … గళం విప్పి నిరసన జ్వాలలను గక్కిన … తెలంగాణ యెన్జీవోస్‌ యూనియన్‌ సభ్యులు

ప్రభుత్వం అందిస్తున్నానంటున్న అభివృద్ది ఫలము, అందరికి అందని పండై, కొందరి నోటికి చెందేదైతే,  అది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మరియు సమసమాజ సిద్దాంతానికే విరుద్దమై వికటిస్తుంది. ఈనాడు మన అభివృద్దిరేటు పెరుగుదల మాట అటుంచితే, ద్రవ్యోల్బణం రేటు మాత్రం విపరీతంగా పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది.  అధిక ధరలతో సామాన్యప్రజలు సతమతమవుతుంటే గోరుచుట్టుపై రోకలి పోటువలే అంతర్‌జాతీయ చమరు మార్కెట్‌ ధరకు సరిచేస్తు కేంద్రప్రభుత్వం పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలను ఇటీవలే పెంచడమైనది. అంతర్‌ జాతీయ చమరు ధర ఇండెక్స్‌ ఆధారముగా పదే పదే పెంచడం వల్ల మన ఆర్థిక వ్యవస్థలో మౌళిక పాత్రయైన ఈ పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలపెరుగుదల ప్రభావము మిగతా రంగాలను శాసిస్తున్నది. ఫలితంగా చుక్కలనంటే నిత్యావసర వస్తువుల ధరలతో  మధ్యతరగతి ప్రజల జీవనం పెనుభారమవుతున్నది. దయానీయపు అంచుపై వీరి బతుకులు పొర్లాడుతున్నాయి.  ఇందుకు స్పందించిన తెలంగాణ బడుగు ఉద్యోగుల గుండెలు టియెన్జీవోస్‌ భవనపు ఆవరణముందు తన నిరసన జ్వాలలను మూకుమ్మడిగా వెల్లగక్కాయి. 

తెలంగాణ యెన్జీవోస్‌ యూనియన్‌ రధసారధి, తెలంగాణ ఉద్యోగ కిశోరమైన ఆన్న శ్రీ స్వామిగౌడ్‌ గారు మరియు సంఘపు ప్రధాన కార్యదర్శి మరియు కార్యనిర్వాహణ రూపశిల్పియైన అన్న శ్రీ దేవి ప్రసాదరావు గారి నాయకత్వంలో టియెన్జీవోస్‌  సిటీబ్రాంచ్‌ చైర్మ్‌న్‌(అడ్‌హక్‌ కమిటీ),అన్న శ్రీ మహమ్మద్‌ ఇక్రముద్దీన్‌ గారి  కృషితో హైదరాబాద్‌ మరియు రంగారెడ్ది జిల్లాలనుండి వచ్చిన వివిధ  యూనిట్ల అధ్యక్ష ,కార్యదర్శుల సమ్మేళనంతో కాగడాలను చేతబూని నిరసన ప్రదర్శనను నిర్వహించడమైనది.

ఈ సందర్భముగా సంఘపు అధ్యక్షులు అన్న శ్రీ స్వామిగౌడ్‌ గారు తన కంచుకంఠంతో ధరల పెరుగుదల నిరసన ధ్వనుల మధ్య ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వము ప్రజా స్పందనను ఎప్పటికప్పుడు గమనిస్తూ  అందుకు తగిన పరిష్కార మార్గములను అన్వేషించి వాటిని వెంటనే అమలుపరచవలసిన అవసరంవుంటుందని పేర్కోన్నారు. ఈనాడు  అధిక ధరలకు, పెంచిన పెట్రోల్‌ ధరలకు  ఉద్యోగ బడుగువర్గాలు సతమతమగుతున్నారని, ఉద్యోగులు తగిన  రవాణ సౌకర్యంలేక తమ ఆఫీసులకు వెళ్ళడానికి ద్వీచక్ర వాహనాలనే ఎక్కువగా వాడుతుంటారని, వారికి పెరిగిన పెట్రోల్‌ ధరలు పెనుభారంకాగలవని పేర్కోన్నారు. ఈ తరహ నిరసన జ్వాలలే సామాన్య ప్రజలనుండి కూడా వస్తున్నందున పెంచిన చమరు ధరలస్థాయికి రాష్ట్రప్రభుత్వం తన అమ్మకపు పన్నును తగ్గించుకొని ప్రజలకు ఊరట కల్గించవలెనని ఈ సభాముఖముగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రియైన  మాన్యశ్రీఅన్న రాజశేఖర్‌రెడ్డి గారికి సవినయముగా మనవిచేస్తున్నానని తెలియజేసారు. ప్రభుత్వానికి సేవకులమే అయినా ప్రజాస్పందనకు పక్షపాతులమని అందుకే రాష్ట్రంలోని సామాన్యప్రజలు వెలుబుచ్చుతున్న నిరసన ధ్వనులకు ఉత్తేజితులమై, పెరిగిన ధరలవల్ల బాధితులమై, సామాజిక స్ప ృహతో తెలంగాణ ఉద్యోగ సమాజం ఈరోజు కాగడాలతో  నిరసన ప్రదర్శనను నిర్వాహిస్తున్నదని తెలియజేసారు.                    
                                          
ఇదే సందర్భముగా సంఘపు  ప్రధాన కార్యదర్శి,  అన్న శ్రీ దేవి ప్రసాదరావు గారు తన ఉపన్యాసంలో ఉద్యోగులు కేవలం తమ జీతభత్యాలను పెంచుటకే పోరాటంచేయువారుకాదని,ఇందుకు ఈ భారీ నిరసన ప్రదర్శనే నిదర్శనమని తెలిపారు.

ధరల పెరుగుదలపై ప్రజా నిరసన వెల్లువను గమనించి వారి స్పందనతో   మమేకమై ప్రభుత్వానికి నిరసన తెలియజేయుచున్నామని పేర్కొన్నారు. వివిధ యూనిట్లనుంచి వచ్చిన అధ్యక్షులను  మరియు కార్యదర్శులను ప్రశంసిస్తూ ఇంతపెద్దసంఖ్యలో వచ్చి  భారీ నిరసన ప్రదర్శనకు ప్రేరకులై, విజయవంతముగా ఈ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిని అభినందిస్తున్నానని తెలియజేసారు. తెలంగాణ యెన్జీవోస్‌ యూనియన్‌కు ప్రజా నిరసనలను ఆస్వాదించే ఆనవాయితి వున్నదని ఈ క్రమములోనే  ప్రభుత్వ నిర్ణయపరంగా కాని లేదా ప్రభుత్వ కార్యనిర్వాహణలో వివక్షతా ధోరణీలవల్లగాని యెన్జీవో వర్గానికి ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని ప్రతిఘటించి పోరాడిన చరిత్ర తమకున్నదని తెలిపారు. ఈ పరంపరలోనే పెరిగిన ధరలకు నిరసనగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నామని, ఇందుకు  స్పందించి  ప్రభుత్వం వెంటనె ధరలను అదుపుచేయు మార్గాలను అన్వేషించి అమలుపరచవలెనని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు..

ఈ సందర్బముగా సంఘపు కార్యనిర్వాహణ కార్యదర్శియైనా శ్రీ మహమ్మద్‌ ఇక్రముద్దీన్‌ గారు తన ముగింపు ప్రసంగంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నియూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులకు తమ ధన్యవాదాలను తెలియజేసారు.

దిక్కులుపెక్కుటిల్లగా ”ఆవాజ్‌ దో, హం యేక్‌ హై ” అంటూ కాగడాల కాంతులతో అనాటి కార్యక్రమము ముగిసినది.

న్యూస్‌ రైటర్‌ : జి.కృష్ణమూర్తి 
అధ్యక్షులు , వాణిజ్య పన్నుల శాఖ
జంట నగరాల యూనిట్‌, టీయెన్జీవోస్‌ యూనియన్‌  (హైదరాబాద్‌)

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో