తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు - తెరాస భవిష్యత్తు వ్యూహం
జూన్ 15th, 2008 by డిస్కవర్ తెలంగాణ
- యం. కోదండరాం, కె. సీతారామారావు
I
భారతదేశంలో ఎన్నికలు, ఈమధ్యకాలంలో, కేవలం ప్రతినిధులను ఎన్నుకోవడానికే కాక విధాన నిర్ణయ ప్రక్రియలో ప్రజలు భాగస్వామ్యం పొందడానికి, విధాన నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి కావలసిన శక్తిని, ప్రభావాన్ని పొందడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో కొన్ని పార్టీలు సామాజిక మార్పుకు ఎన్నికలను సాధనంగా వాడుతున్నాయి.
మనరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధానంగా ఎన్నికలపైనే ఆధారపడింది. ఎన్నికల ద్వార సమైక్యవాదులను ఒంటరి చేసి, రాజకీయంగా దెబ్బకొట్టి తన బలాన్ని పెంచుకోవచ్చునని తెరాస విశ్వసిస్తున్నది. అట్లా తెలంగాణలో సీట్లన్ని గెలిస్తే సంకీర్ణ రాజకీయాల యుగంలో రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధించుకోవచ్చునని తెరాస నమ్ముతున్నది. ఈ మార్గంలో నడిచి తెరాస గణనీయమైన విజయాలను సాధించింది. వనరుల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను, సామాజిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణ ఎదుర్కొంటున్న వివక్షను అట్టడుగు వర్గాల ప్రజలకు తెలియజేయగలిగింది. తెలంగాణ రాజకీయాలపై ఆంధ్ర సంపన్న వర్గాల పెత్తనాన్ని బలహీనపర్చింది. తెలంగాణ ప్రజల్లో రాష్ట్రాన్ని సాధించుకోగలమన్న ఆత్మ విశ్వాసాన్ని కలిగించి పెంపొందించింది. తెలంగాణ డిమాండుకు అనుకూలంగా జాతీయ స్థాయిలో అనేక రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టింది.
అయితే పార్టీ నిర్మాణంలోను, దాని రాజకీయ కార్యాచరణలోను స్పష్టంగా ఎన్నదగిన లోపాలు కూడా ఉన్నాయి. అందుకే ఈసారి ఉపఎన్నికల్లో నల్లేరు మీద నడకగా రావలసిన గెలుపు కొరకు తెరాస బాగా శ్రమపడవలసి వచ్చింది. అందుకుగల కారణాలను వెతుక్కొని, సరిదిద్దుకోకపోతే తెలంగాణ ఉద్యమమే బలహీనపడే ప్రమాదం ఉన్నది. అయితే ఈ మూల్యాంకనం చేయడానికి ప్రస్తుత రాజకీయ పరిస్థితి పరిణమించిన తీరును పరిగణలోనికి తీసుకోవలసిన ఉంటుంది. ఈ దృక్పథంతో తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస వ్యూహం సఫలం కాకపోవడానికి గల కారణాలను, తెరాస భవిష్యత్తులో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహానికి, కార్యాచరణకు సంబంధించిన అంశాలను రేఖామాత్రంగా క్లుప్తంగా వివరించడం జరిగింది.
II
ఇప్పుడొచ్చిన ఉప ఎన్నికలు ఒక రకమైన రాజకీయ అనివార్యత ఫలితమే. తెరాస యుపిఎ ప్రభుత్వంతో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా చేసిన ప్రయత్నాలన్ని విఫలమయిన తరువాత చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాన్ని ప్రజల్లో బహిర్గతం చేయడానికి తెరాస ఒక సవాలుగా తీసికొచ్చినవే ఈ ఉప ఎన్నికలు. ఒక ప్రజల డిమాండ్‌కై / అకాంక్షకై ఇంతమంది ప్రజా ప్రతినిధులు తమ ప్రాతినిధ్యానికి రాజీనామాలు చేసి ప్రజల తీర్పును కోరుతు ఎన్నికలకు పోవడం భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతకు ముందెన్నడు జరుగలేదు. ఇంతటి సాహసానికి పూనుకొన్న పార్టీ భారత రాజకీయాల్లో ఇంతవరకు తెరాస ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర సాధనను ఏకపక్షంచేసి తద్వారా యుపిఎ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచి మార్గాన్ని త్వరితగతిన మరింత సుగమం చేయాలనే వ్యూహంతో తెరాస ఈ ఎన్నికలను తెచ్చింది. అయితే తెరాస రచించిన ఈ రాజకీయ వ్యూహాన్ని తప్పు పట్టాల్సిన అవసరంలేదు. కాని ఈ వ్యూహాన్ని అమలుచేయడంలో దొర్లిన లోపాలవల్లే ఎన్నికలు వికటించి తెరాస అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయిందనేది మన ముందున్న వాస్తవం. మొత్తం మీద ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే తెలిసే విషయం ఏమిటంటే; ఇది తెరాసకు, తెలంగాణ ఉద్యమానికి ఎదురు దెబ్బే తప్ప తెలంగాణవాదం వీగిపోలేదు, ఓడిపోలేదు. ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష క్షీణించలేదు. తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష ప్రజాక్షేత్రంలో మరింత విస్తృతమై తన పునాదిని ఇంక ఎక్కువ పటిష్ఠం చేసుకొన్నది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, ఎన్నికల ఆత్మ రక్షణ ఎత్తుగడగా నైనా, తెలంగాణారాష్ట్ర అవశ్యకతను అంగీకరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ‘తెలంగాణ రాష్ట్రం మాతోనే సాధ్యమని’, తెలుగుదేశం ‘మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదని కమిటి నివేదిక ననుసరించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని’ స్పష్టమైన వాగ్ధానాలు చేసినారు. రాబోయే కాలంలో ఈ రెండు పార్టీలకు ప్రజాక్షేత్రంలో వాగ్ధాన భంగం చేసే ధైర్యముందా? తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష విస్తృతమవుతున్న ఈ తరుణంలో ప్రజల్లో ఓ మాట మాట్లాడి తప్పించుకొని పోయే రోజులు కావివి. తెరాస సీట్లు తగ్గినవి కాని మరో ముఖ్య విషయం ఏమిటంటే ఓట్లు (2004 ఎన్నికల్లో 24 శాతం అనుకుంటే) ఈ ఎన్నికల్లో 35 శాతానికి పెరిగినవి. అదే తెలుగుదేశం ఓట్లు తగ్గి 28.5 శాతానికి, కాంగ్రెస్ ఓట్లు కొంచెం పెరిగి 29.5 శాతానికి చేరుకున్నవి. రేపు 2009లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాప్రాంతంలో ఏ పార్టీ అయినా తెలంగాణావాదాన్ని విస్మరించి, తెరాసను పక్కనపెట్టి ఎన్నికల్లో సీట్లు గెలువడం అసాధ్యమయిన పరిస్థితని ఈ ఉప ఎన్నికల ఫలితాలవల్ల తేలింది. తెరాసకు సీట్లు ఎందుకు తగ్గాయన్నదే కీలకమైన ప్రశ్న? దీనికి జవాబు వెతుక్కొంటే; తెరాస తెలంగాణా ఆకాంక్షపట్ల ప్రజలకున్న స్వచ్ఛందతను (voluenterism) అతిగా అంచనా వేసింది. ఇతరేతర ప్రభావాలు ఏవి పనిచేసినా తెలంగాణా ‘సెంటిమెంట్’ దానంతటదే మమ్ములను గెలిపిస్తుందని తెరాస అభ్యర్థులు భావించి, అతి విశ్వాసంతో చేయాల్సిన కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు. తెలంగాణా ఆకాంక్షను ఓట్లుగా మలుచుకొనే ఎన్నికల నిర్వహణ (poll management) కార్యక్రమాలన్నింటిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అంతేగాకుండా తెరాస అభ్యర్థుల పట్ల వారి నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత (anti-incumbancy) పెరిగింది. దీనికి గల ప్రధాన కారణాలు స్థానిక ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, కార్యకర్తలతో సత్ససంబంధాలు నిర్వహించకపోవడం, పార్టీ యంత్రాంగాన్ని బూత్ స్థాయి నుండి నిర్మించి పటిష్ఠం చేసుకోకపోవడం వంటీ వెన్నో కారణాలు తెరాస అభ్యర్థుల ఓటమికి కారణాలయినవి. ఈ ఉప ఎన్నికల్లో పోటీచేసిన పార్టీలన్నీ, ఒక్క సి.పి.యం.ను మినహాయిస్తే, తెలంగాణావాదాన్ని జపించి తెలంగాణాపట్ల రాజకీయ పోలరైజేషన్ ప్రక్రియను తటస్థీకరణ (neutralise) చేయడానికి ప్రయత్నించారు. ఆ విధంగా జరిగినపుడు తెలంగాణ వాదంతో పాటు ఇతర అంశాలు చర్చనీయం అవుతయని, ధనబలం, పార్టీ యంత్రాంగం, కార్యకర్తల పనితీరు నిర్ణాయకాంశాలు అవుతయని తెరాస అంచనా వేయలేకపోయింది. తెలంగాణా రాష్ట్రం వస్తే వచ్చే తక్షణ లాభాలేమిటి? దీర్ఘకాలిక ప్రయోజనాలేమిటి? ఏ సమస్య ఎట్ల పరిష్కారమవుతుంది? ఏ అన్యాయం ఎట్ల తొలగిపొతది? ఏరంగం ఎట్ల అభివృద్ధి అవుతది? వంటి ప్రశ్నలకు జవాబులు చెప్పి వాటిని తమ ఎన్నికల ప్రచారసరళిలో భాగం చేసుకోవాలనే సోయి తెరాసకు లేకపోయింది. ఇవి తెరాస పార్టీ తీసుకొచ్చిన దండగమారి, ప్రజాధనం వృధా చేసే ఎన్నికలని కాంగ్రెస్ ప్రచారం చేస్తే, కాంగ్రెస్ తన రాజకీయ అధికారం కోసం ఎన్నిసార్లు ప్రభుత్వాలను కూలదోసి మధ్యంతర ఎన్నికలు తీసికొచ్చి ప్రజాధనం వృధా చేసిందని ప్రశ్నించి అటువంటి ఆరోపణలను గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం తెరాస తన ప్రచారంలో భాగం చేయలేదు. మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్న తెరాస గుర్తించని ప్రధాన లోపమేమిటంటే; స్థానిక సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాలు నడిపి, తెలంగాణా ఉద్యమంతో వాటిని అనుసంధానించి తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను ప్రజల మనోభావనలో పటిష్ఠమొనర్చే (concretise) ప్రయత్నం చేయాలనే సోయి లేకపోవడం. భవిష్యత్తులోనైనా తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను ప్రజల నిత్య చైతన్యంలో కాంక్రిటైస్ చేయడం ద్వారానే తెరాస ఒక రాజకీయ పార్టీగా తన యంత్రాంగాన్ని, కార్యకర్తలను కన్సాలిడేట్ చేసుకొని ప్రజా పునాదిని విస్తృతం చేసుకోగలగుతుంది. నిజానికి ఓడింది తెరాస అధినాయకత్వం అంచనాలే తప్ప తెలంగాణా వాదం మాత్రం కాదు. ఇప్పటికీ తెలంగాణా వాదం తెరాసలోనే ఉన్నది. అనవసర విషయాలకు అతిగా స్పందించకుండా, నాటకీయత కొనసాగించకుండా ఉప ఎన్నికల ఫలితాల నుండి సరిఅయిన గుణ పాఠాలు స్వీకరించి, పార్టీ నాయకత్వం వ్యవహరణ శైలిని పూర్తిగా మార్చుకొని, పార్టీని బలోపేతం చేసుకొని ఉద్యమ విస్తృతిని పెంచితే, రాబోయే సంక్లిష్ట సందర్భాల్లో నిర్ణాయక పాత్ర పోషించే అవకాశం తెరాసకు నిశ్చయంగా ఉంటుంది.
III
పూర్తిస్థాయి ఉద్యమ సంస్థగా పార్టీలు పనిచేయడానికి, ఎదగడానికి ఇవ్వాళ పరిస్థితులు సానుకూలంగా లేవు. ముఖ్యంగా గత తెలుగుదేశం కాలం నుండి రాజకీయాల స్వభావం మారిపోయింది. 1970ల నుండి ప్రజల సమస్యలను వ్యక్తీకరించి, వాటికి పరిష్కారాలను చూపి రాజకీయాలలో నిలదొక్కుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నించాయి. చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని, పార్టీని తన నాయకత్వంలోనికి తెచ్చుకోవడానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక పూర్తిస్థాయి వ్యాపారంగా మారలేదు. ఆ విధంగా రాజకీయ సంస్కృతిని కార్పోరేట్ వ్యాపార సంస్కృతిగా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఇందిరాగాంధీ సమ్మోహనాత్మక రాజకీయాల కంటే ముందు గ్రామాల్లో ఓట్లు ఆ గ్రామ పెద్దల/భూస్వామ్య వర్గాల చెప్పుచేతుల్లో ఉండేవి. ఎప్పుడైతే ఇందిరాగాంధీ తన ‘గరీబీ హఠావో’ నినాదంతో ప్రత్యక్షంగా ప్రజలకు, మధ్యంతరంగానున్న భూస్వామ్య పెత్తందార్లను పక్కకు తోసి, అప్పీల్ చేసి ఓట్లు సాధించుకొనే పద్ధతి ప్రవేశపెట్టింది. దాదాపు ఇదే పద్ధతిని ఎన్టీఆర్ తన సినీ గ్లామర్‌తో మొదటి ఎన్నికలను 1983లో స్వీప్ చేయగలిగాడు. దీనితో పాటు వెనుకబడ్డ సామాజిక వర్గాల నాయకత్వానికి అవకాశాలు కల్పించడంతో పాటు పార్టీ నిర్మాణంపై కూడ కొంతమేరకు దృష్టిని సాధించకలిగాడు. ఆ తరువాత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ఈ పద్ధతిని వదిలేసింది. కాంట్రాక్టుల ఆశచూపి స్థానిక నాయకులను తమవైపు తిప్పుకొని, పైసలు పోసి సర్పంచులను తదితర స్థానిక ప్రతినిధులను కొనుక్కొని, ప్రత్యర్థులను దెబ్బతీయడానికి, పార్టీని నిలబెట్టడానికి, ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించింది. తెలుగుదేశం తెచ్చిన మార్పులతో రాజకీయాలు ఒక పూర్తిస్థాయి వ్యాపారంగా మారిపోయాయి. ఈ వ్యాపారంలో నిబద్ధతతో ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం లేకుండా పోయింది. సమిష్టి ప్రయోజనం సాధించవలసిన రాజకీయాలు నాయకుల, నోరున్న వ్యక్తుల అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి.
ఈ కొత్త రాజకీయాలకు సరళీకరణ యుగంలో వచ్చిన విలువలు, వ్యవస్థలు, ప్రక్రియలు కూడా తొడైనాయి. సరళీకరణ యుగంలో రాజ్యం తన అభివృద్ధి-సంక్షేమ విధులను తగ్గించుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాజ్యం అంతవరకు నిర్వర్తించిన విధులలో కొన్నింటిని నిపుణుల కమిటీకి వదిలేసింది. మరికొన్నింటిని వినియోగదారుల కమిటీకి అప్పచెప్పింది. ప్రజా సంక్షేమానికి సంబంధించిన పనులను వాడకందార్ల సంఘాలకు వదిలేసింది. చెరువుల కమిటీలు, పొదుపు సంఘాలు, న్కూల్ కమిటీలు ఈరకమైన కమిటీలలో ముఖ్యమైనవి. ఇక పాలకుల ప్రయోజనాలకు సంబంధించిన పనులను నిపుణుల కమిటీ చూసుకుంటున్నది. టారిఫ్ రెగ్యులేటరీ కమిటీ ఈరకమైన కమిటీలలో ముఖ్యమైనది. కనుక స్థూల ఆర్థిక విధానాలను, ప్రజాసంక్షేమానికి సంబంధించిన విధానాలను రాజకీయాల పరిధి బయటకు నెట్టివేసినారు. మౌలిక సదుపాయాల నిర్మాణం, పారిశ్రామిక విధానం, కరెంటు రేట్లు, పొదుపు-పరపతి సౌకర్యాలు వంటి విషయాలను రాజకీయ వ్యవస్థలలో చర్చించడానికి వీలులేకుండా చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పెంచడానికి అన్ని వ్యవస్థలను నిర్మాణం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ పనిని ప్రభుత్వాలు వదులుకోవడంతో రాజకీయాలలో మౌలిక విషయాలు చర్చలోకి రావడంలేదు. ఆయా కమిటీలలో చర్చ వ్యక్తిగత లాభం లక్ష్యంగా కొనసాగుతున్నాయి. కనుక వ్యక్తిగత లాభాన్ని సాధించే లక్ష్యంతోనే రాజకీయాలు నడపటానికి ఈ వ్యవస్థలో ఆస్కారం కలిగించాయి.
అయితే ఈ సరళీకరణయుగ రాజకీయాలు కూడా క్రమంగా సంక్షోభంలో పడిపోయాయి. వైయక్తిక ప్రయోజనాల కొరకే తాపత్రయపడటం వలన పార్టీల పట్ల, నాయకుల పట్ల ప్రజలలో విశ్వాసం క్రమంగా క్షీణించిపోయింది. ఈ పరిస్థితిలో సరళీకరణయుగ రాజకీయాలకు జవాబుగా తెలంగాణ ఉద్యమం ముందుకొచ్చింది. ప్రజల జీవితాలకు సంబంధించిన మౌలిక సమస్యలను లేవనెత్తింది. ప్రాంతాల మధ్య వనరులను సమానంగా పంపిణీ చేయవలసిందేనని డిమాండ్ చేసింది. ప్రజలకు బతుకుదెరువు చూపించవలసిన కర్తవ్యం ప్రభుత్వానిదేనని నొక్కిచెప్పింది. అయితే ఈ రాజకీయాలను వ్యక్తీకరించడంలో, వ్యవస్తితం చేయడంలో తెరాస పూర్తిగా సఫలీకృతం కాలేదు. సరళీకరణ రాజకీయాల్లోని అవలక్షణాలు ఏదో ఒకస్థాయిలో తెరాసలోను ప్రతిబింబిస్తున్నాయి. ‘గొంగట్ల తింటున్నప్పుడు ఎంటికలు ఎట్ల రాకుండ పోతయి?’ ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్నా తెరాస నాయకులు సరళీకరణ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయడం లేదు. తెరాస తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఎన్నికల రాజకీయాలతో అనుసంధానించి ప్రజాక్షేత్రంలో సక్రమంగా వ్యక్తీకరించి, బలోపేతం చేసి, వ్యవస్థితం చేయడంలో సఫలం కాలేకపోయింది. ఇవ్వాల్టి పరిస్థితుల్లో తాను ఎంచుకున్న వ్యూహంలో విజయం సాధించాలంటే, తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలంటే తెరాస ప్రధానంగా రెండు పద్ధతులను పాటించవలసి ఉంటుంది. మొట్టమొదటి విషయమేమిటంటే పార్టీ నాయకులు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. ప్రజల స్థానిక సమస్యలను తెలంగాణ ఉద్యమ ఎజెండాలో అంతర్భాగం చేయాలి. స్థానిక సమస్యలపై సాగే ఉద్యమాలను తెలంగాణ ఉద్యమంతో అనుసంధానం చేయాలి. అప్పుడే తెలంగాణ డిమాండు ప్రజల నిత్య చైతన్యంలో అంతర్భాగమయి, సజీవంగా నిలబడగలుగుతుంది.
ఇక రెండవ విషయమేమిటంటే, ఈరకమైన కార్యకలాపాల నిర్వహణకు పటిష్టమైన నిర్మాణం కావాలి. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయిదాక ప్రజాస్వామిక పద్ధతిలో కమిటీలను వేసుకోవాలి. ప్రతిస్థాయిలో కమిటీల, నాయకుల బాధ్యతలను, విధులను స్పష్టంగా నిర్వచించాలి. పార్టీ పనితీరును నిరంతరం సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ లోపాలే ఉప ఎన్నికల్లో బయటపడ్డాయి. అభ్యర్థుల మీద విపరీతమైన నిరసన వ్యక్తమైంది. పదవిలో ఉన్నప్పుడు స్థానిక సమస్యలను పట్టించుకోలేదని, అందుబాటులో లేకుండా పోయారని ప్రజలన్నారు. ఇప్పటికి మించిపోయింది లేదు. ఒకరకంగా ఆలోచిస్తే ఈ ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ ఉద్యమానికి క్షేమదాయకమైనవే. 2009 ఎన్నికల్లో ఈ ఫలితం వస్తే కోలుకోలేని నష్టం జరిగేది ఇవ్వాళ వచ్చిన ఫలితాలను గుణపాఠంగా తీసుకొని వేగంగా కదిలితే 2009 కల్లా అన్ని పార్టీలను ఖంగుతినిపించవచ్చు.
IV
ఈ వ్యాసంలో చేసిన విశ్లేషణ ననుసరించి తెలిసే విషయమేమిటంటే, ఉప ఎన్నికలు తీసుకురావడానికి ప్రాతిపదికగా పనిచేసిన వ్యూహం, దాని లక్ష్యాన్ని తప్పు పట్టాల్సిన అవసరంలేదు. కాని దాన్ని అమలుచేయడానికి వేసుకొన్న అంచనాలు (ముఖ్యంగా ప్రజల చైతన్యస్థితి, పార్టీ నిర్మాణశక్తి, కార్యకర్తల నిబద్ధత ఇతరత్రా) తారుమారు కావడంవల్ల ప్రతికూల ఫలితాలు రావడం జరిగింది. ఒక రాజకీయ పార్టీగా తెరాసకు రెండు లక్షణాలున్నవి ఒకటి ఉద్యమ స్వభావమైతే రెండోది దానికనుగుణమైన రాజకీయ ప్రక్రియను నెరపడం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఆ తరువాత జరిగే తెలంగాణ సమాజ పునర్నిర్మాణం కోసం తెరాస ఏకకాలంలో ఇటు భావజాల వ్యాప్తితో పాటు అటు పటిష్టమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూనే దాని ఆధారంగా శక్తివంతమైన రాజకీయ ప్రక్రియను అత్యంత చాకచక్యంగా, నైపుణ్యంతో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చాల సంక్లిష్టమైనది. దీన్ని ఆచరణలో పెట్టడం ఉపన్యాసం చెప్పినంత సులువైన విషయం కాదు. తెలంగాణ ప్రాంతంలోనున్న చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల వల్ల ఇక్కడి ప్రజల స్వభావం ఉద్యమశీలమైనది అంటే తెలంగాణ ప్రాంత వ్యక్తిత్వం ఉద్యమశీలమైనదిగా పరిగణించాలి. ఈ ప్రాంత సామాజిక-సాంస్కృతిక నిర్మాణంలో భాగమైన వ్యక్తిత్వాన్ని, విలువలను, వివిధ అస్తిత్వాలను పరిగణనలోకి తీసుకొని వివిధ స్థల-కాల పరిస్థితులు కనుగుణంగా ఉద్యమ రాజకీయాలను, లాబీయింగ్ రాజకీయాలను, సమర్థవంతంగా అనుసంధానించి ప్రజల సమస్యలను పరిష్కరించే రాజకీయ కార్యాచరణనను తదనుగుణమైన వ్యూహాలను, కార్యక్రమాలను రూపొందించుకోవాలి.
తెరాస అనుసరించాల్సిన భవిష్యత్ వ్యూహానికి వస్తే, ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే రాబోయే సాధారణ ఎన్నికలకు ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి రాబోయే కాలంలో రాజకీయ యవనికపై సమీకరణాలు చాలా వేగవంతంగా మారుతాయి. దీన్ననుసరించి తెరాస చాల చరుకుగా, వేగంగా కదలాల్సి ఉంటుంది. పరిస్థితుల కనుగుణంగా స్పందిస్తూ వ్యూహాత్మక నిర్ణయాలు తీసికొని ముందుకుపోవాలి. తెరాసకు బయటపనిచేస్తున్న వివిధ తెలంగాణా ప్రజాసంఘాలను, వివిధ పార్టీలో ఉన్న తెలంగాణా అనుకూలశక్తులను ప్రత్యక్షంగా, పరోక్షంగా వీలైనంత త్వరలో ఏకీకరణ చేయాలి. ఈ ప్రజాసంఘాల సేవలను భావజాల వ్యాప్తికి, ఉద్యమ విస్తృతికి సమర్థవంతంగా వినియోగించుకోవాలి. స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలను సమీకరించి, ఉద్యమాలు నిర్మించి తెలంగాణావాదంతో రాష్ట్ర సాధనతో అనుసందానించాలి. ఈక్రమంలోనే పార్టీ నిర్మాణాన్ని బూత్‌స్థాయి నుండి జిల్లా స్థాయివరకు పటిష్ఠం చేసుకొని ఆటు కార్యకర్తల సంఖ్యను, ఇటు ప్రజా పునాదిని విస్తృతమొనర్చుకోవాలి. రాష్ట్రస్థాయిలో తెలంగాణా ఉద్యమానికి సరిఅయిన దిశా నిర్దేశనం చేయగల నిబద్ధతగల నాయకత్వంతో పటిష్ఠమైన పార్టీ వ్యవస్థను నిర్మించుకోవాలి. స్థూలస్థాయిలో భావజాల వ్యాప్తికి, ఆందోళనా కార్యక్రమాలకు, లాబీయింగ్ ప్రక్రియకవసరమైన రాజకీయ కార్యాచరణనను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని రూపొందించుకోవాలి. తెలంగాణాలో జరుగుతున్న వివిధ అస్తిత్వ, సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలను రాజకీయోద్యమంతో అనుసంధానించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జరుగబోయే పునర్నిర్మాణం వల్ల కలిగే తక్షణ లాభాలు, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి స్పష్టమైన లక్ష్యాలతో కూడిన ‘మానిఫెస్టోను’ విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల అవగాహనలోకి తీసుకొనిరావాలి. 2009 సాధారణ ఎన్నికలు లక్ష్యంగా వేగంగా, చురుకుగా కదలగలిగే వ్యూహాన్ని, నిర్మాణాన్ని, విధి విధానాలను త్వరితగతిన రూపొందించుకోవాలి. మొత్తం తెలంగాణాలోని నియోజక వర్గాలన్నింటిని సమగ్రంగా అధ్యయనంచేసి పార్టీ నిర్మాణాన్ని విస్తృతపరిచి అభ్యర్థులను ముందుస్తుగానే నిర్ణయించి చేయాల్సిన విధులను స్పష్టంగా నిర్వచించి, నిర్వహించాల్సిన బాధ్యతలను, కార్యక్రమాలను నిరంతరంగా సమీక్షించాలి. ఉప ఎన్నికల వల్ల తెరాసకు సీట్లు తగ్గినవి కాని మంచి అనుభవమొచ్చింది, ఈ అనుభవం నుండి అవసరమయిన, సరిఅయిన గుణపాఠం స్వీకరించి ఒక సమగ్ర దృక్పతంతో, పటిష్ఠమైన నిర్మాణంతో వేగంగా కదిలితే తెలంగాణ రాష్ట్ర సాధనలో తెరాస నిర్ణయాత్మక పాత్ర పోషించడం ఖాయం. ఇప్పటికైనా మునిగిపోయిందేమిలేదు. తెరాస బలం సీట్ల రూపంలో తగ్గిందికాని ఓట్ల రూపంలో పెరిగింది. తెలంగాణా ఆకాంక్ష బలహీనపడలేదు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలు, చైతన్యం తెరాస రాజకీయ కార్యాచరణకన్న విస్తృతమైనవి, విశాలమైనవి. తెలంగాణ ప్రజల కష్టాలపట్ల సానుభూతి, నిబద్ధత ఉండి మానవీయంగా స్పందించే ఎంతోమంది విద్యావంతులుండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. అయితే ప్రస్తుత తరుణంలో కావాల్సింది ప్రజల ఆకాంక్షలను సరిఅయిన విధంగా వ్యక్తీకరించగలిగే రాజకీయ కార్యాచరణ, దానికి దిశానిర్దేశనం చేయగలిగే చాతుర్యంగల రాజకీయ నాయకత్వం. ఈ పని తెరాస చేయకల్గుతుందా, లేదా? అనేది వేచిచూడాల్సిన విషయం.




నమస్స్థ్ సారులు,
జరిగిన యెన్నికలు ప్రజాథీర్పు కనె కాధు , 50% పొలు కాలెదు…వొత్ల ష్థమ్ పెరిగింది కాని ముందు ముందు యెమి చెయ్యలి యెలా చెయ్యలి ఈ విషయలు విద్యావంథులు
TRS వల్లకి చెప్పాలి మరియు చెయుథ నివ్వ్వ్వాల్సివుంది సొ
జరిగిందెదొ జరిగింది Let us help each other but do it Conditionally.
Finally TRS should not fool around.
Jai telangana
Rameshchandra
00971504623109
GTWCA
Dear Telanganites:
We all are experienced for what we did in/by/for telangana= Negligency made & Gifted with Failure Love with Increased no of votes, Let us learn from this mistake and prepare for proper protest:
Let us Start indeffinite Relay Hunger strike infront of Secreteriate/Assembly/Gandhibavan:
should be indeffinite until we get our Telangana State saying All Telangana well wishers are welcome and Not limited to TRS/BJP who ever it may concern Telangaana…no bar Bcz hardly we have 10 months time for further elaections…Let us think of it and i feel this is the time for Action not Mounam…
Jai telangana….
Rameshchandra
Dear Writers & Readers,
It’s a well-written article with good political analysis. Writers mentioned that Politics have become Business, Political Parties are run as Companies, and Party Chiefs behave as CEOs. Also told that TRS can not work as a ‘Udyama’ organization in this Post-liberalization political arena. Hence, Building TRS as a Political Party and FUND-RAISING for Election Expenses is more IMPORTANT. ‘Udyamam’ & ‘Telanganavadam’ only can not get votes & seats! Future TRS strategy - they should find solutions for FUND-RAISING, build relationships & Collaborations with Leading Business Leaders/organizations, idenfify potential Political/Business leaders at Village, Mandal, Dist. & State-level, etc. besides doing all the Good/Ideal things recommended by the Writers of the Article.
Thanks & Regards,
Sridhar Reddy P
Atlanta, USA
పై వ్యాస రచయితలు చేసిన విశ్లేషణ్ బాగానేఉంది,కాని స్మగ్రంగా లేదనిపిస్తున్నది.
నేను కొన్ని విమర్శలు ,సూచనలు చేస్తున్నాను అదనంగా ,కాని అవికూడా సంగ్రతను చేకూర్చ లేవు.నాలాగే మరెందరో తమ అలోచనలను,అనుభవాలను ఇక్కడ రాస్తే ,మొత్తాన్ని క్రోడీకరిస్తే సంగ్రత వచ్చే అవకాశం ఉంది.
అన్నిటీవీ చానళ్ళలో ఇతర ప్రచారసాధనాల్లో పోటిచేసిన సీట్లలో ఒక్కటికూడా ఓడిపోయేసమస్యే లేదని కేసీఆర్ పదే పదే తను చెప్పడమేకాకుండా తమనాయకులెవ్వరూ భిన్నంగా (హరీశ్ రావుతో సహా) కొంచెం అటూ ఇటుగా చెప్పే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు.అంత గొప్పగా చెప్పుకున్నాడు కాబట్టే 9 స్థానాల్లో ఓడిన పిదప అవమానంగా భావిఇంచాల్సి వచ్చింది, ఫలితాలొచ్చిన రెండు రోజుల తరువాత కూడా మీడియాకు ముఖం చాటేయాల్సి వచ్చింది. అన్నిస్థానలనే కాకుండా ఖైరతాబాదు స్థానాన్ని కూడా బొనస్ గా గెలుచుకుంటామని పబ్లిసిటీ చేసుకున్నాడు, కేసీఆర్. ఇంతకుముందు కూడా మూణ్ణెల్లలో ,రెణ్ణెల్లలో తెలంగాణ వస్తుందని ,సోనియమ్మ ఇస్తుందని తానే హైప్ స్రుష్టించుకుంటూ తను భాధ పడుతూ తెలంగాణవాదులను కూడా బాధ పెట్టాడు. దాన్ని ఆసరాగా చేసుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండిన ఇతర ప్రాంతీయుల చేతుల్లో ఉన్న మీడియా చిలవలు పల్వలు గా చెప్పి,రాసి తెలంగాణా వాదులు క్రుంగి పోయేలా చేసింది. అసలు పీజేఆర్ కొడుకుపై తమ అభ్యర్ధిని నిలబెట్టనని చెప్పమని కేసీఆర్ కు ఎవరు సలహా ఇచ్చారు ? తను చేసిన వాగ్ధానాన్ని తానే ఎందుకు భంగచెయ్యాల్సి వచ్చింది? తనే కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజకీయాల్లో కూడా అంత బాహాటంగా మాట తప్పటాన్ని సామాన్యులు కూడా హర్షించరు,అనేది వారు గుర్తించాలి. ఆకారణంగా ఖైరతాబాద్ లో ఉన్న తెలంగాణా వాదుల ఓట్లు కూడా టీఆర్ఎస్ కు పడలేదేమోననిని నా అనుమానం .
మీరు చెప్పినట్లు ఉప ఎన్నికలకు ముందు తెలంగాణలొ సెంటిమెంట్ ఉంది,దాన్ని గౌర్విస్తున్నం, పార్లమెంటులో బలం కలిగిన తమతొనే తెలంగాణా వస్తుందని ,కనుక తమను గెలిపించక తప్పదని కాంగ్రేసు ఒకవైపు నమ్మబలికితే మన ప్రజలు తెరాస తరువాత స్థానంలొ 5 సీట్లిచ్చి బలాన్ని చేకూర్చారు.ఐతే ఇప్పుడేమో ఇక్కడి ప్రజలు తమ అభివ్రుద్ధిని చూసే ఓట్లేశారని 2009లో జరుగనున్న సాధారణ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని తెలంగాణవాదాన్ని బలహీన పరచాలనే లక్ష్యంతో ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు, అని చెప్పుకుంటూ జైతెలంగాణ -జైతెలుగుదేశం అని బానర్ల పై రాసి పెట్టుకుని ,4 గు స్థానాల్లో గెలిచి తెలంగాణాలో సెంటిమెంట్ ఉంది,కాని మేంగెలిచింది మాత్రం దానితో కాదు అని ముక్తాయింపు నిస్తున్నారు ,తెలుగుదేశం వారు. రెండు పార్టీలుకూడ తెరాస మీద ఆశించినంత బాగా పని చేయడంలేదనే అసంత్రుప్తితో ఉన్న తెలంగాణ ఓటర్లను తమ వైపు తిప్పుకోగలిగారు,కొందరినేమో తికమక పెట్టి ఓట్లేయించుకోగలిగారు. ఇవిపోగా తెలంగాణ ఓటర్లను కొందరిని డబ్బులకు, మద్యాలకు లొంగ దీసుకున్నారు. రెండువేల నాలుగులో తెలంగాణకు చేసిన వాగ్దానాన్నేకాదు,ఉపేన్నికల్లో కూడా తెలంగాణ ఓటర్లను ప్రలోభ పెట్టగలిగిన వాళ్లను ప్రలోభ పెట్టారు, మభ్య పెట్టగలిగిన వాళ్లను మభ్యపెట్టారు. ఇప్పుడు జాగ్రత్తగా వెనకడుగు వేస్తూ తమలోని తెలంగాణా నాయకులను బయటికి పోకుండా ఎత్తులు వేస్తూ వాగ్దానాలు చేయలేదన్నట్లుగానే బ్రమింపజేయ జూస్తున్నారు. ఇన్ని నాటకాలను ,కపటపు ఎత్తుగడలను తెరాస ఎదుర్కోగలదా అనేది అనుమానం కలిగిస్తున్నది. పై పార్టీలవారు ప్రతిసారి మద్యం,డబ్బు మరియు ఇతర విధాలుగా మన తెలంగాణ ఓటర్లను ప్రలోభ పెడ్తున్నారు అని మనం ఆక్రోశిస్తున్నమే కాని నిన్న జరిగిన మద్యం వేలం పాటలను తెలంగాణ ఉద్యమ సంస్థల చేత కూడా లోక్ సత్తాతో కలిసి వ్యతిరేకతను ప్రకటించలేక పోయాము. గాంధీజి జాతీయోద్యమంతో పాటు అస్ప్రుశ్యత వంటి సామాజిక రుగ్మతలకు,అవలక్షణాలకు వ్యతిరేకంగా పోరాడారనేది మనం ఈసందర్భంగా గుర్తుకు తెచ్చుకోవడం మంచిది.
…(ఇంకా ఉంది)
2వ పేజి
మన ఉద్యమానికి ఫండ్స్ సమైక్యవాదులకున్నవాటికంటే ఎన్నో రెట్లు తక్కువని మనకు తెలుసు.అందుచేత అందిన ప్రతిపైసాను జాగ్రత్తగ ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఉంది.
తెరాస తనకు అందిన కొన్నిలక్షల మొత్తాన్నిపెద్ద పెద్ద బహిరంగ సభలను నిర్వహించి ఖర్చు చెయ్యడాన్ని మనమంతా చూశాము,కాని జుడీసియస్ గా అవి ఖర్చ్ చేయబడలేదని నేను భావిస్తున్నాను. ఇటీవలి తెలంగాణ ఉద్యమం వచ్చి 8 సంవత్సరాలైనా ఒక పత్రిక గాని ఒక చానల్ నిగాని మనం తెలంగాణ కొరకు పెట్టుకోలేక పోయాము , అందిన సొమ్ములో కొంత ఖర్చు చేసి ఉంటే బాగుండేద. ఐతే మీదియాలేని ఈపరిస్థితుల్లో బహిరంగ సభలు , చిన్న పెద్ద సమావేశాలే మనకు మీడియాలేని లోపాన్ని పూరించగలుగుతాయి. తెలంగాణకు జరిగిన, ఇంకా జరుగుతున్న అన్యాయాలను మన తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు, ఓటర్లకు వివరించి ఈసభలే చైతన్య పరచగలుగుతాయి. మరి పెద్ద పెద్ద సభలను పెట్టి, లక్షలాది ప్రజలను తమ పనులను పక్కకు బెట్టి రప్పించి తెరాస నాయకత్వం చేసిందేమిటి? సభల్లో కేసీఆర్ గొప్పగా మాట్లాడతాడని అందరికి తెలుసు. కనీసం గంటసేపు తనొక్కడే మాట్లాడి ఎన్నో సందేహాలతో ఉన్న ప్రజలకు సమాధానాలు చెప్పాల్సి ఉండగా 15 నుండి 20 నిమిషాలలో లక్షలాదిగా కూడిన సభల్లోకూడా కేసీఆర్ తన ప్రసంగాలను మొక్కుబడికి చేసిన వాటిలాగా ముగించడం నేను స్వయంగా చూశాను. తనతోపాటు మాట్లాడగలిగిన కొత్త కొత్త వాళ్ళను గుర్తించి కూడా మాట్లాడిస్తే మరో రెండు గంటలు సభను అర్ధవంతంగా కొనసాగించవచ్చు. నేనింతగా ఎందుకు సభల్లో ఎక్కువ సమయమ్ మాట్లాడాల్సిన వంసరం గురించి చెప్తున్నానంటే అవే మన సామాన్య జనాలకు శిక్షణనిచ్చే స్థలాలు/బళ్ళు కనుక. మనం పరాయి మీడియామీది కంటే ఈమీటింగుల మీదనె ఎక్కువ ఆధారపడాల్సి ఉంది. మన నాయకులు చెప్పిందే మన ప్రజలు నమ్మాల్సి ఉంది.కనుక సభలద్వారానే మన అమాయక జనాలను చైతన్య పరచాల్సి ఉందనేది గుర్తించండి. ఆకారణంగానే ఇదంతా రాస్తున్నది. కొంత మంది మనవాళ్లే అంటారు,అంతసేపు సభల్లోకూర్చునే ఓపిక మన ప్రజలకు ఉండదని. కాని సభ ఐపోయిన తరువాత కూడా వాహనాలల్లో తండొపతండాలుగా లక్షలాదిగా తరలిరావడం, అసంత్రుప్తితో మళ్లి పోవడం నేను చూశాను. వందల మైళ్ల దూరంనుండి వచ్చినోడు మూడు గంటలసేపు సభలో ఉండలేడా? మొత్తం ప్రసంగాలు వినలేడా? వచ్చే లారీలు ,వచ్చే జనాలు వస్తూనే ఉంటారు,కొద్దిమంది చాలా ముందుగా సభాస్థలిని చేరిన వాళ్ళు వెళ్ళి (పోతే) పోతూ ఉంటారు. దీనిమీద నిరక్షరాస్య ప్రజల అభిప్రాయాలను సేకరించండి.ప్రయోగాలు చెయ్యండి, అప్పుడు మాత్రమే నేను చెప్పే సూచనల మీద ఒక అభిప్రాయానికి,నిర్ధారణ కు రండి. తెరాస సభలకు వచ్చిన జనాలు చైతన్య వంతులై ఉంటే కొన్ని ఊళ్ళలో నిన్నటి ఉప ఎన్నికల్లో తెరాసకు ఏజెంట్లే లేని పరిస్థితి వచ్చి వుండేదికాదు ,అని నా అభిప్రాయం.
తెరాసనుండి బయటికి వెళ్లిపోయిన నాయకులంతా ద్రోహులు కారు . వారిలో కొందరు తెరస నాయకత్వ విధానాన్ని, పార్టీ నిర్వహణ తీరు నచ్చక వెళ్ళిన వారు కూడా ఉన్నారు. కాంగ్రేసుకు దూరంగా ఉండి తెలంగాణ వాదాన్ని బతికించుదామని,ముందుకు తీసుకు పోదామని చూసిన/చూస్తున్న వాళ్లు కొందరున్నారు. అటువంటి వారిని దొరకబట్టి అక్కున జేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తన చుట్టు ఉండే ,తనకు ఎదురుచెప్పని మేధావులేనా కేసీఆర్ కు తెరస ఇతర నాయకత్వానికి కనిపించేది?అనేది తెరాస నాయక్త్వం ఆలోచించాలి. తెరాస ఏర్పడక ముందు,కేసీఆర్ రంగంలోకి రాకముందునుండి కూడా ఉద్యమాన్ని బతికిస్తున్న వారికి తగినంత ప్రాముఖ్యత ఇవ్వక పోవడం వల్ల వారు దూరంగా ఉండిపోయారు. అట్లాంటి వారిని దూరం చేసుకోవడం/ పెట్టడం తగదుకదా! వీరందరినీ ఉపయోగించుకొని మీడియాలో సమైక్యాంధ్ర వాదులు తమ విమర్శలతో,వాదనలతో చీకాకు పరుస్తున్న ,తిక మక పెడ్తున్న,చదువుకోనివాళ్ళనే కాదు,చదువుకున్నోళ్ళను కూడా కొన్ని సార్లు ఆగం చేస్తున్న వాళ్ళను ప్రతి విమర్శలతో/ప్రతివాదనలతో ఎదుర్కునే విధంగా వారికి పని అప్పగిస్తే(విభజన) చేస్తే ఉద్యమం ఇంతగా కుంటుబడేది కాదు కదా! ఇప్పటికైనా వాళ్ళందరిని తగిన విధంగా ఉపయోగించుకుంటే వారిని గౌరవించినట్లే.ఉద్యమానికి ,ఉద్యమకారులకు అప్పుడప్పుడు అడ్డు తగిలే న్యాయ వివాదాలను చూసుకోవడానికి ,పోలీసులు అరెస్టుచేస్తే విడిపించడానికి ఒక లీగల్ సెల్ ను ఎర్పాటు చెయ్యాల్సి ఉంది.ఎక్కడైనా అనుకోకుండా గాయాలు/దెబ్బల పాలైన వారిని వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే విదంగా ఒక మెడికల్ సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
అలాగే ఎన్నికలతోటిగాదు ,ఉద్యమంతోటి మాత్రమే తెలంగాణా వస్తుందని భావించే వారికి ప్రజాసమస్యలను,ఉద్యమ కార్యక్రమాలను అప్పజెప్పితే తెరాసకే మరికొంత భారం తగ్గుతుంది, ఐతే వారితో కొంత వివరమైన చర్చలు లోలోపలనైనా జరపాల్సి ఉంది .తెలంగాణ ఉద్యమంలోని వివిధ ప్రజా సంఘాల వాళ్ళు ఆయా నియోజక వర్గాల్లో ప్రచారానికి వెళ్ళి అక్కడి ఓటర్లు అభ్యర్ధులను తిడుతుంటే చెవులు మూసుకోవాల్సి వచ్చింది.వారి అనుభవాలను ఓడిన అభ్యర్ధులన్నా తెలుసుకొని ఇకముందు పోటీ చెయ్య బొయ్యే వాళ్ళకు తెలియజెప్పితే కూడా ఉద్యమం బలపడుతుంది.
ఐతే ఎవరెన్ని సూచనలు చేసినా తన ఇంటిని తెరాస చక్కదిద్దుకోగలదని ఇప్పటికీ నాకు నమ్మకం కుదరటంలేదు. తమకు ఎలా పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలో తెలియకుంటే ఉద్యమంలోని విధ్యావంతులే,నిష్టాపరులే దగ్గరుండి నిరంతరం శ్రమించి ఆపని చేయక తప్పదు. ఎందుకంటే తెరాస కుంటుబడితే,ఉద్యమం వెనక బడితే బాధపడేది ,ప్రత్యర్ధులతో తిట్లు పడేది,అవహేళనలకు గురయ్యేదీ వారేకదా!
The results are good lesson for KCR over confidence. He always want to get Telangana with out resolving existing issues. What did he do as a cabinet minster to Telangana or for AP state.
I think fighting for Telangana should be for developement first. Separate state should be the last resolution.
పై వ్యాసం గాని ,ఇక్కడ వ్యక్త పరచిన అభిప్రాయాలను కేసీఆర్్ మరియు తెరాస ఇతర నాయకులు చదివేలా ఎవెరైనా చెయ్యగలరా? పొద్దున్నే పత్రికలు చదివే అలవాటు రాజకీయ నాయకులందరికి ఉస్టుంది.కాని కేసీఆర్ కూడా ఆపత్రికలనే చదివితే మన తెలంగాణ వాదుల అభిప్రాయాలను తెలుసుకునేదెట్లా?
Dear Sir,
The analysis is not only repetitive but also extraordinarily too elaborative to comprehend. All the facts have been well known since the formation of TRS in 2001 that Andhras are monied people, the entire media is in their hands, our leaders are purchasable etc. etc. TRS has not grown as a democratic party much less an Udyama Party. It is synonym to KCR. Knowingly well the so called intellectuals could not set KCR right. How will he listen to them now. He converted the party into his Kula Party. KCR kicked out many people from the party if they advised him. KCR cannot be repaired. TRS will fail in the hands of KCR in much uglier manner in future elections. KCR is Sisupala of Telangana. Can Kodandaram or Jayashanker take over TRS like Krishna and do the needful. I doubt.
B. Ram Mohan Reddy, Advocate
President: ‘TELANGANA YUVA SHAKTI’
A REGD. POLITICAL PARTY FOR THE YOUTH OF TELANGANA
DearBRMR,
మీరు టీఆర్ఎస్ ఒక కుల పార్టీగా మారిందనే వాదనతో నేను అంగీకరించలేను. వారసులు రాజకీయాల్లోకి రావడమ్పై కూడా గతంలో చర్చలు జరిగాయి,అది ఇత్లాంటిదే. సమర్ధత ఉన్న కొడుకులు రాజకీయాల్లోకి వస్తే పార్టీ అధిపతులు అడ్డుకుంటే అది ప్రజాస్వామ్యమౌతుందా?ఐతే కేసీఆర్ కొడుకు ఒక మంచి ఉద్యోగంలో ఉండి రాజీనామా చేసి టీఆర్ఎస్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందా? అనేది అనుమానం. ఐతే ఒక ఐఏఎస్ అధికారిగా అసంత్రుప్తితో ఉండతోరాజీనామా చేసి లోక్ సత్తా పార్టీను చూసినప్పు డు రామారావ్ ప్రవేశాన్ని ప్రశ్నించలేము. ఏపార్టీ ని ఏఅధినేత మీరనుకున్నంత బాగా,ధర్మబద్దంగా నడుపుతున్నాడో చెప్పండి. అట్లని ఉద్యమ పార్టీ ఐన టీఆర్ఎస్ కూడా అట్లాగే నడవాలని నేను కోరుకోవడమ్ లేదు. పార్టీ నుండి బయటికి వెళ్ళిన వారితో(సాగనమ్పిన వారితో) సగిగ్గా, ఒక పద్దతి ప్రకారంగా /సవ్యంగా ప్రవర్తించే వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. పార్టిలో అంతర్గతంగానైన చర్చలు జరపలేదనిపిస్తుంది.తెలంగాణ పేరిట పార్టీలు పెట్టడానికి తెలంగాణ వారందరికి హక్కులున్నాయి.అటువంటివాళ్ళంతా తెలంగాణ్ ఓట్లను చీల్చడానికి పనికి వస్తారేమో కాని తెలంగాణను సాధించడానికి పనికి రారని నా నిశ్చితాభిప్రాయం.
మీసంస్క్రుతిక ప్రదర్శన్లను చాలా మంది నాలాగే చూడలేదనుకుంటాను.మూసీటీవీద్వారా ప్రదర్శించండి. వాట్లో ఉండే content బట్టి మీ పార్టీ అభివ్రుద్ధి అవుతుందనుకుంటాను.