Feed on
Posts
Comments

శ్రామికుల తెలం’గానం’తెలంగాణలో శ్రమజీవులను ‘పనిపాటలోల్లు’ అని వ్యవహరిస్తుంటారు. శ్రామికుల పనితోపాటు పాట సాగుతుంటుంది. పొలం పనుల్లో, ఇంటి పనుల్లో, వృత్తి పనుల్లో పాటలు వినిపిస్తూనే ఉంటాయి. పనిలోని అలసటను తగ్గించి, శ్రమను మరిపించి, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పంచి ఉత్పత్తిని పెంచే శక్తి పాటకుంది. పనిలోని లయననుసరించి, శ్రామికుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా పాటకు లయ ఛందస్సు లేర్పడుతుంటాయి. శ్రామికుని జీవిత విధానం, మనోభావాల ఆధారంగా పాటలోని వస్తువు రూపుదిద్దుకుంటుంది. ఇటువంటి పనిపాటలు ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ ప్రాంతాల్లోనూ వినిపిస్తుంటాయి.

తెలంగాణ ప్రాంతంలో ‘మే డే’ నాడు పుట్టి శ్రామికుల మధ్యన పెరిగిన జానపద సాహిత్యాభిమాని డా. గోపులింగారెడ్డి ‘తెలంగాణ శ్రామిక గేయాలను’ పరిశోధనాంశంగా ఎన్నుకున్నారు. తొమ్మిది జిల్లాల్లో విస్తృతంగా క్షేత్ర పర్యటన చేసి వేల గేయాలను సేకరించారు. సేకరించిన వాటిలో రసవంతమైన వాటిని ఎంచుకుని, వర్గీకరించి, విశ్లేషించి సిద్ధాంత వ్యాసాన్ని రూపొందించి పుస్తకంగా ప్రచురించారు. ప్రపంచీకరణ ప్రభావానికి వ్యతిరేకంగా ప్రాంతీయవాదం, అస్తిత్వవాదం బలపడుతున్న ఈ రోజుల్లో ‘తెలంగాణ శ్రామిక గేయాలు’ రెండవ ముద్రణ భాగ్యాన్ని పొందింది.

‘తెలంగాణ శ్రామిక గేయాలు’లో కర్షక కార్మికుల గేయాలతో పాటు వివిధ వృత్తుల వారి శ్రామిక గేయాలున్నాయి. ఈ గేయాల్లో ప్రతిబింబించే తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను వివేచించడమే కాకుండా వారి ఉద్వేగాలు, ఉద్రేకాలు, తిరుగుబాట్లు, తిరస్కారాలు, సుఖసంతోషాలు, సంవేదనలు వంటి మనోభావాలను కూడా వివరణాత్మకంగా, ఆసక్తిదాయకంగా లింగారెడ్డి వివరించారు. గేయాల్లోని రసపోషణ, ఛందస్సంగీతాలు, భాషా విశేషాలను శాస్త్రయుక్తంగా పేర్కొన్నారు.

శ్రామిక గేయాల్లో వ్యవసాయ సంబంధాలే ఎక్కువ. పొలం సాగుబాటు నుంచి కోతల వరకు సాగే వివిధ కార్యక్రమాల్లో పాడే పాటలనూ, పంట ఇంటికి చేరిన తర్వాత ధాన్యాన్ని దంచేటప్పుడు, విసరేటప్పుడు పాడే పాటలనూ డా. లింగారెడ్డి క్రమ పద్ధతిలో విశదం చేశారు. వ్యవసాయాన్ని కనిపెట్టింది స్త్రీలే కాబట్టి విత్తనాలను విత్తడం నుంచి పంటను కోయడం వరకూ స్త్రీల బాధ్యతే ఎక్కువగా ఉంటుంది. స్త్రీల అంతర్గత మనోభావాలు, జీవిత గమనాలు వారి పనిపాటల్లో వ్యక్తమవుతుంటాయి.

పసితనంలోనే పెళ్ళిళ్ళు చేసే వ్యవస్థ మనది. అత్తవారిల్లంటే అదిరిపోయే ఒక ఆడపిల్ల,

‘అమ్మ నేను సిన్నదాన్ని - అల్లుడొస్తె తోలబోకు
ఢిల్లీ పట్నం సల్లగుంటే - నిత్తె రూపాయి దెత్తు”

అని తన శ్రమ శక్తిపైన ఉండే నమ్మకంతో ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనుకుంటుంది. స్త్రీల విసుర్రాయి పాటల్లో బరువైన విసురురాతిని తిప్పేటప్పుడు హ్రస్వాలు దీర్ఘాలవుతుంటాయి. దంపుళ్ళ పాటల్లో దీర్ఘాలు హ్రస్వాలవుతుంటాయి. పనిని బట్టి పాటలు మార్పు చెందుతాయనే అంశాన్ని లింగారెడ్డి చక్కటి ఉదాహృతులతో నిరూపించారు. విసురురాతి పాట లెక్కువగా స్వగతాలు, పుట్టింటి ప్రేమానురాగ అభివ్యక్త్యాలు.

‘నాయీ తల్లి గారోయీ - నాయీ తల్లిగారు నందన్నవనం
నందన్నా వనములో ఏమేమి కలుగు - పొయ్యా పసువులు గలుగు
పుణ్యాల గలుగూ పెట్టా పసుపులు కలుగు - పెండ్లిల్లు గలుగు” -

తల్లి గారిల్లు నందనవనమనీ, పసుపులు పెట్టే ఇల్లనీ, పుణ్యాలను పొందే పుట్టిల్లనీ మురిసిపోతుంది.
వ్యవసాయ సంబంధి గేయాల్లో అధిక భాగం శృంగార గేయాలే అయినప్పటికీ రైతుల వ్యధాభరిత హృదయావిష్కరణ గేయాలు కూడా ఉన్నాయి.

“ఎన్నేండ్లు బతికినా ఏమిలేదన్నా
ఎవుసమంటూ జేసి ఎయిపుట్లు పండించి
ఎన్నడొక్క మెతుకెరుగనన్నా
నాదేటి బతుకాయెనన్నా’ -

అన్నదాత రైతన్నకే మెతుకు లేని దౌర్భాగ్య స్థితి మన దేశంలో ఉంది. ప్రపంచీకరణ ప్రభావంతో ధాన్యపు పంటలు తక్కువవుతున్నాయి. వాణిజ్యపు పంట లెక్కువవుతున్నాయి. పంటలతో పాటు పాటలు కూడా తరిగి పోతున్నాయి. ఆధునికీకరణం మోజులో రైతులు పొలంగట్ల పైన రేడియోలు పెట్టుకొని పాటలను వింటూ నాగళ్ళు దున్నుతున్నారని, ఫలితంగా శ్రామిక గేయ సాహిత్యం అంతరిస్తుందని లింగారెడ్డి ఆవేదన చెందారు.
పారిశ్రామికీకరణం, పాశ్చాత్తీకరణం వల్ల వ్యవసాయమే కాకుండా కుటీర పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. శ్రామికుల బతుకులు చితికిపోయాయి.
“మిల్లు బట్టలు కట్టి మురిస్తిరన్నా
మా ఇంటి రాట్నాలు మాకిస్తిరన్నా
మా పొట్టకే కాని తిండి లేదన్నా
పేదాల పొట్టలు కొట్టిందెవరన్నా” -

తెలంగాణకు ఉద్యమ చరిత్ర నిజాం ప్రభువుల కాలం నుంచీ ఉంది. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమం, రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలోనే చోటు చేసుకున్నాయి. నిజాం నవాబుల అండదండలతో పేదలను పీడించిన పెత్తందార్లను, భూస్వాములను మట్టుపెట్టిన వీరుల సాహసకృత్యాలను కథలుగా పాడుకుంటారు శ్రామికులు. బడుగువర్గాల ధన, మాన, ప్రాణాలను హరించిన దొరల దౌర్జన్యాలను అణచివేసిన దళితవీరుల కథలనూ, వెట్టిచాకిరిని రద్దుచేసిన నేతల ఉద్యమాలనూ పాటల్లో పాడుతుంటారు. తెలంగాణలోని పనిపాటలు స్థానిక చరిత్రలకు పట్టుకొమ్మలే కాకుండా వర్గచైతన్యానికి, విప్లవ భావాలకు ఉత్తమ సాహితీ సాధనాలని లింగారెడ్డి సోదాహరణంగా నిరూపించారు.

వరవరరావు, ఆరుద్ర, జయధీర్‌ తిరుమలరావుల ముందుమాటలు ‘తెలంగాణ శ్రామిక గేయాలకు’ విలువైన సమాచారాన్ని అందించిన వరాల మూటలు. ఏలె లక్ష్మణ్‌ వేసిన ముఖచిత్రం తెలంగాణ ప్రత్యేకతను సూచిస్తూ అందంగా ఆకర్షణీయంగా ఉంది. శ్రామిక గేయాలను పరిశోధించి తెలంగాణ ప్రజల సంస్కృతినీ, చరిత్రనూ, భాషా విశేషాలనూ విశ్లేషించిన డా. గోపు లింగారెడ్డి కృషి ప్రశంసనీయం.

-రావి ప్రేమలత

‘తెలంగాణా శ్రామిక గేయాలు’,
రచన: డా. గోపులింగారెడ్డి,
ప్రతులకు: శ్రీమతి అరుణ, 7-1-249, మంకమ్మతోట, కరీంనగర్‌.
పేజీలు: 304, వెల: రూ. 150/

(ఆంధ్ర జ్యోతి ఆదివారం, 29 జూన్ 2008 సౌజన్యం)

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో