Feed on
Posts
Comments

బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణగాధలు, చారిత్రక సంఘటనలతో సంబం ధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుం బాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను-అను బంధాలను పెంపొందించే వారిధి బోనాలు. భాగ్య నగరవాసుల ప్రత్యేక పండుగగా ఇది సుప్రసిద్ధం. ఒకప్పటి గ్రామాలు కలిసి ఏర్పడిన నగరం మన హైదరాబాద్‌. గ్రామీణ ప్రాంతాల నుంచి అవసరాల కోసం తరలివచ్చిన కుటుంబాలు ఇక్కడ స్థిరపడ డంతో నగరవాతావరణంలో సైతం బోనాల పండుగకు ప్రాధా న్యత ఏర్పడింది. నిర్ధిష్టమైన తిధి, వార నక్షత్రాలు లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలకు వెసులుబాటు ఉన్న రోజున జరుపుకోవడమే ఈ ఉత్సవాల విశిష్టత. అందుకే కులీకుతుబ్‌ షాల కాలంలో ప్రారంభమైన బోనాలు ప్రతి సంవత్సరం రాజ« దానిలో సుమారు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరుగుతుంది.

కులీకుతుబ్‌షా పాదుషాల రాజధాని కేంద్రం గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో ఆషాడమాసంలో మొదటి ఆదివారం ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఆ తర్వాత లష్కర్‌ (సికింద్రాబాద్‌) ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కన్నుల పండువగా సాగి, చివరి వారం చారిత్రక లాల్‌దర్వాజా సింహవాహని, హరిబౌలి అక్కన్న-మాదన్న మహంకాళి ఆలయాల్లో బోనాల సమర్పించి లక్షలాది మంది భక్తుల జై జైధ్వానాల మధ్య నయాపూల్‌ సమీపంలోని ముచుకుందానదీ తీరానికి అమ్మవారి ఘాటాల ఉమ్మడి ఊరేగింపుతో పరిసమాప్త మవుతుంది. గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికా ఆలయంలో జరిగే బోనాలకు అయిదు వందల ఏళ్ల, సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సుమారు రెండువందల ఏళ్ల చరిత్ర ఉంది. అలాగే నిజాం నవాబుల ప్రార్ధనలతో ప్రాశస్త్యం పొందిన లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఇక ఇకులీకుతుబ్‌షాల చివరి పాదుషా అబ్దుల్‌ హసన్‌ తానీషా కొలువులో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన అక్కన్న-మాదన్న ల పూజలందుకున్న హరిబౌలిలోని మాతా మహంకాళి నిజాం నవాబుల కాలంలో కొన్నేళ్లపాటు ప్యాలెస్‌ అంతర్భాగంలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్‌ రాష్ట్ర విముక్తి పోరాటం ఫలితంగా మళ్లీ వెలుగుచూసింది. 1948లో మళ్లీ భక్తులకు అందుబాటు లోకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతియేటా ఆషాడబోనాల ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతు న్నాయి. అక్కన్న-మాదన్న మాతా మహంకాళి ఆలయంగా సుప్రసిద్ధమైన హరిబౌలి ఆలయంలో బోనాల రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుచీరను కానుకగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతున్నది

దేశంలోనే నెల రోజుల పా టు జరుపుకునే పండుగ ఒక్క బోనాలు మాత్రమే.. ఆషాడ మాసం మొదటి ఆదివారం రోజున ఖిలా గోల్కొండలోని జగదాంబికా ఆలయం లో ప్రత్యేక పూజలతో బోనాల పండు గకు శ్రీకారం చుడతారు. అప్పటి నుంచి ప్రతి రోజూ సాధరాణ పూజలు కొనసాగుతాయి. ప్రతి గురువారం, ఆదివారం( ఆషాడ మాసం) ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు బోనాలు సమర్పించే భక్తులతో గోల్కొండకోట కిటకిటలాడుతంది. కొం డపై వెలిసిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు.

గోల్కొండ పరిసర ప్రాం తాల్లోని కుటుంబాలు ఈ రెండు వారాలపాటు దూర ప్రాంతా ల్లోని బంధుమిత్రులను, ఆడపడుచులను ఇంటికి ఆహ్వానించి బోనాలు తీసుకెళ్లి భక్తిశ్రద్దలతో అమ్మవారికి సమర్పించి మొక్కు లు తీర్చుకుంటారు. ఆషాడ మాసంలో మూడో ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పి స్తారు. సికింద్రాబాద్‌ పరిసరాల్లో నివసించే కుటుంబాలు తె లంగాణ జిల్లాల్లో నివసించే తమతమ బంధు మిత్రు లను, స్నేహితులను ఆహ్వానించి వే డుకలు జరుపుకుంటారు.

ఆ తర్వాత వారం లాల్‌దర్వాజా సిం హవాహిని, హరిబౌలి అక్క న్న-మాదన్న మహంకాళి బోనా లనూ బంధుమిత్రులతో కలసి జరుపుకుంటారు. ఇతర ఏ పం డుగలైనా ఒకే రోజున జరుగుతాయి. ఆ రోజు బంధువులను ఆహ్వానిస్తే …. మీరే మా ఇంటికి రండి అని ఎదురు ఆహ్వానాలందుతాయి. దీంతో పరస్పరం కలుసుకుని పండగ జరుపుకోవడం సాధ్యం కాదు. బోనాలు అలా కాదు. నెల రోజుల పాటు జరుపుకోవడం ద్వారా వారింటిలో జరిగే బోనాలకు వీరు… వీరింటిలో జరిగే వేడుకలకు వారు… వెళ్లేందుకు అకాశం లభిస్తుంది. మరో విశేషమేమిటంటే…. నగరంలో ఆషాడ మాసంలో జరిగే బోనాలు గ్రామాల్లో శ్రావణమాసంలో జరుగుతాయి. గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను ను భారీ ఎత్తున నిర్వహిస్తారు.

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com