అక్టోబర్ 4న జరిగిన డెట్రయిట్ బతుకమ్మ వేడుకల సందర్భంగ, బతుకమ్మను అమెరికల పుట్టిపెరిగిన పిల్లలకు పరిచయం చేద్దామన్న ఉద్దేశంతోటి “డిస్కవర్ తెలంగాణ” ఫౌండర్ జయప్రకాశ్ తెలంగాణ, (Registered Non-Profit organization in USA,Tax-ID: 26-3320796) బతుకమ్మ పేయింటింగ్ పోటీలు నిర్వహించినారు. ఈ పోటీల వందకు పైగ పిల్లలు పాల్గొని నిర్వాహకులనే అశ్చర్యపరిచినరు.
ఈ పోటిలను వయసు పరిమితిని బట్టి ఒకటి నుంచి ఐదు, ఐదు నుంచి పది, పది నుంచి పద్ధెనిమిది సంవత్సరల విభాగాలుగ పోటిలు నిర్వహించినరు. వందకు పైన వచ్చిన బతుకమ్మ పేయింటింగ్‌లలో 14 పేయింటింగులు (1-5 సం|| విభాగంల), 28 పేయింటింగులు (5-10 సం|| విభాగంల), 5 పేయింటింగులు (10-18 సం|| విభాగంల) ఎంపిక అయినయి. పోటిల ఆర్యన్ (5-10 సం|| విభాగంల) వేసిన బతుకమ్మలు చానమందిని విశేషంగ ఆకట్టుకున్నయి. పోటిల పాలుగొన్న పిల్లలు ఒకటికన్న ఎక్కువ బొమ్మలను వేస్తము అని ఉత్సాహం చూపించినరు.
పోయిన సంవత్సరం అక్టోబర్ రెండున, సోనియాగాంధి ఐక్యరజ్య సమితి సందర్శించినప్పుడు కలుసుకున్న అమర్ కరిమిళ్ళ, జయప్రకాశ్ తెలంగాణ, తెలంగాణ స్పూర్తిని అందరిలోపల పెంచనీకని “ఫర్ తెలంగాణ…ఫర్ ఎవర్” ఫొటో కాంపేయిన్ మొదలుపెట్టినరు (http://4ever.discover-telangana.org/?page_id=2). ఒక సంవత్సరంల మంచి స్పందన వచ్చినంక పిల్లలకు ఏదైనా సృజనాత్మకమైన పోటీ నిర్వహించాలనే ఉద్దేశం తోటి , 17 సెప్టెంబర్ 2008 తెలంగాణ వీలీన దినోత్సవం సందర్భంగ 31 డిసెంబర్ 2008 వరకు సాగే “కలర్ తెలంగాణ 2008″ (CT8) అనే పేయింటింగ్ పోటీలను మొదలుపెట్టినరు (http://4ever.discover-telangana.org/?page_id=172).
తెలంగాణ విందు, పీజ్జాలతో కూడిన అమెరికన్ విందు తోటి “డెట్రయిట్ బతుకమ్మ పేయింటింగ్ పోటీలు” ముగిసినయి. పోటీల తరువాత అనుకున్న వాటికన్న ఎక్కువ వచ్చిన ఎంట్రీల నుంచి విజాతను ఎంపిక చేసుడు కష్టమయి వోటింగ్ పద్ధతి ద్వార మూడు విభగలల్ల ముగ్గురు చొప్పున మొత్తం తొమ్మిది విజేతలను ఎంపిక చేసుడు అయినది. ఇంతవరకు బతుకమ్మ వేడుకలల్ల గాని తెలంగాణ వేడుకలల్ల గాని ఇట్లాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదని, ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని చాన మంది తల్లిదండ్రులు వాల్ల సంతోషాన్ని పంచుకున్నరు.
“కలర్ తెలంగాణ 2008″ (CT8)ల భాగంగ నిర్వహిచ్చిన డెట్రయిట్ బతుకమ్మ పేయింటింగ్ పోటీల వచ్చిన స్పందనతోటి ఇట్లాంటి పోటీలు తెలంగాణల బడులల్ల కూడ నిర్వహించాలె అనుకుంటున్నం అని బహుమతులు అందజేసెటప్పుడు, “ఫర్ తెలంగాణ…ఫర్ ఎవర్” తరపున తేన (తెలంగాణ ఎన్.ఆర్.ఐ) కన్వీనర్ హరి మారోజు ప్రకటించినరు. మూడు విభాగాలనుంచి ఎంపికైన తొమ్మిది మంది పిల్లలకు హరి మారోజు టాయ్-సారస్, కే-మార్ట్ గిఫ్టు కార్డులు బహుకరించినరు. మరిన్ని పేయింటింగ్లు చూడనీకి (http://4ever.discover-telangana.org) వెబ్ సైట్‌ను చూడండి.
Visit CT8 / ‘Color Telangana 2008‘ for more details & encourage your kids to participate the online event. Click here for Photos