Feed on
Posts
Comments

- దేశపతి శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్

102108aj1.jpgతెలంగాణ వాదం బలపడి, సమైక్యవాదులు సైతం జై తెలంగాణ అంటున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్పనిసరిగా మారుతున్నది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు రెండూ తెలంగాణకు అనుకూలంగా తీర్మానించడంతో ఏకాభిప్రాయం లేదనే సాకులకు కాలం చెల్లింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంక్లిష్టమైన ప్రక్రియ అనే రాజశేఖరెడ్డి వాదన పస లేనిదిగా ఢిల్లీ పీఠం ముందు తేలిపోయింది. దీంతో తెలంగాణ ఏర్పాటులో జటిలత్వాన్ని కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మతాన్ని వాడుకునే ప్రమాదకర ఎత్తుగడను ప్రయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నాటకంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోషిస్తున్న కీలుబొమ్మ పాత్రకు తోడుగా అసదుద్దీన్ మతం ముసుగుతో చేరారు.

బ్రిటీష్ వారు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి మత విద్వేషాలను రగిల్చి వాడుకున్నారు. ఇప్పుడూ అదే విధానం అమలవుతున్నది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను విడదీయాలని కుట్ర సాగుతున్నది. తెలంగాణ ప్రజల నుంచి హైదరాబాద్ ముస్లింలను వేరు చేసే దారుణానికి ఒడిగడుతున్నారు. అక్కడితో ఆగకుండా ముస్లింల నుంచి హైదరాబాద్ ముస్లింలను విడదీసి చూపించే ఘాతుకానికి తెరలేపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలది మత సంఘర్షణల సంస్క­ృతిగా చిత్రీకరించే ఎత్తుగడ సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింల మనుగడకు ముప్పు ఏర్పడుతుందనే భయాన్ని వారి మనసులో నాటుతున్నారు. నిజానికి తెలంగాణది ఇరుమతాల మధ్య మమతానుబంధాలు పెనవేసుకుపోయిన చరిత్ర. కట్టు, బట్ట, తిండి, తిప్పలు అన్నీ ఒకటిగా బతుకుతారు. ఇక్కడి వీధుల్లో ఉర్దూ, తెలుగు కలిసి చెమ్మచెక్క ఆడుకున్నాయి. అన్ని ఆరాట పోరాటాల్లోనూ కలిసే ఉన్నారు.

ఇవాళ తెలంగాణ ఉద్యమం గొప్పగా చాటుకుంటున్న తుర్రెబాజ్‌ఖాన్ వంటి వీరుల చరిత్ర ఇటీవలి వరకు అణచివేతకు గురైంది. తెలంగాణ రైతాంగ పోరాటంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూమి పోరులో అమరుడైన బందగీ, పత్రికా స్వేచ్ఛకు ప్రాణమిచ్చిన షోయెబుల్లాఖాన్, భావుకతను, తిరుగుబాటు తీవ్రతను మేళవించిన కవియోధుడు మఖ్దూం వంటి వారినందరినీ ఈ నేల సగర్వంగా స్మరించుకుంటున్నది. తెలంగాణ ప్రజలు ఉర్దూని తమ భాషగానే భావిస్తారు. ఒకనాడు తౌరక్యాంధ్రులంటూ తెలంగాణ తెలుగు, ముస్లింలను కించపరచినవారే నేడు వారిని మతం పేర విభజింప చూస్తున్నారు. తమ పాలనలోనే ముస్లింలకు రక్షణ అని పరోక్షంగా పలికిస్తున్నారు. కానీ తెలంగాణ నాయకుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసేందుకు సృష్టించిన మతకలహాల్లోనే లెక్కకు మించిన ముస్లింలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కొట్లాటల్లోనే అపురూపమైన తెలంగాణ కవి గులాం యాసిన్ బలైపోయారు. తనకు తాను ముస్లింల ప్రతినిధిగా చెప్పుకునే అసదుద్దీన్‌కు తెలంగాణ ముస్లింల బతుకుల పట్ల పట్టింపు లేదు.

నదీజలాల్లో వాటా దక్కక వ్యవసాయం కూలిపోయి ఎందరో ముస్లిం రైతులు కూడా ఆత్మహత్యల పాలయ్యారు. ఊళ్లో పూటగడవక గల్ఫ్ ఎడారుల్లో ఎందరో ముస్లిం యువకులు మెతుకులేరుకుంటున్నారు. కవి గోరటి ఎంకన్న పాడినట్టుపరక చాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికోయిరి, లారీలల్ల క్లీనర్లయ్యిర? పెట్రోలు మురికిల మురికయ్యిన్రా? తల్లీ- దూదు సేమియకు దూరమయ్యినారో సాయబుల పోరలు, ఆ బేకరి కేఫుల ఆకలి తీరిందో ఆ పట్టణాలలో!‘ అని తెలంగానం చేస్తున్న ఆక్రందనలు, తెలంగాణ ఉద్యమం వేస్తున్న ప్రశ్నలు అసదుద్దీన్ చెవికెక్కినట్టు లేదు. హైదరాబాద్ రాష్ట్రంలో 40 శాతానికి పైగా ముస్లిం ఉద్యోగులు ఉంటే సమైక్య రాష్ట్రంలో నాలుగు శాతానికి కూడా నోచుకున్నది లేదు.

జాతీయ సమగ్రతా మండలి వేదిక మీద సచార్ కమిటీ అమలు గురించో, అమాయక ముస్లింల మీద అనుమానంతో జరుగుతున్న అమానవీయ దాడుల గురించి అసదుద్దీన్ అడిగి ఉంటే అర్థవంతంగా ఉండేది. కానీ ఒకరి చేతిలో చిలుకగా మారి, వారి పలుకులు వినిపించడం సరికాదు. హైదరాబాద్‌తో పేగు సంబంధంలేని పాలకులు తమ రియల్ ఎస్టేట్ ఆస్తుల అడ్డాగా మాత్రమే ఈ నేలను చూస్తున్నారు. వక్ఫ్ ఆస్తులను వాటాలుగా పంచుకుంటున్నారు. నాటి అసఫ్ జాహీ రాజులు, మరుగునపడ్డ అజంతా ఎల్లోరా గుహలను పరరిక్షించి ప్రపంచం ముందుంచారు.

రామప్ప దేవాలయం శిథిలం కాకుండా చర్యలు తీసుకున్నారు. తస్కరించిన శిల్పాల్ని కూడా వెతికి తెప్పించి యథా స్థానంలో అతికించారు. ఆబిడ్స్‌లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన, తాను చదువుకున్న చాదర్‌ఘాట్ స్కూల్‌ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తే చెన్నారెడ్డి అడ్డుకున్నారు. కాని నేడు అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌లోని అపురూప నిర్మాణాలను కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టుకున్నారు. ఎటువంటి భావోద్వేగాలు లేని కులాతీత, మతాతీత, ప్రాంతాతీత దోపిడీ తత్వమే పాలకుల సమానత్వం. అసదుద్దీన్ ఈ సమానత్వాన్నే కోరుకుంటున్నారా?

(Courtesy: AndhraJyothy 21 October 2008)

Share/Save/Bookmark

3 Responses to “అసదుద్దీన్ ఏం కోరుకుంటున్నారు?”

  1. 1
    naveen achari Says:

    స్వాతంత్రానికి పూర్వం నుండీ ఉన్న పార్టీ MIM. పొద్దుతిరుగుడు పువ్వు లాగా ఎవరు అధికారంలో ఉంటే వారి పంచనచేరే అసదుద్దీన్ కానీ MIM కానీ ముస్లీమ్ లకు చేసిందేమిటో చెప్పాలి. పాతబస్తీ ప్రజల కష్టాలకు మొదటినుంచీ వారికి ప్రాతినిథ్యం వహించిన వారే బాద్యత వహించాలి. కేవలం తమ ఆస్థుల్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజాప్రయోజనాల్ని ఫనంగా పెడుతున్న నాయకుల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.

    ముస్లీమ్ ల పరిస్థితుల్ని అధ్యయనం చేసిన సచార్ కమిటి చేసిన సూచనలు అమలుకావడానికి తాను చేసిన ప్రయత్నాల్ని అసదుద్దీన్ చెప్పాలి. ఎన్ని రోజులు ఉద్యమం చేసాడో వివరించాలి. పాఠశాలల ఏకికరణ కారణంగా ఎక్కువ స్కూళ్లు మూతపడ్డది పాతబస్తీలోనే. ఎప్పుడు ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తే ఒవైసీలు ఎన్నిస్కుళ్ళ మూసివేతను ఆపగలిగారో చెప్పమనండి.

    కేవలంమతాన్ని అడ్డుపెట్టుకుని మైనార్టీ విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీలకు అనుమతులు పొందడం, ఆస్థులు కూడబెట్టడం, కూడబెట్టిన ఆస్థుల్ని రక్షించుకోవడం మినహా అసదుద్దీన్ ముస్లీమ్ లకు చేసిందేమిటొ చెప్పాలి.

  2. 2
    నీ మిత్రుడు Says:

    “అసదుద్దీన్ ఏం కోరుకుంటున్నారు?” తొక్క.. రాజశేఖర్ రెడ్డి ఏమి అనుకుంటే అది చేస్తాడు.

  3. 3
    Kumar Says:

    రాజషెఖర్ రెద్ది ఎలా చెపితె అలా వినె గంగెద్దు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com