Feed on
Posts
Comments

- తెలంగాణ ఐ.టి.ఫోరం

Hyderabad Metro Rail

హైదరాబాదు రోడ్లమీద ట్రాఫిక్‌ నరకం నుండి బయటపడవేసే మెట్రో రైలు వస్తుందంటే శుభవార్తనే. ఇందులో ఒక లైను- సికింద్రాబాదు నుండి ఫలక్‌నుమాదాకా, రెండో లైను- నాగోల్‌ నుంచి అమీర్‌పేట మీది నుండి హైటెక్‌సిటీ దాకా, మూడోది- కూకట్‌పల్లి నుంచి నాంపల్లిదాకా వేస్తరట. దీని కోసం జంట నగరాలలో మొత్తం 5000 దుకాణాలు, 2000 ఇండ్లు, 147 స్కూళ్లు, కాలేజీలు, 120 దవాఖానలు, 54 గుళ్లు, మసీదులు, చర్చిలు కూలిపోతయి. హైదరాబాదుకు గుర్తుగా నిలిచిన చారిత్రక కట్టడాలు కనబడకుండపోతాయి. అంటే మెట్రోరైలు కాలనాగువలె నగరాన్ని కాటేయబోతున్నది.

ఇప్పుడున్న ప్రధాన వ్యాపారకేంద్రాలు, వ్యాపార సమూహాలు సమూలంగా పెకిలించివేయబడుతాయి. వాటి బదులు మెట్రోరైలు మార్గాన రెండు పక్కల కొత్త షాపింగ్‌ కాంప్లెక్సులు అవతరిస్తాయి. ఆ కాంప్లెక్సులను మైటాసుకు కానుకగా ఇస్తారు. కనుకనే మైటాస్‌ మెట్రోరైలు కాంట్రాక్టు తనకిస్తే తానే ప్రభుత్వానికి ఉల్టా పైసలిస్తానంటున్నది. అంటే రైలు మార్గం పొడవున వున్న వ్యాపార కేంద్రాల మీద మైటాస్‌ కంపెనీకి గుత్తాధిపత్యం ఏర్పడుతది.

ఈ రైలును ఆపడం ఎవరి తరమని అధైర్యపడవద్దు. అసలే ఇది ఎన్నికల సంవత్సరం. మన ఓట్లతోనే కదా పార్టీలు మనమీద పెద్దరికం చేసేది. ఇప్పుడు చెప్పితెనే వింటరు. కనుక దుకాణాలు, ఇండ్లు కూల్చ కుండ ఇప్పుడున్న పట్టాలను కలుపుకుంట కొత్తగా రైలు లైను వేయవచ్చునని పెద్దలు అంటున్నరు.

ఆ పద్ధతిలో రైలు రావాలెగని, మెట్రో రైలు పేరు తోటి మమ్ముల బర్‌బాద్‌ చేయొద్దని, మైటాస్‌కు కట్నంగా పట్నం ఇవ్వొద్దని, అందరి హైదరాబాదును కొందరి పాలు చేయొద్దని రైలు కూత కన్న పెద్దగా మనం గొంతు విప్పుదాం. తెలంగాణ విద్యావంతుల వేదిక – తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ రిసెర్చిస్కాలర్స్‌ అసోసియేషన్‌

(Courtesy: AndhraJyothy 27 October 2008)

3 Responses to “జంట నగరాలను కూల్చే మెట్రోరైలు!”

  1. 1
    డిస్కవర్ తెలంగాణ Says:

    సర్కారీ బడులకు ‘మెట్రో’ గండం
    హైదరాబాద్‌, డిసెంబర్‌ 18: ‘గోరుచుట్టుపై రోకటిపోటు’లా మారింది నగరంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. అకడమిక్‌ క్లబ్బింగ్‌తో 180 స్కూళ్లు మూతపడగా, తాజాగా మరో 10 స్కూళ్లపై ‘మెట్రో’ కత్తి వేలాడుతోంది. రవాణా వ్యవస్థను చక్కదిద్దడానికి వస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు నగరంలోని బడులకు గండంగా మారింది. దీనికింద స్టేషన్ల కో సం సేకరించనున్న భూమితో వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడనున్నారు. మెట్రో రైలు యంత్రాంగం మాత్రం గుట్టుగా సర్వే లు కొనసాగిస్తోంది.

    వివరాలు బయటపెట్టకుండా ప్రభుత్వ పాఠశాలల సర్వే చేపడుతోంది. 3వేల మంది చదువుకునే యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు 700 మంది చదువుకు నే బజార్‌ఘాట్‌లోని ఆగాపురా పాఠశాల ప్రాంగణం, 600 మంది విద్యార్థులున్న పంజాగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పడవ స్కూలు) స్థలాలను ప్రస్తుతం సేకరించనున్నారు. దాంతోపాటు బేగంబజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థలాన్ని కూడా సేకరించనున్నట్లు తెలిసింది. మెట్రో కింద భూసేకరణలో ప్రధానంగా ప్రభు త్వ పాఠశాలలనే టార్గెట్‌గా చేసుకున్నట్టు తెలుస్తోంది.

    నష్టపరిహారం వంటి సమస్యలు, ప్రత్యేకంగా భూసేకరణ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో మెట్రో యంత్రాంగం ప్రభుత్వ పాఠశాలల స్థలాలపై కన్నేసింది. యూసుఫ్‌గూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే అతి పెద్దది. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలు కలిపి ఇందులో 3 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుతో వీరంతా చెల్లాచె దురు కానున్నారు. ఇవే కాక ప్రధాన రహదారిపై ఉన్న పంజాగుట్ట పడవ స్కూలు, బజార్‌ఘాట్‌లోని ఆగాపురా స్కూలు ప్రాంగణాలు మెట్రో రైలు కింద పోనున్నాయి.

    వీధిన పడనున్న మరో 10 వేల విద్యార్థులు
    అకడమిక్‌ క్లబ్బింగ్‌తో 10వేల మంది విద్యార్థులు వీధిన పడినట్లు అంచనా. మెట్రో రైలు ప్రాజెక్టుతో మరో 10వేల మంది విద్యార్థులు డ్రాపవుట్లుగా మిగలనున్నారు. మెట్రో రైలుతో రవాణా వ్యవస్థ చక్కదిద్దే మాట పక్కన పెడితే ప్రభుత్వ పాఠశాలలు తమ అస్తిత్వాన్ని కోల్పోనున్నాయి. మల్లమ్మ బేఫికర్‌00 జిల్లా విద్యాశాఖాధికారిణి బి.మల్లమ్మ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు.

    అకడమిక్‌ క్లబ్బింగ్‌తో 180 పాఠశాలలు మూతపడి, 10 వేల మంది వీధిన పడితే నష్టనివారణ చర్యలు చేపట్టని డీఈవో, మెట్రోరైలు ప్రాజెక్టుతో పాఠశాలల స్థలాలను సేకరించనున్నారనే సమాచారం తెలిసినప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, మెట్రో రైలు ప్రాజెక్టు కింద ఎన్ని పాఠశాలలు సేకరించనున్నారో అడిగితే ‘మాకు తెలియదనే’ సమాచారం జిల్లా యంత్రాంగం నుంచి రావడం గమనార్హం.

    (Source: AndhraJyothy, 18 Dec 2008)

  2. 2
    డిస్కవర్ తెలంగాణ Says:

    మేటా(తు)స్‌ : హెచ్‌ఎండీఏకు రూ. 11 కోట్ల బకాయిలు

    హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 : ‘మేటాస్‌’అదో అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీ. రెండు విభాగాలుగా ఏర్పడి ప్రాపర్టీస్‌, ఇన్ఫ్రా స్టక్చర్‌ రంగంలో పేరొందిన సంస్థ.. గ్రేటర్‌ హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైల్‌ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా ఈ సంస్థే చేపడుతోంది. రూ.12 వేల కోట్ల ఈ ప్రాజెక్టుకు సర్కారు నుంచి ఒక్కపైసా అవసరం లేదని స్పష్టం చేసింది. అం తేనా.. 30 ఏళ్లలో రూ.32 వేల కోట్లు తిరిగి ఇస్తానని సర్కారుతో ఒప్పందం చేసుకుంది. మెట్రోరైల్‌కు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వచ్చిన ‘ మేటాస్‌’ బాచుపల్లిలోని హిల్‌ కౌంటీ సెజ్‌ పేరిట నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతులకు రూ.11 కోట్ల అభివృద్ధి చార్జీలతో పాటు, ప్రభావిత చార్జీలను చెల్లించలేదు. తమకు వ్యాపారలావాదేవీలు సరిగ్గా కొనసాగడం లేదని పేర్కొంది.

    ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నందున సొమ్మును ఒకే సారి కట్టలేమని వాయిదాలు కావాలని సర్కారును కోరినట్లు సమాచారం. అధికారికంగా మాత్రం ఈ చార్జీలు చెల్లించడానికి జనవరి 15 వరకు సమ యం కావాలని హెచ్‌ఎండీఏకు లేఖ రాయడం విశేషం. ఇప్పుడు హెచ్‌ఎండీఏకు చెల్లించడానికి రూ.11 కోట్లు లేనప్పుడు, మెట్రోరైల్‌కు వేల కోట్ల రూపాయలు ఎలా వస్తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేటాస్‌ హిల్‌ కౌంటీ సెజ్‌పేరుతో 12 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దరఖాస్తు చేసింది.

    దీనిని పరిశీలించిన మల్టీ స్టోర్డ్‌బిల్డింగ్‌ కమిటీ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌తో సమావేశమై ఈ ఏడాది జూన్‌5 వ తేదీన పర్మిషన్‌ ఇచ్చింది. ఇదే సమయంలో మేటాస్‌ హిల్‌ కౌంటీ సెజ్‌లో ప్లాట్లను బుకింగ్‌ చేసుకోమని భారీ ఎత్తున ప్రచారం చేసింది. బాచుపల్లిలో 300 ఎకరాలలో రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్స్‌,టౌన్‌షిప్‌లు, విల్లాస్‌, డూప్లెక్స్‌ హౌసెస్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఐటి కంపెనీల కోసం ప్రత్యేక సెజ్‌ల నిర్మాణం చేపట్టింది.

    వీటిలో సెజ్‌కు మినహా మిగతా వాటి నిర్మాణం కోసం డెవలప్‌మెంట్‌ చార్జీలు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం మూలంగా ఐటీ కంపెనీలు తిరోగమనంలో పయనిస్తుండడంతో ప్రత్యేక ఆర్థిక మండలి కోసం నిర్మిస్తు న్న భారీ భహుళ అంతస్తుల భవనానికి చార్జీలు చెల్లించలేక పోయామని మేటాస్‌ వర్గాలు అంటున్నాయని ఓ అధికారి అన్నారు. పర్మిషన్‌ తీసుకున్న దగ్గర నుంచి ఆరు నెలలుగా రూ.11 కోట్లరూపాయలు చెల్లించకపోయినా హెచ్‌ఎండీఏ కిమ్మనే పరిస్థితి లేదు. బహుళ అంతస్తుల భవనం నిర్మించాక…కంపెనీలు వస్తాయే రావోనన్న అనుమానం మేటాస్‌లో నెలకొంది.

    ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా చెల్లింపులు చేయలేని పరిస్థితి నెలకొందని చెబుతున్న మేటాస్‌ రూ.12 వేల కోట్ల మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేయగలదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఏదో రకంగా నిర్మించినప్పటికీ తర్వాత ప్రభుత్వానికి చె ల్లిం చాల్సిన సొమ్మును వాయిదాల ప్రకారం చెల్లిస్తుందా? లేదా అనే సందేహాలున్నాయి. నష్టాలు వస్తున్నాయనే పేరిట రాయితీలు కోరదనే గ్యారెంటీ ఏమిటని మేధావులు ప్రశ్నిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతుల చార్జీల చెల్లింపులకే వాయిదాల కావాలని అడిగే ఈ బడా సంస్థ రేపు వేల కోట్ల చెల్లింపులు ఎలా చేస్తుందన్న నమ్మకాలపై ఇప్పుడే సందేహాలు వ్యక్తమవుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

    (Source: AndhraJyothy, 24 Dec 2008)

  3. 3
    డిస్కవర్ తెలంగాణ Says:

    ‘సత్యం’ రామలింగరాజు రాజీనామా | రూ. 7000 కోట్ల ఫ్రాడ్‌, స్టాక్‌మార్కెట్‌ క్రాష్‌

    హైదరాబాద్‌, జనవరి 7 ః ఒక మహా పర్వతం కుప్పకూలిపోయింది. తెలుగువారి సాఫ్ట్‌ వేర్‌ నైపుణ్యానికి ప్రతీకగా అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటి వరకు సగర్వంగా తలెత్తుకు తిరిగిన సత్యం’ కంపెనీ బుధవారం నాడు దోషిగా నడిరోడ్డుపై నిల్చుంది.

    ఈ కంపెనీ అక్రమాల పుట్టగా, అవినీతికి పెట్టని కోటగా మారిపోవడంతో జరిగిన అన్ని దారుణాలకూ బాధ్యత వహిస్తూ సత్యం ఛైర్మన్‌ రామలింగరాజు బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. క్షణాలలో మార్కెట్‌లో సత్యం షేర్ల పతనం ప్రారంభమైంది.

    బుధవారం స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సత్యం షేర్‌్‌ ధర రూ. 39.95 క్షీణించింది. ఇది ఆ కంపెనీ షేర్‌ వాటాలో దాదాపు 80 శాతానికి సమానం. మధ్యాహ్నానికి సత్యం షేర్‌ మార్కెట్‌ విలువ రూ. 48.50కి అంటే 72 శాతం పడిపోయింది. అన్ని అక్రమాలకూ బాధ్యత వహిస్తూ రామలింగరాజు కంపెనీ బోర్డు సభ్యులకు పంపిన రాజీనామా లేఖలో ఆయన అంగీకరించిన విషయాలు దిగ్భ్రాంతి కలిగిసున్నాయి.

    సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు తిమ్మిని బమ్మిని చేసి, కేవలం 61 కోట్ల రూపాయల ఆదాయం వస్తే దాన్ని 647 కోట్లుగా లెక్కల్లో చూపించారు. అలాగే కంపెనీ ఆస్తుల విలువలో ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చూపించారు. ఈ లెక్కలను కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు, మరో తప్పును దాచేయడానికి మరో తప్పు.. ఇలా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోవడంతో కంపెనీ మొత్తం రూ. 7000 కోట్ల మేర ఫ్రాడ్‌కు పాల్పడినట్లు తేలిపోయింది. కంపెనీ లెక్కల్లోని తప్పొప్పులను స్వయంగా రామరాజే బోర్డుకు రాసిన లేఖలో వెల్లడించారు.

    తన వారసునిగా తాత్కాలిక బాధ్యతలను రామ్‌ మైనంపాటికి రామలింగరాజు అప్పగించారు.

    ముఖ్యంగా ‘సత్యం’ కంపెనీ పేరును తిరగేసి రాస్తే వచ్చే ‘మేటాన్‌’ (Maytas) కంపెనీని సుస్థిర పరుచుకోవడానికి చేసిన ప్రయత్నమే చివరికి అసలు కంపెనీ పుట్టె ముంచినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
    (Courtesy: AndhrJyothy)

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com