“ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, బొగ్గు, భూమి తదితర వనరులు మనకు దక్కవు. రాజ్యాధికారం లేనిదే తెలంగాణ అభివృద్ధి సాధ్య పడదు. అందుకని దేశస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, తెలంగాణపై ఏకాభిప్రాయం కుదిరినందున కాంగ్రెస్ ద్రోహపూరిత వైఖరిని ఎండగడుదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో తక్షణమే బిల్లు పెట్టమని డిమాండ్ చేద్దాం. నవంబర్ 1న ‘విద్రోహదినం’ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఊరేగింపులు, ధర్నాలు, సదస్సులు జరిపి కాంగ్రెస్‌ని నిలదీద్దాం. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని ప్రకటిద్దాం.” అని తెలంగాణ విద్యావంతుల వేదిక , తెలంగాణ రచయితల వేదిక , తెలంగాణ ఉద్యోగుల సంఘం , తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం, తెలంగాణ డెవెలప్మెట్ ఫోరం, తెలంగాణ టీచర్స్ ఫోరం, తెలంగాణ ఐ.టీ ఫోరం, తెలంగాణ ప్రైవేటు సెక్టార్ ఉద్యోగుల సంఘం , తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ల సంఘం , తెలంగాణ గ్రాడ్యుయెట్ ఇంజనీర్స్ అసోసియేషన్, వాల్లు విడుదల చేసిన కరపత్రంల ప్రజలందరికి విన్నపం చేసుకున్నరు
- “నవంబర్ 1న ‘విద్రోహదినం’ : ధర్నా పిలుపు” పూర్తి కరపత్రాన్ని ఇక్కడ క్లిక్ చేసి చదవంరి
- మీరున్నది ఏ దేశమైనా ‘తెలంగాణా ముద్దు బిడ్డ’లైనందుకు, నవంబర్ ఒకటిన మీరున్న ప్రదేశంల ధర్నా చేశి మీ సంఘీభావం తెలుపండి
