Feed on
Posts
Comments

-మంచికంటి

100308_aj1.jpg
తెలంగాణ మట్టినీ మనుషుల్నీ చూసినప్పుడల్లా
నీటి ఒడ్డున తచ్చాడుతున్న సోమాలియాలు గుర్తొస్తాయి
తెలంగాణ భూమి పుత్రుల్ని కదిలించినప్పుడల్లా
కల్లోలమౌతున్న లాటిన్‌ అమెరికా దేశాలు జ్ఞప్తికి వొస్తాయి
తెలంగాణ చరిత్ర కళ్ళ ముందు కదులుతున్నప్పుడు
పోరాట రూపాలెన్నో పాఠం చెప్పినట్టుగా ఉంటుంది
పాలమూరు కూలీలను చూసినప్పుడైతే
సైబీరియా వలస పక్షులే గుర్తుకు వొస్తాయి
మనిషి మనిషినీ పట్టిపట్టి చూసినప్పుడు
ఎన్నెన్నో కళారూపాలు గజ్జెకట్టి కళ్ళముందు ఆడినట్టే ఉంటుంది
కట్ట మైసమ్మలూ సమ్మక్క సారక్కలను చూస్తుంటే
గ్రామదేవతలే ఇప్పటికీ చేయెత్తి ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది
నా తెలంగాణ మిత్రులు యాసలో మాట్లాడుతున్నప్పుడు
తాత ముత్తాతల నాటి పరిమళమేదో
నన్ను చుట్టు ముట్టినట్టే ఉంటుంది
ఆ మట్టిలో అడుగు పెట్టినప్పుడల్లా
అడుగడుగునా రక్తం చిందించిన అడవి గుర్తుకొచ్చి
త్యాగాల భూమికి తల ఆనించి నమస్కరించాలనుంటుంది
తెలంగాణ సోదరులెవరు గళమెత్తినా
సంస్క­ృతీ సాంప్రదాయాలన్నీ జరజరా పాకుతూవొచ్చి
ఆత్మీయంగా అల్లుకున్నట్టే ఉంటుంది
చిత్రకారుల కుంచెల గుండా ప్రాణం పోసుకున్న చిత్రాలు
కళ్ళ ముందు కదిలినప్పుడల్లా
అమ్మో అయ్యో కలలో నుండి నడిసొచ్చి
ఆప్యాయంగా తల నిమురుతున్నట్టే ఉంటుంది
తరతరాల పోరాట చరిత్రలో తల మునకలైనప్పుడల్లా
రాతిగుండును భుజాలకెత్తుకున్న హెర్క్యులస్‌ కళ్ళముందుకొస్తాడు
అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ములారా
మీ పోరాట స్ఫూర్తికి వెయివేల దండాలు

(Courtesy : AndhraJyothy, Vividha; 3 Nov 2008)

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com