Feed on
Posts
Comments

- మామిడి భరత్ భూషన్

ఆంధ్రులు మన ఆప్త మిత్రులే
తెలంగాణకు శత్రువే లేడింక!
సినిమా స్టూడియోలు, సిలికాన్ వాలీలు, సెజ్లు
ఫ్లై ఓవర్లు, మెట్రో రైళ్ళు, కాలేజీలు ఖార్ఖానల కొరకు
ప్రతి ఊరా రెడ్ కార్పెట్ పరువుండ్లి
తెలంగాణ ఊరూరూ ఆప్తులకేనని చాటండింక

తెలంగాణకు అందరూ కావల్సినవాళ్ళే
తెలంగాణ అందరిదీ ఇంక.
గోదావరి మంజీరాలు పొరుగు ప్రాంతాల పేదవాల్లకే
హైదరాబదు మంచి సెట్లర్లకే ఇంక
ఇక్కడ బతకలేక భీవండికో, దుబాయికో
దేశదేశానికి పోయినోల్ల ఊర్లన్నీ ఆప్తులకే పంచుండ్రి
మంచి కార్పోరేట్ కాలేజీలు, ఐటం పాటల సినిమాలు
ఆంధ్ర మెస్సులు, క్లబ్బులు కాలనీలూ
లాంకో మధుకాన్ ఫాక్టరీలు ఇంకా వంద తెరిసి
నవీనంగ అభివృద్ది చేసే ఆసాములదే తెలంగాణ అని కొండెక్కి ప్రకటించుండ్లి!

ప్రాంతీయుడు ప్రాంతేతరుడు అన్న కాళోజి లొల్లిని పాతరేసి
పొత్తులతో లెక్కల్ల ఎవ్వనికీ తక్కువ కాకుండ
అందరికీ తెలంగాణను అప్పచెప్పుండ్రి
ఇంక తెలంగాణనెవ్వడు ఎట్లాపగలడో సవాల్ చెయ్యుండ్రి
సెట్లరెవ్వడు ఉద్యోగం వదిలిపోడు
స్తానికులకు మిగిలిన చిప్పనెవ్వడూ గుంజుకోడింక
పోలవరంల కోస్తాకు కొట్టుకుపోయిన
గోదారినెవ్వడు గుర్తు చెయ్యొద్దు
పోతిరెడ్డిపాడు గ్రేటర్ హైదరాబాదు
తెలంగాన భూములను ముక్కలుగా రియల్ ఎస్టేట్ కమ్మిన సంగతి
ఇంత కాలం ఈ జాతికైన గాయాల్ని ఇంకెవ్వరూ మాట్లాడొద్దు.
తెలంగాణ అందరిదీ అయిపోయింది
పాత బాధలు ‘దగాపడిన తెలంగాణా’, ‘చిధ్రమైన తెలంగాణా’
దోపిడీ దౌర్జన్యాల గాయపడిన తెలంగాణ రోత పాటల నింక పక్కనబెట్టి
అత్తరు బూసుకొన్న సెట్లరు బ్రదర్స్ సంకన జేరి
కొత్త నాయకుల నీడన ప్రాంతీయతను పర్మనెంటుగా తుదిసెయ్యుండ్లి

ఈ రోజునుంచి ఇంక సెట్లరుతో కల్సి
జై తెలంగాణకు కొత్త సలాం చెయ్యుండ్రి
‘ఆంధ్ర గో బాక్’ కు గుడ్ బై చెప్పి
నవీనాంధ్రులకు రెడ్ కార్పెట్ పరువుండ్లి

ఎవ్వడు ఎక్కడికి పొయ్యేదిలేదింక
సైంసుండ్లి ఇంక నాలుగు నెలలు
దొరలందరు పగలు మరిశి
అన్నదమ్ములోలె కలిసిపోయిండ్లు

ఊరు బొడ్రాయి దగ్గెర సెట్టుకు యాల్లడిన
తెలంగాణ సెంటిమెంటును కిందకు దించుండ్రి
పాడె కట్టి తొందరగా పని ముగించుండ్రి
సెట్లరు బ్రదర్తో కల్సి తెలంగాణ సాధించుండ్రి

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com