Feed on
Posts
Comments

ముంపు బారిన మహారాష్ట్ర వన్యమృగ సంరక్షణ ప్రాంతం | గుర్తించిన ఇంజినీర్లు
సమస్యలు తప్పవంటున్న నిపుణులు! | బయటపడే మార్గంపై అధికారుల యోచన

122308_en.jpg

ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం మరో ‘పోలవరం’ కానుందా?… ఈ ప్రశ్నకు నీటిపారుదల రంగ నిపుణులు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లు అవుననే సమాధానమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వన్యమృగ సంరక్షణ విభాగం అనుమతి కోసం నీటిపారుదలశాఖ అధికారులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. వీటికోసం మధ్యలో కొన్నాళ్లు పోలవరం పనుల్ని ఆపేయాల్సి వచ్చింది కూడా. ఇప్పుడు ప్రాణహిత-చేవెళ్ల విషయంలోనూ ‘వన్యమృగ సంరక్షణ అనుమతుల’ సమస్యే తలెత్తే ప్రమాదం పొంచి ఉంది.

ప్రాణహితపై రిజర్వాయర్‌ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం కాగా, ఎలాంటి అనుమతి లేకుండానే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. రూ.38,500 కోట్లతో టెండర్లు కూడా ఖరారు చేసింది. అయితే ముంపు ప్రాంతంలో వన్యమృగ సంరక్షణ ప్రాంతం ఉన్నట్లు తాజాగా నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో ముంపునకు గురయ్యేది అటవీ భూమి మాత్రమే అని అధికారులు భావించారు. రిజర్వాయర్‌ పనులు దక్కించుకున్న నిర్మాణ సంస్థ సర్వే మొదలు పెట్టాక… ముంపునకు గురయ్యే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నది వన్యమృగ సంరక్షణ ప్రాంతమని తేలింది. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రిజర్వాయర్‌ నిర్మాణ స్థలాన్ని మార్చితే వన్యమృగ సంరక్షణ ప్రాంతం ముంపును నివారించవచ్చేమో అన్న అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. టెండర్లన్నీ ఖరారు చేసినందున ఇప్పుడు మార్చితే వచ్చే సమస్యలు కూడా ఎక్కువని, మార్చకుండా అనుమతులకోసం ప్రయత్నించడమే మేలని కూడా కొందరు ఇంజినీర్లు సూచిస్తున్నట్లు తెలిసింది.

మొత్తమ్మీద ఇది సమస్యగా మారే అవకాశం ఉంది. మరోవైపు ప్రాణహిత ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ట్రైబ్యునల్‌ తీర్పు, రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1978 ఆగస్టు 7న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాణహితపై బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం అవసరం. ఎందుకంటే ముంపునకు గురయ్యే ప్రాంతం మహారాష్ట్రకు చెందిన భూమి. ఇందులో అటవీ ప్రాంతం కూడా ఉంది. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు చేపట్టినా, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రయోజనం కలిగేలా చేపట్టినా సరే ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాల్సి ఉందని అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లు స్పష్టం చేశారు.

న్నో మార్పులు…

ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనపై ఇప్పటికే పలుసార్లు మార్పులు జరిగాయి. మొదట ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్పూరు తాలూకా తలాయి గ్రామం వద్ద ప్రతిపాదించారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 144.78 మీటర్లు. 110 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పాటు 57.7 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలన్నది లక్ష్యం. ఈ ప్రతిపాదన వల్ల లక్షా 79వేల ఎకరాలు ముంపునకు గురవుతోందని అంచనావేశారు. అయితే ప్రాణహితను సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టడానికి 1981 మే 13న మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో పూర్తిగా ఆంధ్రప్రదేశే ఈ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. దీని ప్రకారం 12 టీఎంసీల వినియోగంతో 58వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా నివేదిక కూడా తయారు చేశారు. తుమ్రి గ్రామం వద్ద 154 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజి నిర్మించాలని చేసిన ఈ ప్రతిపాదన వల్ల ఆంధ్రలో 425 హెక్టార్లు, మహారాష్ట్రలో 2,553 హెక్టార్లు ముంపునకు గురవుతోందని అంచనావేశారు. ఈ ప్రతిపాదనకు కూడా మహారాష్ట్ర అంగీకరించలేదు.అనంతరం ముంపు ప్రాంతంలో గ్రామాలు, పట్టా భూములు లేకుండా చేపట్టేందుకు రిజర్వాయర్‌ మట్టాన్ని 150 మీటర్లకు తగ్గించి మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో 223 హెక్టార్లు, మహారాష్ట్రలో 1257 హెక్టార్లు ముంపునకు గురవుతోందని తేల్చారు.

తాజాగా 152 మీటర్ల ఎత్తుతో ఆదిలాబాద్‌ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద రిజర్వాయర్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాణహిత-చేవెళ్ల పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 160 టీఎంసీల నీటిని మళ్లించి 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడంతోపాటు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు ఇవ్వాలన్నది కూడా లక్ష్యం. మహారాష్ట్రతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి పూనుకొంది. టెండర్లు ఖరారు చేసి పనులకూ శ్రీకారం చుట్టింది. కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుని మొబిలైజేషన్‌ అడ్వాన్సు కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.

(Courtesy: 23 December 2008, Eenadu)

* * *

Maps:

Picture 1 Picture 2 Picture 3

Picture 4 Picture 5 Picture 6

Maps Courtesy : WikiMapia.Org

2 Responses to “ప్రాణహిత-చేవెళ్ల మరో ‘పోలవరం’ కానుందా?…”

  1. 1
    డిస్కవర్ తెలంగాణ Says:

    పోల’వరమా’.. పాపమా?

    ఇప్పటికే రూ.2100 కోట్లు చెల్లింపు.. | మరో రూ.300 కోట్లకు రెడీ
    డిజైన్‌ మారిస్తే కాల్వలు పారవు, మార్చకపోతే కేంద్రం ఒప్పుకోదు.. | సంకట స్థితిలో సర్కారు

    (ఆన్‌లైన్‌-రాజమండ్రి) అటవీ అనుమతిలో కొత్త మెలికతో పోలవరం బహుళా ర్థ సాధక ప్రాజెక్టు ప్రశ్నార్థకమవుతోంది. అటవీ, పర్యావర ణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టును ప్రభుత్వం మొదలుపెట్టింది. ప్రాజెక్టులో మొత్తం 22 పనుల్లో డ్యామ్‌ మి నహా అన్ని పనులూ ప్రారంభమయ్యాయి. కాల్వల తవ్వ కానికి, ఇతర మట్టి పనులకు ఇప్పటివరకూ రూ.2,100 కోట్లు చెల్లించారు. మరో రూ.300 కోట్ల చెల్లింపునకు సి ద్ధంగా ఉన్నాయి.

    భూసేకరణ, పునరావాస వ్యయం దీని కి అదనం. లక్షా 50 వేల ఎకరాల భూమి, 400 గ్రామా లు ముంపునకు గురవుతున్నా.. లక్షా యాభై వేలమంది గిరిజనులు నిరాశ్రయులవుతున్నా.. వారికి పునరావాసం కల్పిం చకుండానే పనులు మొదలుపెట్టిన వైఎస్‌ సర్కారుకు ఇప్పుడు అటవీ శాఖ పెట్టిన మెలికతో తల బొప్పికట్టింది. కేంద్ర అటవీ శాఖ సూచించినట్లు డ్యామ్‌ ఎత్తును 150 నుంచి 135 మీటర్లకు తగ్గిస్తే ప్రస్తుతం తవ్విన కాలువల్లోకి నీరు పారదు. త్వరలో ప్రారంభం కానున్న స్పిల్‌వే నిర్మాణంలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎ త్తు తగ్గిస్తే నిర్దేశిత ఆయకట్టుకు సరిపడా నీరివ్వలేరు.

    ఎత్తు తగ్గించకుండా కట్టాలంటే ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రా ల్లో గిరిజనులను తరలించాల్సి ఉంటుంది. 7.20 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం రూ.12,500 కోట్ల అంచనాతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో ప్రారంభించా రు. అయితే ప్రభుత్వం చెబుతున్న 7.20 లక్షల ఆయకట్టులో 6.90 లక్షల ఎకరాలనూ వైఎస్‌ ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పోలవరం ఆయకట్టుగా చూపించింది. సుప్రీంకోర్టుకు కూడా ఇవే లెక్కలు సమర్పించారని నిపుణులు అంటున్నారు.

    బాధితులను విస్మరించినందుకే అనుమతి రద్దు
    జాతీయ పర్యావరణ పునర్విచారణ అధికార సంస్థ (ఎన్‌ఈఏఏ) పోలవరం ప్రాజెక్టుకు ఇంతకుముందు ఇ చ్చిన పర్యావరణ అనుమతిని రద్దుచేస్తూ కొన్ని నెలల క్రి తం తీర్పునిచ్చింది. బాధితుల గోడు వినకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందున అనుమతి రద్దు చేస్తున్నామని ఆ సంస్థ వెల్లడించింది. అన్ని అనుమతులూ లేకున్నా ప్రా జెక్టు పనులు కుడి, ఎడమ కాల్వల తవ్వకాల వేగంగా జ రిగిపోతున్నాయి. స్పిల్‌వే నిర్మాణానికి కొండల్ని పిండిచే సే పని శరవేగంగా జరుగుతోంది. ఈ సమయంలో అట వీ అనుమతుల మెలికతో ప్రాజెక్టుకు బ్రేక్‌ పడే అవకాశా లు అధికంగా కనిపిస్తున్నాయి.

    జాతీయ గిరిజన విధానానికి విరుద్ధం

    ఏదైనా ఒక ప్రాజెక్టు కింద 50 వేలమంది గిరిజనులను తరలించాల్సి వస్తే అటువంటి ప్రాజెక్టును చేపట్టకూడదని జాతీయ గిరిజన విధానం పేర్కొంటున్నది. అయితే పోలవరం కింద ముంపునకు గురవుతున్న గిరిజనులు తాజా లెక్కల ప్రకారం 70 వేలమంది వరకూ ఉన్నారు.

    (Courtesy: 28 December 2008, AndhraJyothy)

  2. 2
    డిస్కవర్ తెలంగాణ Says:

    ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై జలసంఘానికి మహా సర్కారు ఫిర్యాదు

    ముంబై, డిసెంబర్‌ 29 : ఏదో సామెత చెప్పినట్లు మహారాష్ట్ర సర్కారు, వైఎస్‌ సర్కారుపై జల సంఘానికి ఫిర్యాదు చేసింది. బాబ్లీ విషయంలో సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశాలను దిక్కరించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాణహిత విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని, వెంటనే ఆ ప్రాజెక్టు పనులను ఆపాలని జలసంఘానికి మొరపెట్టుకుంది.

    ప్రాణహితలో తమ నీటి వాటాను తేల్చి, ఆ తరువాత ప్రాజెక్టు కట్టుకోవాలని అంతలోపు ప్రాజెక్టు కడితే అడ్డుకోవాలని మహారాష్ట్ర సర్కారు జల సంఘానికి ఫిర్యాదు చేసింది. గోదావరి నదిపై ట్రిబ్యునల్‌ తీర్పు, సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించిన మహా సర్కారు ఇప్పుడు ప్రాణహిత విషయంలో తమకు వాటా ఉందనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    (Courtesy: 29 December 2008, AndhraJyothy)

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com