- పున్న అంజయ్య

పల్లెటూరి పిల్లగాడా…
పసులు గాసే మొనగాడా !
పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో
ఓ…పాల బుగ్గల జీతగాడా
కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో
సుద్దాల హనుమంతు కలం నుండి జాలువారిన ఈ పాట వినని వారుండరు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1908 డిసెంబర్‌లో జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన నివసించిన ఊరు పేరే ఇంటి పేరుగా మారింది. సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు, యావదాంధ్ర దేశం మారుమోగిందంటే అతిశయోక్తి కాదు. పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారు. నాటి నిజాం వ్యతిరేకోద్యమంలో బతికున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు.
చిన్నతనం నుండే నాటకాల పై ఆసక్తిని పెంచుకున్న హనుమంతుకు ప్రజా కళారూపాలైన హరికథ, బురక్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచారాసా్తల్రుగా ఉపయోగపడ్డాయి. ఆయన బురక్రథ చెబితే ఆనాడు గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదని జనంలో ప్రచారం బలంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ దళ సభ్యునిగా చేరి తన పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు హన్మంతు వాలంటీర్‌గా పనిచేశారు. ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో `సంఘం’ స్థాపించారు. ఈ `సంఘం’ ఆధ్వర్యంలో ఆందోళనలు, తిరుగుబాటు పోరాటాలు మొదలైనయ్.
`సంఘం వచ్చిందిరో రైతన్నా- మనకు బలం
చాలా తెచ్చిందిరో కూలన్నా- మనకు బలం
సంఘం వచ్చింది మనకు చాలా బలం తెచ్చింది
దొంగల దోపిడి దొరల దుమ్ము దులిపివేసింది
నంగనాచి నైజాము నడుం విరగదన్నింది
కులమతాల కుళ్ళులేని సమతే మన మతమన్నది
రైతు కూలి రాజ్యానికి రహదారులు వేసింది
తెల్ల నల్లదొరతనాల తోక నరికి వేసింది’
అనే పాటలు గ్రామాలలో మారు మ్రోగినయ్. సంఘం పెట్టి, పాటలు కట్టి ప్రజల్ని ఉద్రేకపరుస్తున్నాడని హనుమంతు పై నిజాం ప్రభుత్వం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసంలోకి వెళ్ళాల్సి వచ్చింది.
ఆ రోజుల్లో ఉపన్యాసాలకంటే పాటే జనంలోకి బాగా చొచ్చుకుపోయేది. పాటే జనంలో చైతన్యాన్ని కలిగించేది. వెట్టిచాకిరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశారు. ఇవన్నీ `వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయి. అపారమైన ఆత్మవిశ్వాసం, అలుపెరగని వీరావేశం ఆయన పాటకు బలాన్ని, బలగాన్ని సమకూర్చి పెట్టాయి.
రణభేరి మ్రోగింది తెలుగోడా!
రావోయి ముందుకు మొనగాడా! …
ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
ప్రజా ప్రభుత్వం సాధిస్తాం …
స్వాతంత్య్ర రథమెక్కి
సమరవీధులందు దోలి …
అవునంటారా కాదంటారా మరి
ఏమంటారో చిందోరా ఓ పెద్దోరా …
వెట్టి చాకిరీ విధానమో రైతన్న
ఎంత చెప్పినా తీరదు కూలన్న …
లెయ్ లెయ్
వెయిర దెబ్బ
దెబ్బకు దెబ్బ
వెయ్ వెయ్ …
ఈ భూమి నీదిరా
ఈ నిజాం ఎవడురా
ఈ జులుం ఈ జబర్‌దస్తీ
నెగురదన్ని వేయరా- …
ఇలాంటి పాటలెన్నో గ్రామాల గుండెల్లో ఎర్రెరగ్రా జాలు వారాయి.
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు ఎందరినో కవులుగా, గాయకులుగా, ఉద్యమకారులుగా తయారు చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, బానిస జన విముక్తి కోసం జరిగిన ఈ పోరాటం అంతర్జాతీయ స్థాయిలోనే ఒక గుర్తింపును తెచ్చిపెట్టింది.
చరిత్రాత్మకంగా జరిగిన ఈ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రాంతాలకు చెందిన 4 వేల మంది ప్రజలు ప్రాణ త్యాగాలు చేస్తే ఇందులో సగం మంది నల్లగొండ జిల్లా వారేనంటే సాయుధపోరాటంలో ఆ జిల్లా పాత్ర ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రాణ త్యాగాల్లోనే కాకుండా సాయుధ పోరాటానికి ఇరుసుల్లా పనిచేసే గొప్ప నాయకత్వాన్ని, తిరుగులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసి ప్రజల్ని గెరిల్లా పోరాట వ్యూహాలకు కూడా సిద్ధం చేసింది.
ఒక చేత్తో పెన్నూ, మరో చేత్తో గన్నూ పట్టుకొని పోరాటంలో పాల్గొన్న వీరసేనాని హనుమంతు.జానపద కళా రూపాలకు జీవం పోసి, అనేక పాటలను ప్రజలకు అందించిన సుద్దాల హనుమంతు 1982 అక్టోబర్ 10న అమరుడయ్యాడు.
(ఇది సుద్దాల హనుమంతు శత జయంతి సంవత్సరం)
(Courtesy: Surya, 28 December 2008)
- Watch the videos: సుద్దాల హనుమంతు గురించి : అశోక్ తేజ మాటల్ల
February 7th, 2009 at 6:56 am
జొహార్లు ,సుద్దాల హనుమంతుని చరిత్ర చాలా భాగుంది